30-6-2026 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భవమే పుణ్యప్రదంబు భక్తులకెల్లన్”(లేదా...)“భవమే భక్తులకెల్లఁ బుణ్యముల సంప్రాప్తించ మూలమ్మగున్”
అవని పయిననె వసించుచు నెవరికి సాధ్య పడనిదగు యిచ్ఛను పొందన్ శివుని యడపొడ గనిన యను భవమే పుణ్యప్రదంబు భక్తులకెల్లన్
కందంప్రవచనములు, సత్సంగముశివనామస్మరణ నుపవసించి శివునితోశివరాత్రినిఁ గన లింగోద్భవమే పుణ్యప్రదంబు భక్తులకెల్లన్మత్తేభవిక్రీడితముప్రవచింపంగఁ బురాణకోవిదులటన్ భక్త్యాత్ములై గాథలన్శివనామస్మరణంబు నల్దిశల నిక్షేపాన మార్మోగగన్శివరాత్రిన్ బరమాత్మసన్నిధిని సంసేవింపలింగంపు సంభవమే భక్తులకెల్లఁ బుణ్యముల సంప్రాప్తించ మూలమ్మగున్
భవ బంధమ్ముల రోయుచు భువిలో ప్రతి రూపమదియె ముదమున గనగా శివుడే యని నమ్మెడి యను భవమే పుణ్యప్రదంబు భక్తులకెల్లన్.భువిసౌఖ్యమ్ములశాశ్వతమ్ములనుచున్ మోక్షంబు కై నిత్యమున్ భవ బంధమ్ముల వీడి యీశ్వరుని సద్భావమ్ముతో కొల్చుచున్ భవుడే సర్వ మటంచు డెందమున సద్వైరాగ్యమున్ భక్తి వై భవమే భక్తులకెల్లఁ బుణ్యముల సంప్రాప్తించ మూలమ్మగున్.
భవ సాగరమును దాటగశివ నామ జపము సలుపగ సిద్ధి లభించు న్ భువి జనుల కు దివ్య పు టను భవమే పుణ్య ప్ర దంబు భక్తుల కెల్లన్
భువిపై భక్తులవిరతముభవబంధమ్ములను ద్రుంచ ప్రార్థింత్రుగదాశివ సేవా భావావిర్భవమే పుణ్యప్రదంబు భక్తులకెల్లన్భువిపై భక్తులు లక్ష్యసాధనముకై పూజింతురవ్యక్తునిన్భవబంధమ్ములఁ ద్రుంచిమోక్షమిడుమా పంచాననా యందురేశివలింగార్చన సల్పు చుంద్రు సతమున్ జిత్తంబునన్ భక్తి సం భవమే భక్తులకెల్లఁ బుణ్యముల సంప్రాప్తించ మూలమ్మగున్
మ॥ నవకమ్మున్ఁ గని నేమనిష్ఠలటు సన్మానించి కర్తవ్యముల్భువిలో ధర్మము నెంచి యీశ్వరుని సంపూర్ణమ్ముగా నమ్ముచున్జవితోఁ జేయుచుఁ గర్మ మార్గమున సత్సాంగత్యమున్ బొందఁగన్భవమే భక్తులకెల్లఁ బుణ్యములు సంప్రాప్తించ మూలమ్మగున్భవము అంటే సంసారము తీసుకున్నానండి. మరొక పూరణ అండి(భగవంతుని సంకల్పము వలనే మనము పుట్టినాము. మరి భవబంధములు లేకుండా ఉండవు కదా! మన బాధ్యతలను సన్మార్గంలో నిర్వర్తించడం పుణ్యఫలమిస్తుందని. సన్యాసులు తప్ప అందరూ బాధ్యతా బద్ధులే కదండి)శా॥ భవమే రీతిగ పాపమౌనొ భగవత్భావంపు రూపమ్ముగన్భువిలోఁ బుట్టఁగ బాధ్యతా పరిని సమ్మోదమ్ముతోఁ దాల్చు ప్రజ్ఞ వివేకమ్మును గాంచి శ్రద్ధఁ గని విశ్వాసమ్ముతోఁ సాగఁగన్భవమే భక్తులకెల్లఁ బుణ్యములు సంప్రాప్తించ మూలమ్మగున్
