గురువు గారికి ధన్యవాదాలు ఇలా సవరించానండీ! బంక మట్టి లోన పలుమార్లు దొర్లిన మేక మారె వింత మెకము వోలె గిట్ట నుండి మట్టి పొట్టదాకనుగల మేఁకనుఁ గని జడలమెకము వాఱె
చీకున చూపుతగ్గి తన చేరువ నెవ్వరు తోడు లేక తాన్ పీకుచు డొల్లనెమ్ములను పేలవ మయ్యెను సింహమొక్కటిన్ ఆకులు మీదనుండనవి యందక నిక్కుచు దూకుచున్నదౌ మేఁకనుఁ గాంచి సింహమదె మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితనకు భయపడి హరి దాగెననుచు పల్కు
రిప్లయితొలగించండికనక కశిపు గనుచు తనయుడనియె
మేకను గని జడలమెకము వాఱె ననుట
తగదు తగదటంచు తండ్రి తోడ.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండియుద్ధమందుతెగువయోధయైనశిఖండి
రిప్లయితొలగించండిభీష్మునెదుటనుండెభీకరముగ
తనదుప్రతినఁదలచితలవంచెవ్రుద్ధుడు
మేకనుఁగనిజడలమెకమువాఱె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వృద్ధుడు' టైపాటు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిబింకముగల నుడులు పెద్దగ బల్కుచు
గడ్డ మంత జూపి గడుసు యౌచు
రమ్ము జంపెద నిను రయముగ నను పోతు
మేకను గని జడలమెకము వాఱె.
(మేకపోతు గాంభీర్యము)
తొలగించండిబింకముగల నుడులు పెద్దగ బల్కుచు
గడ్డ మంత జూపి గడుసు దగుచు
రమ్ము జంపెద నిను రయముగ నను పోతు
మేకను గని జడలమెకము వాఱె.
(మేకపోతు గాంభీర్యము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభద్రుడు తల నరుక రుద్రుడు మన్నించి
రిప్లయితొలగించండిమేషపు తలనిచ్చె , దక్ష ప్రభువు
శంఖమోలె పలికె శంభుని నామమున్
మేఁకనుఁ గని జడలమెకము వాఱె”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
రెండవ పాదంలో యతి తప్పింది. 'వలె'ను 'ఓలె' అనరాదు. ఇక్కడ 'జడలమెకము' ఎవరు?
తొలగించండి
రిప్లయితొలగించండిశ్రీకరుడంచు నీవనెడు శ్రీహరి భీతిలి దాగె నెచ్చెటో
నాకుడ యాలకించుమని నాయన పల్కగ విన్న పుత్రుడే
యా కమలాక్షుడన్న నెవరంచు దలంచితివోయి మూర్ఖుడా!
మేఁకను గాంచి సింహమదె మ్రింగనటంచుఱికెన్? భయమ్మునన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితాఁకనుసత్యమేతనకుఁదాల్చినయాయుధమయ్యెతాతకున్
రిప్లయితొలగించండిమూకలుతెల్లవారువడిమూల్గిరిబాధనువానిజూచియే
వేకువజామునందునటవెల్గునునింపిరిభారతమ్మునన్
మేకనుగాంచిసింహమదెమ్రింగునటంచునుఱికెన్భయమ్మునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసోకుగ జంతు జాలమును శోభగ చేర్చిరినొక్క చోటునన్
రిప్లయితొలగించండిసాకుచు సింహ రాజులకు చక్కగ పెట్టిరి మేష మందలన్
సోకునురా కరోనయని సుద్దులు వీనుల ఘోషవెట్టగన్
మేఁకనుఁ గాంచి సింహమదె మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"..చేరిచి రొక్కచోటునన్" అనండి. 'మేష మందలన్' దుష్టసమాసం.
సమస్య :
రిప్లయితొలగించండిమేకను గాంచి సింహమది
మ్రింగు నటంచురికెన్ భయమ్మునన్
( అల్లరిమేక త్రాటిని త్రెంపుకొని రాక్షసిబొమ్మ తగిలించుకొని సింహాన్ని భయపెట్టగలిగింది )
ఉత్పలమాల
.....................
