21-6-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్”(లేదా...)“మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్”
సందరము చిలుకు వేళలపొందిక వీడి గిరి క్రుంగె , నందుని సుతుడున్పొందిన గాయము కాంచిన్మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "గాయము గాంచియు" అనండి.
కందెనుకాంతలమనసేకుందేలాయెనుసుదతియుకుండలతోడన్చిందులువేసెనుకవ్వముమందరపర్వతమునోక్కమానినిఁదిట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందంవిందొనరించును సుధననియందరుఁ దెచ్చియు మధించ నంబుధి నా కీయిందిరనిడె సవతిగననిమందరపర్వతము నొక్క మానిని దిట్టెన్మానిని = భూ దేవిఉత్పలమాలవిందొనరించు తా సుధను వేడుకఁ గ్రోలెద మంచు దెచ్చి యయ్యందరు జుట్టి వాసుకిని నంబుధి జిల్కఁగ ముందె కుందఁగానిందిర నొక్కతెన్ సవతి నేర్పడ జేసెనటంచుఁ జెచ్చెరన్మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
సుందర కూర్మంబు హరిని మందర పర్వతము నొక్క , మానిని దిట్టెన్ కొందలమందుచు సురలనునిందితులను జేసి పతికి నీడగనిల్చెన్
చక్కని పూరణ. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
సందర మథనము సేయగనందుండిప్రమాదకరపు హాహాలమ్మే మందరమణిజేర తొగనుమందర పర్వతము నొక్క మానిని దిట్టెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సందర మథనము'?
సందరమున్ మథింపగ విషమ్ము ప్రమాదకరంబు నాభియే యందుననుద్భవించి యది యంబరకేశుని కంఠమందునన్ మందది జేరివానికట మచ్చను జేసెనటంచు బాధతో మందర పర్వతంబునొక మానిని నిందయొనర్చె గిన్కతోన్.
అందపు క్షీ రాంబుధి లో సుందర శైలమ్ము క్రుంగ సురవరు లెల్లన్ పొందుగ వేడగ హరి గని మందర పర్వతము నొక్క మానిని దిట్టెన్
కందుటగానవచ్చెనటకాంతకుమోమునదర్విలాగగాచిందులుస్రుష్టిలీలయనిచెప్పెడినామెకుముందువెన్కగోవిందుడుపట్టిలాగుననివెన్ననుభద్రముఁజేయువేడ్కతోమందరపర్వతమ్మునోకమానినినిందయోనర్చెకిన్కతోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సృష్టి' టైపాటు.
మంధరగిరిసందర్శనసంధర్భమునన్ బడలిక సంరోధముతోకందిన పాదంబులతోమందరపర్వతము నొక్క మానిని దిట్టెన్
సందరమునుచిలుకుటకైమందరమును శౌరి కూర్మమై తలదాల్చన్సుందర దేహము కందగమందర పర్వతము నొక్క మానిని దిట్టెన్
సుందరుడై చెలంగు హరి' సొక్కుచు మూపున కూర్మ రూపుడైమందరమున్ ధరింప పలుమారులు త్రచ్చుచు నొవ్వజేయగాకందిన దేహమున్ తలచి క్రందనజేసిరి భక్తకోటి యామందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్
మందిరము చేసి పతిదౌడెందము నందుండెడు సిరి డీలా పడుచున్కందగ హరి, వీపునగలమందరపర్వతము నొక్క మానిని దిట్టెన్
