4, డిసెంబర్ 2016, ఆదివారం

సమస్య - 2216 (మూడును నాలుగు గలిసిన...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మూడు నాలుగు గలిపిన ముప్పది కద"
లేదా...
"మూడును నాలుగున్ గలియ ముప్పది యౌఁగద లెక్కఁ జూచినన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

  1. మూడు ముచ్చటగ మన త్రిమూర్తు లయ్యె
    నాలుగు మన విధాత ముఖాలు గావె
    మూడు నాలుగు గలిపిన "ఏడు" పాయె
    మూడు నాలుగు గలిపిన ముప్పది కద!


    మూడు + నాలుగు = ఏడు

    ముప్పు + అది = ముప్పది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'ఏడు పాయె'...?

      తొలగించండి
    2. 'ముప్పది'ని ముప్పు+అది అనడం బాగుంది.

      తొలగించండి
    3. మా చిన్నప్పటి పిల్లల హాస్యం:

      "మూడు, నాలుగు కలిపితే ఎంత?"
      "ఏడు"
      "నువ్వే ఏడు!"

      తొలగించండి


  2. లెక్క లయ్య బెత్తమున జిలేబి నేర్చె,
    చేతుల పదియౌ కాళ్లవి చేర్చను పది
    మొత్తము యిరవై, పైపెచ్చు మూడుకు మరి
    మూడు, నాలుగు గలిపిన ముప్పది కద!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ లెక్క సరిపోయింది. పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. వాయు వందున గల్గు మూడక్షరములు
    అనలమున గలుగును నాలుగక్షరములు
    ముప్పు గద రెండు కలసిన చెప్పనేల?
    మూడు నాలుగు కలసిన ముప్పది కద !
    (ముప్పు + అది = ముప్పది)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      గాలికి అగ్ని తోడైతే ముప్పే కదా! బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  4. త్రిగుణములు మూడు విధములు దివిని చేర
    యారు ముఖముల షణ్ముఖు డవత రించె
    ఏక వింశతి గణపతి యేక మైన
    మూడు నాలుగు గలిసిన ముప్పది కద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ లెక్క కొంత గజిబిజిగా ఉంది. వివరణ అవసరమనుకుంటాను.
      'చేరన్+ఆరు= చేర నారు..' అవుతుంది.

      తొలగించండి
  5. మిత్రులకు విన్నపం...
    మరి కాసేపట్లో అష్టావధానపు టేర్పాట్లలో వ్యస్తుణ్ణవుతాను. సాయంత్రం వరకు బ్లాగు చూడడం వీలు పడదు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేయండి.

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    మూడు రంగుల ముచ్చట మురిపెములవి
    నాల్గు గలిసిన నేడుగానంతమొందు
    యేడు రంగులు దెలుపగు నేమి మాయ?
    మూడునాలుగు గలిపిన ముప్ప దికద!?
    ఏడును యెన్నడెన్నరిటు లేలకొ వచ్చును యారు నొక్కటం
    చాడును నాల్క యేడుపను చాడ్పున నుంటివటోయి సప్తమీ!
    కీడును జూపు యష్టమున గూడును నాలుగు నాల్గు సత్సరిన్
    మూడును నాలుగున్ గలియ ముప్ప దియౌగద లెక్క(న్) జూచినన్

    రిప్లయితొలగించండి
  7. రమ్ము బాలక గణితంపు క్రమము దెలియ
    పదికి పదిజేర్చి యటమీద ముదముతోడ
    నొకటి రెండుల నద్దాని కొప్పగూడి
    మూడు నాలుగు గలిపిన ముప్పది కద.

    చూడిది బాలకా! గణిత సూత్రము చక్కగ నేర్వుమోయి నీ
    వాడుచు పాడుచున్ పదికి హర్షముతో బదిజేర్చి మీదటన్
    కూడగ వచ్చుమొత్తమున కూర్మిగ నొక్కటి రెండుసంఖ్యలున్
    మూడును నాలుగున్ గలియ ముప్పదియౌ గద లెక్కజూచినన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఏడు నెనిమిది తోడను హెచ్చవేసి
    మఱియు రెండుతో విడదీసి వఱలు నట్టి
    దాని నందున నైదును తగ్గ జేసి
    మూడు నాలుగు గలిపిన ముప్పది కద.

