ఆ.వె:బొప్పి కట్టు దెబ్బ పుల్వామ లో దిని సిగ్గు లేక తామె నెగ్గినట్లు పాక్ ప్రభుత్వమునకు పరువుకై యచటి యా కాశవాణి సతముఁ గల్లలాడు” (పుల్వామా దాడి లో దెబ్బ తిన్న పాకిస్తాన్ మా కేమీ కాలేదు.భారత్ దాడి లో ఒక కాకి చచ్చింది అంటూ జోక్ చేసింది. అక్కడి రేడియో అలాగే మాట్లాడింది. )
మ.కో:దేశ మందున శాంతి యుండిన దృప్తి జెందని యా బ్రిటన్ దేశ మందలి వార్త లెప్పుడు ద్వేషముల్ రగిలించు నీ దేశమున్ విడి కూడ యేదియొ దీర్ఘదృష్టిని వారి యా కాశవాణి నిరంతరమ్మును గల్లలే పలుకున్ గదా” (బి బి సి రేడియో భారత్ గూర్చి అబద్ధాలు ప్రచారం చేస్తుంది అని.)
ఎండ కాయు నన్న మెండుగ వర్షించు నబ్బురముగ దేశ మందు నంత వాన వచ్చు నన్న వరదలు వచ్చు నా కాశవాణి సతముఁ గల్ల లాడు
లేశ మైనను సత్య మాడదు రిత్త పల్కులు వెక్కసం బాశ మూరెడు చేత లౌర నిరర్థకమ్ములు నిత్యముం గాశ దేశము సుప్రసిద్ధము కాదు భారత మందు నా కాశ వాణి నిరంతరమ్మును గల్లలే పలుకుం గదా
ఆటవెలది
రిప్లయితొలగించండికచ్చితమగు వార్త లిచ్చు మాధ్యమమనఁ
బ్రభుత చేయు మంచి పనులఁ దెలుప
విని విపక్షమోర్వదన వారి దృష్టి నా
కాశవాణి సతముఁ గల్లలాడు
మత్తకోకిల
లేశమైననసత్య మాడక రీతి గా వచియించు ని
ర్దేశమై ప్రజ మెచ్చు శీర్షికలే ప్రసారమొనర్చుచున్
దేశమొందెడు వృద్ధిఁదెల్పనదే విపక్షపు దృష్టి నా
కాశవాణి నిరంతరమ్మును గల్లలే పలుకున్ గదా!
ప్రాభవమొనరించు ప్రఖ్యాతమైన ఆ
రిప్లయితొలగించండికాశవాణి సతముఁ గల్లలాడు
ప్రసరణము సలిపెడు వార్తలు వినినంత
రోత కలుగు చుండు శ్రోత లకును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివార్తలనెఱిగించు ప్రాబల్యమేగల
రిప్లయితొలగించండిసాధనంబిదియని జనుల తలపు
పొల్లులన్ దెలుపగ పొల్పునన్ సాగు నా
కాశవాణి సతముఁ గల్లలాడు
దేశమందలి వార్తలెన్నడు తెల్పు మాధ్యమమేదనన్
లేశమంతయు సంశయింపగలేము దీనిని జూపగా
పేశలంబగు పొల్లువార్తలఁ వేగమున్ దునుమాడ నా
కాశవాణి నిరంతరమ్మును గల్లలే పలుకున్ గదా
[ఎల్లప్పుడు పొల్లు వార్తలను ఖండించు ప్రక్రియలో ఆ కల్లలను చెబుతుందని]
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఆ॥వె
రిప్లయితొలగించండివార్త వార్త వలెనె పసరించునుండు నా
కాశవాణి; సతముఁ గల్లలాడు
చులుక కూటి కొరకు సుద్దికద్దుచు రంగు
ప్రొద్దుగడుపు కొన్ని రోతతతులు!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు సర్🙏
తొలగించండిఅన్ని వర్గములకు నానందమిచ్చు నా
రిప్లయితొలగించండికాశవాణి సతముఁ గల్లలాడు
ననుట కల్లమాట యరసి చూడంగ నా
కాశవాణి గాదె కల్పతరువు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్తకోకిల:
రిప్లయితొలగించండిలేశమైనను స్వార్థచింతన లేక శ్రోతల మేలుకై
దేశమందలి విజ్ఞులందరిఁ దెచ్చి సూచనలిచ్చుచున్
వాశియైన ప్రసారముల్ జరుపంగ బల్కెదవెట్టు లా
కాశవాణి నిరంతరమ్మును గల్లలే పలుకున్ గదా?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి-
రిప్లయితొలగించండి"దేశ మెల్ల దోచె దేవర మోడి" ~~ ఆ
కాశవాణి సతముఁ గల్లలాడు
వారి మాట లెల్ల వార్తగా చెప్పదు
నాణ్యతగల చరిత నమ్మదగును.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాశినాథుడు పల్కెనిట్లు నకార భావన తోడ నా
రిప్లయితొలగించండికాశవాణి నిరంతరమ్మును గల్లలే పలుకున్ గదా!
