24-1-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్”(లేదా...)“చెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై”(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ప్రదీప్ గారి సమస్య)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చల్లగ నుండక, మగనికినిల్లాలును పెట్టె పోరు చీరల కొరకైమెల్లగ "నీదగు తగవుకుచెల్ల"ని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్చెల్లు + అని= చెల్లని
మీ పూరణ బాగున్నది అభినందనలు
కందంఅల్లరి జేసెడి మరదలిపిల్లను బెండ్లాడ ,గోల పెట్టుచు కోరెన్ఉల్లి పొరకోక, అమ్మకచెల్లని, రూకనిడి మగడు చీరన్ దెచ్చెన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
కల్లలు గాదిది ప్రియతమచల్లని హృదయ o బు తోడ చనువు గ నుందు న్దల్లడ మందకు తగవుకుచెల్లని ' రూకల నిడి మగడు చీరన్ దెచ్చె న్
మీ పూరణ బాగున్నది అభినందనలుకల్లలు గావివి
కందంకొల్లగ బంగరు నాణెములల్లనఁ ద్రవ్విన పునాదులందున జిక్కన్వెల్లువగ విత్తమందుచుచెల్లని రూకనిడి, మగడు చీరను దెచ్చెన్ఉత్పలమాలకొల్లగ పైఁడి నాణెములు గూడ పునాదులు ద్రవ్వినంత తానుల్లము నందు సంతసమునుప్పెన రీతినగాంచి మార్పిడిన్వెల్లువలై ధనంబొదవ ప్రేమను రంజిలఁజేయనెంచుచున్జెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై
గురుదేవులకు వందనములు. వృత్తము రెండవ పాదములో 'రీతిని' అని సవరణ.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
కల్లతనమున విపణికడచెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్నెల్లరకు జెప్పి యాదినమెల్ల గడిపె నాపడతుక మిక్కిలి గరిమన్
మెల్లగ నేగి కొట్టునకు మీనపు కన్నుల యింటిదానకైబల్లల మీదనున్న యొక ప్రక్కన వేసినకోక గాంచి తానల్లన తాకి చూచి ధర యడ్గి కొనెన్ పిసినారి యేరికిన్చెల్లని, రూకతో మగడు చీరను దెచ్చెను భార్య కోసమై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు...యింటిదానికై
తెల్లని ధోవతి నిచ్చుచుపల్లదురాలగు బసాలు వలిపమడుగగా నొల్లియకు పంచె చెల్లుకుచెల్లని, రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్.
తెల్లని పట్టుధోవతిని తెచ్చితి నీకొరకంచు జెప్పుచున్ పల్లదురాలు మఱ్ఱెతయె పట్టు వరాసిని గోరి నిత్యమావల్లభ పోరుపెట్టగ నిక పంచెకు చీరయె యౌను చెల్లుకున్ జెల్లని, రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై.
ఎల్లలులేని కిన్క తనువెల్ల దహింప నిరస్త భూషయైప్రల్లదనంబునన్ జెలఁగు భార్యకు సాంత్వన గూర్చనెంచి తామెల్లగ చెంతజేరి యెలమిన్ తన కౌగిటఁజేర్చి కిన్కకున్చెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
చెల్లవన రాదు కాలముచెల్లిన రూకలు విలవనుఁ జెప్ప నధికమేచెల్లగఁ జేసి కులసతికిచెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్చివుకుల అచ్యుత దేవరాయలు
చల్లని సాయంకాలముమల్లెలు విరబూయువేళ మానిని సరసన్మెల్లగజేరి యలుకకున్చెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్
పిల్లలు పొదుపున కూర్చినచిల్లర నాణెముల తోడ చెల్లింపులతోచిల్లర వర్తక ఋణమికచెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్
చెల్లియొ చెల్లకో మగడు చేసిన యప్పును చెల్లుసేయగాపిల్లలు దాచుకొన్నదగు విత్తమునంతయు కూడబెట్టి యాచిల్లర నాణెముల్ మగని చేతుల నుంచ భళా ఋణంబికన్జెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు
ఉ.మెల్లగ మందహాసమున మెచ్చెను భోజుడు కాళిదాసునిన్వల్లము నింపె, నాణ్యమగు బంగరు రూకలు నొక్కదానినిన్ భిల్లునికిచ్చె దానముగ బ్రీతిని, సొట్టను గుర్తుపట్టకన్ *చెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై*.