ఆకుల మేయు మేక యొక
టందరు నేగిన వెన్క నూరిలో
వేకువజామునందు జని
వీధిని రాక్షసి బొమ్మ జూచి తా
సోకుగ దాల్చి గర్వమున
సొక్కుచు సోలుచు నేగుచుండె ; నా
మేకను గాంచి సింహమది
మ్రింగు నటంచురికెన్ భయమ్మునన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరాజకీయ మందు రాణించు తన కొక్క
రిప్లయితొలగించండిడెదురు నిల్చి పోటి నిచ్చుచుండ
వాడు గెలుచు ననుచు పలువురు వచియింప
మేకను గని జడల మెకము వాఱె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమేకలమంద నుండి విడి మెల్లగ కేసరియుండు తావుకున్
దాకొని భీతిచెందినను దాఖ్యముతో గడుసైన మాటలన్
భీకరమౌ విధిన్ నుడివి పేరడగించెద నిప్పుడే ననున్
మేకను గాంచి సింహమదె మ్రింగు నటంచుఱికెన్ భయమ్మునన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమేకలు గొఱ్ఱెలం గసవు మేపుటకై పశుపాలకుండు తా
రిప్లయితొలగించండిచేకొని బోయె కాన, కట చెచ్చర కేసరి యుగ్రరూపునన్
బైకొని దాడి జేసె వడి, ప్రక్కన గొఱ్ఱియ, చంపఁబూనగా
మేఁకనుఁ గాంచి, సింహమదె మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిభీకరమైన యోచనలె వేదన మూలము నెంచి జూడగన్
చీకటి లోన త్రాడు గని చిత్రము పామని భ్రాంతి నొందరే
లోకము తీరు గాంతు మట రూఢిగ నివ్విధి భీతి నొందనై
మేకను గాంచి సింహమదె మ్రింగు నటంచురికెన్ భయమ్మునన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిజంతుశాలయందు జడలమెకమునకు
రిప్లయితొలగించండిమేఁక దొరికె నాఁడు మేఁతగాను
వింతజబ్బుతోడ వేసరిల్లుచునున్న
మేఁకనుఁ గని జడలమెకము వాఱె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆకలి గొన్న వేళ తిరుగాడుచు జంగలమందు దూకెనా
రిప్లయితొలగించండిమేఁకనుఁ గాంచి సింహమదె; మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్
మేఁక వనాంతరంబునటు మిత్తి వలెన్ దరుమంగ సింగమున్
తాకగనీక వేగముగ దట్టపు తుప్పల జేరి దాగెనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిమంద వీడి వచ్చి మార్గమొందని మేక
గజరిపువును గాంచి గజగజమనె
బింకమూని తానె బెట్టుగా గర్జించు
మేకను గని జడలమెకము వాఱె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆకలిగొన్న వేళ ఫలహారము దొర్కెనటంచు నెంచె నా
రిప్లయితొలగించండిమేకను గాంచి సింహమదె; మ్రింగునటంచురికెన్
భయమ్మునన్
బ్రాకుచు ప్రక్కనే నిలువ బారుగనోరును దెర్చినట్టిదౌ
భీకర సర్పరాజము వివేకముతోడ ప్రమాద మెంచుచున్
భీకర సర్పరాజము = కొండచిలువ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఫలహారము' సాధుశబ్దం కాదు.
ధన్యవాదములు గురుదేవా! ఫలాహారము సరియైన దనుకొనెదను. సవరిస్తాను!🙏🙏🙏
తొలగించండిఆకలిగొన్న వేళ పరమాన్నము దొర్కెనటంచు నెంచె నా
తొలగించండిమేకను గాంచి సింహమదె; మ్రింగునటంచురికెన్
భయమ్మునన్
బ్రాకుచు ప్రక్కనే నిలువ బారుగనోరును దెర్చినట్టిదౌ
భీకర సర్పరాజము వివేకముతోడ ప్రమాద మెంచుచున్
భీకర సర్పరాజము = కొండచిలువ
వేటకాడు క్రోవిబేల్చె నచటనొక
రిప్లయితొలగించండిమేఁకనుఁ గని ; జడలమెకము వాఱె
తనదయిన యశనము దారిదప్పె ననుచు
ఛాగి దొరక నతడు సంతసించె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమేషరాశిభర్త దూషింప మొదలిడ
రిప్లయితొలగించండిసింహరాశిభార్య చింతపడక
తొలగు వేళ పొరుగు తొయ్యలి యిట్లనెన్
మేఁకనుఁ గని జడలమెకము వాఱె
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిబంక మట్టి లోన పలుమార్లు దొర్లిన
రిప్లయితొలగించండిమేక మారె వింత మెకము వోలె
గిట్ట నుండి మట్టి పొట్టదాకనుగల
మేఁకనుఁ గని జడలమెకము వాఱె
చీకున చూపుతగ్గి తన చేరువ నెవ్వరు తోడు లేక తాన్
పీకుచు డొల్లనెమ్ములను పేలవ మయ్యెను సింహమొక్కటిన్
ఆకుల మేతకోసమటులక్కరతో నడిచొచ్చుచున్న ఓ
మేఁకనుఁ గాంచి సింహమదె మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'వచ్చుచున్న'ను 'ఒచ్చుచున్న' అనరాదు. అలాగే 'ఒక'ను 'ఓ' అనరాదు.
