17-8-2023 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్”(లేదా...)“కంఠేకాలుఁడు పంక్తికంధరుని వేగం దాఁకె నత్యుగ్రుఁడై”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో కుప్పిలి ఉమామహేశ్వర్ గారి సమస్య)
శుంఠాగ్రేసర! యా దశకంఠుడు స్తోత్రమ్ము జేయ కడు భక్తిని శ్రీకంఠుని, వాత్సల్యముతో కంఠేకాలుండు పంక్తి కంధరుఁ దాకెన్.
శుంఠయె రావణు డసురుడకుంఠిత దీక్షా పరుండు కోరెను గిరిజన్కంఠము న పాశమయ్యెనుకంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్.
శుంఠాగ్రేసర! చాలుచాలుమిక నీ చోద్యంబు లౌ మాటలే కంఠేకాలుని గొల్చెగాదె తనదౌ కంఠమ్ము లర్పించి, శ్రీకంఠున్ రావణ బ్రహ్మయే కనననుగ్రాహ్యమ్మదే యెప్పుడా కంఠేకాలుఁడు పంక్తికంధరుని వేగం దాఁకె నత్యుగ్రుఁడై?
శుంఠడు జక్కగ నేర్వకకంఠస్థము జేసినట్టి గాధల రీతిన్పంఠపు బొమ్మలమర్చగకంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్
లుంఠక సురద్విషుడు దశకంఠుడు కుజనపహరింప కపిరథుఁ మదినుత్కంఠనెలకొనెన్ దానైకంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్లుంఠాకుండయి రావణుండవనిజన్ లుప్తమ్ముగాబొందగాశుంఠాగ్రేసరుడైన వానివలనన్ శోకాగ్ని పాషాణమైకంఠంబందున నిండ దాశరథి తా కాలాంతకుండాయెగాకంఠేకాలుఁడు పంక్తికంధరుని వేగం దాఁకె నత్యుగ్రుఁడై
కంఠమునఁ బాము కలఁగనెకుంఠనమొందఁగ జగములు కుపితుండగుచున్కంఠీరవమట్టు లెగసికంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్
శుంఠా? కాదు మహేశభక్తవరు డీశున్ గొల్చు లంకేశుడేకంఠంబెన్నఁడు శైవనామ జపముం గావించు, నీశానునిన్కంఠంబందునఁ గ్రాలు పన్నగము తాఁగాంచెన్ కలన్ వింతగాకంఠేకాలుఁడు పంక్తికంధరుని వేగం దాఁకె నత్యుగ్రుఁడై
కం॥ కంఠీరవ ప్రాంగణమునశుంఠలు ప్రేక్షకులునాటఁ జూడఁగ నటు శ్రీకంఠ దశకంఠులై చనఁగంఠేకాలుండు పంక్తికంధరుఁ దాకెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంఠ ముల బిలు వ నా దశకం ఠు డు స్తోత్రము ల నపుడు కదలిన నా శ్రీకంఠు డు భక్తుని కడకు న్కం ఠె కాలుండు. పంక్తి కంథ రు దా కె న్
ఠె టైపాటు మన్నించండి
మ॥ కంఠేకాలుని భక్తుఁడై కొలిచి యా కందర్ప వైరిన్ గనన్గంఠంబందున మాయ, మూర్ఖత తనన్ గ్రమ్మంగ నిశ్చేష్టుఁడైశుంఠన్ బోలుచుఁ గోరఁ దుచ్ఛమును నాశూలాయుతున్, రోయుచున్గంఠేకాలుఁడు పంక్తికంధురుని వేగం దాఁకె నత్యుగ్రుఁడైబెంగుళూరు అవధానములో ఇలాగే ఒకాయన (Retired IITB Professor) ప్రాస కష్టమైన సమస్య “మూర్ఖుని జిత్తమున్ దెలియ పుంగవకేతున కైన సాధ్యమే” అడిగారండి
ఆర్యా! పై సమస్యకు నా సరదా ప్రయత్నం:మూర్ఖపు యోచనల్ సలుపు మోమున నింపు నమాయకత్వమున్మూర్ఖులతో చరించు వినబోవడు పెద్దల సుద్దులెన్నడున్మూర్ఖుడు చేయుకృత్యములు మోదముఁ గూర్చవు మానవాళికిన్"మూర్ఖుని జిత్తమున్ దెలియ పుంగవకేతున కైన సాధ్యమే"
కందంకంఠంబందున గరళమకుంఠిత దీక్షను నిలిపిన గోపతి హనుమైకుంఠమన వేల్చి లంకనుగంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్శార్దూలవిక్రీడితముకంఠంబందున నింపియున్ విషము సత్కార్యమ్ము సాగించియున్గంఠేకాలుఁడునయ్యెఁ హన్మయన సాకారంబునై లంక నుత్కంఠన్ గాల్చియు భీతిగొల్పుచును సీతాసాధ్వి భృత్యుండనన్గంఠేకాలుఁడు పంక్తికంధరుని వేగం దాఁకె నత్యుగ్రుఁడై!
శుంఠాగ్రేసర! యా దశ
రిప్లయితొలగించండికంఠుడు స్తోత్రమ్ము జేయ కడు భక్తిని శ్రీ
కంఠుని, వాత్సల్యముతో
కంఠేకాలుండు పంక్తి కంధరుఁ దాకెన్.