చెల్లని వస్తువేదియును సృష్టిని లేదనిఁ బల్కినంతటన్చెల్లని రూకనున్ విసరి చెల్లగఁ జేయమనంగ భార్యయున్ చెల్లుబడెయ్యె వీలుగను చెల్లిన కాలపు రూకవంగనున్చెల్లని రూకతో మగఁడు చీరనుఁ దెచ్చెను భార్యకోసమైచివుకుల అచ్యుత దేవరాయలు
ధన్యవాదాలు
కం:గొల్లున తగవుల బడి, తనయుల్లమ్మున ప్రేమ పొంగ "నోసీ యింకన్మల్లెలు కొను,తగవుల కిక చె ల్లని రూక నిడి, మగడు చీరన్ దెచ్చెన్(తగవుల కిక+చెల్లు+అని మల్లె పూల కోసం రూపాయి ఇచ్చాడు.రూపాయికి మల్లె పూలు ఇప్పుడు రావు కానీ పూర్వం వచ్చేవి.)
చక్కని పూరణ. అభినందనలు
ఉ:పిల్లలు రూక లిమ్మనుచు వేడగ ,భార్యయు చీర కోరగా"పిల్లల కేల రూక?"లని,వింతగ నచ్చపు రూక వోలె భాసిల్లెడు నాట రూక నిడి చేయుచు గారము పిల్లవాండ్ర , నాచెల్లని రూకతో , మగడు చీరను దెచ్చెను భార్య కోసమై(పిల్లలకి చెల్లని ఆట రూపాయి ఇచ్చి,భార్యకి చీర కొన్నాడు.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. ౕ. అభినందనలు
మెల్లగదరిచేరినసతి తెల్లనికోకయు వలెననితెలుపగపతితో చెల్లించి ధనము ఋణమిక చెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్”*మెల్లగదరిచేరినసతి తెల్లనికోకయు వలెననితెలుపగపతితో చెల్లించి ధనము ఋణమిక చెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్”*
మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు
పిన్నక నాగేశ్వరరావు.చిల్లి పడినట్టి నోటునుమెల్లగ పలు నోట్లమధ్య మిళితమొనర్చెన్ చల్లగ దుకాణమందునచెల్లని నోటునిడి మగడు చీరన్ దెచ్చెన్.
