1, ఆగస్టు 2023, మంగళవారం

న్యస్తాక్షరి - 83

2-8-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
పాదాంతాక్షరాలుగా 'వ - వ - వ - వా' న్యస్తం చేస్తూ
శివుని స్తుతిస్తూ చంపకమాల (లేదా...) కందం వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. కైలాసము నందుందువ,
    తోలే యుడుపవగ జాబిలి మెరిసి పోవ
    న్గేళీ విలాసివగుదువ,
    యేలా జేసెదవు నాట్య మీలాగు శివా?

    రిప్లయితొలగించండి
  2. కందం
    భారము నీదే శివ శివ
    నీరముపాలనుమునుగగ నీదయకరవా
    చీరెద నిన్నే వినవా
    కోరికఁదీరగకొలిచెదకుమరునిగనవా!

    రిప్లయితొలగించండి
  3. అను నిత్యము కరుణించవ !
    యనుచును మరియు నను కావుమని నేనిలువన్
    వినుటయె దప్పను కొంటివ !
    యనువుగ నిను కొలుచు రీతి నలరిం చు శివా !

    రిప్లయితొలగించండి
  4. నిరతము దల తును శివ శివ
    కరుణను నన్నే లు మయ్య కారుణ్య శివా
    చరణము లంటె ద నో శివ
    స్మరణము జేయుదు ను నిన్ను మరువ కను శివా!

    రిప్లయితొలగించండి
  5. భారమునీదేశివశివ
    నీరముపాలనుమునుగగ నీదయకరువ
    ద్దిరచేరగనినువినువ
    క్కోరికదీరగకొలిచెదకుమరునిగనవా

    రిప్లయితొలగించండి

  6. మినుసిగ వేల్పువంచు నిను మేదిని భక్తులు కొల్చు చుంద్రు వ
    ర్ధన దయచూపుమంచు నిను రాతము వేడెడి వారమే వివ
    క్షనువిడు మంటినో గరళ కంఠ సదాశివ నీదు రూప వ
    ర్ణనలను జేయజాలను నిరామయ దాసుల బ్రోవరా శివా!


    ఘనమగు నీనామమె భవ
    వినాశ మని నమ్మి కొలుతు వృషపతి హే వ
    ర్ధన గంగాధర భార్గవ
    మినుసిగ వేల్పు మము బ్రోవ మేదిని రావా!

    రిప్లయితొలగించండి
  7. కైలాస వాసివగుదువ
    దేల,హిమాంశుని ధరింపనేల పరమశివ,
    లీలా విశేషమున నవ
    లీలన్గళమున విషము నిలిపితివి దేవా.




    రిప్లయితొలగించండి
  8. భోళాశంకర కానవ
    శూలాయుధ వామదేవ శూలి భవ శివా
    ఫాలుడ శశిధర కానవ
    మౌళీ పార్వతి తపస్సు మాన్పగ రావా

    రిప్లయితొలగించండి
  9. చం.

    విను, హర! శంకరాభరణబృందము ప్రీతిని మెప్పు తోడ వ
    న్నెను నియమించు పండితుల నెయ్యము గోరితి సాహసించి, వ
    ర్ధనుడ! మహేశ ! గంగ వలె ధారగ పద్యములల్ల నేర్పు, వ
    త్సను గద, పార్వతీప్రియుడ! తామస లక్షణమున్ విదల్చవా!

    రిప్లయితొలగించండి
  10. చంపకమాల
    వరమునొసంగ వేడితిని పన్నగభూషణ పాహిపాహి వ
    జ్జరమునుమించి కక్కరము చంద్రకళాధర నాదు బాళి వ
    త్సరములు నిష్ఠతోడ మనసార నినున్గన వేచియుంటి వ
    ద్దురయిటు జాగు సేయతగదో హిమశైలసుతావరా శివా!

    రిప్లయితొలగించండి
  11. నా ప్రయత్నం..

    కం.
    శితికంఠ ! జటాధర ! శివ !
    ప్రతిదినము నిను ‌నుతియింతు భక్తిగ దేవ
    శ్రుత ! గౌరీపతి ! భైరవ !
    అతులిత మహితోత్తమ ! భవహరుడా ! దేవా

    తిరివీధి శ్రీమన్నారాయణ

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. చంపకమాల
      శివ!శివ!శంకరా!ప్రమథ సేవిత!శూలి!మహేశ!పంచవ
      క్త్ర!వృషభవాహనా!శశిధరా!హర!సన్నుత దివ్యమౌని వ
      ర్గ!విషధరా!జటాధర!పురారి!ఉమాధవ!శ్వేతవ
      ర్ణవర తరంగ గంగధృత!నాగవిభూషణ!నన్నుబ్రోవవా!

