30, జులై 2012, సోమవారం

రవీంద్రుని గీతాంజలి - 89

No more noisy, loud words from me
such is my master's will. Henceforth
I deal in whispers. The speech of my
heart will be carried on in murmurings
of a song.

Men hasten to the King's market.
All the buyers and sellers are there.
But I have my untimely leave in the
middle of the day, in the thick of work.

Let then the flowers come out in my
garden, though it is not their time ;
and let the midday bees strike up their
lazy hum.

Full many an hour have I spent in
the strife of the good and the evil, but
now it is the pleasure of my playmate
of the empty days to draw my heart on
to him ; and I know not why is this
sudden call to what useless incon-
sequence !

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఇదియె నాస్వామి సంకల్ప, మింక కంఠ
మెత్తి బిగ్గరగాఁ బల్క నెప్పుడేని,
మాటలాడెద గుసగుస నేటినుండి,
గీతమందస్వరాలాప రీతితోన
తేటపరచెద మదిలోని మాట లెల్ల ||

రాచయంగడి కెగబ్రాకెఁ బ్రజలగుంపు,
కొనెడువా రమ్మువారును గూడి రచట,
కాని పట్టపగల్ వేళగాని వేళ
వచ్చితిన్ పనిసందడి వదలి నేను,
(ఎఱుఁగఁడో యాతఁ డిప్పుడె యేల పిలిచె?)
పూలు నాయెలదోటలోఁ బూయునిమ్ము,
తుమ్మెదల్ మ్రోయనిమ్ము జుంజుమ్మటంచు,
కాని యవ్వాని కిది యెటుగానివేళ ||

ద్వంద్వములలోని సదసద్విభాగమందె
జీవితపు టెన్నిదినములో చెల్లిపోయె,
కాని మున్ వట్టినాళ్ళ నాతోన యాట
లాడుకొను జంటగాని కీనాడు నాదు
మనసుఁ దనవైపు లాగుకోఁ జనవు పుట్టె,
అనుపయోగఁపు వట్టి యే యాటకోస
మిట్లు చప్పునఁ బిల్చెనో? యే నెఱుంగ ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి