24-6-2026 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“గగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్”(లేదా...)“మహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
దహరుల చిత్రం బనుచును విహితుడు చెప్ప గననెంచి వెడలగ నందున్ గుహములు పొలమును దున్నగ మహిషము గగనమున సాగెఁ గనుమా వేడ్కన్.మహిమ లవెన్నొగల్గు సినిమా యని చూడ మటంచు నాకు నా విహితుడు చెప్ప ప్రాణ సమ వేడు కొనన్ జని కాంచ నందులో గుహముల గట్టి కర్షకుడు గుడ్డము దున్నుచు నుండగా నటన్ మహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా.
జగతిని తననర్చించుచుస్థగులగు దానవులడిగెడు చనవుల దీర్చన్తిగకంటి తనపయి దరలగగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్
మహిని తనను వేడుకొనెడి కుహనా భక్తులు దనుజుల కోర్కెలు దీర్చన్ మిహిరాణుడెక్కి గమించగమహిషము గగనమున సాగెఁ మదముగ వేడ్కన్
అహరహమా క్రీడలలోవిహరించుచు గాలిపడగఁ విడిచెనతండేవహవా యనదగు దృశ్యముగగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్కహళిని నూదుచుండు మరి గాలిపటాల వినోదమందునన్నహరహమున్ మునింగి నయనమ్ముల ముందర రెచ్చునాతడేమొహరమునందు గాలిపట మొక్కటి విడ్చెను దాని రూపమేమహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా[ కహళి = కొమ్ముబూర; మొహరము = సమూహము ]
కందంసహనము వీడిన శిష్టులునహరహము గొలువ వధించె నంబయె! కలువన్విహితముగ నాత్మరూపునమహిషము గగనమున సాగె గనుమా వేడ్కన్! చంపకమాలసహనము వీడి శిష్టులట శాంతిని బొందగ మాత దుర్గకైయహరహమున్ దపించి కరుణాలయ వేడగ గూల్చె రక్కసున్విహితమనంగ నైక్యమును బేగి గొనంగను నాత్మరూపమైమహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా!
ప్రగతికి మూలంబ నగా జగములు న చ్చె రు వు నంద శాస్త్ర జ్ణ్ణు ల చే సొగస గు ప్రయోగ మ య్య ది గగన మ్ము న మహీ ష మేగె గనుమా వేడ్కన్
కం॥ గగనతల యానము మిగుల సుగమముఁ జేయ మహిషమటు సొగసగు రూపున్ జగతినిడ విమానమునకుగగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్చం॥ మహినిటు వ్యోమయానములు మాన్యులు కూర్చఁగ శాస్త్ర విజ్ఞతన్మహిషపు రూపు నందుఁ గని మక్కువ నచ్చెరువొంది పల్కిరేమహిమలఁ గల్గు దేవతలు మానవ మేధకు సాటి యున్నదేమహిషము వేడ్కతో గగనమార్గమునం జరియుంచెఁ గాంచుమా(నేను శాస్త్ర విద్యార్థినండి)పెద్ద పద్యము వ్రాయడము కన్న చిన్న పద్యములో అదే భావమిడ్చుట కష్టతరమండి
కందంమొగిలు తెరాకృతి జూచినమృగలోచన బల్కెనపుడు మెఱపు వెలుగులన్అగపడె విచిత్ర దృశ్యముగగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఉండవల్లి సెంటరు.మొగిలు తెరాకృతి -మబ్బులవరుస రూపము
విహగమువోలె నాకసఁపు వీధులలో జరియించు మేఘమేబహువిధమైన రూపముల బర్వము జేయుచునుండె నేత్రముల్విహరణ సేయు నంబుదము వింతగ కాసరమట్లు దోచ నామహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా
మొగులును గాంచితి నభముననగుపించెను పలు తెఱఁగుల నాశ్చర్యముగాసొగసుగ కదలుచు ముందుకుగగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్
గగనమునఁ గారుమబ్బు లవిగో కదలఁగ గుమిగూడి వింతగ నవియే యగపడె దున్నల వోలెన్ గగనమ్మున మహిష మేగెఁ గనుమా వేడ్కన్ సహనము నూని యశ్వపతి సంభవ కోరఁగఁ దర్కయుక్తిమై విహితము స్వీయ ధర్మమును వీడి దయార్ద్ర మనస్కుఁడై సరోరుహ ముఖి కిచ్చి తద్వరము రోష విహీనము ధర్ముఁ డుండఁగా మహిషము వేడ్కతో గగన మార్గమునం జరియించెఁ గాంచుమా
ఇహమును వీడిపోవుటకు నిప్పుడు కాలము దాపురించె నీయహమును వీడి శ్రీహరికి ప్రార్థన జేయుము ముక్తి గాంచగామహిపయి నీవు చేసిన యమానుష కృత్యములెన్ని, పాశితో మహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా
విగతుని జేయగ ప్రతివ్రతమగడౌ సత్యవతుని ఘన మహితోన్నతుడౌఖగమువలె జముని దోడ్కొనిగగనమ్మున మహిషమేగె గనుమా వేడ్కన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.గగనమున మేఘమాలికయగుపించెను పలు రకాల యాకారములన్జగమెల్ల చూచు చుండగగగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిదహరుల చిత్రం బనుచును
విహితుడు చెప్ప గననెంచి వెడలగ నందున్
గుహములు పొలమును దున్నగ
మహిషము గగనమున సాగెఁ గనుమా వేడ్కన్.
