12-6-2021 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను"(లేదా...)"రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా"
వస్త్ర మూ డ్చగ జూచిన పాలసుండు దుష్ట కృత్యుండు దురితుఁడు ద్రోహి యైన కుజనుని దురము నందున క్రుద్ధ భీమ రుద్రుడు సుయోధనుజంపె క్రూర ముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివుని యాజ్ఞయె లేకున్న చీమయైనకుట్ట దందురు లోకులు కువలయమునవాయు సుతుడు కారణమైన భండనమునరుద్రుడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను.
భీకరముగాగరణభూమిభీముడపుడుకదిసినెదిరినినుసిఁగోల్పెగదనుఁబట్టిఖండనమ్మునుఁజేసెనుకనగకాలరుద్రుడెసుయోధనునిఁజంపెక్రూరముగను
రౌద్రమురూపుదాల్చినదిరోహితమయ్యెనుయుద్ధభూమియేభద్రముఘీంకరించెనటభాసురమయ్యెనుకోపమగ్నిగాఛిద్రముఁజేసెభీముఁడునుఛీయనిరోయుచురాజరాజునేరుద్రుడెయాసుయోధనునిఁగ్రూరముగావధియించెఁజూడుమా
సమస్య :రుద్రుడె యా సుయోధనుని గ్రూరముగా వధియించె జూడుమా ( పాంచాలీపరాభవము - భీముని ప్రతీకారము )భద్రముతోడ భర్తలకు భామిని ద్రౌపది ప్రేమ మీర ని ర్ణిద్రగ సేవలన్ సలుప నీచుడు రాజు మదోద్ధరుండునై ఛిద్రపు బుద్ధి నూరువుల జేరగ బిల్వగ ; భీమసేనుడన్ రుద్రుడె యా సుయోధనుని గ్రూరముగా వధియించె జూడుమా !
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
గణపతికి తండ్రి యనినంత, కనెనెవరనిముందు గాంధారి, గిరిధారి పూతన స్ధనములను బట్టి చేసె నదేమి, పొట్ట పట్టిహరి దనుజు నెవ్విధముగ సంహరణ చేసెరుద్రుడె, సుయోధనుని ,జంపె, క్రూరముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "తండ్రి యెవ్వరొ... స్తన.." అనండి.
క్రొవ్విడి వెంకట రాజారావు: ద్వంద్వ యుద్ధము నందున వాయు సుతుడు భీకరమ్మగు కినుకతో పెచ్చురేగి రుద్రుడె సుయోధనుని జంపె క్రూరముగను ననియెడు నటుల తీక్ష్ణమై యడరుజెందె.
అద్రిజ ప్రాణనాథు డతడంబర కేశుని యాజ్ఞలేనిదే యీ ధ్రువమందు జీమయిన నెవ్వని కుట్టగ లేదు సత్యమే క్షుద్రుడటంచు నానిలి వృకోదరుఁ బావుగ జేసి తంపిలో రుద్రుడె యా సుయోధనుని గ్రూరము గావధియించె జూడుమా!
మూడు కనులతో సతి యందము కనునెవడురందిననెవరిన్ చంపెను పాండు సుతుడుజింకలనెటుల చంపెను సింహ రాజురుద్రుఁడె , సుయోధనునిఁ జంపెఁ , గ్రూరముగను"...భారతీనాథ్ చెన్నంశెట్టి...
