15, జూన్ 2026, సోమవారం

సమస్య - 5499

16-6-2026 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా”

(లేదా...)

“ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్”

26 కామెంట్‌లు:

  1. వరమై దీనులతాపనాశకములై భావార్థగమ్యమ్ములై
    కరుణాసంద్రములైసదానరులకున్ కష్టాపహారంబులై
    చిరకాలంబుగ చింతితార్థఫలముల్ శ్రేయంబులాచంద్రశే
    ఖరపాదంబులెమోక్షదాయకములౌ గాదందురాపండితుల్

    కరుణనుగురిపించునెపుడు
    మరణమునమృతత్త్వమొసగు మహిమాన్వితముల్
    మరువకు నిరతము విధుశే
    ఖరపదములె మోక్షదాయకమ్ములగుగదా

    రిప్లయితొలగించండి
  2. నిరతము జీవితమందున
    నెరవేర్చెడి పాపములను నిరసించుటకై ,
    యరయగ దెలిసెను శశీశే
    ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా

    రిప్లయితొలగించండి
  3. నరుడా! మానవ జన్మమందు గడు
    పుణ్యంబార్జనంజేయుమా!
    దురహంకారము మాని సజ్జనుడవై
    దుష్కార్యముల్ వీడియున్
    పరమారాద్యుని సేవయే జనులకున్
    భాగ్యమ్ము , శ్రీ చంద్ర శే
    ఖరపాదంబులె మోక్షదాయకములౌ
    గాదందురా పండితుల్

    రిప్లయితొలగించండి
  4. స్మరి యించు చు శివ నామము
    కరములు జోడించి మ్రొ క్క కరుణించు దయా
    పరుడుగు శంకరు శశి శే
    ఖర పదము లె మో క్ష దాయ కమ్ములగు గదా!

    రిప్లయితొలగించండి

  5. సిరి సంపదలవి ధరలో
    స్థిరములు కావని యెఱుగుచు దివ్య పదము కై
    నిరతమ్ము చంద్రమశ్శే
    ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా.


    పరుగుల్ తీయకు మెండమావులవియే స్వాస్థ్యమ్ము లీ ధాత్రిలో
    స్థిరముల్ కావను మాట వాస్తవమదే క్షేత్రములో కాంచగా
    పరమానందుడె శాశ్వతమ్మనెడి విశ్వాసమ్ము తో చంద్రశే
    ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్.

    రిప్లయితొలగించండి
  6. వరదుండని సేవింతురు
    కరిచర్మాంబరధరునిటఁ గైవల్యముకై
    పరమేశ్వరుడగు శశిశే
    ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా

    వరదుండాశివుడంచుఁ గొల్తురుకదా భస్మాంగునిన్ భక్తితో
    కరిచర్మాంబరధారి నిబ్బరికమే కైవల్యమిచ్చున్ గదా
    కరుణాంభోనిధి యన్న నీలగళుడే కాలాత్ముడా చంద్రశే
    ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్

    రిప్లయితొలగించండి
  7. శిరమున్ మోడిచి భక్తి నెక్కొనగ సంసేవింప సర్వేశ్వరున్
    సిరులందించును సౌఖ్యముల్ నెరపు నుత్సేకించు శ్రేయమ్మలే
    పరమౌ ముక్తిని బొందనెల్లరకు ఖట్వాంగిన్ హరున్ చంద్రశే
    ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్

    రిప్లయితొలగించండి
  8. శిరసును మోడిచి భక్తిగ
    పురహరు బూజింప నొదవు పుణ్యగతులు శం
    కరుడే గతియగు శశిశే
    ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా

    రిప్లయితొలగించండి
  9. కం॥ ధరణిని సద్భక్తిఁ గనుచు
    మురారి యని తలఁచి నిష్ఠఁ బూని కొలచినన్
    నరహరి యెందు కనపడడు
    ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా

    మ॥ ఖరమౌ సూకరమౌ ధరాతలమునన్ గామ్యార్ధ సంధాతగన్
    మరియే చింతనుఁ గాంచ కుండ నటు సమ్మానించి సద్భక్తితోఁ
    బరమున్ గోరుచు తత్పరార్ద్రల సదా ప్రార్థించినన్ జాలదో
    ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్

    (ఈశావాస్యమిదం సర్వం సూక్తి పోతన గారి పద్యమును అనుసరించి)

    రిప్లయితొలగించండి
  10. కందం
    వరములుఁ గోరి తపించ న
    సురులన్ బోళాతనమునఁ జూచెననంగన్
    బరహితమెంచఁగ విధుశే
    ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా!

