4, జూన్ 2021, శుక్రవారం

సమస్య - 3742

5-6-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ”
(లేదా...)
“పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ”

69 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    [ఈ మధ్య నొక బృందములో నొక మిత్రుఁడు నేను ప్రకటించిన పద్యమును గూర్చి చెప్పిన సందర్భము]

    సమదల సత్కవిత్వమగు చక్కని పద్దెము వ్రాసి, బృందమం
    దమిత ముదమ్ముతో నునుప, దానినిఁ జూచిన మిత్రుఁ డొండు, తాఁ
    దమినిఁ బఠింపకే, కనుచు, ’దానిఁ బఠించుట వ్యర్థమే!’ యనెన్!

    పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. [ఈ మధ్య నొక బృందములో నొక మిత్రుఁడు నేను ప్రకటించిన పద్యమును గూర్చి చెప్పిన సందర్భము]

      సదమల సత్కవిత్వమగు చక్కని పద్దెము వ్రాసి, బృందస
      మ్మదపు ముదమ్ముతో నునుప, మంకుగఁ జూచిన మిత్రుఁ డొండు, దా
      నెదుటఁ బఠింపకే, కనుచు, ’నిద్ది పఠించుట వ్యర్థమే!’ యనెన్!
      పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ?

      తొలగించండి
    2. ప్రాస దోషాన్ని సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  2. ఇదిగోచూడుమునవయుగ
    మిదియునుజనులకుతెలివినినిండుగనిచ్చున్
    పదపడిజీవికలేనివి
    పదుగురుమెచ్చెడికవితలఫలమేమికవీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. మి, నిలకుయతివేయవచ్చుననుకునివేశానుసందేహముతీర్చగలరు

      తొలగించండి
  3. చదివించ గల రచనలే
    పదుగురు మెచ్చె డి కవిత ల ఫలమే : మి కవీ
    చదివిన భావము దెలియక

    పదముల పేర్చియు రచింప ఫలితము గలదా?

    రిప్లయితొలగించండి
  4. పదులును వందలు వేలుగ
    కుదురుగ పరమాత్మఁ దలపకున్నను కావ్యం
    బది కైవల్యంబిడునే?
    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమికవీ?

    రిప్లయితొలగించండి
  5. ఎదలనుదాగియుండెడివివెచ్చనిమాటలమూటలేగదా
    పదములపోందుకూర్చుచునుపన్నుగభావములందఁజేయగా
    ఎదగనిమేధలయ్యవియువేరుగనారసివిందుసేతురే
    పదుగురుమెచ్చుపద్యములవ్రాసిననేమిఫలమ్ముసత్కవీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. ఎదలనుదాగియుండెడివినేగతిమాటలమూటలేగదా
      పదములఁబోందుకూడికనుపన్నుగభావములందఁజేయగా
      ఎదగనిమేధలయ్యవియునేవిధినారసివిందుసేతురే
      పదుగురుమెచ్చుపద్యములవ్రాసిననేమిఫలమ్ముసత్కవీ

      తొలగించండి

  6. ముదమని సాహిత్యమ్మును
    చదివెడు సామాన్యులెవరు? సంభృత శ్రుతులున్
    చదవరులు ముఖస్తుతికై
    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ.

    రిప్లయితొలగించండి
  7. కలమును బట్టలేని పలుగాకు
    లు నిత్యము భోగభాగ్యము
    ల్లిలపయి ముఖ్యమంచు మది
    నెంతురు వారలందు చేతనే
    పలుకుదు రిట్లు, కావ్యముల
    వ్రాసెడు వారల జూసి యీర్షచే,
    "పలుగురు మెచ్చు పద్యములు
    వ్రాసిన నేమి ఫలంబు సత్కవీ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి

  8. హృదయము దాకునట్లు కడు హృద్యముగా రచియింప నేమి కో
    విదులగు వారుతప్ప నిక పెద్దలెవండు పఠింప కుండగన్
    వదలక పట్టిపట్టి బల వంతము గా వినిపింప నట్టి యా
    పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలము సత్కవీ.

    రిప్లయితొలగించండి
  9. ఎదయెదలను గదిలించుచు
    ముదమును గలిగించెడు కళ పోషణలేకే
    వదిలించగ చేతి చమురు
    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మది ముదమందు కీర్తియును మంగళముల్ గలుగున్ భువిన్ సదా
      పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన; నేమి ఫలమ్ము సత్కవీ
      పదపడి క్రిందుమీదగుచు భావము వ్యాకరణమ్ము ఛందమున్
      వదలుచు వేనవేలుగను వ్రాయగ పద్యములన్ విలోలతన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏

      తొలగించండి
  10. హృదయము లేని కరోనల

    కెదురు నిలవ జాలక వణికెడు రోగులకున్

    నదురగు సాయమె పాడిర

    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  11. కందం
    ముదమున మిత్రుల కైతలు
    వదలక ప్రతిదినము మీరు వహ్వా! యనఁగన్
    విదురులు వినా తమ సఖులు
    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ?