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మూడు నైన సత్త్వ రజ తమో గుణములు
    కనగ ధర్మార్ధ కామ మోక్షములు నాల్గు
    మూడు నాలుగు గలిపిన ముప్పది కద
    ననక ననువుగ వాటిని నడపు మోయి.

    రిప్లయితొలగించండి
  10. ఆర్యు లారవి నుడుమీ ర లగును నేడు
    మూడు నాలుగు గలిపిన, ముప్పది కద
    మూడు పదులను గలుపగ ముచ్చటగ ను
    నెక్కములపుస్త కమ్మును జక్క జదువ
    లెక్క లన్నియు వచ్చును మిక్కుటముగ

    రిప్లయితొలగించండి
  11. అన్నమందరికి సరిపో కున్న చేటు
    మూడు, నాలుగు కలిపిన ముప్పదికద!
    వంటచేయి మూడుపదుల ప్రతినిధులకు
    చాల గొడవ జరుగు వంట చాలకున్న

    రిప్లయితొలగించండి
  12. ముప్పు యొకచోట మూడుగా కొప్పులున్న
    ముప్పు దుష్ట చతుష్టయమ్మొకటిగాగ
    చెప్ప ముమ్మాటికిని విను ముప్పుముప్పు
    మూడు నాలుగు గలిపిన ముప్పది కద.

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. కఱకుఁ బలుకైన ముదితుఁడె కన్న తండ్రి
      తనదు ప్రశ్నకు నీయ నుత్తరము విదిత
      మెల్లరకుఁ బదమూడున కింపుగఁ బద
      మూడు నాలుగు గలిపిన ముప్పది కద


      దాడులు సేయు ఘోరగతి దౌష్ట్య గుణమ్ములు మానవాళిపై
      వీడక క్రోధ మోహములు విస్తృత లోభ గుణాత్త చిత్తులై
      యోడగ నీషణేంద్రియము లుర్వి జనాశ్రిత దోషకారకుల్
      మూడును నాలుగున్గలియ ముప్పది యౌఁగద లెక్కఁ జూచినన్

      [ముప్పు+ అది = ముప్పది ; ఈషణత్రయము(దారేషణము, విత్తేషణము, పుత్రేషణము), అంతఃకరణ చతుష్టయము (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము)]

      తొలగించండి
  14. ఏడగు నార్యవింటివిగ నెవ్విధ మున్మఱి కూడినన్సుమా
    మూడును నాలుగున్ గలియ,ముప్పది యూ గదలెక్క జూచిన
    న్నేడును గల్పగా నిటను నిర్వది మూడున కిప్పుడీ తరి
    న్వాడును వీ డు ను న్ననక పామరు డైనను జెప్పుదీని నిన్

    రిప్లయితొలగించండి
  15. మూడు నాలుగు గలిపిన ముప్పది కద?
    కాదు కాదంచు మాష్టారు కన్నులురిమె
    పోను బడికంచు నేడ్వగ కూన, తప్పు
    లెల్ల దిద్ద మెచ్చు ననుచు తల్లి పలికె

    రిప్లయితొలగించండి
  16. కూడుటచేతకాదనుచు కొట్టుచు తిట్టెను పంతులిట్టులన్
    "గాడిదవంచు తిట్టినచొ గాడిదకే యవమానమౌనురా
    యాడుచు పాడుచున్ చదువనాచదువిట్టులె యెక్కు బుర్రకున్
    మూడును నాలుగున్ గలియ ముప్పది యౌఁగద లెక్కఁ జూచినన్"

    రిప్లయితొలగించండి
  17. కామము వలన పానము, స్త్రీ, మృగయయు
    ద్యూతములను నాల్గింటికి తోడుగాను
    పారుషమ్ములు మూడును జేరినంత
    మూడు నాలుగు గలిపిన ముప్పది కద