శుంఠయె రావణు డసురుడ
రిప్లయితొలగించండికుంఠిత దీక్షా పరుండు కోరెను గిరిజన్
కంఠము న పాశమయ్యెను
కంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్.
శుంఠాగ్రేసర! చాలుచాలుమిక నీ చోద్యంబు లౌ మాటలే
రిప్లయితొలగించండికంఠేకాలుని గొల్చెగాదె తనదౌ కంఠమ్ము లర్పించి, శ్రీ
కంఠున్ రావణ బ్రహ్మయే కనననుగ్రాహ్యమ్మదే యెప్పుడా
కంఠేకాలుఁడు పంక్తికంధరుని వేగం దాఁకె నత్యుగ్రుఁడై?
శుంఠడు జక్కగ నేర్వక
రిప్లయితొలగించండికంఠస్థము జేసినట్టి గాధల రీతిన్
పంఠపు బొమ్మలమర్చగ
కంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్
లుంఠక సురద్విషుడు దశ
రిప్లయితొలగించండికంఠుడు కుజనపహరింప కపిరథుఁ మదిను
త్కంఠనెలకొనెన్ దానై
కంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్
లుంఠాకుండయి రావణుండవనిజన్ లుప్తమ్ముగాబొందగా
శుంఠాగ్రేసరుడైన వానివలనన్ శోకాగ్ని పాషాణమై
కంఠంబందున నిండ దాశరథి తా కాలాంతకుండాయెగా
కంఠేకాలుఁడు పంక్తికంధరుని వేగం దాఁకె నత్యుగ్రుఁడై
కంఠమునఁ బాము కలఁగనె
రిప్లయితొలగించండికుంఠనమొందఁగ జగములు కుపితుండగుచున్
కంఠీరవమట్టు లెగసి
కంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్
శుంఠా? కాదు మహేశభక్తవరు డీశున్ గొల్చు లంకేశుడే
రిప్లయితొలగించండికంఠంబెన్నఁడు శైవనామ జపముం గావించు, నీశానునిన్
కంఠంబందునఁ గ్రాలు పన్నగము తాఁగాంచెన్ కలన్ వింతగా
కంఠేకాలుఁడు పంక్తికంధరుని వేగం దాఁకె నత్యుగ్రుఁడై
కం॥ కంఠీరవ ప్రాంగణమున
రిప్లయితొలగించండిశుంఠలు ప్రేక్షకులునాటఁ జూడఁగ నటు శ్రీ
కంఠ దశకంఠులై చనఁ
గంఠేకాలుండు పంక్తికంధరుఁ దాకెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికంఠ ముల బిలు వ నా దశ
రిప్లయితొలగించండికం ఠు డు స్తోత్రము ల నపుడు కదలిన నా శ్రీ
కంఠు డు భక్తుని కడకు న్
కం ఠె కాలుండు. పంక్తి కంథ రు దా కె న్
ఠె టైపాటు మన్నించండి
తొలగించండిమ॥ కంఠేకాలుని భక్తుఁడై కొలిచి యా కందర్ప వైరిన్ గనన్
రిప్లయితొలగించండిగంఠంబందున మాయ, మూర్ఖత తనన్ గ్రమ్మంగ నిశ్చేష్టుఁడై
శుంఠన్ బోలుచుఁ గోరఁ దుచ్ఛమును నాశూలాయుతున్, రోయుచున్
గంఠేకాలుఁడు పంక్తికంధురుని వేగం దాఁకె నత్యుగ్రుఁడై
బెంగుళూరు అవధానములో ఇలాగే ఒకాయన (Retired IITB Professor) ప్రాస కష్టమైన సమస్య “మూర్ఖుని జిత్తమున్ దెలియ పుంగవకేతున కైన సాధ్యమే” అడిగారండి
ఆర్యా! పై సమస్యకు నా సరదా ప్రయత్నం:
తొలగించండిమూర్ఖపు యోచనల్ సలుపు మోమున నింపు నమాయకత్వమున్
మూర్ఖులతో చరించు వినబోవడు పెద్దల సుద్దులెన్నడున్
మూర్ఖుడు చేయుకృత్యములు మోదముఁ గూర్చవు మానవాళికిన్
"మూర్ఖుని జిత్తమున్ దెలియ పుంగవకేతున కైన సాధ్యమే"
కందం
రిప్లయితొలగించండికంఠంబందున గరళమ
కుంఠిత దీక్షను నిలిపిన గోపతి హనుమై
కుంఠమన వేల్చి లంకను
గంఠేకాలుండు పంక్తికంధరుఁ దాఁకెన్
శార్దూలవిక్రీడితము
కంఠంబందున నింపియున్ విషము సత్కార్యమ్ము సాగించియున్
గంఠేకాలుఁడునయ్యెఁ హన్మయన సాకారంబునై లంక ను
త్కంఠన్ గాల్చియు భీతిగొల్పుచును సీతాసాధ్వి భృత్యుండనన్
గంఠేకాలుఁడు పంక్తికంధరుని వేగం దాఁకె నత్యుగ్రుఁడై!