లేశ మైనను నమ్మ కూడదు లేదు సత్యము, గొప్పదా
కాశవాణి చరిత్ర నిల్చు నికార్సు వార్తల పేటిగా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి-
రిప్లయితొలగించండిhttps://youtube.com/shorts/7Al6pVxCrAo?si=2s-YImTCZdfmGmg5
ఆ॥ దేశదేశములిటు తీవ్రయుద్ధముఁ జేయ
రిప్లయితొలగించండిశాంతి యోధులెల్ల బ్రాంతిఁ గనిరి
క్లేశమొంద జనులు కీడు పెంచుఁ గద యా
కాశవాణి సతముఁ గల్లలాడు
మత్త॥ దేశదేశములిట్లు యుద్ధపు తేరు తోలఁగ మూర్ఖతన్
గ్లేశమొందిన శాంతి యోధులు లేశమైనను నమ్మరే!
కేశవా యిది సత్యమందువ కీడు హెచ్చుగఁ బెంచి యా
కాశవాణి నిరంతరమ్మును గల్లలే పలుకున్ గదా
(నేటి యద్ధోన్మాదంలో జరుగుతున్న కీడు గురించి శాంతి కాముకులు ఇలా భావించారని యండి)
ఆ.వె:బొప్పి కట్టు దెబ్బ పుల్వామ లో దిని
రిప్లయితొలగించండిసిగ్గు లేక తామె నెగ్గినట్లు
పాక్ ప్రభుత్వమునకు పరువుకై యచటి యా
కాశవాణి సతముఁ గల్లలాడు”
(పుల్వామా దాడి లో దెబ్బ తిన్న పాకిస్తాన్ మా కేమీ కాలేదు.భారత్ దాడి లో ఒక కాకి చచ్చింది అంటూ జోక్ చేసింది. అక్కడి రేడియో అలాగే మాట్లాడింది. )
సర్వ జనుల హితము సర్వ వేళల గోరి
రిప్లయితొలగించండివార్త సేకరించి వసుధ కొసగి
మేలు గూర్చు నట్టి మేటి దె ట్టుల నా
కాశ వాణి సతము గల్ల లాడు?
మ.కో:దేశ మందున శాంతి యుండిన దృప్తి జెందని యా బ్రిటన్
రిప్లయితొలగించండిదేశ మందలి వార్త లెప్పుడు ద్వేషముల్ రగిలించు నీ
దేశమున్ విడి కూడ
యేదియొ దీర్ఘదృష్టిని వారి యా
కాశవాణి నిరంతరమ్మును గల్లలే పలుకున్ గదా”
(బి బి సి రేడియో భారత్ గూర్చి అబద్ధాలు ప్రచారం చేస్తుంది అని.)
దూషణమ్ముసేయు ధూర్తుల పలుకిది
రిప్లయితొలగించండిసజ్జనులనరు గద సత్యమవని
వాక్యమిదియె గాన వ్యాపింప వలదు - "ఆ
కాశవాణి సతముఁ గల్లలాడు"
ఎండ కాయు నన్న మెండుగ వర్షించు
రిప్లయితొలగించండినబ్బురముగ దేశ మందు నంత
వాన వచ్చు నన్న వరదలు వచ్చు నా
కాశవాణి సతముఁ గల్ల లాడు
లేశ మైనను సత్య మాడదు రిత్త పల్కులు వెక్కసం
బాశ మూరెడు చేత లౌర నిరర్థకమ్ములు నిత్యముం
గాశ దేశము సుప్రసిద్ధము కాదు భారత మందు నా
కాశ వాణి నిరంతరమ్మును గల్లలే పలుకుం గదా
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
సత్య మందజేయు చక్కగా మనకు నా
కాశవాణి సతముఁ; గల్లలాడు
ననుట నిజము కాదు,ఘనముగ నందించు
జరుగు సంగతులను క్షణములోన.