    కూడిక తీసివేతలను కొత్తగ నేర్చిన బాలురిద్దరున్
    గూడిరి చేతకాగితము కొత్తకలమ్మును బట్టి చేసిరే
    యేడున రెండు దీసిపదిహేడును గూడిరి కల్పిరొక్కటిన్
    మూడును నాలుగున్ గలియ ముప్పది యౌఁగద లెక్కఁ జూచినన్

    రిప్లయితొలగించండి
  18. ఒకటి రెండుతో కూడగ నొక్క పదియు
    రెండు మూడుతో యగునేని రెండు పదులు
    మూడు నాలుగు కలిపిన ముప్పది కద!
    అంక గణిత మెఱుగనిదీ సంకలనము!
    (1+2 =10 మఱియు 2+3 =20 అయితే 3+4 =30 అవుతుంది కదా! ఇది అంక గణితాని కందని కూడిక .........కేవలం హేతు బద్ధతకు మాత్రమే దొరుకుతుందని నా భావన.)

    రిప్లయితొలగించండి
  19. ధనము,బలము,మదము,దొరతనము లందు
    నొక్క టైనను ధూర్తుల కున్న కీడు
    మూడు,నాలుగు కలిపిన ముప్పది కద
    తరచి జూడగ శాంతి భద్రతలకిలను

    రిప్లయితొలగించండి
  20. ఒకటి,రెండు నింగియు భూమియు ననుకొన్న

    వాయువును మూడు,నాలుగవది యనలము

    ఐదగు జలము; పంచ భూతాల యందు

    మూడు, నాలుగు కలిపిన ముప్పది గద.

    ( ముప్పు+అది=ముప్పది )

    రిప్లయితొలగించండి
  21. అవధాానము

    శంకరాభరణమునదిగ్గజమ్ములైన కందిశంకరయ్యమరియుకవివరేణ్యు డైనమధుసూదనుండునునరుగుకతన దిగ్విజయమగుగావుత!దేవిదయను

    రిప్లయితొలగించండి
  22. కూడి కొసగెను గురువొకక్రొత్తలెక్క
    శిష్య గణమునకుంచగ చిన్నిదనగ
    “రెండు పదులకు నొక్కటిరెండు మరియు
    మూడు నాలుగు గలిపిన?ముప్పదికద {యనిరి}
    2.కూడిక వచ్చునాన్నయన ?కోరిక చేనొకలెక్క జెప్పెగా
    ఏడుకు తొమ్మిదుంచి పదిహేనునుజేర్చగ వచ్చుదానికే
    మూడును,నాలుగున్ గలియ?”ముప్పదియౌగద లెక్కజూచినన్
    పాడుచు బల్కె బిడ్డ తనపంతము నెగ్గినదన్నచందమున్”|

    రిప్లయితొలగించండి
  23. మూడు నాలుగు గలిపిన యేడగుగద !
    ముప్పు దెట్టుల నగునని మూల్గుచుండి
    ముప్పు దేడున యేడునుముంచ నీట
    "మూడు నాలుగు గలిపిన ముప్పది కద"

    రిప్లయితొలగించండి
  24. నెలకు ముప్పది తిథులౌను నెలత వినుము
    బహుళమున నష్టమికి నిరువదియు మూడు
    నవమి దశమి యేకాదశుల్ నాల్గు పైన
    మూడు నాలుగు గలిపిన ముప్పది కద.

    రిప్లయితొలగించండి
  25. మగువ మద్యము వేటయు మానకున్న
    కఠిన శిక్షలు వాక్కున గట్టిదనము
    జూదము ధన వ్యయంబును జూడధరను
    మూడు నాలుగు గలిపిన 'ముప్పది'కద.

    ఒకటికి నొకటి యొక్కటి యుత్సుకతను
    మూడు మూళ్ళకు నొకటియు ముచ్చటగను
    నైదుకాదరమున మరి యైదు చేర్చి
    మూడు నాలుగు గలిపిన ముప్పది కద.

    రిప్లయితొలగించండి