మహిమ లవెన్నొగల్గు సినిమా యని చూడ మటంచు నాకు నా
విహితుడు చెప్ప ప్రాణ సమ వేడు కొనన్ జని కాంచ నందులో
గుహముల గట్టి కర్షకుడు గుడ్డము దున్నుచు నుండగా నటన్
మహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా.
జగతిని తననర్చించుచు
రిప్లయితొలగించండిస్థగులగు దానవులడిగెడు చనవుల దీర్చన్
తిగకంటి తనపయి దరల
గగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్
మహిని తనను వేడుకొనెడి
రిప్లయితొలగించండికుహనా భక్తులు దనుజుల కోర్కెలు దీర్చన్
మిహిరాణుడెక్కి గమించగ
మహిషము గగనమున సాగెఁ మదముగ వేడ్కన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅహరహమా క్రీడలలో
రిప్లయితొలగించండివిహరించుచు గాలిపడగఁ విడిచెనతండే
వహవా యనదగు దృశ్యము
గగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్
కహళిని నూదుచుండు మరి గాలిపటాల వినోదమందున
న్నహరహమున్ మునింగి నయనమ్ముల ముందర రెచ్చునాతడే
మొహరమునందు గాలిపట మొక్కటి విడ్చెను దాని రూపమే
మహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా
[ కహళి = కొమ్ముబూర; మొహరము = సమూహము ]
కందం
రిప్లయితొలగించండిసహనము వీడిన శిష్టులు
నహరహము గొలువ వధించె నంబయె! కలువన్
విహితముగ నాత్మరూపున
మహిషము గగనమున సాగె గనుమా వేడ్కన్!
చంపకమాల
సహనము వీడి శిష్టులట శాంతిని బొందగ మాత దుర్గకై
యహరహమున్ దపించి కరుణాలయ వేడగ గూల్చె రక్కసున్
విహితమనంగ నైక్యమును బేగి గొనంగను నాత్మరూపమై
మహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా!
ప్రగతికి మూలంబ నగా
రిప్లయితొలగించండిజగములు న చ్చె రు వు నంద శాస్త్ర జ్ణ్ణు ల చే
సొగస గు ప్రయోగ మ య్య ది
గగన మ్ము న మహీ ష మేగె గనుమా వేడ్కన్
కం॥ గగనతల యానము మిగుల
రిప్లయితొలగించండిసుగమముఁ జేయ మహిషమటు సొగసగు రూపున్
జగతినిడ విమానమునకు
గగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్
చం॥ మహినిటు వ్యోమయానములు మాన్యులు కూర్చఁగ శాస్త్ర విజ్ఞతన్
మహిషపు రూపు నందుఁ గని మక్కువ నచ్చెరువొంది పల్కిరే
మహిమలఁ గల్గు దేవతలు మానవ మేధకు సాటి యున్నదే
మహిషము వేడ్కతో గగనమార్గమునం జరియుంచెఁ గాంచుమా
(నేను శాస్త్ర విద్యార్థినండి)
పెద్ద పద్యము వ్రాయడము కన్న చిన్న పద్యములో అదే భావమిడ్చుట కష్టతరమండి
కందం
రిప్లయితొలగించండిమొగిలు తెరాకృతి జూచిన
మృగలోచన బల్కెనపుడు మెఱపు వెలుగులన్
అగపడె విచిత్ర దృశ్యము
గగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
మొగిలు తెరాకృతి -మబ్బులవరుస రూపము
విహగమువోలె నాకసఁపు వీధులలో జరియించు మేఘమే
రిప్లయితొలగించండిబహువిధమైన రూపముల బర్వము జేయుచునుండె నేత్రముల్
విహరణ సేయు నంబుదము వింతగ కాసరమట్లు దోచ నా
మహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా
మొగులును గాంచితి నభమున
రిప్లయితొలగించండినగుపించెను పలు తెఱఁగుల నాశ్చర్యముగా
సొగసుగ కదలుచు ముందుకు
గగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్
గగనమునఁ గారుమబ్బు ల
రిప్లయితొలగించండివిగో కదలఁగ గుమిగూడి వింతగ నవియే
యగపడె దున్నల వోలెన్
గగనమ్మున మహిష మేగెఁ గనుమా వేడ్కన్
సహనము నూని యశ్వపతి సంభవ కోరఁగఁ దర్కయుక్తిమై
విహితము స్వీయ ధర్మమును వీడి దయార్ద్ర మనస్కుఁడై సరో
రుహ ముఖి కిచ్చి తద్వరము రోష విహీనము ధర్ముఁ డుండఁగా
మహిషము వేడ్కతో గగన మార్గమునం జరియించెఁ గాంచుమా
ఇహమును వీడిపోవుటకు నిప్పుడు కాలము దాపురించె నీ
రిప్లయితొలగించండియహమును వీడి శ్రీహరికి ప్రార్థన జేయుము ముక్తి గాంచగా
మహిపయి నీవు చేసిన యమానుష కృత్యములెన్ని, పాశితో
మహిషము వేడ్కతో గగనమార్గమునం జరియించెఁ గాంచుమా
విగతుని జేయగ ప్రతివ్రత
రిప్లయితొలగించండిమగడౌ సత్యవతుని ఘన మహితోన్నతుడౌ
ఖగమువలె జముని దోడ్కొని
గగనమ్మున మహిషమేగె గనుమా వేడ్కన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
గగనమున మేఘమాలిక
యగుపించెను పలు రకాల యాకారములన్
జగమెల్ల చూచు చుండగ
గగనమ్మున మహిషమేగెఁ గనుమా వేడ్కన్.