18, జూన్ 2026, గురువారం

సమస్య - 5502

19-6-2026 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ”

(లేదా...)

“కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా”

14 కామెంట్‌లు:

  1. ఊసులు జెప్పు కొనుటకై
    లేసుగ పలికెడు పదములు రేగుచు నుండన్
    నాసిరకముగ నగుపడెడి
    బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ”

    రిప్లయితొలగించండి
  2. (ఒక కన్నడ భాషాభిమాని తన మిత్రునితో...)
    సుందరమైన కన్నడము సూడఁగఁ బాతది తెల్గు కంటె; నే
    డిందరుఁ బల్కుమాట యది యేదనఁ గస్తురి కన్నడమ్మె; నీ
    కెందుకు సందియమ్ము? వినుటెందుకు వారల వీరి మాటలన్?
    గొందరు భాషలందుఁ దెలుఁగున్ ఘనమందురు - నమ్మబోకుమా!

    రిప్లయితొలగించండి

  3. కాసుల కొరకై వరుణా
    వాసమ్మును దాటి పోవు వైధేయుడు సా
    వాసికి తా జెప్పె నిటుల
    బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ.


    అందరి వోలె మోజుపడి అత్యధికమ్ముగ ప్రాతి భావ్యమున్
    బొందెడి కౌతికమ్మున సముద్రము దాటి విదేశ మేగెడిన్
    మందుడొకండు వాగెనట మద్యము గ్రోలుచు స్నేహి తో నిటుల్
    కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా.

    రిప్లయితొలగించండి
  4. కందం
    మా సము లెవ్వరు లేరని
    మీసముఁ ద్రిప్పుచు పలికె తమిళుడుగరువమై
    గాసిల తెలుగులు గూసెను
    "బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ!"

    ఉత్పలమాల
    ముందుగ పుట్టెనే ముదము పొందగ మా తమిళంపు భాష మీ
    రెందున గొప్పవారనుచు నీర్ష్య మదాంధుడుమీరు గర్వమై
    కుందఁగఁ దెల్గువారలిలఁ గూసెను నోటికి వచ్చురీతిగన్
    కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా!

    రిప్లయితొలగించండి


  5. కొందరు బాసలందు దెలుగున్ ఘనమందురు; నమ్మబోకుమా
    కొందరుకాదుకాదనుచు కుత్సితులైనిజమొప్పుకోక దు
    ర్నిందలుజేయుచుందురిల నేరుగచర్చలుజేయలేరునెం
    దెందరు ఎన్నియున్ బలుక నీ భువిలోతెలుగేఘనంబులే

    రిప్లయితొలగించండి
  6. కం॥
    వ్రాసినదేమో యొక్కటి,
    వాసిగ పలుకంగనేమొ వావిరి యాంక్షల్!
    నాసిగ నిట్టుల గాసిలు
    బాసలలోఁదెలుఁగు ఘనమ? వట్టిదె సుమ్మీ!

    (కొన్ని భాషలలో వ్రాసిన లిపి ప్రకారం ఉచ్చారణ ఉండదు. ఇంగ్లీషులో know లాగా. అలాగే కొన్ని భారతీయ భాషల్లో కూడా ఇదే తంతు. కాని మన తెలుగులోని వర్ణమాల విస్తారమయినది. అంతే కాక వ్రాసిందే నిష్కర్షగా నిర్భయంగా చదవగలం కూడా.
    కాబట్టి అలా "బాధ" పడే భాషలలో తెలుగెలా ఘనమవుతుంది? కాదు కదా !!అని నా పూరణ)

    రిప్లయితొలగించండి
  7. సుందరమైన భాషయని శ్రోతలు పల్కగ ముక్త కంఠలై
    *“కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా”*
    మందమతిన్మొరంకులటుమాటలనాడిన ద్రిప్పిగొట్టుచున్
    సందియమేలరా వినుము చక్కని భాషయనంతెలుంగెరా.

    బాస నెరుంగక యందురు
    బాసలలో తెలుగు ఘనము వట్టిదె సుమ్మీ
    మీసము దువ్వుచు చెపుమా
    బాసలలో మేటియైన భాషతెలుంగే!


    రిప్లయితొలగించండి
  8. వాసిగ దేశము నందున
    భాసిలు సౌందర్యముగల భాష తెలుంగే!
    దోసముతో కూడినవగు
    బాసలలోఁ దెలుఁగు ఘనమ! వట్టిదె సుమ్మీ!


    [ఒక సంస్కృత భాషాభిమాని తన మిత్రునితో....]

    ముందుగ సంస్కృతమ్ముగద మ్రోగినదిచ్చట వేద ఘోషగా
    పొందిక తోడ భాసిలి ప్రపూజితమైనది తల్లిభాషగా
    సందియమేల తానొసగె చక్కని పల్కులు తెల్గు భాషకై
    కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా

    రిప్లయితొలగించండి
  9. సుందరమైన భాష వినసొంపుగ నుండెడు భాష తేనియల్
    చిందుచు నుండు భాష వికసించెడు భాష విలాసమౌచు క
    న్విందులు చేయు భాష కమనీయపు భాష తెనుంగుయే కదా
    కొందరు భాషలందు దెలుగున్ ఘనమందురు, నమ్మబోకుమా
    అంధుల మాటలెప్పుడును అట్టుల కాదని వాదులాడినన్

    రిప్లయితొలగించండి
  10. గాసట బీసట రచనల
    వీ సము మాధుర్య మెందు వెదికిన గన మా
    దోసపు భాష న నుచొ కడు
    భాస లలో తెలుగు ఘనమ? వట్టిదె సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  11. ఉ॥ కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా
    యెందుకనంగ వారిఁ గన నెల్లరుఁ దెల్గును బల్కు వారలే
    పొందుచు జన్మమీ ధరను పొర్లుచుఁ గన్నడ దేశమందునన్
    డెందము వృద్ధిఁగాంచె తగు ఠీవిగఁ గన్నడ నాకు గొప్పదౌ

    (సమస్యను యథాతథంగా సమర్థించాలని ప్రయాస అండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కం॥ బాసల నెనిమిది తడవలు
      బాసటఁ గని జ్ఞాన పీఠ భవ్య సుమమ్మై
      దూసిన కన్నడమె ముదము
      బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ

      (ఒక కన్నడీగుని పలుకులండి)

      తొలగించండి
  12. వాసికి నెక్కె ఘనమ్ముగ
    భాసిలఁ గావ్యమ్ము లెన్నొ భరతావనిలో
    నీసునఁ గొందఱు కా దన
    బాసలలోఁ దెలుఁగు ఘనమ, వట్టిదె సుమ్మీ

    [ఘనమ = ఘనమే]


    దుందుడు కొప్ప వెక్కసము దుష్ట పదమ్ములు వాడ వింతగాఁ
    గుందదె తెన్గు తల్లి యెద ఘోర తరమ్ముగ మున్ను త్రాగి రన్
    చందము నేతులం దమి భృశమ్ముగఁ దాతలు నేఁడు నక్కటా
    కొందఱు బాస లందుఁ దెలుఁగున్ ఘన మందురు నమ్మఁబోకుమా

    రిప్లయితొలగించండి