    మత్తేభవిక్రీడితము
    వరముల్ గోరెడు రక్కసుల్ తపములన్ వాంఛింప బోళాతనం
    బిరువై కాచ, పరోపకారములతోనేపారు శిష్ట్యాత్ములన్
    దరిఁజేరున్ గృపఁజూపఁగన్ రయమునన్ ద్ర్యక్షుండు బాలేందు శే
    ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్

    రిప్లయితొలగించండి
  11. కం:స్థిర చిత్తమ్మున తత్త్వ
    మ్మరయుచు సద్భక్తి తోడ నా పరమేశున్
    స్మరియింపు మోయి ! శశిశే
    ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా”

    రిప్లయితొలగించండి
  12. మ:సరియౌ పాండితి గల్గియున్, ఘటికుడై కావ్యమ్ములన్ వ్రాసియున్
    బిరుద మ్మొక్కటి బొంద గోర కవికిన్ విద్యావిహీనుండె యై
    ధరణిన్ బాలన జేయు నేత పదమున్ దా బట్టనే పొందు త
    త్ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్!
    (పండితుడే ఐనా సరే ఏ ఆవార్డో రావా లంటే ఒక గాడిద కాళ్లు పట్టుకోక తప్పదు. )

    రిప్లయితొలగించండి
  13. హరి కాఁగ స్వీయ పుత్రుఁడు
    పరమాత్ముని కార్య భంగ వారణమున కా
    తరుణము వసుదేవునకున్
    ఖర పదములె మోక్ష దాయకమ్ము లగుఁ గదా


    హరి నామస్మరణం బొసంగును సతం బానంద మెవ్వారికిన్
    హరి సంకీర్తన మెల్ల వారికినిఁ బాపౌఘమ్ములం బాపఁగన్
    నర సందోహము వొందఁ గ్లిష్ట తర సందర్భమ్ము ఖండేందు శే
    ఖర పాదంబులె మోక్ష దాయకములౌఁ గా దందురా పండితుల్

    రిప్లయితొలగించండి
  14. నిరతమ్మున్ గడు స్వార్థ చింతనముతో నిర్మించ సంసారమున్
    వరసంఘమ్మున సౌఖ్యముల్ గలుగునే, భావించి మిత్రత్వమున్
    ధరపై నందరితో చరింప శుభమౌ, ధ్యానమ్ముతో చంద్ర శే
    ఖరపాదంబులె మోక్ష దాయకములౌ, గాదందురా పండితుల్?

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వరముల బొందెడు రీతిని
    నిరతము పూజించుచుండి నిర్మల భక్తిన్
    కరుణా మయుడౌ విధుశే
    ఖర పదములె మోక్ష దాయకమ్ములగుఁ గదా!

    రిప్లయితొలగించండి
  16. కరుణామయుడగు హరునే
    పరమేశ్వరి తపము చేసి పడసెను పతిగా
    మరువక గొల్చిన విధుశే
    *“ఖరపదములె మోక్షదాయకమ్ములగుఁ గదా”*


    హరునే భర్తగ గోరి పార్వతియు‌నాహారమ్మునేవీ డుచున్
    మరియేచింతనమాచరించకసదామాహేశునే దల్చుచున్
    యరమేనయ్యెనటంచుమెచ్చమునులానందమ్ముతోచంద్రశే
    *“ఖరపాదంబులె మోక్షదాయకములౌఁ గాదందురా పండితుల్”*

    రిప్లయితొలగించండి