అద్రిజ నాదరింపకయె యజ్ఞము జేయగ దక్షుడచ్చటన్భద్రము గానలేక సతి ప్రాణమువీడగ యోగవహ్నిలోఛిద్రము జేయగా దలచి శీఘ్రమె జన్నము వీరభద్రుడైరుద్రుడె యాసుయోధనుని క్రూరముగా వధియించె జూడుమాసుయోధనుడు = మంచి యోధుడు ( దక్షుడు)
బద్రముగాను దాగినను భానుమతీశుని రెచ్చగొట్టగారౌద్రముతోడ వెల్వడెను రాజసమొప్పగ మడ్గునుండియున్భద్ర గజంబు రీతిగను వాయుకుమారుడు భీకరోగ్రుడౌరుద్రుడె, యా సుయోధనుని క్రూరముగా వధియించె జూడుమా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తేటగీతి'ఊరువున్' జూపి కృష్ణనగౌరవించ'ఛిద్రమొనరింతు'నని భీమసేనుడనియుదాగి యుండ మడుగున గదాధరునిగరుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగనునా ప్రయత్నం:ఉత్పలమాలనిద్రను సైతమున్ మఱువ నేరక ద్రౌపది భంగపాటులన్ఛిద్రము జేతు నూరువుల నిక్కమిదన్న ప్రతిజ్ఞ 'భీముఁడున్' ,భద్రమటంచు సారమున వాలినఁ బోరుకుఁ బిల్చియున్ 'గదారుద్రుఁడె' యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొల్లి ప్రతినలు చెల్లింప తొడలు విరిచిభీమసేనుడు రారాజు బింకమణచెకలను నిప్పులెగయ మధ్య కన్ను తెరచిరుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగనుశంక తీర్చగ అర్జును వంక జూచికృష్ణు డతనికొసగె దివ్య దృష్టి అందువధలు చేయువాడు శివుడు; వరుస లోనరుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: క్షుద్రుడు కౌరవాగ్రజుని క్రూర గుణమ్ముల నీసడించుచున్ రౌద్రపు రూపమొంది నని రావము జేయుచు భీకరమ్ముగన్ ఛిద్రము జేసి యూరువులు చీదఱలాడుచు భీమసేనుడౌ రుద్రుఁడె' యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా!
కె.వి.యస్. లక్ష్మి: ప్రాణ భయమున మునుగగ ద్రహము నందుభీము డరిగెను కనుగొని భీరు జాడ నులిమె భీకర రీతిని తలప దోచె రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను(ద్రహము=మడుగు)
ఉ: భద్రత నెంచి దాగెనట పర్ణసి యందున రాజరాజు తాముద్రలు వేసి స్తంభనగ, ముప్పును నివ్విధి మట్టగించ నైక్షుద్రపు మార్గమున్ గనగ క్రోధము మీరగ భీమసేనుడన్రుద్రుడె యా సుయోధనుని గ్రూరముగా వదియించె జూడుమాముద్రలు =యోగ ముద్ర మట్టగించు=తొలగించువై. చంద్రశేఖర్
వదియించె /వధియించి గా చదువగలరు
ధన్యవాదములు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండె నిండుగ ద్వేషమ్ము కూరుకొనగఅనిల పుత్రుని తామసమతిశయించపంచ భర్తృక సంతోష పడగ భీమరుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను
ద్రౌపదికి దన తొడలను దరిసనమిడరట్టడి యనుచు భావించి రౌద్రగతినినతని తొడల నుగ్గుగజేతుననిన భీమరుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను
కద్రువ బిడ్డ వాసుకియె కంఠమునుండగ యానతిచ్చెనారుద్రుఁడె ; యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా"భద్రము నీట దాగిన ప్రభావము వీడిన రాజ రాజునాక్షుద్రుని, భీమ సేనుడట , కూలిన యూరువె సాక్ష్యమిచ్చురా...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "కంఠమునుండగ నానతిచ్చె"
ఛిద్రము జేసి పాండవుల జీవితముల్ కురురాజ్యకాంక్షతోక్షుద్రదురాశయుండు నయకోవిదులన్ వని ద్రోల దుర్మతిన్,భద్రయశోవిలాసవర వాయుసుతప్రకటారివాహినీరుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా!కంజర్ల రామాచార్య.
ముద్రణ చేయు వేళ తన మామను పేర్చగ జెప్పెనచ్చులన్నిద్రను యుండుటన్ మరచి నేర్పుయు లేకను అంతరార్థమున్భద్రుడు, వృద్ధుడే మరచి పద్యము మార్చెను చూడ నిట్టులన్రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "నిద్రను నుండుటన్ ... నేర్పును లేకయె యంతరార్థమున్..."
