24, జులై 2012, మంగళవారం

రవీంద్రుని గీతాంజలి - 83

MOTHER, I shall weave a chain of
pearls for thy neck with my tears of
sorrow.

The stars have wrought their anklets
of light to deck thy feet, but mine will
hang upon thy breast.

Wealth and fame come from thee
and it is for thee to give or to withhold
them. But this my sorrow is absolutely
mine own, and when I bring it to thee
as my offering thou rewardest me with
thy grace.


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....


*(తల్లిరో! నేడు నీ పైడిపళ్ళెరమును
స్వీయదుఃఖాశ్రుమాలఁ గైసేతు నేను)
మాతరో! నేడు నా బాష్పమౌక్తికముల
హారముం గ్రుచ్చి నీ గళమందు వైతు ||

చొక్కఁపు రవీందుతారల చెక్కడంపు
వెలుఁగుటందెలు నీ పదంబులఁ జెలంగుఁ,
గాని యీనాడు నీ యెదపైని నాదు
బాష్పమాలిక వ్రేలి శోభలు వెలార్చు ||

ధనము కీర్తియు నీ వీయఁదగినవమ్మ!
యిచ్చెదో! మానుకొనెదొ! నీ యిష్ట మద్ది,
కాని మాయింట నా సొంతమైన సొమ్ము
దుఃఖ మొకటియె పూర్తిగ దొరుకు సుమ్ము ||
*(అచ్చమౌ రతన మ్మిది యరయ దీవ,)
యేను దానిన కానుక యిత్తు నీకుఁ,
బ్రతిఫలంబయి నీ యనుగ్రహము వచ్చు,
*(నెంతయుం దీని కేను గర్వింతు నమ్మ!) ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి