ఉ:తీరుగ రామగాధలను దీసిన చిత్రము గంటి,దానిలో నారిని బట్టి, సీత గని నవ్వును కొంతగ నిగ్రహించి తా నోరగ జూచు దృశ్య మది యొప్పెను తారకరాము డుండుటన్ నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ” (నారి=స్త్రీ ఐన సీత.నారిని బట్టి= వింటి నారిని పట్టి.ఆ సినిమా అంతా గొప్పగా ఉంది కానీ రాముడు నారిని లాగ బోతూ ఒక పక్క సీతను చూస్తూ, వచ్చే నవ్వును వెకిలి నవ్వుగా కాక నిగ్రహించుకుంటూ ఉన్న దృశ్యం ఉందే! అది రాము డంటే. అది యన్.టి. రామా రావు ఉండ బట్టి అలా వచ్చింది. ఇక్కడ సినిమా సంగతి లేకుండా రాముణ్ని గూర్చి చెప్పవచ్చు కదా!అంటే ఆ ఒక్కటే రాముడు అనటం సరి కాదు.ఆ సినిమాలో రాము డంటే ఇది అనే దృశ్యం అది.)
తేటగీతి
రిప్లయితొలగించండిరామపట్టాభిషేకము రమ్యమనుచు
కైక రంజిల్ల మంధరకాలుమోపి
భరతుని వరింప పట్టమ్ము వాదుసలుప
నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె!
ఉత్పలమాల
భూరిగ సంబరాల్ గనుచు ముచ్చటఁజెందెడు కైకఁ గాంచుచున్
దారుణమెంచి మంధరయె దావము పాలొనరించి రామునిన్
దీరుచ రాజుగన్ భరతు దిక్కును జూపెడు వాదమందునన్
నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ!
తన విలాతిని నారిగ తలచు చుండ ,
రిప్లయితొలగించండిమైథిలి వివాహమాడిన మరొక నారి ,
నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె
సతులి రువురి కోరికలను చక్కబెట్ట
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమంధర పలుకు కుటిలపు మాటలు విని
రాజు కాకుండ రాముని రమణి కైక
యడ్డు కొనుచు నతనిని తా నడవి కంప
నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె.
నేరుపు కాడు రాముడని నేతను జీసెడి పాళమందు నన్
వారిజ నేత్రులిర్వు రట పన్నిన కుట్రకు ధర్మ మూర్తియే
భీరుక మేగె నంచొక వివేకియె తా వచి యించె నిట్టులన్
నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ.
నారిఁ బిగియింపగా విల్లు నాడు విరిగి
రిప్లయితొలగించండినారి జానకి వరియించె వీరుడనుచు
నారి సవరించుచున్ లంక నాథునడచె
నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె
నారిఁ బిగింపగా విరిగెనా ధనువే రఘువీరుడెత్తినన్
నారి లభించె రామునకు నాడు మహీజ వరించినంతటన్
నారిని సంతరించి గద నాశమొనర్చెను లంకనాథునిన్
నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి(తాటకా సంహార సందర్భము)
రిప్లయితొలగించండితేటగీతి:
చాననడుచగ తగదను శాస్త్ర నియతి;
కలక కాదంచు పలికెడి కౌశికాజ్ఞ;
బాలిమముగాన శంకలు పాఱి, వింటి
నారి, నారి నడుమ రాముడౌర నలిగె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ🙏
తొలగించండిరాజ్య కాంక్ష కు నడ్డమై రమణి యొకతె
రిప్లయితొలగించండివెంట నడచె ను వనముకు వెలది యొక తె
నారి నారి నడుమ రాము డౌ ర నలిగె
ననుచు బలి కెను సామాన్యు డవని యందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి-
ముద్దు తీర్చమనె కలాపములను కోరి
చూడ చక్కని పెండ్లాము చూడరో ది
నారి, నారి నడుమ రాముడౌర నలిగె
పసిడి వెలచూడగా గుండె ప్రక్క జారి.
https://youtube.com/shorts/2tGi9Y31ld8?is=aQJRcfVebT0lGBSA
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"తీర్చుమనె"
తే.గీ:అబలనున్ జంపుటయె ముని యాజ్ఞ కాగ
రిప్లయితొలగించండినారి లాగుచు "నిద్ది యన్యాయ మగునె?"
