3, డిసెంబర్ 2016, శనివారం

సమస్య - 2215 (వర సురలోక మేగుదురు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వరసుర లోక మేగుదురు వారక చేసినఁ బాప కృత్యముల్"
లేదా...
"స్వర్గలోక మేగెదరఁట పాపులెల్ల"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు!

40 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. పొట్ట చుట్టు బాంబుల బెల్టు కట్టి బెట్టి
      చేత గన్ను బట్టి ముసుగు మూత చుట్టి
      చంపి జనుల బిదప తాము చచ్చి, వీరు
      స్వర్గలోక మేగెదరఁట పాపులెల్ల!

      తొలగించండి

  2. స్వర్గలోక మేగెదరఁట పాపులెల్ల
    మొట్ట మొదట యుచితముగా మోజు తీర,
    కొంత సేదదీర నటుపై కోసు దూర
    మున నరకము జేరుదురోయి ముద్దు గాన :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. దైవ చింతన మందున తనరి పోవ
    స్వర్గలోక మేగెదరఁట , పాపు లెల్ల
    వైతరణిని దాట వెసల కతన యనగ
    నరక మందున శరణట రౌర వమ్ము

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    ముప్పుతిప్పల బ్రజనీడ్చి మొట్ట మొదట
    స్వర్గ లోక మేగెదరట పాపులెల్ల
    పిదప నరక యాతననంద భీరులట్లు;
    పుణ్యులాకష్టముల దీర్చి పోరె పిదప?
    వరుసను ధర్మరాజు గనె వారెవరాయన వారి తమ్ములే
    నరకమునందు గుందగను ;నాటి చతుష్టయమందె నాకమున్;
    స్థిరసుఖమంద నారకమె దీర్తురు ముందర పుణ్యపూరుషుల్
    వర సురలోకమేగుదురు వారక జేసిన బాపకృత్యముల్

    రిప్లయితొలగించండి
  5. కరుణయు, ధర్మచింతనము, కమ్మని మాటలు, వర్తనంబునన్
    సరసత లేని రాక్షసుల శాసనమందున వ్యంగ్యరీతిలో
    నరయుడు కొందరిట్లనెద రానరనాథుని జేరి మ్రొక్కి భూ
    వర! సురలోకమేగుదురు వారక చేసిన బాపకృత్యముల్.

    పరమ పావనమైనట్టి సురనది గని
    “గంగ! గంగా యటంచును ఘనతబొగిడి
    స్నానమును జేయ వింటిరె దాని మహిమ
    స్వర్గలోక మేగెదరట పాపులెల్ల.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  6. పుణ్య కర్మల ఫలితముఁ బొందు కొరకు
    స్వర్గలోక మేగెదరఁట పాపు లెల్ల
    పిదప నరకలోకపు బాధలొదవు సుమ్మ
    చెందు పాపపు పరిహార మందుకొనగ

    రిప్లయితొలగించండి
  7. పాపకర్మలనేజేసి పాపభీతి
    గలిగి తదుపరి పరమాత్మ కాళ్ళబడుచు
    మంచిమార్గమునేద్రొక్కి మారిపోగ
    స్వర్గలోక మేగెదరఁట పాపు లెల్ల

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నిచ్చలు పరమాత్మది కీర్తి నెంచు చుండి
    నందరా హరి రూప మనంగ నుండ
    స్వర్గలోక మేగెదరట; పాపులెల్ల
    నరకలోక మేగి సరవి నమరుదురట.

    కలియుగము నందు హరినామ ఘన భజనల
    రూపు జెందుచు ననయము రోతబెట్టు
    చేష్ఠలెల్ల ధ్వంస మొనర్చి చెన్ను నమర
    స్వర్గలోక మేగెదరట పాపులెల్ల

    రిప్లయితొలగించండి
  9. స్వర్గ లోక మేగె దరట పాపు లెల్ల
    రైన పుణ్యాత్ము లందఱు నరుగ వలెను
    నరక లోకమునకు మఱి న్యాయ మదియ
    కారణంబరయగబాపి గణము దివిని
    నాక్ర మించుట మూలాన నట్లు జరుగు