ధన్యవాదాలు ఇలా సవరించాను గురువుగారు!ముద్రణ చేయు వేళ మరి మోదము నొప్పగ పేర్చలేక తాన్నిద్రను యచ్చులన్ మరచి నేర్పును లేకయు యంతరార్థమున్భద్రుడు, వృద్ధుడేమమరచి పద్యము మార్చెను చూడ నిట్టులన్రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా
క్షుద్రుడు వీడెగా కొలువుకూటమునందు పరాభవించె నాడా ద్రుపదాత్మజన్, బల మదాంధుని జేతుననూరునంచు దా రౌద్రముగా చెలంగె రణరంగమునన్ గన భీముడా మహా రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా
నిండు సభలోన ద్రౌపది నెగ్గు వడగగారణంబగు దుష్టుని కసిని,కాలరుద్రుడె సుయోధనుని జంపె గ్రూరముగనుసబబ యయ్యది భార్యను సముదయింప
భద్రుడు నామకుండొకడు భామరొ! వింటిరె? చిత్రమియ్యదిన్రుద్రుడె యాసుయోధనుని గ్రూరముగావధియించె జూడుమారుద్రుడు నాబరంగుచును రౌద్రముతోడను నుండునట్టియాభద్రపు రూపుడేసరగు వంధ్యుని జేసెను ధార్తరాష్ట్రునిన్
జీవ లయ కార్యము దలంప శివుని లీల యొక్కరికి నొక్క కారణ ముండ మృతికిఁ జంపు వా రాయుధమ్ములె శంకరునకు రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను క్షుద్రుని వంశ నాశకునిఁ గ్రూరుని నన్యపు టంగ రాశియే భద్ర మవధ్యమై తనరఁ బార్థుని సన్నను గాంచి యంతటన్ ఛిద్రము సేసి యూరువుల శీఘ్రమ భీముఁడు భీకరాకృతిన్ రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా
భార్యనవమానపరచినపగతుడచట దాగగ మడుగునందున దరికినీడ్చిచీల్చుచుతొడలనట భీమసేనుడనెడిరుద్రుడెసుయోధనునిజంపె క్రూరముగను
వస్త్ర మూ డ్చగ జూచిన పాలసుండు
రిప్లయితొలగించండిదుష్ట కృత్యుండు దురితుఁడు ద్రోహి యైన
కుజనుని దురము నందున క్రుద్ధ భీమ
రుద్రుడు సుయోధనుజంపె క్రూర ముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశివుని యాజ్ఞయె లేకున్న చీమయైన
కుట్ట దందురు లోకులు కువలయమున
వాయు సుతుడు కారణమైన భండనమున
రుద్రుడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభీకరముగాగరణభూమిభీముడపుడు
రిప్లయితొలగించండికదిసినెదిరినినుసిఁగోల్పెగదనుఁబట్టి
ఖండనమ్మునుఁజేసెనుకనగకాల
రుద్రుడెసుయోధనునిఁజంపెక్రూరముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరౌద్రమురూపుదాల్చినదిరోహితమయ్యెనుయుద్ధభూమియే
రిప్లయితొలగించండిభద్రముఘీంకరించెనటభాసురమయ్యెనుకోపమగ్నిగా
ఛిద్రముఁజేసెభీముఁడునుఛీయనిరోయుచురాజరాజునే
రుద్రుడెయాసుయోధనునిఁగ్రూరముగావధియించెఁజూడుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిరుద్రుడె యా సుయోధనుని
గ్రూరముగా వధియించె జూడుమా
( పాంచాలీపరాభవము - భీముని ప్రతీకారము )
భద్రముతోడ భర్తలకు
భామిని ద్రౌపది ప్రేమ మీర ని
ర్ణిద్రగ సేవలన్ సలుప
నీచుడు రాజు మదోద్ధరుండునై
ఛిద్రపు బుద్ధి నూరువుల
జేరగ బిల్వగ ; భీమసేనుడన్
రుద్రుడె యా సుయోధనుని
గ్రూరముగా వధియించె జూడుమా !