కల్లయె యుంట కనఁబడని ముల్లులు పురుషాధము లిట మును ముందుగఁ దానుల్లమున నెఱిఁగి యెల్లినిఁ జెల్లని రూక నిడి మగఁడు చీరన్ దెచ్చెన్తల్లడిలంగ దార వర తారలు గట్టిన చీర లంతఁ దానుల్లము నందు వీక్షణము నొప్పుగఁ జేసి యొసంగ నాజ్ఞనే చల్లగ నూఱడిల్లుమ విశాల విలోచన! చెల్ల దింక నీ చె ల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై [చెల్లు= కొనసాగు (క్రియ); చెల్లు = చెల్లుబడి, అధికారము, (విశేష్యము)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచల్లగ నుండక, మగనికి
రిప్లయితొలగించండినిల్లాలును పెట్టె పోరు చీరల కొరకై
మెల్లగ "నీదగు తగవుకు
చెల్ల"ని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్
చెల్లు + అని= చెల్లని
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండికందం
రిప్లయితొలగించండిఅల్లరి జేసెడి మరదలి
పిల్లను బెండ్లాడ ,గోల పెట్టుచు కోరెన్
ఉల్లి పొరకోక, అమ్మక
చెల్లని, రూకనిడి మగడు చీరన్ దెచ్చెన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండికల్లలు గాదిది ప్రియతమ
రిప్లయితొలగించండిచల్లని హృదయ o బు తోడ చనువు గ నుందు న్
దల్లడ మందకు తగవుకు
చెల్లని ' రూకల నిడి మగడు చీరన్ దెచ్చె న్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండికల్లలు గావివి
కందం
రిప్లయితొలగించండికొల్లగ బంగరు నాణెము
లల్లనఁ ద్రవ్విన పునాదులందున జిక్కన్
వెల్లువగ విత్తమందుచు
చెల్లని రూకనిడి, మగడు చీరను దెచ్చెన్
ఉత్పలమాల
కొల్లగ పైఁడి నాణెములు గూడ పునాదులు ద్రవ్వినంత తా
నుల్లము నందు సంతసమునుప్పెన రీతినగాంచి మార్పిడిన్
వెల్లువలై ధనంబొదవ ప్రేమను రంజిలఁజేయనెంచుచున్
జెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై
గురుదేవులకు వందనములు. వృత్తము రెండవ పాదములో 'రీతిని' అని సవరణ.
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండికల్లతనమున విపణికడ
రిప్లయితొలగించండిచెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్
నెల్లరకు జెప్పి యాదిన
మెల్ల గడిపె నాపడతుక మిక్కిలి గరిమన్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిమెల్లగ నేగి కొట్టునకు మీనపు కన్నుల
రిప్లయితొలగించండియింటిదానకై
బల్లల మీదనున్న యొక ప్రక్కన వేసిన
కోక గాంచి తా
నల్లన తాకి చూచి ధర యడ్గి కొనెన్ పిసి
నారి యేరికిన్
చెల్లని, రూకతో మగడు చీరను దెచ్చెను భార్య కోసమై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
తొలగించండి...యింటిదానికై
రిప్లయితొలగించండితెల్లని ధోవతి నిచ్చుచు
పల్లదురాలగు బసాలు వలిపమడుగగా
నొల్లియకు పంచె చెల్లుకు
చెల్లని, రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్.
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండి
రిప్లయితొలగించండితెల్లని పట్టుధోవతిని తెచ్చితి నీకొరకంచు జెప్పుచున్
పల్లదురాలు మఱ్ఱెతయె పట్టు వరాసిని గోరి నిత్యమా
వల్లభ పోరుపెట్టగ నిక పంచెకు చీరయె యౌను చెల్లుకున్
జెల్లని, రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై.
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిఎల్లలులేని కిన్క తనువెల్ల దహింప నిరస్త భూషయై
రిప్లయితొలగించండిప్రల్లదనంబునన్ జెలఁగు భార్యకు సాంత్వన గూర్చనెంచి తా
మెల్లగ చెంతజేరి యెలమిన్ తన కౌగిటఁజేర్చి కిన్కకున్
చెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
తొలగించండిచెల్లవన రాదు కాలము
రిప్లయితొలగించండిచెల్లిన రూకలు విలవనుఁ జెప్ప నధికమే
చెల్లగఁ జేసి కులసతికి
చెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్
చివుకుల అచ్యుత దేవరాయలు
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిచల్లని సాయంకాలము
రిప్లయితొలగించండిమల్లెలు విరబూయువేళ మానిని సరసన్
మెల్లగజేరి యలుకకున్
చెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిపిల్లలు పొదుపున కూర్చిన
రిప్లయితొలగించండిచిల్లర నాణెముల తోడ చెల్లింపులతో
చిల్లర వర్తక ఋణమిక
చెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిచెల్లియొ చెల్లకో మగడు చేసిన యప్పును చెల్లుసేయగా
తొలగించండిపిల్లలు దాచుకొన్నదగు విత్తమునంతయు కూడబెట్టి యా
చిల్లర నాణెముల్ మగని చేతుల నుంచ భళా ఋణంబికన్
జెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు
తొలగించండిఉ.
