20-8-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్”(లేదా...)“ధారణ సేయనేరఁ డవధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో నారాయణ మిత్ర గారి సమస్య)
కందంకూరిమి నవధాన గురులునేరుపఁ గిటుకులు గ్రహించి నిరుపమ గతిలోధోరణు లెఱుఁగుచు, గతమునధారణలో విఫలుఁడె, యవధానముఁ జేసెన్ ఉత్పలమాలధారయు ధోరణుల్ ధిషణ ధైర్యము గల్గియు శిక్షణంబునన్గూరిమి నేర్పఁగన్ గురులు గొప్పగ సాధన జేసి నిత్యమున్గోరఁగ పృచ్ఛకుల్ సెలఁగి గుక్కను ద్రిప్పక తా, గతమ్మునన్ధారణ సేయనేరఁ డ, వధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్!
తీరుగ ధరించి ధోవతినూరంతయు మెచ్చునట్లు వూరేగుటనేగౌరవ మనుకొనక,వలువధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్”
పూరణలను చేసి చివర ధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్ సూరియె శిక్షణ నివ్వగజోరుగ పద్యమ్ము లల్లి చూపెను ప్రతిభన్.సూరి వధానమందలి సుసూత్రము లెన్నియొ తెల్ప నేడటన్ భూరివధానమున్ నెఱుప ప్రోథము వీడుచు వచ్చె మున్ను తాధారణ సేయనేరఁ , డవధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్ జోరుగ పద్యమల్లుచును సుస్వర మందున నాలపింపగన్.
దూర పురినుండి వచ్చినకారణమున నా విదునికి కట్టు కొనంగన్బారెడు వస్త్రము నీయగధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్
కోరిక చెలగ కవి యసాధారణ సరళిన్ ప్రతిభకు దర్పణమగుచున్ప్రేరణనొసంగు వలువలధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్కారణ జన్ముడేననుచుఁ గాంచిన వారలు మెచ్చురీతిగన్కోరికతోచెలంగి తను గొప్పగ విద్యను చూప సిద్ధమైప్రేరణపూరితంబయిన వేషముకై తగు వల్వలెంచుచున్ధారణ సేయనేరఁ డవధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్
పేరొందిన గురువుల కడతోరపు శిక్షణ ను బొంది దోష రహితు డైనేరుపు మీరిన బిదప న్ధార ణ లో విఫలు డె యవ ధానము జేసెన్
కారణజన్ముఁడు తాననిధారుణి యవధానమందు దక్షుండని విస్తారఁపు పొగడ్తల శిరోధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్
ధారుణిలోన నాతడవధానము లందున మేటి యెల్లరున్కారణజన్ము డీతడని గర్వమెరుంగని నమ్రుడంచు విస్తారముగా పొగడ్తలను సల్పిన నెన్నఁడు దర్పమున్ శిరోధారణ సేయనేరఁ డవధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్
కం॥ భారము దైవము నదనుచుఁబారముఁ జేర్చు మని మ్రొక్కి ప్రార్థనఁ జేయన్గోరిన దైవము కృపఁగనధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్ఉ॥ భారము మోయు వాఁడతఁడు ప్రార్థనఁ జేసెదఁ బ్రోవఁగా ననిన్ధారణ తోడ మ్రొక్కుచును దైవము దీవెనలొంది సాఁగఁగన్గూరిమి నుంచి మక్కువగఁ గోరిన దైవము కొమ్ముకాయఁగన్ధారణ సేయనేరఁ డవధా మొనర్చెను మెచ్చిరెల్లరున్2వ పాదము ధారణ ఏకాగ్రచిత్తము 4వ పాదము ధారణ retentive memory
కారణ మేమొగాని తన గమ్యముజేరుటకై కవీంద్రుడున్భారతి సేవజేయుచును బంతము తోడను మెల్లమెల్లగాకోరి భజించసాగె మది కోమలగాత్రిని వాక్కు చేడియన్ధారణ సేయనేర డవధానమొనర్చెను మెచ్చిరందరున్.
ధారణిసుంతలేకమది తల్లడమొందెడువేళ ఛాత్రుకున్ధీరము పాదుగొల్పు గురుదీవన తారక మంత్రమయ్యె సాకారమునొందనీప్సితము క్రన్నన పద్యములల్లె తొల్లితాధారణ సేయనేరఁ డవధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. నేరిచి పండితుల కడనుధారణలో మెలకువలను దాక్షిణ్యముతో తీరు నెఱుంగుచు; గతమునధారణలో విఫలుడు; నవధానము జేసెన్.
