13, ఆగస్టు 2023, ఆదివారం

సమస్య - 4502

14-8-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లాయరుఁ గని భీతిఁ గని పలాయనమైతిన్”
(లేదా...)
“లాయరుఁ గాంచి భీతిలి పలాయనమంత్రమునుం బఠించితిన్”

16 కామెంట్‌లు:

  1. వేయుటనల్లనికోటును
    కూయుటకల్లలుసభలనుకుంచితబుద్ధిన్
    మాయలుమర్మముతెలిసిన
    లాయరుగనిభీతిగనిపలాయనమైతిన్

    రిప్లయితొలగించండి
  2. నేయుడు దోడుగ నుండగ
    రాయుని గృహమున ధనమును లాగితి మనుచున్
    న్యాయాలయ దాపునగల
    లాయరుఁ గని భీతిఁ గని పలాయనమైతిన్

    రిప్లయితొలగించండి
  3. మడుగులో దాగిన దుర్యోధనుని స్వగతము:


    కందం
    సాయము సేయగఁ కృష్ణుడు
    వాయగ నా వారలెల్ల, పాండవులకు వా
    లాయమిక జయము! యని మే
    లా? యరుఁ గని భీతిఁ గని పలాయనమైతిన్!

    ఉత్పలమాల
    సాయము సేయగన్ మిగుల చక్రియె పాండవ పక్షపాతిగన్
    బాయగ యోధులెల్లరు విపత్తునెదర్చుట కష్టమంచు వా
    లాయమనంగ నోటమియె ప్రాణ భయమ్మునఁ బోరు సల్ప మే
    లా? యరుఁ గాంచి భీతిలి పలాయనమంత్రమునుం బఠించితిన్!

    రిప్లయితొలగించండి
  4. న్యాయస్థానమునందున
    బాయక తడబాటున పర పక్షమ్మునకున్
    శ్రేయముఁ గూర్చెడి వెంబర
    లాయరుఁ గని భీతిఁ గని పలాయనమైతిన్

    రిప్లయితొలగించండి
  5. ఆ యరుఁగుపైన నలుగురు
    మాయలమాంత్రికులు పన్ను మాయకులోనై
    గాయపడితి వారికి వీ
    లా యరుఁగని భీతిఁ గని పలాయనమైతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హాయిగ కాలమున్ గడుపు నప్పుడు చేసిన చేష్టలెన్నియో
      సాయముఁగోరుమిత్రునికి చక్కని తోడుగ పోయి తోటలో
      కాయలుకోయువేళ పలు గాయము లైనవినాకు చెప్పనే
      లా? యరుఁ గాంచి భీతిలి పలాయనమంత్రమునుం బఠించితిన్

      తొలగించండి
  6. ( *యుద్ధమునుండి పారివచ్చిన ఖడ్గ తిక్కన మాటలుగా నూహించి*)

    ఆయోధనమున వీరుల
    సాయకములు చీల్చుచుండ క్షతగాత్రులటన్
    భూయస్సుగ గూలిరి బే
    లా! యరుఁ గని భీతిఁ గని పలాయనమైతిన్.


    ఆయుధమున్ ధరించి వడి యంకము జొచ్చితి నిశ్చయమ్ముగా
    నా యరివీరులన్ దునుమ నచ్చట వైరి శరమ్ము లెల్ల నా
    కాయము గ్రుచ్చుచుండనిక కక్కస మోర్చగ లేనటంచు బే
    లా! యరుఁ గాంచి భీతిలి పలాయనమంత్రమునుం బఠించితిన్.

    అరు= గాయము

    రిప్లయితొలగించండి
  7. చేయని నేరము రుద్దుచు
    సాయము సేతునని మరల సాకుల వలలో
    మాయఁగ సొమ్ములు మింగెడి
    లాయరుఁ గని భీతిఁ గని పలాయనమైతిన్

    రిప్లయితొలగించండి
  8. న్యాయ విచారణమ్మునకు వ్యాజ్యము దాఖలు చేసినంత నా
    లాయరు వాయిదాలనుచు లక్షలులక్షలు గుంజసాగె నే
    మాయల జేసెనో తగవు మాత్రము తీరక పేదనైతినే
    లాయరుఁ గాంచి భీతిలి పలాయనమంత్రమునుం బఠించితిన్

    రిప్లయితొలగించండి
  9. కం॥ సాయముఁ గోరెను లాయరు
    న్యాయస్థానమునఁ గల్ల నయముగ నాడన్
    బాయక సాక్షిగ రమ్మన
    లాయరుఁ గని భీతిఁ గని పలాయన మైతిన్

    రిప్లయితొలగించండి
  10. చేయుచు కల్పిత సాక్షుల
    మూయించును కేసు లన్ని మోసము తోడన్
    మాయావి యైన క్రిమినల్
    లాయ రు గని భీతి గని పలాయన మైతిన్

    రిప్లయితొలగించండి
  11. చేయుచు తిమ్మి బమ్మి గను చిత్తము వచ్చిన రీతి మార్చు చున్
    సాయము సేతు నంచు పలు సాక్ష్యము లన్ సృజి యించు వాడు నై
    మాయపు వాదన ల్ సలిపి మన్నన బొందు చు ఫీజు పెంచు నా
    లాయరు గాంచి భీతిలి ప లాయన మంత్రము నున్ బ ఠి o చి తిన్

    రిప్లయితొలగించండి
  12. ఉ॥ సాయముఁ గోర లాయరును సర్వులు మెచ్చిన వాని నమ్ముచున్
    మాయలఁ జేసి యెక్కువగ మాసము మాసము వాయిదాలనిన్
    మేయుచు నుండ నాధనము మేటిగ మోసము తెల్సినంతనే
    లాయరుఁ గాంచి భీతిలి పలాయన మంత్రమునుం బఠించితిన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఈయగ నెంతో ధనమును
    న్యాయము చేసెదను నీకు నమ్ముమటంచున్
    సాయము చేయక త్రిప్పెడు
    లాయరుఁ గని భీతిఁ గొని పలాయనమైతిన్.

    రిప్లయితొలగించండి