    రిప్లయితొలగించండి
  10. సురవర లోక మేగుదురు శుద్ధ చరిత్రులు దైవ చింతనా
    పరవశ చిత్త మానవులు భక్త శిఖామణు లెల్ల రిద్ధరం
    దరతమ భేద హీన సమ దర్శన భాసిత దివ్య దక్షిణా
    వరసుర లోక మేగుదురు వారక చేసినఁ బాప కృత్యముల్

    [దక్షిణా వరసుర లోకము = యమలోకము]


    విష్ణు లీల లెఱుఁగ గల విబుధు లేరి
    కుమిలి మరణావసాన మగు సమయమ్ము
    న మది నారాయణస్మరణ మహిమ నిక
    స్వర్గలోక మేగెదరఁట పాపులెల్ల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజ్ఞులు కవివర్యులు కామేశ్వర రావు గారు:

      నన్నొక చిన్న విషయము వేధించుచున్నది..."స్వర్గ" లోని "స్వ" కు ముందుగా వచ్చిన "క" గురువై గణదోషము అవదు కదా! క్షమించండి...నా "వ్యాకరణ జ్ఞానము" మీకు తెలియనిది కాదు!

      తొలగించండి
    2. శాస్త్రి గారు మంచి సందేహము. ఇక తెలుగు పదమగుటచే స్వ వలన దాని ముందటి యక్షరము క గురువు కాదు.అదే ఘన స్వర్గ అనియున్న న గురువే. ఘన సంస్కృత పదము కనుక. పూర్వము నాకు వచ్చిన సందేహమే యిప్పుడు మీకు వచ్చినది.

      తొలగించండి
    3. నీనీ రోజు "వీర స్వర్గ" అన్నాను. గణ దోషం అవుతుందేమో కదా!

      తొలగించండి
    4. 7) సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. ఒక హల్లుకు మరొక హల్లు వత్తుగా వచ్చినప్పుడు అది సంయుక్తాక్షరం. ‘చక్రి’ లో ‘క్రి’ సంయుక్తాక్షరం. ఈ పదాన్ని మనం చక్-రి అన్న విధంగా పలుకుతాము. పొల్లు అక్షరం కారణంగా ‘చక్’ గురువవుతుంది. కనుక ‘చక్రి’లోని ‘చ’ గురువు. అలాగే అగ్ని, సత్య, విద్య, శిల్పి, కర్మ, హర్ష మొదలైన పదాలలో ముందున్న అక్షరాలు గురువులు. అక్షరమాలలోని ‘క్ష’ సంయుక్తాక్షరమే. కనుక ‘పక్షి’ అన్నపుడు ‘ప’ గురువే. కొందరు కృ, మృ మొదలైన ఋత్వం ఉన్న అక్షరాలను సంయుక్తాక్షరాలుగా పొరబడి దాని ముందున్న అక్షరాన్ని గురువుగా భావిస్తారు. కాని ఋత్వం హల్లు కాదు, అచ్చు. క్+అ=క అయినట్లు క్+ఋ=కృ అవుతుంది. కనుక ‘వికృతి, అమృతము’ మొదలైన చోట్ల వి, అ గురువులు కావు.
      గమనిక :- ‘అతఁడు త్యాగమూర్తి’ అన్నచోట ‘త్యా’ అనే సంయుక్తాక్షరం ముందున్న ‘డు’ గురువు కాదు. ఎందుకంటే అతఁడు అనేది తెలుగు పదం. దాని తర్వాత ఉన్న ‘త్యా’ అనే అక్షరం ‘డు’ పైన ఒత్తిడి తీసుకురాదు. అతఁడుత్-యాగమూర్తి అని పలుకము. కేవలం ఊనిక లేకుండా అతఁడు-త్యాగమూర్తి అంటాం. కనుక ‘డు’ లఘువే. తెలుగు పదాల తర్వాత సంయుక్తాక్షరం ఉన్నా ఆ తెలుగు పదం చివరి అక్షరం గురువు కాదని గమనించండి. ‘సూర్యజ్యోతి’ అన్నపుడు సూర్య, జ్యోతి అనే రెండు పదాలు సమాసంగా ఏర్పడం వల్ల ‘ర్య’ గురువు. ‘సూర్యుని జ్యోతి’ అన్నపుడు ‘సూర్యుని’ అనేది తెలుగు పదమయింది. కనుక అక్కడి ‘ని’ గురువు కాదు.

