ఉ:వజ్రము వోలె నిష్ఠురము బ్రాహ్మణ భాషయె ,రాజులందునన్ వజ్రము గుండె కాని మృదుభాషయె స్వంతము, వారి మార్చగా వజ్రము వంటి రాజులకె భావ్యము,ఛాందసవిప్రభాషయన్ వజ్రము సంస్కరించిన ద్రవంబుగ మారును లోక పూజ్యమై” ("నిండు మనమ్ము నవ్య నవనీతసమానము" అనే నన్నయ గారి పద్యపు భావం.)
వజ్రి తన యాయుధమయిన
రిప్లయితొలగించండివజ్రను బట్టుకు ప్రఘనుల వధ సలుప జనెన్
వజ్ర తగిలి వడ పుట్టగ
వజ్రము సంస్కారమున ద్రవంబుగ మారున్”
వజ్రమపూర్వమవనిపై
రిప్లయితొలగించండివజ్రమునకు సానబెట్ట వచ్చును వెల్గుల్
వజ్రము ధృఢమైనను వా
గ్వజ్రము సంస్కారమున ద్రవంబుగ మారున్
వజ్రము భూమిలోన గన వచ్చును గాదె విలక్షణంబుగా
వజ్రమపూర్వమేననుచు పల్వురు మెత్తురు మిక్కుటంబుగా
వజ్రము సానబెట్ట పలు వన్నెలు చిమ్ముట చూడనౌను వా
గ్వజ్రము సంస్కరించిన ద్రవంబుగ మారును లోక పూజ్యమై
-
రిప్లయితొలగించండిఅమలిన ప్రేమయె సఖి భ
వ్యమైన కొరముట్టు దొరయ వజ్రము సంస్కా
రమున ద్రవంబుగ మారున్
హము నిండిన మది వలెన్ సుహాసిని సుదతీ
https://youtube.com/shorts/uRlDsXzu9Ko?si=r_ge5Ma1MDIlDvzK
ఉ॥ వజ్రముఁ బోలు నిర్దయను వాల్మికి చూపుచు వేటయందునన్
రిప్లయితొలగించండివజ్రము వంటి బాణమున పక్షినిఁ గూల్చఁగ జోడు పక్షియే
హిజ్రత బాధనొందఁ దన హీనతఁ గాంచి ద్రవించె శిష్టుఁడై
వజ్రము సంస్కరించిన ద్రవంబుగ మారును లోక పూజ్యమై
హిజ్ర వియోగము అన్యదేశ్యమండి (ఉర్దూ)
(మరింక జ్ర ప్రాసాక్షరంగా పదాలు దొరకలేదండి)
ఇక్కడ వజ్రమును వజ్ర కాఠిన్యానికే ఉపయోగించానండి
వజ్రమతని సంకల్పము
రిప్లయితొలగించండివజ్రముకన్నను కఠినము వర్ష్మము గననా
వజ్రఁపు మది కరిగినచో
వజ్రము సంస్కారమున ద్రవంబుగ మారున్
వజ్రమువంటి దీమసము వజ్రము కన్న దృఢంబు లక్ష్యమే
రిప్లయితొలగించండివజ్రసమానమై వరలు వర్ష్మము వానిది యెంచిచూడగా
వజ్రిని గూడ గెల్వగల బల్లిదుడాత డమూల్యమైననా
వజ్రము సంస్కరించిన ద్రవంబుగ మారును లోక పూజ్యమై
కం: వజ్ర మ్మాతని చిత్తము,
రిప్లయితొలగించండివజ్రమ్మే యతని గుండె పరుల యెడల నా
వజ్రమును మార్చె భార్యయె
వజ్రము సంస్కారమున ద్రవంబుగ మారున్”
ఉ:వజ్రము వోలె నిష్ఠురము బ్రాహ్మణ భాషయె ,రాజులందునన్
రిప్లయితొలగించండివజ్రము గుండె కాని మృదుభాషయె స్వంతము, వారి మార్చగా
వజ్రము వంటి రాజులకె భావ్యము,ఛాందసవిప్రభాషయన్
వజ్రము సంస్కరించిన ద్రవంబుగ మారును లోక పూజ్యమై”
("నిండు మనమ్ము నవ్య నవనీతసమానము" అనే నన్నయ గారి పద్యపు భావం.)
వజ్రపు చెడు బావనలను
రిప్లయితొలగించండివజ్రపు మనసున్న భార్య భర్త తలపులన్
వజ్రపు వచనము లనియె డి
వజ్రపు సంస్కార మున ద్రవ ంబు గ మారున్
వజ్రం బొక బొగ్గే యట
రిప్లయితొలగించండివజ్రముఁ బొడి సేసి యంత వారిఁ గలిపినన్
వజ్రి దయ యున్న నెంతటి
వజ్రము సంస్కారమున ద్రవంబుగ మాఱున్
వజ్రికిఁ గల్గ దుఃఖములు స్వర్గము వీడి వసించి యుండె వా
గ్వజ్రము నెల్ల వీడి నిజ గర్వము వీడి ప్రభుత్వ హీనుఁడై
వజ్ర సమాన మానసుఁడు వంతలఁ జిక్కిన మెత్తనౌగదా
వజ్రము సంస్కరించిన ద్రవంబుగ మాఱును లోక పూజ్యమై
వజ్రము వంటిది ధ్యేయము
రిప్లయితొలగించండివజ్రమువలెగొప్ప ఖ్యాతిబడసినదిదియే
వజ్రమువలె రాణించుచు
*వజ్రము సంస్కారమున ద్రవంబుగ మారున్*
వజ్రమువంటిదే ద్విజుని పల్కను మాటయు నిక్కమెప్పుడున్
వజ్రసమానవీరుడనపాలకుడైననుగెల్వలేడిలన్
వజ్రమనస్కుడైననుసువాక్కులతోడనుతానుగెల్చువా
*గ్వజ్రము సంస్కరించిన ద్రవంబుగ మారును లోకపూజ్యమై*