22-6-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము”
(లేదా...)
“మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్”
పగలు శ్రమియించి యలసితి పడక జేరి నిదుర బోయెద మన్నను నీదు గోల యవశ మయ్యెను కాదుటే యంత కన్న నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము.చిత్కళ గొంతునీ విధిని చించుకు గేకలు వేయబోకు మా సత్కృప జూపి నీవికను శాంతి వహింపుమ, చెప్పె నెప్పుడో సత్కవి వాగు వారలట సన్నిధి నుండుట కంటె కాంచగా మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్
కవుల సభకు రేపటి ఉషఃకాలమునకె కవుల జాబితా నక్షర క్రమపు రీతి కూర్చుట కొరకై నిదుర రాకుండుటకయినల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము”
నల్ల వేల్పుకే తప్పదు నల్లిబాధతల్ల డిల్లుట పరిపాటి దైవమయినకల్ల లేర్చికూర్చిన కవి కల్పనయగు'నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము'ఉత్కలికాసమగ్రమగు యోచనలే కవికిన్ సమస్యలౌమత్కుణపూర్ణతల్పమును మచ్చరికించని వారలుందురేసత్కవి సంప్రహాసమున సల్పిన కల్పన కాకపోవునే'మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్'
సత్కవి యైన నన్ను సతి చక్కగ జూచుచు నున్న నింటిలోనత్కుదు నొక్కమూలకును నవ్వక కారణ మెంచి చూడగన్మత్కుణ పూర్ణతల్పమె సుమా సుఖనిద్రనొసంగునెప్పుడున్ఉత్కటమైన భావనము లుప్పెన రీతిగ పొంగు చుండగన్
సత్కవి యైన నన్ను సతి చక్కగ జూచుచు నున్న నింటిలోనత్కుదు రాత్రు లందు విడనాడుదు శయ్యను హేతువెంచగన్మత్కుణ పూర్ణతల్పమె సుమా సుఖనిద్రనొసంగునెప్పుడున్ఉత్కటమైన భావనము లుప్పెన రీతిగ పొంగి పొర్లుచున్
ఉ॥ ఉత్కళ రాష్ట్రమందు జనులుత్సవ రీతినిఁ బేర్మి మీరఁగన్సత్కృతిఁ జేయగాను నను సాదర మొప్పఁగఁ బిల్వ నేఁగఁగన్మత్కుళముల్ కనన్ వసతి మాళిగ యందునఁ దెల్పఁ బల్కిరేమత్కుణ పూర్ణ తల్పమె సుమా సుఖ నిద్ర నొసంగు నెప్పుడున్సత్కృతి సత్కారము వసతి మాళిగ వసతి గృహము (మళిగె కన్నడ భాషలో అధికంగా వాడుతారండి)
తే.గీ:అత్తవారింటి కేగగా నతివినయము జూపి,వద్దన వినకుండ జూపినారునల్లులున్నట్టి మంచమే ,నయము సుమ్మునేల పై చాప పైననే నిదుర బోవ.
ఉ: మత్కృత సత్కవిత్వమును మన్నన జేయక, సంతతమ్ము నన్చీత్కరణమ్ము జేసి, నస చే నిదురింపగనీక, చేసినన్సత్కృతి నెంచ నట్టి పరుషస్వన యౌ సతి తో పరుండుటా?మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్”(సాదించే భార్య పక్కన పడుకోవటం కంటే నల్లుల మంచమే నయం.)