      తొలగించండి
    5. "వీర స్వర్గ" ను తొలగించి, "వీరు స్వర్గ" గా మార్చాను. సరియా?

      తొలగించండి
  11. పాపములఁ జేయ నరకంపు ప్రాప్తి!గతము,
    ప్రస్తుతమ్మున జీవుల పాప కర్మ
    మరణమునకు మునుపె చూప నరకబాధ!
    స్వర్గలోక మేగెదరఁట పాపులెల్ల

    రిప్లయితొలగించండి
  12. ఇరవుగ జేయ పుణ్యము లునేపున హాయిగ నెల్లవారునున్
    వరసురలోక మేగుదురు ,వారక చేసిన పాపకృత్యము
    ల్లరయగ బాపు లౌదురట,యా రడి వెట్టిన సాటి వారల
    నిరతము బోదురయ్యెడను నేరుగగాలుని యొద్దకున్గదా

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వర సురలోక మేగుదురు వారక జేసిన బాప కృత్యముల్
    స్మరణము జేసి పాపులిట మైవడి గూడి సునీతమొందుచు
    న్నిరతము హరి నామముల నెంచుచు నొమ్మిక దోడ వాటుగా
    పరులకు చందు జేసెడి సపర్యల వల్ల ననంగ నమ్ముమీ!

    రిప్లయితొలగించండి
  14. మర్త్య లోకాన మంచిగా మసలి,పెక్కు

    పుణ్య కార్యముల్ జేసిన భూరి జనులు

    స్వర్గ లోకమేగెదరట; పాపులెల్ల

    నరక లోకాన యాతన ననుభవింత్రు.

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పరమ పవిత్రులై హరుని భావన జేయుచు నుండు భక్తులు
    న్నొరవున తాము ధర్మగుణ నోజను గూడి చరించు నప్పుడున్
    వర సురలోక మేగుదురు; వారక జేసిన పాప కృత్యముల్
    స్మరణము జేసి మారవలె సడ్డలు తామును నాకమొందగన్.

    రిప్లయితొలగించండి
  16. దివ్య భావనా బలమందు తిమిర మడచి
    పరుల సేమము నరయుచు బరగు వారు
    స్వర్గలోక మేగెదరట; పాపు లెల్ల
    చేరెదరని యందురుగద రౌరవమ్ము!

    రిప్లయితొలగించండి
  17. స్మరణ మొనర్చ నామ మవసానము నందు నజామిళు౦డు ను
    ద్ధరణము నొందడే,యఘవితానము జేసిన గాని నీ భువిన్,
    మరణము నొందు వేళ పరమాత్మగు శ్రీహరి నే దలంచ భూ
    వర! సురలోక మేగుదురు వారక జేసిన బాప కృత్యముల్

    రిప్లయితొలగించండి
  18. అమృతమే పుణ్యులకు సదా యనుచు జేరు
    స్వర్గలోకమే, గెదరఁట పాపులెల్ల
    తాము తినురు, మసలుచున్న తైలమందు
    మునుగురని పేర్కొనెనట బైబులు నిజముగ ||

    రిప్లయితొలగించండి
  19. నిరతము దైవచింతనయు, నిష్ఠను బూనిన వర్తనంబుతో
    సరసవచస్సుధావిభవశక్తిని బూనుచు సత్త్వయుక్తవై
    స్థిరగుణవౌచు సంఘమున శ్రేయము గల్గెడు రీతినిత్యమున్
    వరసురలోకమే గుదురు వారక చేసిన బాప! కృత్యముల్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  20. స్వర్గలోకమేగెదరట పాపు లెల్ల
    రనెడి మాటలెపుడు సత్య మవగ బోవు
    పాప చింతన యున్నట్టి వార కెల్ల
    వాస మాఖరున నరక వాస మేను.

    మంచి పనులు చేసెడు మనుజు లెల్ల
    స్వర్గ లోకమేగెదరట :పాపులెల్ల
    దురితము లనొన రించుచు నరకమునకు
    నేగుదు రిది నిజమటంచు నిలను నమ్ము.