      తొలగించండి
  13. హిమగిరివాస! స్వయంభువ!
    తమకముతో గారవించ దయతో కైవ
    ల్యమునిచ్చి మమ్ముఁ గావవ
    సుమశర సంహర! పినాకి! శూలధర! శివా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హిమగిరివాస! సాంబశివ! యెందరినోకరుణించి నావు వ
      ర్ణములకు లొంగిమిక్కిలివరమ్ములఁ గుప్పి దురాశతోడ వ
      క్రములగు బుద్ధితోనలరు రాక్షసులన్ హరియించినావు వ
      ర్జ్యముగద నీదు సాకతము సజ్జన భక్తుల నెంచి చూడవా!

      తొలగించండి
  14. హరహర శంభో శివశివ
    మరువక దల తును మది నిను మహాదేవ శివా
    వరములు గోరక నో శివ
    చరణము లంటియు గొలిచెద సతతమును శివా

    రిప్లయితొలగించండి
  15. హరహర శంకర బ్రోవవ
    పరమేశ్వర పరమభక్తపాల శివా వ
    జ్జరమే పంచాక్షరి, వ
    ద్దుర జాగునుసేయ సన్నుతులు దయగనవా

    రిప్లయితొలగించండి
  16. కందము
    ప్రాలేయశైలసుతధవ!
    బాలేందుధరా!పినాకపాణి!శివ!వివ
    స్త్రా!లింగ!మహేశ!అభవ!
    కాలాంతక!వ్యోమకేశ!కావగరావా!

    రిప్లయితొలగించండి
  17. కం॥అనుదినము నిను గొలుతు శివ
    మనమున భక్తిని నిలుపుచు మరువక గుణవ
    ర్ధన భవభయ నాశక శివ
    ననుఁ బ్రోవఁగ రావ కృపను నవకముగ శివా

    రిప్లయితొలగించండి
  18. చం॥ మనమున నన్ను గొల్చినను మక్కువ తోడను మిమ్ముఁ బ్రోవ వ
    త్తుననుచుఁ దెల్పినట్టి శివ తోరముగా నినుఁ గొల్తు నయ్య వ
    ర్ధనఁ గనఁ బాహి పాహి యని ధర్మముఁ దప్పక నిత్యమున్ భవ
    మ్మున నిను వీడి యన్యలను మ్రొక్కఁగ లేనయ శంకరా శివా

    రిప్లయితొలగించండి
  19. కరుణనుచూపించుముశివ
    మరువకనాపైసతతముమారహరావ
    చ్చిరినినుగనంగ నుగనవ
    మరిమరిపిలుచుచుకొలిచెదమదిలోన భవా


    2.కరుణాసాగర శివశివ
    తరుణిని కావంగ జాగు తగునాహర వ
    ద్దురశంకరననుగావవ
    పరమేశాపార్వతీశపరుగునరావా

    రిప్లయితొలగించండి
  20. 3ఉరగా భరణా శివ శివ
    పరమేశ్వర సుందరాస్యపార్వతిపతివ
    య్య, రయము మామొరవిను శివ
    కరములు జోడించి కొలుతు కరుణించు శివా

    రిప్లయితొలగించండి
  21. చంపకమాల
    మనమున నీవె నిండ పలుమారులు భక్తిని గొల్వ నాకు వ
    ర్ణనలవి రావు రావు శివ! వ్రాయగ పాడగ భాషలేదు వ
    డ్డనలిడలేని పేదనయ! డస్సి వయోధిక వృద్ధునౌచు వ
    ల్లనగు జపమ్ము మౌనముగ రాజితనామము గావవా శివా!

    కందం
    మనమున నిండితివయ! వ
    ర్ణనలవి స్తోత్రింపఁ గవిత రాదయ! భవ! వ
    డ్డనలిడ బడుగును, నా వ
    ల్లన మౌనజపమగు గావ రావయ్య! శివా!

    రిప్లయితొలగించండి