భువిపై పూర్వపు జన్మ పాపములె యామూలమ్ము వెంటాడగా వివిధమ్మౌ పశు పక్షిజన్మలుడుగన్ పెక్కేండ్లు కాఱించి దానవ విద్వేషి స్తుతింప మానవునిగా నారాయణుండిచ్చు సంభవమే భక్తులకెల్లఁ బుణ్యములు సంప్రాప్తించ మూలమ్మగున్
అవిరళ భవ బంధశ్రేణి వినాశన మౌను వాంఛనీయము సుమ్మీ దివి జారాధన నిజ వై భవమే పుణ్యప్రదంబు భక్తుల కెల్లన్ సవనమ్ముల్ దగఁ జేయ నెంచినను విస్తారమ్ముగా ధాత్రి మానవ జన్మంబ యవశ్యమౌను గద సుంతైనన్ విచారింపుమా యవనిం గాయమ యాద్యమై వఱలు ధర్మైకార్జనార్థం బనన్ భవమే భక్తుల కెల్లఁ బుణ్యములు సంప్రాప్తింప మూలమ్మగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రవియైచంద్రుడునంతరిక్షములునై రాముండుకృష్ణుండునైశివుడైసత్త్వరజస్తమోగుణములై చిద్రూపమై శక్తియైభువియైనగ్నిజలంబులై గగనమై పోషించు సర్వేషు వై*భవమే భక్తులకెల్ల బుణ్యములు సంప్రాప్తించ మూలమ్మగున్*
శివరాత్రి పర్వదినమునశివశివ! హరహర!యనుచును శివనామంబే యవనీ తలమున మ్రోగెడు భవమేపుణ్యప్రదంబు భక్తులకెల్లన్
భవభయతరియగు అభవుని అవనీ తలమున గనుటకు ఆలయమున ఆశివసందర్శనమను అనుభవమే పుణ్యప్రదంబు భక్తులకెల్లన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.భవునే నిత్యము గొల్చుచుస్తవమున్ జేయుచు హరహర సంకీర్తనతోశివరాత్రినిఁ గన లింగోద్భవమే పుణ్యప్రదంబు భక్తుల కెల్లన్.
అవని పయిననె వసించుచు
రిప్లయితొలగించండినెవరికి సాధ్య పడనిదగు యిచ్ఛను పొందన్
శివుని యడపొడ గనిన యను
భవమే పుణ్యప్రదంబు భక్తులకెల్లన్
కందం
రిప్లయితొలగించండిప్రవచనములు, సత్సంగము
శివనామస్మరణ నుపవసించి శివునితో
శివరాత్రినిఁ గన లింగో
ద్భవమే పుణ్యప్రదంబు భక్తులకెల్లన్
మత్తేభవిక్రీడితము
ప్రవచింపంగఁ బురాణకోవిదులటన్ భక్త్యాత్ములై గాథలన్
శివనామస్మరణంబు నల్దిశల నిక్షేపాన మార్మోగగన్
శివరాత్రిన్ బరమాత్మసన్నిధిని సంసేవింపలింగంపు సం
భవమే భక్తులకెల్లఁ బుణ్యముల సంప్రాప్తించ మూలమ్మగున్
రిప్లయితొలగించండిభవ బంధమ్ముల రోయుచు
భువిలో ప్రతి రూపమదియె ముదమున గనగా
శివుడే యని నమ్మెడి యను
భవమే పుణ్యప్రదంబు భక్తులకెల్లన్.
భువిసౌఖ్యమ్ములశాశ్వతమ్ములనుచున్ మోక్షంబు కై నిత్యమున్
భవ బంధమ్ముల వీడి యీశ్వరుని సద్భావమ్ముతో కొల్చుచున్
భవుడే సర్వ మటంచు డెందమున సద్వైరాగ్యమున్ భక్తి వై
భవమే భక్తులకెల్లఁ బుణ్యముల సంప్రాప్తించ మూలమ్మగున్.