    రిప్లయితొలగించండి
  21. వరమగు|జన్మసార్థకత భారతదేశపు సైనికోత్తముల్
    మరణము|”శత్రుముట్టడిని మానగ నాపుచురక్షగూర్చగా?
    వరసురలోకమేగుదురు”|”వారకచేసిన బాపకృత్యముల్
    తరచుగ లెక్కజూపుటచె దండనబంచును చిత్రగుప్తుడే”.
    2.మంచిబెంచెడి మార్గాన మానవతగ
    నీతి నియమాన బెరుగగా? జాతి ప్రజలు
    స్వర్గ లోక మేగుదురట|”పాపులేల్ల
    నరకయాతన బడెదరు నమ్ముమెపుడు


    రిప్లయితొలగించండి
  22. తరతమ భేదమెంచక క్షుధానల దగ్ద నిరాశ్రయుండ్రనన్
    కరుణను జూపు సత్పథులెగౌరవ మొందుచు నంత్యమందునన్
    వరసుర లోక మేగుదురు వారక చేసినఁ బాప కృత్యముల్
    వెరువక సల్పినన్ నరక వేదన తప్పదనందురీ భువిన్



    ధర్మమార్గమున్ వీడక దాన మిడుచు
    పుణ్యకార్యార్థులన సత్పురుషులెపుడు

    స్వర్గలోక మేగెదరఁట, పాపులెల్ల
    నరకమూనకు సదా తరలు చుంద్రు

    రిప్లయితొలగించండి
  23. పుణ్య కార్యార్థు లైైన సత్పురుషులెపుడు

    రిప్లయితొలగించండి
  24. తీర్థ స్నానాల పాపాలు తీఱి పోవ
    స్వర్గ లోక మేగెదరట పాపులెల్ల
    రనెడి మాట లసత్యము లన్న లార!
    చెఱుపు జేయ ఫలిత మెటు చెఱుప నగును!

    రిప్లయితొలగించండి
  25. మరణము సంభవించునను మర్మమెఱంగియు మానవుల్ సదా
    తరగని నల్ల డబ్బులను తామొనగూర్చిరనేక రీతులన్
    శరణము లేదు వారలకు ,సత్యము రోగపు పీడ చేత చా
    వ ,రసుర లోక మేగుదురు వారక చేసినఁ బాప కృత్యముల్

    రిప్లయితొలగించండి


  26. శ్రీగురుభ్యోనమః

    కురువరుడా సుయోధనుడు కొండొకొ పుణ్య మదేమి జేసెనో
    మురియుచు నుండె స్వర్గమున ముఖ్య యనుంగుల తోడి నవ్వుచు
    న్నరయగ కొంత కాలమటు లబ్బును పుణ్య ఫలలంబు లేశమై
    వరసుర లోక మేగుదురు వారక చేసినఁ బాప కృత్యముల్

    రిప్లయితొలగించండి
  27. పాపముల్ చేసిన నరులు పాప పంకి
    లమున బడి తదుపరి పుణ్య లక్షణాల
    తోడ చేసిన పుణ్యము తోనె వారు
    స్వర్గలోక మేగెదరఁట పాపులెల్ల

    రిప్లయితొలగించండి
  28. కరమగు ప్రీతి తోడుతను కంజదళాక్షుని పూజచేయుచున్
    స్థిరముగ పేద సాదలకు సేవలుచేసి తరించు వారలే
    వరసుర లోక మేగుదురు, వారక చేసినఁ బాపకృత్యముల్
    తరుముచునుండ సంతతము తప్పునె కాలుని లోక ఖేదముల్?

    రిప్లయితొలగించండి
  29. కవిమిత్రులకు నమస్కృతులు.
    రేపటి అష్టావధానపు టేర్పాట్లలో వ్యస్తుణ్ణై ఉండి మీ పూరణలను చూడలేకపోయాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  30. కరవగ జాతి వైరములు కన్నులు మూయగ నుగ్రవాదముల్
    మరచుచు మానవత్వమును మాయను జేర జిహాది దండులన్
    బిరబిర పేల్చి బాంబులను బింక ము తోడను చంపి చావగా
    వరసుర లోక మేగుదురు వారక చేసినఁ బాప కృత్యముల్!!!

    రిప్లయితొలగించండి