క్రొత్త మంచము కొని దెచ్చి కోర్కె మీర పవ్వ ళీ o చుచు దానిపై పలికె నిట్లు కిర్రు కి ర్రను శబ్ద ముల్ కెరలు చుండె నల్లు లున్నట్టి మంచమే నయము సుమ్మి
సత్కరణమ్ములన్ ధృతిని సల్పుచు క్షేత్రములందు నిత్యమున్ సత్కవితల్ లిఖించుచును సమ్మతి తోడఁ బ్రశస్తి బొందుచున్ సత్కృపఁ జూపుచున్ మెలగు స్వామిని కౌగిలిఁ జెల్గినన్, వినా మత్కుణ పూర్ణ తల్పమె సుమా సుఖ నిద్ర నొసంగు నెప్పుడున్
ఉల్లము లలర నిద్రిల నెల్లవారు చల్ల వలయు సుమమ్ములు సక్కఁగాను వెల్లి విరియ వాసన లట మల్లె లింకనల్లు లున్నట్టి మంచమే నయము సుమ్ము [ఇంకన్ + అల్లులు =ఇంక నల్లులు; అల్లి = అల్లి పువ్వు] సత్కృప నూని యెల్లరకు శయ్యలొసంగ నెడంద నెంచినన్ మత్కృత మైన విన్నపము మన్నన సేయుమ భూత లాధినాథోత్కర మంతకున్ బుధవ రోత్తమ విన్మ సఖా సదా వినా మత్కుణ పూర్ణ తల్పమె సుమా సుఖ నిద్ర నొసంగు నెప్పుడున్
అత్తగారింట్ల పడకపై నయ్యొనాకుకంటికిన్నిద్ర కరువాయె కారణమ్మునల్లులున్నట్టి మంచమే, నయము సుమ్మినేలపైపడు కొనటయే నిమ్మలముగ.
తేటగీతిశయనమున్న వాహనమునన్ సాగ రాత్రిగుంతలమయమై రహదారి కుందఁజేయదక్కదు కద చక్కని నిద్ర! దానికన్ననల్లులున్నట్టి మంచమే నయము సుమ్ముఉత్పలమాలగత్కుల దారిలో న పడకల్ గల వాహనమందు రాత్రిలోయుత్కటమైన కుద్పులకు నోడ్చని మేనుకు నిద్రవచ్చునే?చిత్కి యజీర్తితో నలిగి చేరితి వైద్యుని! దానిమించుచున్మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్
రిప్లయితొలగించండిపగలు శ్రమియించి యలసితి పడక జేరి
నిదుర బోయెద మన్నను నీదు గోల
యవశ మయ్యెను కాదుటే యంత కన్న
నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము.
చిత్కళ గొంతునీ విధిని చించుకు గేకలు వేయబోకు మా
సత్కృప జూపి నీవికను శాంతి వహింపుమ, చెప్పె నెప్పుడో
సత్కవి వాగు వారలట సన్నిధి నుండుట కంటె కాంచగా
మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్
కవుల సభకు రేపటి ఉషఃకాలమునకె
రిప్లయితొలగించండికవుల జాబితా నక్షర క్రమపు రీతి
కూర్చుట కొరకై నిదుర రాకుండుటకయి
నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము”
నల్ల వేల్పుకే తప్పదు నల్లిబాధ
రిప్లయితొలగించండితల్ల డిల్లుట పరిపాటి దైవమయిన
కల్ల లేర్చికూర్చిన కవి కల్పనయగు
'నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము'
ఉత్కలికాసమగ్రమగు యోచనలే కవికిన్ సమస్యలౌ
మత్కుణపూర్ణతల్పమును మచ్చరికించని వారలుందురే
సత్కవి సంప్రహాసమున సల్పిన కల్పన కాకపోవునే
'మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్'
సత్కవి యైన నన్ను సతి చక్కగ జూచుచు నున్న నింటిలో
రిప్లయితొలగించండినత్కుదు నొక్కమూలకును నవ్వక కారణ మెంచి చూడగన్
మత్కుణ పూర్ణతల్పమె సుమా సుఖనిద్రనొసంగునెప్పుడున్
ఉత్కటమైన భావనము లుప్పెన రీతిగ పొంగు చుండగన్
సత్కవి యైన నన్ను సతి చక్కగ జూచుచు నున్న నింటిలో
రిప్లయితొలగించండినత్కుదు రాత్రు లందు విడనాడుదు శయ్యను హేతువెంచగన్
మత్కుణ పూర్ణతల్పమె సుమా సుఖనిద్రనొసంగునెప్పుడున్
ఉత్కటమైన భావనము లుప్పెన రీతిగ పొంగి పొర్లుచున్
ఉ॥ ఉత్కళ రాష్ట్రమందు జనులుత్సవ రీతినిఁ బేర్మి మీరఁగన్
రిప్లయితొలగించండిసత్కృతిఁ జేయగాను నను సాదర మొప్పఁగఁ బిల్వ నేఁగఁగన్
మత్కుళముల్ కనన్ వసతి మాళిగ యందునఁ దెల్పఁ బల్కిరే
మత్కుణ పూర్ణ తల్పమె సుమా సుఖ నిద్ర నొసంగు నెప్పుడున్
సత్కృతి సత్కారము వసతి మాళిగ వసతి గృహము (మళిగె కన్నడ భాషలో అధికంగా వాడుతారండి)
తే.గీ:అత్తవారింటి కేగగా నతివినయము
రిప్లయితొలగించండిజూపి,వద్దన వినకుండ జూపినారు
నల్లులున్నట్టి మంచమే ,నయము సుమ్ము
నేల పై చాప పైననే నిదుర బోవ.