కందం
రిప్లయితొలగించండికూరిమి నవధాన గురులు
నేరుపఁ గిటుకులు గ్రహించి నిరుపమ గతిలో
ధోరణు లెఱుఁగుచు, గతమున
ధారణలో విఫలుఁడె, యవధానముఁ జేసెన్
ఉత్పలమాల
ధారయు ధోరణుల్ ధిషణ ధైర్యము గల్గియు శిక్షణంబునన్
గూరిమి నేర్పఁగన్ గురులు గొప్పగ సాధన జేసి నిత్యమున్
గోరఁగ పృచ్ఛకుల్ సెలఁగి గుక్కను ద్రిప్పక తా, గతమ్మునన్
ధారణ సేయనేరఁ డ, వధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్!
తీరుగ ధరించి ధోవతి
రిప్లయితొలగించండినూరంతయు మెచ్చునట్లు వూరేగుటనే
గౌరవ మనుకొనక,వలువ
ధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్”
పూరణలను చేసి చివర
రిప్లయితొలగించండిధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్
సూరియె శిక్షణ నివ్వగ
జోరుగ పద్యమ్ము లల్లి చూపెను ప్రతిభన్.
సూరి వధానమందలి సుసూత్రము లెన్నియొ తెల్ప నేడటన్
భూరివధానమున్ నెఱుప ప్రోథము వీడుచు వచ్చె మున్ను తా
ధారణ సేయనేరఁ , డవధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్
జోరుగ పద్యమల్లుచును సుస్వర మందున నాలపింపగన్.
దూర పురినుండి వచ్చిన
రిప్లయితొలగించండికారణమున నా విదునికి కట్టు కొనంగన్
బారెడు వస్త్రము నీయగ
ధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్
కోరిక చెలగ కవి యసా
రిప్లయితొలగించండిధారణ సరళిన్ ప్రతిభకు దర్పణమగుచున్
ప్రేరణనొసంగు వలువల
ధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్
కారణ జన్ముడేననుచుఁ గాంచిన వారలు మెచ్చురీతిగన్
కోరికతోచెలంగి తను గొప్పగ విద్యను చూప సిద్ధమై
ప్రేరణపూరితంబయిన వేషముకై తగు వల్వలెంచుచున్
ధారణ సేయనేరఁ డవధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్
పేరొందిన గురువుల కడ
రిప్లయితొలగించండితోరపు శిక్షణ ను బొంది దోష రహితు డై
నేరుపు మీరిన బిదప న్
ధార ణ లో విఫలు డె యవ ధానము జేసెన్
కారణజన్ముఁడు తానని
రిప్లయితొలగించండిధారుణి యవధానమందు దక్షుండని వి
స్తారఁపు పొగడ్తల శిరో
ధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్
ధారుణిలోన నాతడవధానము లందున మేటి యెల్లరున్
రిప్లయితొలగించండికారణజన్ము డీతడని గర్వమెరుంగని నమ్రుడంచు వి
స్తారముగా పొగడ్తలను సల్పిన నెన్నఁడు దర్పమున్ శిరో
ధారణ సేయనేరఁ డవధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్
కం॥ భారము దైవము నదనుచుఁ
రిప్లయితొలగించండిబారముఁ జేర్చు మని మ్రొక్కి ప్రార్థనఁ జేయన్
గోరిన దైవము కృపఁగన
ధారణలో విఫలుఁడె యవధానముఁ జేసెన్
ఉ॥ భారము మోయు వాఁడతఁడు ప్రార్థనఁ జేసెదఁ బ్రోవఁగా ననిన్
ధారణ తోడ మ్రొక్కుచును దైవము దీవెనలొంది సాఁగఁగన్
గూరిమి నుంచి మక్కువగఁ గోరిన దైవము కొమ్ముకాయఁగన్
ధారణ సేయనేరఁ డవధా మొనర్చెను మెచ్చిరెల్లరున్
2వ పాదము ధారణ ఏకాగ్రచిత్తము 4వ పాదము ధారణ retentive memory
కారణ మేమొగాని తన గమ్యము
రిప్లయితొలగించండిజేరుటకై కవీంద్రుడున్
భారతి సేవజేయుచును బంతము
తోడను మెల్లమెల్లగా
కోరి భజించసాగె మది కోమల
గాత్రిని వాక్కు చేడియన్
ధారణ సేయనేర డవధానమొ
నర్చెను మెచ్చిరందరున్.
ధారణిసుంతలేకమది తల్లడమొందెడువేళ ఛాత్రుకున్
రిప్లయితొలగించండిధీరము పాదుగొల్పు గురుదీవన తారక మంత్రమయ్యె సా
కారమునొందనీప్సితము క్రన్నన పద్యములల్లె తొల్లితా
ధారణ సేయనేరఁ డవధాన మొనర్చెను మెచ్చి రెల్లరున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
నేరిచి పండితుల కడను
ధారణలో మెలకువలను దాక్షిణ్యముతో
తీరు నెఱుంగుచు; గతమున
ధారణలో విఫలుడు; నవధానము జేసెన్.