యంచు ధర్మసంకట మింక నాత్మ మెదల
నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె”
(నారి=స్త్రీ.నారి= వింటి నారి.రాముడు తాటకిని చంపే ముందు రెంటి మధ్య నలిగాడు. )
తే॥ రాముని నియతి కృష్ణుని రాసలీల
రిప్లయితొలగించండిగతి విదేశీయునకు తెల్ప గమనమిడక
పలుకు బహు భార్యలకితఁడు పతిగ మనుచు
నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె
ఉ॥ తీరుగఁ దారతమ్యమును దెల్లముఁ జేయ విదేశ పౌరుఁడై
వేరుగ రామకృష్ణులకు భేదము నెంచెడు శక్తిఁ గాంచడే
పారక బుద్థి పల్కు బహుభార్యల భర్తను తెల్పఁ గోరినన్
నారికి నారికిన్ నడుమ నల్గెడి వాఁడన రామచంద్రుడౌ
ఉ:తీరుగ రామగాధలను దీసిన చిత్రము గంటి,దానిలో
రిప్లయితొలగించండినారిని బట్టి, సీత గని నవ్వును కొంతగ నిగ్రహించి తా
నోరగ జూచు దృశ్య మది యొప్పెను తారకరాము డుండుటన్
నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ”
(నారి=స్త్రీ ఐన సీత.నారిని బట్టి= వింటి నారిని పట్టి.ఆ సినిమా అంతా గొప్పగా ఉంది కానీ రాముడు నారిని లాగ బోతూ ఒక పక్క సీతను చూస్తూ, వచ్చే నవ్వును వెకిలి నవ్వుగా కాక నిగ్రహించుకుంటూ ఉన్న దృశ్యం ఉందే! అది రాము డంటే. అది యన్.టి. రామా రావు ఉండ బట్టి అలా వచ్చింది. ఇక్కడ సినిమా సంగతి లేకుండా రాముణ్ని గూర్చి చెప్పవచ్చు కదా!అంటే ఆ ఒక్కటే రాముడు అనటం సరి కాదు.ఆ సినిమాలో రాము డంటే ఇది అనే దృశ్యం అది.)
పోరి దశాననున్ దునిమి, భూమిజ సేరఁగరాఁగ "నిష్ఠమైఁ
రిప్లయితొలగించండిబోరితి రాజధర్మమును బూని, సతీ! నిను నేను నేలుకో
నేరన" టంచుఁ బల్కెనట నిక్కమె! యక్కట! కీర్తిరూపమౌ
“నారికి, నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ”
అరయ నేక పత్నీ వ్రతుఁ డతఁడు నిజము
రిప్లయితొలగించండితల్లిపై నతనికి భక్తి తద్ద కలదు
పేరు రాముఁడు దాటఁడు దార పలుకు
నారి నారి నడుమ రాముఁ డౌర నలిఁగె
ఏరికి నైనఁ గర్మ ఫల మెవ్విధి నైన భరింపఁగా వలెం
గారణ మైరి యాండ్రు నిజ కాయము సన్నగిలం గ్రమమ్మునన్
వారక యిర్వ దేడుగుర భామలఁ దారలఁ బెండ్లియాడఁగా
నారికి నారికిన్ నడుమ నల్గెడి వాఁడన రామ! చంద్రుఁడౌ
శ్రీరఘురాము కానఁ గని, చెన్నగు రూపము దాల్చి చెంతకున్
రిప్లయితొలగించండిజేరి వచించె శూర్పణఖ, చిక్కితి మారుని కోలలందునన్
తీరుచు కోర్కెలంచు వినుతింపగ, దిగ్భ్రమనంది చిత్తమున్
నారికి నారికిన్ నడుమ నల్గెడివాడన రామచంద్రుడౌ
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తల్లి యానతి నొకవంక తలను దాల్చ
ఆలి చెప్పిన దాని కాదనగ లేక
తల్లడిల్లుచు మదిని మధన పడుచును
నారి నారి నడుమ రాముడౌర నలిగె.
వాసుదేవుడు నలిగెను ద్వాపరమున
రిప్లయితొలగించండి“నారి నారి నడుమ రాముఁ డౌర నలిగె”
సీతజాడనరయలేక త్రేత యందు
చెట్టు పుట్టల నరయుచు చింత తోడ
పేరిమితోడతల్లులట పెంచుచుగోమునుచూపుచుండగా
మారుగమాటలాడకనుమౌనముతోడభరించుచెల్లయున్
కూరిమిచూపుచున్ సతము కూడుచునాడుచుచెంతచేరుచున్
“నారికి నారికిన్ నడుమ నల్గెడివాఁడన రామచంద్రుఁడౌ”