8, ఆగస్టు 2023, మంగళవారం

సమస్య - 4498

9-8-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బొబ్బిలి యుద్ధమున నోడె బుస్సీ సేనల్”
(లేదా...)
“బొబ్బిలి యుద్ధరంగమున బుస్సి బలంబులె యోడె వింటివా”

14 కామెంట్‌లు:

  1. పబ్బము గడుపుకొనదలచి
    యబ్బురముగ ఫ్రెంచి సేన యాలము లోనన్
    బెబ్బులి తో పోరాడెను
    బొబ్బిలి యుద్ధమున నోడె బుస్సీ సేనల్.

    రిప్లయితొలగించండి
  2. బొబ్బిలి యుద్ధంబనునొక
    కబ్బము చదివి నిదురింప కలలో నేనో
    యబ్బురము గంటి యందున
    బొబ్బిలి యుద్ధమున నోడె బుస్సీ సేనల్.

    రిప్లయితొలగించండి
  3. బొబ్బిలి వీరులు దురమున
    నబ్బురముగ పోరుసల్పి యసువులు బాయన్
    తబ్బిబ్బయి బుస్సిపలికె
    బొబ్బిలి యుద్ధమున నోడె బుస్సీ సేనల్

    రిప్లయితొలగించండి

  4. గబ్బితనమ్ముతో భరత కల్పము జొచ్చిన తెల్ల వారనన్
    ప్రబ్బుగ నాగ్రహమ్ముగల వాడొక రాతిరి గాంచె నిద్రలో
    నబ్బుర స్వప్న మొక్కటిని యందున గెల్చిరి భార తీయులే
    బొబ్బిలి యుద్ధరంగమున , బుస్సి బలంబులె యోడె వింటివా.

    రిప్లయితొలగించండి
  5. తబ్బిబ్బు సేయ కుండుము
    “బొబ్బిలి యుద్ధమున నోడె బుస్సీ సేనల్”
    దబ్బున పలుకకు మటులున
    నిబ్బరముగ బొబ్బిలోడె నిజముగ నయ్యో

    రిప్లయితొలగించండి
  6. అబ్బినగర్వాతిశయముఁ
    బొబ్బిలిపైదాడిసేయ మొగపడె శవముల్
    కబ్బపుసేతరి నుడివెన్
    బొబ్బిలి యుద్ధమున నోడె బుస్సీ సేనల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అబ్బిన కండకావరమె హానికి కారణ భూతమాయెగా
      బొబ్బిలి కోటలో మిగిలె మొగ్గరమైన కళేబరమ్ములే
      కబ్బపు గూర్పరే నుడివె కన్పడు పీన్గుల వంక జూచుచున్
      బొబ్బిలి యుద్ధరంగమున బుస్సి బలంబులె యోడె వింటివా

      తొలగించండి
  7. బొబ్బిలి జనులే వీరులు
    అబ్బురమగు తెగువతోడ, అతి ధైర్యంగా
    మబ్బుగ వచ్చెడిని బుస్సి మరణము కోరే
    బొబ్బిలి యుద్ధముననోడె బుస్సీ సేనల్

    రిప్లయితొలగించండి
  8. అబ్బురమంద వైరివరులాలమునందున దుర్నిరీక్ష్యమౌ
    బెబ్బులివోలె బొబ్బలిడి భీతిని గొల్పుచు శత్రు సేనలన్
    బొబ్బిలి వీరుడొక్కొకఁడు పోరును సల్పుచు ప్రాణమొడ్డెరా!
    బొబ్బిలి యుద్ధరంగమున బుస్సి బలంబులె యోడె వింటివా

    రిప్లయితొలగించండి
  9. పై అధికారి బుస్సీ దొరను ప్రశంసిస్తూ....

    కందం
    నబ్బురమైన కుతంత్రము
    నిబ్బరమగు వ్యూహమందు నెగ్గెను గాదే!
    బెబ్బులి పాపయ పోరిన
    బొబ్బిలి యుద్ధమున నోడె బుస్సీ! సేనల్

    ఉత్పలమాల
    అబ్బురమౌ కుతంత్రముల నాపితె భారత వీరులెల్లరిన్
    నిబ్బరమెంతయో గలిగి నీదగు శైలిని వ్యూహమల్లఁగన్
    బెబ్బులి తాండ్రపాపయ విభిన్న విధంబున గాండ్రుమన్నయున్
    బొబ్బిలి యుద్ధరంగమున బుస్సి! బలంబులె యోడె వింటివా!"

    రిప్లయితొలగించండి
  10. బెబ్బులి పాపయ పోరుచు
    బొబ్బిలి యుద్ధము న నోడె :: బుస్సీ సేనల్
    నిబ్బర ముగ పోరు సలిపి
    యబ్బురపరచు వి జ యమ్ము నందెను మెచ్చ న్

    రిప్లయితొలగించండి
  11. కం॥ నిబ్బరమగు ఘన వీరత
    బొబ్బిలి నిజ పౌరుషమును మొగ్గని విధమే
    యబ్బురముఁగొల్పఁ దోచెను
    బొబ్బిలి యుద్ధమున నోడె బుస్సీ సేనల్

    ఉ॥ బెబ్బులి వోలె పౌరుషము భీకర యుద్ధము నందుఁ జూపుచున్
    బొబ్బిలి వీర సైనికులు పోరుచు శత్రువు చేతికందకన్
    నిబ్బరతన్ సర్వులును నీతిని బాయకఁ జావునొప్పిరే
    యబ్బుర మొందు రీతి జనులందరుఁ జేరుచు స్త్రీలతో సహా
    బొబ్బిలి యాత్మగౌరవము పోరును జూచి వచించిరిట్టులన్
    బొబ్బిలి యుద్ధరంగమున బుస్సి బలంబులె యోడె వింటివా

    ఈసమస్యకు పూర్వా పర్వాలు కొంత వివరించగా ఉత్పలమాల 6 పాదాలు యైనదండి

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    బొబ్బిలి వీరుల శవముల
    దిబ్బలఁ గని రాణివాస స్త్రీలెల్లరు తా
    గొబ్బున నిప్పుల దూకగ
    బొబ్బిలి యుద్ధమున నోడె బుస్సీ సేనల్.

    రిప్లయితొలగించండి