21-8-2023 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సత్కవి గాఁ డతఁడు పొందె సన్మానములన్”(లేదా...)“సత్కావ్యమ్ముల వ్రాయనట్టి కవికే సన్మాన సత్కారముల్”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో డా. పిలకా శాంతమ్మ గారి సమస్య)
సత్కార్యంబుల కూతముసత్కృతులన్ నిగుడజేయు సామాజికుడేసత్కార్యశీలుడు కనుకసత్కవి గాఁ డతఁడు పొందె సన్మానములన్
సత్కార్యంబులు సల్పువారి గుఱియై సామాజికుండై సదాసత్కీర్తిన్ బడసెన్ గదా నరయగన్ సంస్కారబద్ధుండు కించిత్కాలంబు పురోగమించు దిశగా చేకూర్చుగా బోధనల్సత్కావ్యమ్ముల వ్రాయనట్టి కవికే సన్మాన సత్కారముల్
కందంఉత్కృష్టుఁడైన సూరనయుత్కంఠ కథా గమనము నొప్పగ నల్లెన్సత్కృతి, సామాన్యఁడనెడుసత్కవి గాఁ డతఁడు! పొందె సన్మానములన్!శార్దూలవిక్రీడితముఉత్కృష్టమ్మని పండితుల్ బొగడగా నొప్పించు పాండిత్యమైయుత్కంఠన్ దగ రేపు సత్కథలతో నుత్సాహమందింపగన్బూత్కారీ కృప గల్గి సూరన కళాపూర్ణోదయంబాదిగన్సత్కావ్యమ్ముల వ్రాయ, నట్టి కవికే సన్మాన సత్కారముల్!
చిత్కళకవితలుజెప్పెనుసత్కవి, గాడతడుబొందెసన్మానములన్తత్కళనవమానించివిపత్కరదారినిగనుచునుపైరవితోడన్
సత్కార్యాచరణమ్ములనుత్కృష్టంబతని చరితముత్తము డతఁడేసత్కారమునకుఁ బాత్రుఁడు,సత్కవి గాఁ డతఁడు, పొందె సన్మానములన్
సత్కథలను రచి యించుచుసత్కార్య దు రంధ రుండు సౌమ్యుండ గుచున్సత్కళ లప్రోత్సహించునుసత్కవి గా డతడు పొందె సన్మానము లన్
సత్కావ్యములన నొప్పడుసత్కవి గాఁ డతఁడు ; పొందె సన్మానములన్తత్కారణమున వానికిసత్కారము జేయువారు శఠులన నొప్పున్
ఉత్కర్షించుచు నేతలె యుత్కృష్టులటంచు పొగడెడున్మాదులిలన్ సత్కారముపొందదగినసత్కవి గాఁ డతఁడు, పొందె సన్మానములన్.సత్కార్యమ్మని భూరిగాను ధనమున్ సాధింపగా నెంచుచున్ చీత్కారమ్ముల లెక్కసేయక సదా శ్రీమంతులన్ గూర్చి తానుత్కర్షించుచు వ్రాయనా ధనికులౌ యున్మాదు లందించిరేసత్కావ్యమ్ముల వ్రాయనట్టి కవికే , సన్మాన సత్కారముల్.
సత్కార్యాచరణమ్ములందతడు విశ్రామమ్ములేకుండగానుత్కృష్టంబగు సంఘసేవకునిగా నుర్విన్ జనుల్ మెచ్చుచున్సత్కారమ్మును సేయనొక్కడనియెన్ సత్కర్మలన్ సల్పుచోసత్కావ్యమ్ముల వ్రాయనట్టి కవికే సన్మాన సత్కారముల్
కం॥ ఉత్కృష్ట సంఘ సేవయుసత్కర్మల నాచరించు సంయమనముతోనుత్కర్షుఁడై తనరఁగాసత్కవి గాఁడతఁడు పొందె సన్మానములన్శా॥ ఉత్కృష్టంబగు కావ్య రీతి యును భావౌచిత్యమున్ లేకనేమత్కావ్యమ్ము ఘనమ్మటంచు జనులన్ మైకమ్ములో ముంచఁగన్సత్కారమ్ములఁ బొందఁ గల్గుదురు భాషాకోవిదుల్ గామహిన్సత్కావ్యమ్ములు వ్రాయనట్టి కవికే సన్మాన సత్కారముల్
సత్కామ్యంబుమదిన్ దలంచి సతమున్సంప్రీతితో సూరియున్సత్కార్యంబులు సేయనే కవివరుల్సద్గ్రంథముల్ వ్రాతురోపూత్కారీ కృపతోడ గల్గు జయమున్మోదంబు సౌభాగ్యమున్సత్కావ్యంబులు వ్రాయనట్టి కవికే సన్మార్గ సత్కారముల్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. సత్కవితల మెచ్చుకొనుచుసత్కవులను ప్రోత్సహించి సన్మానించున్సత్కవులకు సాయపడెడుసత్కవి గాడతడు, పొందె సన్మానములన్.