    చంపకమాల
    పదపడి వ్రాయఁ గైతలను భావము వొందిక నొప్పలేదనన్
    విదురుల కైతలన్ జదివి వేడుక వాటిని తస్కరించియున్
    గుదిరిచి సొంతపేరునిడి గొప్పకు నావని మాధ్యమమ్ములన్
    పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ?

    రిప్లయితొలగించండి
  12. ఈపద్యమునే పరిశీలించండి గురువుగారు

    కలమును బట్టలేని పలుగాకు
    లు నిత్యము భోగభాగ్యము
    ల్లిలపయి ముఖ్యమంచు మది
    నెంచెడి వారలు నెల్లవేళలన్
    పలుకుదు రిట్లు, కావ్యముల
    వ్రాసెడు వారలజూసి యీర్షచే,
    "పలుగురు మెచ్చు పద్యములు
    వ్రాసిన నేమి ఫలంబు సత్కవీ"

    రిప్లయితొలగించండి
  13. సమస్య :

    పదుగురు మెచ్చు పద్యముల
    వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ

    ( వాసి కవితలు కీర్తిదాయకాలు - రాశి కవితలు దండుగమారులు )

    చంపకమాల
    ...................

    చెదరని భావసంపదయు ,
    జెల్వుగ బుద్ధివికాసకారులౌ
    కుదురగు సన్నివేశములు ,
    గూర్చిన శాశ్వతకీర్తి లభ్యమౌ
    పదుగురు మెచ్చు పద్యముల
    వ్రాసిన ; నేమి ఫలమ్ము సత్కవీ ?
    యదవదతోడ తత్తరము
    నందుచు రాశిగ కైతలల్లినన్ .

    (అదవద - కలత ; తత్తరము - తొందరపాటు )

    రిప్లయితొలగించండి
  14. పొదుపుగ మాటలు వాడక
    కుదుపులతో తొంబదుగురకున్ జటి లంబై
    పద సంక్షోభసహితమౌ
    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ?

    రిప్లయితొలగించండి
  15. మది రంజిలుగా వ్రాయగ
    పదుగురు మెచ్చెడి కవితల; ఫలమేమి కవీ
    పదులును వందల కవితల
    పదముల డాంబికమె గాని పస లేకున్నన్

    రిప్లయితొలగించండి
  16. చం:

    వదలక వ్రాయు పద్యములు వాడుక భాష తెనుంగు నెంచనై
    యెదలను తాకినంత మరి యెల్లలు దాటి ప్రసిద్ధి నొందగన్
    బదులుగ వన్నెకెక్కగను బల్కుట నివ్విధి నెట్లు భావ్యమౌ?
    పదుగురు మెచ్చు పద్యములు వ్రాసిన నేమి ఫలంబు సత్కవీ!

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  17. పదునుగ పద్యము వ్రాసిన
    విదిలింపరు రూకనైన వెర్రితనమ్మా
    క్షుధ దీర్పగ లేనప్పుడు
    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ

    రిప్లయితొలగించండి
  18. మది దాగిన భావమ్ములు
    పద పాటవమేళనమున పలువురి హితమున్
    బెదరక చెప్పెద వెప్పుడు
    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ

    రిప్లయితొలగించండి
  19. పెదవులనంద చందములు పెద్దగ వర్ణన సేయ లోకమున్

    పదుగురు మెచ్చు ; పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ

    మధురము నీదు నామమని మానిని మానస చోర బాలునిన్

    హృదయము పొంగు రీతులను కృష్ణుని లీలను కోరి చెప్పుచున్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  20. మృదులవచోవిలాసము లమేయరసాన్వితవర్ణనమ్ములం
    బొదుపుగఁ జేర్చి శబ్దముల, పొందుగ భావపరీమళమ్ములం
    బదపడి కూర్చ లేక రసభావవిహీనపదార్భటీగతిం
    బదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ!

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  21. మరో పూరణ

    పదవుల నీయబో రెవరు ప్రాకటనిర్ధనఖేదనమ్ములం
    దదవద నొంద నాదుకొని యాపద దీర్చెడు వార లుండ బో
    రదను గ్రహించి సాయపడు నార్యమహోన్నతు లుండబో రహో!
    పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ!