డెందములో స్త్రీ సొగసుకు,మందమునను,మోటుశిలల మలినంబులతోకుందైతి నేనను మిషనుమందరపర్వతము, నొక్క మానిని దిట్టెన్”చిందర బందరైన వన శీర్షముతోడ మహోన్నతంబులౌమోదము నివ్వలేనిపెను మోటగు బండలు గుండ్లు తప్ప లేదందము, సౌష్టవం బు గల యంగజ సోయగ మొప్పు, మందమౌమందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చె, గిన్కతోన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కొందరకమృతంబిడి మరికొందరికిడి కల్పకంబు కోర్కెలు దీరన్ఎందుకు నాకేమిడవనిమందరపర్వతము నొక్క మానిని దిట్టెన్
కందుకము వోలె నుండునుమందరపర్వతము,నొక్కమానిని దిట్టెన్ నందఱు నుండగ సభలోమందుడు మూర్ఖుడు నగునొక మంత్రిని బాధన్
మందర పర్వతంబిడెను మాన్యత నొప్పగ నమృతంబునున్ నందఱి దేవతాళికిని నాయతరీతిని నంచుబల్కుచున్ నందఱి కన్నియిచ్చి,దనుహర్షము నొందగ నీయకుండగామందరపర్వతము నొకమానిని నింద యొనర్చె గిన్కతోన్
ఇందఱిలో నేల శివుని నంద ఱడుగ వలె నలసమె యా యద్రి విషంబందేల పుట్ట వలె నని మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్ [ఇక్కడ మానిని పార్వతీ దేవి చెలికత్తెలలో నొకతె] అందఱు చూచు చుండగ ననర్హను నిందల కేను మిన్నయౌ సుందర వృత్తి నుండ నిలఁ జోద్య మకారణ మక్క టక్కటా కంద మనమ్ము మిక్కుటము కర్కశ రీతిని నన్ను జూడు మా మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్
ఉ: బృందము కొండ జేరెనట విందును బొంద విలాసయాత్ర కైసుందరి యూరకుండకయె చుక్కలు చెక్కెను మందరాగ్రిగన్తొందరలోన *మందు* ర గ దోషము దొర్లగ సిగ్గునొందనైమందర పర్వతంబు నొక మానిని నింద యొనర్చె గిన్కతోన్వై. చంద్రశేఖర్
మండరాగ్రిగన్ / మండరాద్రిగన్ గా చదువగలరు
అందరి బాగుకై విషము నాని యుమాపతి యుల్లసమ్ముతోకంధరమందునన్ నిలుపగా నది నల్లగ మాడ్చె చెచ్చెరన్కందిన నట్టిదౌ మగని కంఠము గన్గొని బాధ నొందుచున్మందర పర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్
బందరు లడ్డులన్ వడల భారిగ మెక్కుచు నింటినుండియేకందక కార్యభారమును కంప్యుటరందున నిర్వహించగా సుందరుడైన భర్త కడు చోద్యముగా గనుపట్ట బోలచున్మందర పర్వతంబు, నొక మానిని నిందయొనర్చెను గిన్కతో
బోలుచున్ టైపాటు
సుందరమైనసంద్రమును , జుట్టయు వాసుకి మందరాద్రికిన్,గుందుచు రత్నగర్భ పడు గోడును గాంచియు , ద్రచ్చుచుండగామందుడ ! బాధకోర్చెగద మానిని సాగరు భార్యయంచు నామందర పర్వతంబునొక మానినినిందయొనర్చె గిన్కతో ~~~~~~~~~~~~~~~~~~
మందర పర్వతము సముద్ర మధ్యము గా అతి సుందర ప్రదేశము. శివపార్వతులు ఇక్కడ కాపురం చేశారని ప్రసిద్ధి. ఇట్టి ప్రదేశంలో తిరుగాడే ఒక నాయిక ఈ విధంగా తలుస్తుందనే భావనగా నా ప్రయత్నము:ఉ: అందము చింద వేచితిని యామని వేళన పొందుగోరనైసందడి పిల్ల తెమ్మెరలు చక్కని వెన్నెల రాత్రులందు ; నా చందము గానకుంటి నిను చప్పున తోడ్కొన మంథనమ్ము, హేమందర పర్వతంబు ,నొక మానిని నింద యొనర్చె గిన్కతోన్వై. చంద్రశేఖర్
సందరము చిలుకు వేళల
రిప్లయితొలగించండిపొందిక వీడి గిరి క్రుంగె , నందుని సుతుడున్
పొందిన గాయము కాంచిన్
మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"గాయము గాంచియు" అనండి.