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగణపతికి తండ్రి యనినంత, కనెనెవరని
రిప్లయితొలగించండిముందు గాంధారి, గిరిధారి పూతన స్ధన
ములను బట్టి చేసె నదేమి, పొట్ట పట్టి
హరి దనుజు నెవ్విధముగ సంహరణ చేసె
రుద్రుడె, సుయోధనుని ,జంపె, క్రూరముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"తండ్రి యెవ్వరొ... స్తన.." అనండి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిద్వంద్వ యుద్ధము నందున వాయు సుతుడు
భీకరమ్మగు కినుకతో పెచ్చురేగి
రుద్రుడె సుయోధనుని జంపె క్రూరముగను
ననియెడు నటుల తీక్ష్ణమై యడరుజెందె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅద్రిజ ప్రాణనాథు డతడంబర కేశుని యాజ్ఞలేనిదే
యీ ధ్రువమందు జీమయిన నెవ్వని కుట్టగ లేదు సత్యమే
క్షుద్రుడటంచు నానిలి వృకోదరుఁ బావుగ జేసి తంపిలో
రుద్రుడె యా సుయోధనుని గ్రూరము గావధియించె జూడుమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడు కనులతో సతి యందము కనునెవడు
రిప్లయితొలగించండిరందిననెవరిన్ చంపెను పాండు సుతుడు
జింకలనెటుల చంపెను సింహ రాజు
రుద్రుఁడె , సుయోధనునిఁ జంపెఁ , గ్రూరముగను"
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅద్రిజ నాదరింపకయె యజ్ఞము జేయగ దక్షుడచ్చటన్
రిప్లయితొలగించండిభద్రము గానలేక సతి ప్రాణమువీడగ యోగవహ్నిలో
ఛిద్రము జేయగా దలచి శీఘ్రమె జన్నము వీరభద్రుడై
రుద్రుడె యాసుయోధనుని క్రూరముగా వధియించె జూడుమా
సుయోధనుడు = మంచి యోధుడు ( దక్షుడు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబద్రముగాను దాగినను భాను
రిప్లయితొలగించండిమతీశుని రెచ్చగొట్టగా
రౌద్రముతోడ వెల్వడెను రాజస
మొప్పగ మడ్గునుండియున్
భద్ర గజంబు రీతిగను వాయు
కుమారుడు భీకరోగ్రుడౌ
రుద్రుడె, యా సుయోధనుని క్రూ
రముగా వధియించె జూడుమా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండి'ఊరువున్' జూపి కృష్ణనగౌరవించ
'ఛిద్రమొనరింతు'నని భీమసేనుడనియు
దాగి యుండ మడుగున గదాధరునిగ
రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను
నా ప్రయత్నం:
ఉత్పలమాల
నిద్రను సైతమున్ మఱువ నేరక ద్రౌపది భంగపాటులన్
ఛిద్రము జేతు నూరువుల నిక్కమిదన్న ప్రతిజ్ఞ 'భీముఁడున్' ,
భద్రమటంచు సారమున వాలినఁ బోరుకుఁ బిల్చియున్ 'గదా
రుద్రుఁడె' యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండితొల్లి ప్రతినలు చెల్లింప తొడలు విరిచి
రిప్లయితొలగించండిభీమసేనుడు రారాజు బింకమణచె
కలను నిప్పులెగయ మధ్య కన్ను తెరచి
రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను
శంక తీర్చగ అర్జును వంక జూచి
కృష్ణు డతనికొసగె దివ్య దృష్టి అందు
వధలు చేయువాడు శివుడు; వరుస లోన
రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిక్షుద్రుడు కౌరవాగ్రజుని క్రూర గుణమ్ముల నీసడించుచున్
రౌద్రపు రూపమొంది నని రావము జేయుచు భీకరమ్ముగన్
ఛిద్రము జేసి యూరువులు చీదఱలాడుచు భీమసేనుడౌ
రుద్రుఁడె' యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిప్రాణ భయమున మునుగగ ద్రహము నందు
భీము డరిగెను కనుగొని భీరు జాడ
నులిమె భీకర రీతిని తలప దోచె
రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను
(ద్రహము=మడుగు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిభద్రత నెంచి దాగెనట పర్ణసి యందున రాజరాజు తా
ముద్రలు వేసి స్తంభనగ, ముప్పును నివ్విధి మట్టగించ నై
క్షుద్రపు మార్గమున్ గనగ క్రోధము మీరగ భీమసేనుడన్