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  22. చదువకనిత్యసత్యములసంఘములందునహెచ్చుఁదగ్గులన్
    వదులుచుదత్వసంపదనువారధిగట్టకముందువారికిన్,
    బదములడంబరంబులనుబల్కుచునస్థిరఁబాదబంక్తులౌ
    పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ”

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  23. ముదిరిన మూర్ఖభావనలబోలెడు పుత్తములేర్చిగూర్చినన్
    గుదురునె యప్పరాత్పరుని గొల్వని యద్భుత కావ్యరాజముల్
    మదులను దోచబోవుగద, మత్సరమున్ బురిగొల్పు, జూడగన్
    పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ?
    ముదమున గూర్చి పద్యముల మోక్షమునొందుట మేలుగాదొకో!

    రిప్లయితొలగించండి
  24. కదలని ధారయు ఛందం
    బొదవని పద బంధనముల నొదగని భావం
    బెదియున్గాన్పడనోపక
    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ?!

    రిప్లయితొలగించండి
  25. చదివి ముదమ్ము నొంది కడు చక్కని కైతలటంచు మెచ్చినన్
    సదమల బుద్ధితో నడచు సందడిగాండ్లు, కలుంగు కీర్తి సూ
    బుధులగు వారికర్థమగు పూనికతో కఠినంపు భాషలో
    పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ?

    రిప్లయితొలగించండి
  26. పద విన్యాస ప్రతిభా
    విదథ మహా కావ్య చయము విష యాధీ శా
    విది తానాదర మైనం
    బదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ


    సదమల శబ్ద భావ యుత చారు తరార్థ వరోపమాన సం
    ప దతులి తావతంస సువిభాసిత భవ్య మనోజ్ఞ సత్కథా
    విదిత రసాన్వి తోన్నత పవిత్రము లర్థ విహీనమైనచోఁ
    బదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ

    [అర్థము =1. శబ్దార్థము 2. ధనము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరాభరణమున సెప్టెంబరు 2015 నుండి (నే నడుగిడి నప్పటి నుండి) నేటి వఱకుఁ గవి గవిత్వ సంబంధ సమస్యలు 91 యైనవి. శత సమస్యలు త్వరలోఁ గాఁ గల వని యాశించెదను!

      28/9/2015 నాటితోఁ బ్రారంభము.
      కవివర!నీ కవిత్వమునఁ గాంతుము ..
      ఇది పద్య ప్రారంభం.
      దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

      అప్పటి నా పద్యము:
      కవివర!నీ కవిత్వమునఁ గాంతుము భావ గభీర గూఢముల్
      కవన సుధార సోద్దిత వికాస మనోజ్ఞ మరంద ధారలున్
      సువికసి తారవిందములు సుందర శబ్ద సుసంహి తమ్ములున్
      నవరస గుంభి తావిరల నంద విశేష విలాస దాయముల్

      తొలగించండి
  27. చంపకమాల
    సదముల రీతి పద్యముల ఛందము నొప్ప కవిత్వ మాధురుల్
    ముదమును గూర్పఁగన్బలికి ముచ్చట మిత్రుల మధ్య పంచితే!
    విదుర విశాలలోకమున వేడుక మెప్పును బొందనెంచకే
    పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ?

    రిప్లయితొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  29. ముదమును శాంతిని దృప్తిని
    మృదువగు పదకో శములను మేదికి యీయన్
    పదములు న్యాయమె యిటులన
    పదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ!

    రిప్లయితొలగించండి
  30. పదునగు భావజాలములు పద్యములందున నేర్చికూర్చి యిం
    పొదవెడురీతి పాదముల పోహళ పెట్టి యలంకరించినన్
    గదురుగజేయ జాలదుగ కస్తినివారణజేయు మార్గమున్
    పదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ

    రిప్లయితొలగించండి
  31. ముదములు గల్గు నెల్లరకు ,ముచ్చత గూర్చును మోము దమ్మిపై
    పదుగురు మెచ్చు పద్యములవ్రాసిన,నేమి ఫలమ్ము సత్కవీ!
    పదముల సొంపునుండకను బద్యములెన్నియు వ్రాయుచుండినన్
    సదమల బుద్ధి నిచ్చెడుసుశబ్దపు పద్యమువ్రాయనొప్పగున్

    రిప్లయితొలగించండి
  32. మృదుమధురంబగుచక్కని
    పదములతోడనుసతతము వ్రాసిన నొప్పౌ
    కదనముకూర్చెడివిధముగ
    పదుగురుమెచ్చెడికవితలఫలమేమికవీ

    రిప్లయితొలగించండి