కందెనుకాంతలమనసే
రిప్లయితొలగించండికుందేలాయెనుసుదతియుకుండలతోడన్
చిందులువేసెనుకవ్వము
మందరపర్వతమునోక్కమానినిఁదిట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండివిందొనరించును సుధనని
యందరుఁ దెచ్చియు మధించ నంబుధి నా కీ
యిందిరనిడె సవతిగనని
మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్
మానిని = భూ దేవి
ఉత్పలమాల
విందొనరించు తా సుధను వేడుకఁ గ్రోలెద మంచు దెచ్చి య
య్యందరు జుట్టి వాసుకిని నంబుధి జిల్కఁగ ముందె కుందఁగా
నిందిర నొక్కతెన్ సవతి నేర్పడ జేసెనటంచుఁ జెచ్చెరన్
మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిసుందర కూర్మంబు హరిని
రిప్లయితొలగించండిమందర పర్వతము నొక్క , మానిని దిట్టెన్
కొందలమందుచు సురలను
నిందితులను జేసి పతికి నీడగనిల్చెన్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిసందర మథనము సేయగ
నందుండిప్రమాదకరపు హాహాలమ్మే
మందరమణిజేర తొగను
మందర పర్వతము నొక్క మానిని దిట్టెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సందర మథనము'?
రిప్లయితొలగించండిసందరమున్ మథింపగ విషమ్ము ప్రమాదకరంబు నాభియే
యందుననుద్భవించి యది యంబరకేశుని కంఠమందునన్
మందది జేరివానికట మచ్చను జేసెనటంచు బాధతో
మందర పర్వతంబునొక మానిని నిందయొనర్చె గిన్కతోన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందపు క్షీ రాంబుధి లో
రిప్లయితొలగించండిసుందర శైలమ్ము క్రుంగ సురవరు లెల్లన్
పొందుగ వేడగ హరి గని
మందర పర్వతము నొక్క మానిని దిట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందుటగానవచ్చెనటకాంతకుమోమునదర్విలాగగా
రిప్లయితొలగించండిచిందులుస్రుష్టిలీలయనిచెప్పెడినామెకుముందువెన్కగో
విందుడుపట్టిలాగుననివెన్ననుభద్రముఁజేయువేడ్కతో
మందరపర్వతమ్మునోకమానినినిందయోనర్చెకిన్కతోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సృష్టి' టైపాటు.
మంధరగిరిసందర్శన
రిప్లయితొలగించండిసంధర్భమునన్ బడలిక సంరోధముతో
కందిన పాదంబులతో
మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసందరమునుచిలుకుటకై
రిప్లయితొలగించండిమందరమును శౌరి కూర్మమై తలదాల్చన్
సుందర దేహము కందగ
మందర పర్వతము నొక్క మానిని దిట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసుందరుడై చెలంగు హరి' సొక్కుచు మూపున కూర్మ రూపుడై
రిప్లయితొలగించండిమందరమున్ ధరింప పలుమారులు త్రచ్చుచు నొవ్వజేయగా
కందిన దేహమున్ తలచి క్రందనజేసిరి భక్తకోటి యా
మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమందిరము చేసి పతిదౌ
రిప్లయితొలగించండిడెందము నందుండెడు సిరి డీలా పడుచున్
కందగ హరి, వీపునగల
మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడెందములో స్త్రీ సొగసుకు,
రిప్లయితొలగించండిమందమునను,మోటుశిలల మలినంబులతో
కుందైతి నేనను మిషను
మందరపర్వతము, నొక్క మానిని దిట్టెన్”
చిందర బందరైన వన శీర్షముతోడ మహోన్నతంబులౌ
మోదము నివ్వలేనిపెను మోటగు బండలు గుండ్లు తప్ప లే
దందము, సౌష్టవం బు గల యంగజ సోయగ మొప్పు, మందమౌ
మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చె, గిన్కతోన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికొందరకమృతంబిడి మరి
రిప్లయితొలగించండికొందరికిడి కల్పకంబు కోర్కెలు దీరన్
ఎందుకు నాకేమిడవని
మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందుకము వోలె నుండును
రిప్లయితొలగించండిమందరపర్వతము,నొక్కమానిని దిట్టెన్
నందఱు నుండగ సభలో
మందుడు మూర్ఖుడు నగునొక మంత్రిని బాధన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమందర పర్వతంబిడెను మాన్యత నొప్పగ నమృతంబునున్
రిప్లయితొలగించండినందఱి దేవతాళికిని నాయతరీతిని నంచుబల్కుచున్
నందఱి కన్నియిచ్చి,దనుహర్షము నొందగ నీయకుండగా
మందరపర్వతము నొకమానిని నింద యొనర్చె గిన్కతోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఇందఱిలో నేల శివుని
రిప్లయితొలగించండినంద ఱడుగ వలె నలసమె యా యద్రి విషం
బందేల పుట్ట వలె నని
మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్
[ఇక్కడ మానిని పార్వతీ దేవి చెలికత్తెలలో నొకతె]
అందఱు చూచు చుండగ ననర్హను నిందల కేను మిన్నయౌ
సుందర వృత్తి నుండ నిలఁ జోద్య మకారణ మక్క టక్కటా
కంద మనమ్ము మిక్కుటము కర్కశ రీతిని నన్ను జూడు మా
మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్
ఉ:
రిప్లయితొలగించండిబృందము కొండ జేరెనట విందును బొంద విలాసయాత్ర కై
సుందరి యూరకుండకయె చుక్కలు చెక్కెను మందరాగ్రిగన్
తొందరలోన *మందు* ర గ దోషము దొర్లగ సిగ్గునొందనై
మందర పర్వతంబు నొక మానిని నింద యొనర్చె గిన్కతోన్
వై. చంద్రశేఖర్
మండరాగ్రిగన్ / మండరాద్రిగన్ గా చదువగలరు
తొలగించండిఅందరి బాగుకై విషము నాని యుమాపతి యుల్లసమ్ముతో
రిప్లయితొలగించండికంధరమందునన్ నిలుపగా నది నల్లగ మాడ్చె చెచ్చెరన్
కందిన నట్టిదౌ మగని కంఠము గన్గొని బాధ నొందుచున్
మందర పర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్
బందరు లడ్డులన్ వడల భారిగ మెక్కుచు నింటినుండియే
రిప్లయితొలగించండికందక కార్యభారమును కంప్యుటరందున నిర్వహించగా
సుందరుడైన భర్త కడు చోద్యముగా గనుపట్ట బోలచున్
మందర పర్వతంబు, నొక మానిని నిందయొనర్చెను గిన్కతో
బోలుచున్ టైపాటు
తొలగించండిసుందరమైనసంద్రమును , జుట్ట
రిప్లయితొలగించండియు వాసుకి మందరాద్రికిన్,
గుందుచు రత్నగర్భ పడు గోడు
ను గాంచియు , ద్రచ్చుచుండగా
మందుడ ! బాధకోర్చెగద మా
నిని సాగరు భార్యయంచు నా
మందర పర్వతంబునొక మానిని
నిందయొనర్చె గిన్కతో
~~~~~~~~~~~~~~~~~~
మందర పర్వతము సముద్ర మధ్యము గా అతి సుందర ప్రదేశము. శివపార్వతులు ఇక్కడ కాపురం చేశారని ప్రసిద్ధి. ఇట్టి ప్రదేశంలో తిరుగాడే ఒక నాయిక ఈ విధంగా తలుస్తుందనే భావనగా నా ప్రయత్నము:
రిప్లయితొలగించండిఉ:
అందము చింద వేచితిని యామని వేళన పొందుగోరనై
సందడి పిల్ల తెమ్మెరలు చక్కని వెన్నెల రాత్రులందు ; నా
చందము గానకుంటి నిను చప్పున తోడ్కొన మంథనమ్ము, హే
మందర పర్వతంబు ,నొక మానిని నింద యొనర్చె గిన్కతోన్
వై. చంద్రశేఖర్