గురువు గారికి ధన్యవాదాలు
తొలగించండిఇలా సవరించానండీ!
బంక మట్టి లోన పలుమార్లు దొర్లిన
మేక మారె వింత మెకము వోలె
గిట్ట నుండి మట్టి పొట్టదాకనుగల
మేఁకనుఁ గని జడలమెకము వాఱె
చీకున చూపుతగ్గి తన చేరువ నెవ్వరు తోడు లేక తాన్
పీకుచు డొల్లనెమ్ములను పేలవ మయ్యెను సింహమొక్కటిన్
ఆకులు మీదనుండనవి యందక నిక్కుచు దూకుచున్నదౌ
మేఁకనుఁ గాంచి సింహమదె మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేకువఝామునందు నవివేకపు సింగమరణ్య మందునన్
రిప్లయితొలగించండివీఁక చరించుచుండ నొక వింత మృగంబును గాంచె నింతకున్
మేఁకయొకండు గర్తమున మేనున పంకముతోడ నుండె నా
మేఁకనుఁ గాంచి సింహమదె మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభీకరరూపునం జెలగు వీరుడ? విద్యలయందు మేటియా?
రిప్లయితొలగించండిదూకుడు దుర్గుణం బెసగు ధూర్తుడ? హింసను బ్రోత్సహించెనా!
కాకలు దీరు నాంగ్లులకు కంటకు డయ్యెను గాంధి, యయ్యెడన్
మేఁకనుఁ గాంచి సింహమదె మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధూకులు నెల్లజేరి తమ దూకుడు బెంచుచు రాజకీయమున్
రిప్లయితొలగించండిజేకొని, రాష్ట్రభూములను చెడ్డతనంబున బెక్కిలించగన్
లోకులు నెల్లరొక్కటయి రుద్రుల రీతిని ధిక్కరించగా
మేఁకనుఁ గాంచి సింహమదె మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్.
ఆటవెలది
రిప్లయితొలగించండిచేకొని వటుఁడొకఁడు మేకల గుంపును
గడ్డి మేపు చుండఁ గాననమున
నాకలిగొని మ్రింగ దూకఁ బోవఁగనెంచ
మేఁకనుఁ గని జడలమెకము, వాఱె
ఉత్పలమాల
చేకొని మేకలన్ వనము సేరుచు మేపఁగ బాలుఁడొక్కడున్
గేకలు వేసినన్ దొలఁగె కీడుఁదలంపక మందనొక్కటే
యాకలి తోడ వేచినదొ యార్తిగ దూకుచు పట్టఁ బోవఁగన్
మేఁకనుఁ, గాంచి సింహమదె మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్
జడల మెకము దూకె సరగున ముందుకు
రిప్లయితొలగించండిమేకనుగని,జడల మెకము వాఱె
వేట గాడు శరము వేవేగ సంధించ
భయము తోడ వడిగ వనికి యపుడు
వేకువ ఝామునన్ గుహను వీడుచు ముందుకు దూకెనొక్కటన్
రిప్లయితొలగించండిమేకను గాంచి సింహమదె,మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్
నాకుల నాహరించుటను నాహరిణంబట యాపుచున్ వెసన్
భీకర మౌవిధంబుగను వేలకొ లందిగ నంగలేయుచున్
కాననముల నెల్లఁ గట్టెల కింకను
రిప్లయితొలగించండినిల్వఁ గొట్టఁ గినిసి వెల్వడంగ
మ్రింగ నుత్స హించి చెంగున బలిసిన
మేఁకనుఁ గని జడలమెకము వాఱె
వీఁకను దిర్గుచుండును దివిన్ ఘన రాశులు సంతతమ్మునుం
బ్రాకట రీతిఁ గాంచ నొక వాసరమం దిటు లుండఁ గేతువున్
వే కన మేష రాశి శశి వేఁగుచు నిల్వఁగ సింహ రాశిలో
మేఁకనుఁ గాంచి సింహ మదె మ్రింగు నటం చుఱికెన్ భయమ్మునన్