సత్కవుల గ్రంథ రచనలుసత్కార్య మటంచు నచ్చు సన్మతి వేసెన్పూత్కారి భక్తుడాతడుసత్కవి గాడతుడు, బొందె సన్మానములన్
సత్కార్యంబుల కూతము
రిప్లయితొలగించండిసత్కృతులన్ నిగుడజేయు సామాజికుడే
సత్కార్యశీలుడు కనుక
సత్కవి గాఁ డతఁడు పొందె సన్మానములన్
సత్కార్యంబులు సల్పువారి గుఱియై సామాజికుండై సదా
తొలగించండిసత్కీర్తిన్ బడసెన్ గదా నరయగన్ సంస్కారబద్ధుండు కిం
చిత్కాలంబు పురోగమించు దిశగా చేకూర్చుగా బోధనల్
సత్కావ్యమ్ముల వ్రాయనట్టి కవికే సన్మాన సత్కారముల్
కందం
రిప్లయితొలగించండిఉత్కృష్టుఁడైన సూరన
యుత్కంఠ కథా గమనము నొప్పగ నల్లెన్
సత్కృతి, సామాన్యఁడనెడు
సత్కవి గాఁ డతఁడు! పొందె సన్మానములన్!
శార్దూలవిక్రీడితము
ఉత్కృష్టమ్మని పండితుల్ బొగడగా నొప్పించు పాండిత్యమై
యుత్కంఠన్ దగ రేపు సత్కథలతో నుత్సాహమందింపగన్
బూత్కారీ కృప గల్గి సూరన కళాపూర్ణోదయంబాదిగన్
సత్కావ్యమ్ముల వ్రాయ, నట్టి కవికే సన్మాన సత్కారముల్!
చిత్కళకవితలుజెప్పెను
రిప్లయితొలగించండిసత్కవి, గాడతడుబొందెసన్మానములన్
తత్కళనవమానించివి
పత్కరదారినిగనుచునుపైరవితోడన్
సత్కార్యాచరణమ్ముల
రిప్లయితొలగించండినుత్కృష్టంబతని చరితముత్తము డతఁడే
సత్కారమునకుఁ బాత్రుఁడు,
సత్కవి గాఁ డతఁడు, పొందె సన్మానములన్
సత్కథలను రచి యించుచు
రిప్లయితొలగించండిసత్కార్య దు రంధ రుండు సౌమ్యుండ గుచున్
సత్కళ లప్రోత్సహించును
సత్కవి గా డతడు పొందె సన్మానము లన్
సత్కావ్యములన నొప్పడు
రిప్లయితొలగించండిసత్కవి గాఁ డతఁడు ; పొందె సన్మానములన్
తత్కారణమున వానికి
సత్కారము జేయువారు శఠులన నొప్పున్
ఉత్కర్షించుచు నేతలె
రిప్లయితొలగించండియుత్కృష్టులటంచు పొగడెడున్మాదులిలన్
సత్కారముపొందదగిన
సత్కవి గాఁ డతఁడు, పొందె సన్మానములన్.
సత్కార్యమ్మని భూరిగాను ధనమున్ సాధింపగా నెంచుచున్
చీత్కారమ్ముల లెక్కసేయక సదా శ్రీమంతులన్ గూర్చి తా
నుత్కర్షించుచు వ్రాయనా ధనికులౌ యున్మాదు లందించిరే
సత్కావ్యమ్ముల వ్రాయనట్టి కవికే , సన్మాన సత్కారముల్.
సత్కార్యాచరణమ్ములందతడు విశ్రామమ్ములేకుండగా
రిప్లయితొలగించండినుత్కృష్టంబగు సంఘసేవకునిగా నుర్విన్ జనుల్ మెచ్చుచున్
సత్కారమ్మును సేయనొక్కడనియెన్ సత్కర్మలన్ సల్పుచో
సత్కావ్యమ్ముల వ్రాయనట్టి కవికే సన్మాన సత్కారముల్
కం॥ ఉత్కృష్ట సంఘ సేవయు
రిప్లయితొలగించండిసత్కర్మల నాచరించు సంయమనముతో
నుత్కర్షుఁడై తనరఁగా
సత్కవి గాఁడతఁడు పొందె సన్మానములన్
శా॥ ఉత్కృష్టంబగు కావ్య రీతి యును భావౌచిత్యమున్ లేకనే
మత్కావ్యమ్ము ఘనమ్మటంచు జనులన్ మైకమ్ములో ముంచఁగన్
సత్కారమ్ములఁ బొందఁ గల్గుదురు భాషాకోవిదుల్ గామహిన్
సత్కావ్యమ్ములు వ్రాయనట్టి కవికే సన్మాన సత్కారముల్
సత్కామ్యంబుమదిన్ దలంచి సతమున్
రిప్లయితొలగించండిసంప్రీతితో సూరియున్
సత్కార్యంబులు సేయనే కవివరుల్
సద్గ్రంథముల్ వ్రాతురో
పూత్కారీ కృపతోడ గల్గు జయమున్
మోదంబు సౌభాగ్యమున్
సత్కావ్యంబులు వ్రాయనట్టి కవికే
సన్మార్గ సత్కారముల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
సత్కవితల మెచ్చుకొనుచు
సత్కవులను ప్రోత్సహించి సన్మానించున్
సత్కవులకు సాయపడెడు
సత్కవి గాడతడు, పొందె సన్మానములన్.
సత్కవుల గ్రంథ రచనలు
రిప్లయితొలగించండిసత్కార్య మటంచు నచ్చు సన్మతి వేసెన్
పూత్కారి భక్తుడాతడు
సత్కవి గాడతుడు, బొందె సన్మానములన్