20, జూన్ 2026, శనివారం

సమస్య - 5504

21-6-2026 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్”

(లేదా...)

“రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్”

17 కామెంట్‌లు:

  1. కందం
    కాముకతనహల్యఁ గొనన్
    దా, మౌని రగిలి శపించ,తనువెల్ల భగా
    లై మనుచు స్వప్నమై సు
    త్రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్!

    ఉత్పలమాల
    కాముకతత్వమై చెలఁగి కాంత నహల్యను బొంద మోహమై
    తా, ముని కోప శాపమున తన్వున నిండి భగమ్ము లేర్పడన్
    జామునఁ జింతతో కునుక స్వప్నము నందున గేలి చేసి సు
    త్రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్!

    రిప్లయితొలగించండి
  2. ఏ మన్నెదొర నడిగినను
    రామునిగ నటించినట్టి రంజిలు టాక్సీ
    రాముడు చిత్రపు తారక
    రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్”

    రిప్లయితొలగించండి
  3. స్థేమము గల్గిన నృపతులు
    తామట మరలిరి పరీక్ష తప్పిన వారై
    కోమల శరీరుడగు శ్రీ
    రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్

    స్థేమము గల్గువారలును శ్రేష్ఠులు పల్వురి భంగపాటునే
    తామట గాంచిరా పుడమి తాల్పులు సీత స్వయంవరంబునన్
    గోమలమైన దేహమును గొప్పలు చెప్పగ లేని బాలుడౌ
    రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పుడమి తాల్పులు'?

      తొలగించండి
    2. పుడమితాల్పులు అంటే 'రాజులు' అనే అర్థంలో ప్రయోగించాను గురూజీ

      తొలగించండి

  4. రాముడు పసి బాలుండని
    కోమల రూపుండనుచును కోదండము తా
    నిమాత్రమెత్తలేడని
    రామునిఁ గని నవ్విరట ధరాపతు లెల్లన్.


    కామిత కార్యమౌ శివుని కార్ముక మెత్త నసాధ్యమై యిటన్
    భీమ బలుండ్రె కీడుపడి వేదన చెందుచు నుండు వేళలో
    నా మహిమాన్వితమ్మగు హయాంగము నెత్తగ వచ్చెనంచు శ్రీ
    రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్.

    రిప్లయితొలగించండి
  5. అష్టావక్రుడు జనకుని సభలో ప్రవేశించినప్పుడు ఆయన ఆకారాన్ని చూసి సభికులు అపహాస్యము చేశారని ఒక కథ ఆధారంగా)
    కం॥
    సామర్థ్యమందు గాకన్
    స్థామనమందున్నవంక దరిసించుసభన్
    ధీమంతసమున్నతిఁవన
    రా మునిఁగని నవ్విరట ధరాపతులెల్లన్!!

    వనర+ఆ ముని

    రిప్లయితొలగించండి
  6. ఉ॥ సామముఁ దెల్పినన్ శివుని చాపముఁ ద్రుంచిన కోప మందునన్
    దామస రూపుఁడై యపుడు తాల్చు మనంగనె విష్ణు చాపమున్
    బ్రేమగఁ బూన రాఘవుఁడు పేరిమితో జమదగ్ని పుత్రుఁడౌ
    రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్

    సామము మంచిమాట పేరిమి గౌరవము పూను ధరించు
    (ఆక్షణములో మాత్రము విష్ణువు అవతారమే యైనను పరశురామునికి తామసము క్రమ్మిందని అపుడు వాడినానండి)

    రిప్లయితొలగించండి
  7. కం:ప్రేమయె కరవయ్యెను హిం
    దూమతమున మహ్మదీయ దుష్టుల చేతన్
    బాముల బడినట్టి విజయ
    రాముని గని నవ్వి రట ధరాపతు లెల్లన్.
    (హిందూ రాజులలో ఐకమత్యం లేదు.విజయ రామ రాజు సమస్యలలో ఉంటే మిగిలిన హిందూ రాజులు నవ్వుకొన్నారు. ఆయన తళ్లి కోట యుద్ధం లో మరణించాడు.)

    రిప్లయితొలగించండి
  8. ఉ:రాముని జూపి యెల్లరకు రాజ సభన్ దన పుత్రుడంచు నా
    ప్రేమను జూపు పంక్తిరథు వీక్షణ జేయుచు గాన్ క లిచ్చుచున్
    సేమము గోరుచున్ ముదము జెందగ మేలము లాడి ప్రేమ తో
    రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్”

    రిప్లయితొలగించండి
  9. ధామము నందు నాటకము తమ్ముని తో మరికొందరాడ యా
    వాముని విల్లు హస్తమున బట్టుట నేరని వేషధారి శ్రీ
    రాముని గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్
    భూమిజ పాత్ర ధారియగు ముద్దుల గుమ్మయు సూచుచుండగన్

    రిప్లయితొలగించండి
  10. ధీమతులకు సాధ్య పడని
    కోమలు డగు ని తండు కోదండ మ్మున్
    రాము o డెత్త న్ లేడని
    రాముని గని నవ్వి రట ధరా పతు లెల్లన్

    రిప్లయితొలగించండి
  11. సామజ రథ తురగ భట
    స్తోమ బల సమేతుఁ డయ్యు దుర్జయుఁ డైనన్
    భామాభుఁ బరాజిత సం
    గ్రామునిఁ గని నవ్వి రట ధరాపతు లెల్లన్


    భీమత రోది తోన్మదితు విప్ర కులోద్భవు నత్తఱిం బరం
    ధామ పదాబ్జ తత్పరు సదా భజనా రతునిన్ సమగ్ర సం
    క్షేమ సుఖాంత రాత్ముని నిమీళిత నేత్రు నిరంత రాంత రా
    రామునిఁ గాంచి నవ్విరి ధరావిభు లెల్ల సభాంతరమ్మునన్

    [నిరంతర+అంతర+ఆరాముని = నిరంతరము తనలోఁ దా నానందించు వానిని]

    రిప్లయితొలగించండి
  12. ఆముని వెంటసాగి జనకాధిపు పట్టణ వీధులందునన్
    భూమిజ తండ్రి సత్కృతుల బొంది మునీశ్వరు డానతీయగా
    సోముని విల్లుభేదనము చొక్కగ జేయగ, సంతసమ్ముతో
    రామునిఁ గాంచి నవ్విరి ధరావిభులెల్ల సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    రాముని కంటెను ముందుగ
    భూమిజ నాశించి యత్నము జరిపిరి ఘనుల్
    ఏమిది! పసివాడనుచును
    రామునిఁ గని నవ్విరట ధరాపతులెల్లన్.

    రిప్లయితొలగించండి