ఉ: మత్కృత సత్కవిత్వమును మన్నన జేయక, సంతతమ్ము నన్
రిప్లయితొలగించండిచీత్కరణమ్ము జేసి, నస చే నిదురింపగనీక, చేసినన్
సత్కృతి నెంచ నట్టి పరుషస్వన యౌ సతి తో పరుండుటా?
మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్”
(సాదించే భార్య పక్కన పడుకోవటం కంటే నల్లుల మంచమే నయం.)
క్రొత్త మంచము కొని దెచ్చి కోర్కె మీర
రిప్లయితొలగించండిపవ్వ ళీ o చుచు దానిపై పలికె నిట్లు
కిర్రు కి ర్రను శబ్ద ముల్ కెరలు చుండె
నల్లు లున్నట్టి మంచమే నయము సుమ్మి
సత్కరణమ్ములన్ ధృతిని సల్పుచు క్షేత్రములందు నిత్యమున్
రిప్లయితొలగించండిసత్కవితల్ లిఖించుచును సమ్మతి తోడఁ బ్రశస్తి బొందుచున్
సత్కృపఁ జూపుచున్ మెలగు స్వామిని కౌగిలిఁ జెల్గినన్, వినా
మత్కుణ పూర్ణ తల్పమె సుమా సుఖ నిద్ర నొసంగు నెప్పుడున్
ఉల్లము లలర నిద్రిల నెల్లవారు
రిప్లయితొలగించండిచల్ల వలయు సుమమ్ములు సక్కఁగాను
వెల్లి విరియ వాసన లట మల్లె లింక
నల్లు లున్నట్టి మంచమే నయము సుమ్ము
[ఇంకన్ + అల్లులు =ఇంక నల్లులు; అల్లి = అల్లి పువ్వు]
సత్కృప నూని యెల్లరకు శయ్యలొసంగ నెడంద నెంచినన్
మత్కృత మైన విన్నపము మన్నన సేయుమ భూత లాధినా
థోత్కర మంతకున్ బుధవ రోత్తమ విన్మ సఖా సదా వినా
మత్కుణ పూర్ణ తల్పమె సుమా సుఖ నిద్ర నొసంగు నెప్పుడున్
అత్తగారింట్ల పడకపై నయ్యొనాకు
రిప్లయితొలగించండికంటికిన్నిద్ర కరువాయె కారణమ్ము
నల్లులున్నట్టి మంచమే, నయము సుమ్మి
నేలపైపడు కొనటయే నిమ్మలముగ.
తేటగీతి
రిప్లయితొలగించండిశయనమున్న వాహనమునన్ సాగ రాత్రి
గుంతలమయమై రహదారి కుందఁజేయ
దక్కదు కద చక్కని నిద్ర! దానికన్న
నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము
ఉత్పలమాల
గత్కుల దారిలో న పడకల్ గల వాహనమందు రాత్రిలో
యుత్కటమైన కుద్పులకు నోడ్చని మేనుకు నిద్రవచ్చునే?
చిత్కి యజీర్తితో నలిగి చేరితి వైద్యుని! దానిమించుచున్
మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్