రిప్లయితొలగించండిమెల్లగ మందహాసమున మెచ్చెను భోజుడు కాళిదాసునిన్
వల్లము నింపె, నాణ్యమగు బంగరు రూకలు నొక్కదానినిన్
భిల్లునికిచ్చె దానముగ బ్రీతిని, సొట్టను గుర్తుపట్టకన్
*చెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై*.
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిచెల్లని వస్తువేదియును సృష్టిని లేదనిఁ బల్కినంతటన్
రిప్లయితొలగించండిచెల్లని రూకనున్ విసరి చెల్లగఁ జేయమనంగ భార్యయున్
చెల్లుబడెయ్యె వీలుగను చెల్లిన కాలపు రూకవంగనున్
చెల్లని రూకతో మగఁడు చీరనుఁ దెచ్చెను భార్యకోసమై
చివుకుల అచ్యుత దేవరాయలు
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిధన్యవాదాలు
తొలగించండికం:గొల్లున తగవుల బడి, తన
రిప్లయితొలగించండియుల్లమ్మున ప్రేమ పొంగ "నోసీ యింకన్
మల్లెలు కొను,తగవుల కిక
చె ల్లని రూక నిడి, మగడు చీరన్ దెచ్చెన్
(తగవుల కిక+చెల్లు+అని మల్లె పూల కోసం రూపాయి ఇచ్చాడు.రూపాయికి మల్లె పూలు ఇప్పుడు రావు కానీ పూర్వం వచ్చేవి.)
చక్కని పూరణ. అభినందనలు
తొలగించండిఉ:పిల్లలు రూక లిమ్మనుచు వేడగ ,భార్యయు చీర కోరగా
రిప్లయితొలగించండి"పిల్లల కేల రూక?"లని,వింతగ నచ్చపు రూక వోలె భా
సిల్లెడు నాట రూక నిడి చేయుచు గారము పిల్లవాండ్ర , నా
చెల్లని రూకతో , మగడు చీరను దెచ్చెను భార్య కోసమై
(పిల్లలకి చెల్లని ఆట రూపాయి ఇచ్చి,భార్యకి చీర కొన్నాడు.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. ౕ. అభినందనలు
తొలగించండిమెల్లగదరిచేరినసతి
రిప్లయితొలగించండితెల్లనికోకయు వలెననితెలుపగపతితో
చెల్లించి ధనము ఋణమిక
చెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్”*
మెల్లగదరిచేరినసతి
తెల్లనికోకయు వలెననితెలుపగపతితో
చెల్లించి ధనము ఋణమిక
చెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్”*
మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
చిల్లి పడినట్టి నోటును
మెల్లగ పలు నోట్లమధ్య మిళితమొనర్చెన్
చల్లగ దుకాణమందున
చెల్లని నోటునిడి మగడు చీరన్ దెచ్చెన్.
కల్లయె యుంట కనఁబడని
రిప్లయితొలగించండిముల్లులు పురుషాధము లిట మును ముందుగఁ దా
నుల్లమున నెఱిఁగి యెల్లినిఁ
జెల్లని రూక నిడి మగఁడు చీరన్ దెచ్చెన్
తల్లడిలంగ దార వర తారలు గట్టిన చీర లంతఁ దా
నుల్లము నందు వీక్షణము నొప్పుగఁ జేసి యొసంగ నాజ్ఞనే
చల్లగ నూఱడిల్లుమ విశాల విలోచన! చెల్ల దింక నీ
చె ల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై
[చెల్లు= కొనసాగు (క్రియ); చెల్లు = చెల్లుబడి, అధికారము, (విశేష్యము)