రుద్రుడె యా సుయోధనుని గ్రూరముగా వదియించె జూడుమా
ముద్రలు =యోగ ముద్ర
మట్టగించు=తొలగించు
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివదియించె /వధియించి గా చదువగలరు
రిప్లయితొలగించండిధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగుండె నిండుగ ద్వేషమ్ము కూరుకొనగ
రిప్లయితొలగించండిఅనిల పుత్రుని తామసమతిశయించ
పంచ భర్తృక సంతోష పడగ భీమ
రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిద్రౌపదికి దన తొడలను దరిసనమిడ
రిప్లయితొలగించండిరట్టడి యనుచు భావించి రౌద్రగతిని
నతని తొడల నుగ్గుగజేతుననిన భీమ
రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికద్రువ బిడ్డ వాసుకియె కంఠమునుండగ యానతిచ్చెనా
రిప్లయితొలగించండిరుద్రుఁడె ; యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా"
భద్రము నీట దాగిన ప్రభావము వీడిన రాజ రాజునా
క్షుద్రుని, భీమ సేనుడట , కూలిన యూరువె సాక్ష్యమిచ్చురా
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కంఠమునుండగ నానతిచ్చె"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఛిద్రము జేసి పాండవుల జీవితముల్ కురురాజ్యకాంక్షతో
తొలగించండిక్షుద్రదురాశయుండు నయకోవిదులన్ వని ద్రోల దుర్మతిన్,
భద్రయశోవిలాసవర వాయుసుతప్రకటారివాహినీ
రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా!
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముద్రణ చేయు వేళ తన మామను పేర్చగ జెప్పెనచ్చులన్
తొలగించండినిద్రను యుండుటన్ మరచి నేర్పుయు లేకను అంతరార్థమున్
భద్రుడు, వృద్ధుడే మరచి పద్యము మార్చెను చూడ నిట్టులన్
రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"నిద్రను నుండుటన్ ... నేర్పును లేకయె యంతరార్థమున్..."
ధన్యవాదాలు ఇలా సవరించాను గురువుగారు!
రిప్లయితొలగించండిముద్రణ చేయు వేళ మరి మోదము నొప్పగ పేర్చలేక తాన్
నిద్రను యచ్చులన్ మరచి నేర్పును లేకయు యంతరార్థమున్
భద్రుడు, వృద్ధుడేమమరచి పద్యము మార్చెను చూడ నిట్టులన్
రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా
క్షుద్రుడు వీడెగా కొలువుకూటమునందు పరాభవించె నా
రిప్లయితొలగించండిడా ద్రుపదాత్మజన్, బల మదాంధుని జేతుననూరునంచు దా
రౌద్రముగా చెలంగె రణరంగమునన్ గన భీముడా మహా
రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా
నిండు సభలోన ద్రౌపది నెగ్గు వడగ
రిప్లయితొలగించండిగారణంబగు దుష్టుని కసిని,కాల
రుద్రుడె సుయోధనుని జంపె గ్రూరముగను
సబబ యయ్యది భార్యను సముదయింప
భద్రుడు నామకుండొకడు భామరొ! వింటిరె? చిత్రమియ్యదిన్
రిప్లయితొలగించండిరుద్రుడె యాసుయోధనుని గ్రూరముగావధియించె జూడుమా
రుద్రుడు నాబరంగుచును రౌద్రముతోడను నుండునట్టియా
భద్రపు రూపుడేసరగు వంధ్యుని జేసెను ధార్తరాష్ట్రునిన్
జీవ లయ కార్యము దలంప శివుని లీల
రిప్లయితొలగించండియొక్కరికి నొక్క కారణ ముండ మృతికిఁ
జంపు వా రాయుధమ్ములె శంకరునకు
రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను
క్షుద్రుని వంశ నాశకునిఁ గ్రూరుని నన్యపు టంగ రాశియే
భద్ర మవధ్యమై తనరఁ బార్థుని సన్నను గాంచి యంతటన్
ఛిద్రము సేసి యూరువుల శీఘ్రమ భీముఁడు భీకరాకృతిన్
రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా
భార్యనవమానపరచినపగతుడచట
రిప్లయితొలగించండిదాగగ మడుగునందున దరికినీడ్చి
చీల్చుచుతొడలనట భీమసేనుడనెడి
రుద్రుడెసుయోధనునిజంపె క్రూరముగను