భవ సాగరమును దాటగ
రిప్లయితొలగించండిశివ నామ జపము సలుపగ సిద్ధి లభించు న్
భువి జనుల కు దివ్య పు టను
భవమే పుణ్య ప్ర దంబు భక్తుల కెల్లన్
భువిపై భక్తులవిరతము
రిప్లయితొలగించండిభవబంధమ్ములను ద్రుంచ ప్రార్థింత్రుగదా
శివ సేవా భావావి
ర్భవమే పుణ్యప్రదంబు భక్తులకెల్లన్
భువిపై భక్తులు లక్ష్యసాధనముకై పూజింతురవ్యక్తునిన్
భవబంధమ్ములఁ ద్రుంచిమోక్షమిడుమా పంచాననా యందురే
శివలింగార్చన సల్పు చుంద్రు సతమున్ జిత్తంబునన్ భక్తి సం
భవమే భక్తులకెల్లఁ బుణ్యముల సంప్రాప్తించ మూలమ్మగున్
మ॥ నవకమ్మున్ఁ గని నేమనిష్ఠలటు సన్మానించి కర్తవ్యముల్
రిప్లయితొలగించండిభువిలో ధర్మము నెంచి యీశ్వరుని సంపూర్ణమ్ముగా నమ్ముచున్
జవితోఁ జేయుచుఁ గర్మ మార్గమున సత్సాంగత్యమున్ బొందఁగన్
భవమే భక్తులకెల్లఁ బుణ్యములు సంప్రాప్తించ మూలమ్మగున్
భవము అంటే సంసారము తీసుకున్నానండి.
మరొక పూరణ అండి
(భగవంతుని సంకల్పము వలనే మనము పుట్టినాము. మరి భవబంధములు లేకుండా ఉండవు కదా! మన బాధ్యతలను సన్మార్గంలో నిర్వర్తించడం పుణ్యఫలమిస్తుందని. సన్యాసులు తప్ప అందరూ బాధ్యతా బద్ధులే కదండి)
శా॥ భవమే రీతిగ పాపమౌనొ భగవత్భావంపు రూపమ్ముగన్
భువిలోఁ బుట్టఁగ బాధ్యతా పరిని సమ్మోదమ్ముతోఁ దాల్చు ప్ర
జ్ఞ వివేకమ్మును గాంచి శ్రద్ధఁ గని విశ్వాసమ్ముతోఁ సాగఁగన్
భవమే భక్తులకెల్లఁ బుణ్యములు సంప్రాప్తించ మూలమ్మగున్
భువిపై పూర్వపు జన్మ పాపములె యామూలమ్ము వెంటాడగా
రిప్లయితొలగించండివివిధమ్మౌ పశు పక్షిజన్మలుడుగన్ పెక్కేండ్లు కాఱించి దా
నవ విద్వేషి స్తుతింప మానవునిగా నారాయణుండిచ్చు సం
భవమే భక్తులకెల్లఁ బుణ్యములు సంప్రాప్తించ మూలమ్మగున్
అవిరళ భవ బంధశ్రే
రిప్లయితొలగించండిణి వినాశన మౌను వాంఛనీయము సుమ్మీ
దివి జారాధన నిజ వై
భవమే పుణ్యప్రదంబు భక్తుల కెల్లన్
సవనమ్ముల్ దగఁ జేయ నెంచినను విస్తారమ్ముగా ధాత్రి మా
నవ జన్మంబ యవశ్యమౌను గద సుంతైనన్ విచారింపుమా
యవనిం గాయమ యాద్యమై వఱలు ధర్మైకార్జనార్థం బనన్
భవమే భక్తుల కెల్లఁ బుణ్యములు సంప్రాప్తింప మూలమ్మగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరవియైచంద్రుడునంతరిక్షములునై రాముండుకృష్ణుండునై
రిప్లయితొలగించండిశివుడైసత్త్వరజస్తమోగుణములై చిద్రూపమై శక్తియై
భువియైనగ్నిజలంబులై గగనమై పోషించు సర్వేషు వై
*భవమే భక్తులకెల్ల బుణ్యములు సంప్రాప్తించ మూలమ్మగున్*
శివరాత్రి పర్వదినమున
రిప్లయితొలగించండిశివశివ! హరహర!యనుచును శివనామంబే
యవనీ తలమున మ్రోగెడు
భవమేపుణ్యప్రదంబు భక్తులకెల్లన్
భవభయతరియగు అభవుని
రిప్లయితొలగించండిఅవనీ తలమున గనుటకు ఆలయమున ఆ
శివసందర్శనమను అను
భవమే పుణ్యప్రదంబు భక్తులకెల్లన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
భవునే నిత్యము గొల్చుచు
స్తవమున్ జేయుచు హరహర సంకీర్తనతో
శివరాత్రినిఁ గన లింగో
ద్భవమే పుణ్యప్రదంబు భక్తుల కెల్లన్.