1, జనవరి 2023, ఆదివారం

సమస్య - 4296

2-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పార్వతికి రమాదేవి సపత్ని యగును”
(లేదా...)
“పార్వతికిన్ రమాసతి సపత్ని యటంచు వచింత్రు విజ్ఞులే”

21 కామెంట్‌లు:

  1. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో......

    తేటగీతి
    ఉర్వికి సురాపగన్ దింప నూతమయ్యె
    శివుని జూటమ్ము సగరులు దివిని జేర
    సృష్టి వీక్షించు సర్వుల దృష్టి గంగ
    పార్వతికి, రమాదేవి! సపత్నియగును

    ఉత్పలమాల
    ఉర్వి సురాపగన్ దనర నూతము నయ్యెను శూలి జూటమే
    గర్వము గంగకున్ బులిమి కావ్యములల్ల కవీశులెల్లరున్
    సర్వులు గంగ భార్యయని శర్వుని శీర్షము దీరెనంచనన్
    బార్వతికిన్, రమాసతి! సపత్ని యటంచు వచింత్రు విజ్ఞులే

    రిప్లయితొలగించండి

  2. ఉగ్రు డేకాంతమందున నున్నవేళ
    క్రోడకాంత వరుసయేమి పైడి తల్లి
    కనుచు నగజాత కోరగా హరుడు తెలిపె
    పార్వతికి , రమాదేవి సపత్ని యగును.


    శర్వుని గిబ్బడాల్దొర విశాఖుని మాయలచెంచు రాయడా
    సర్వమెఱంగువాడు పురశాసను జెంతనజేరి శాక్రియే
    కర్వరి గూర్చి తెల్పుమన కల్మషకంఠుడు చెప్పెనీ విధిన్
    బార్వతికిన్ , రమాసతి సపత్ని యటంచు వచింత్రు విజ్ఞులే.

    రిప్లయితొలగించండి
  3. ప్రమథనాధుడగు శివుడు భర్త యగును
    పార్వతికి ; రమాదేవి సపత్ని యగును
    ఘృష్టి యవతారమందున కేశవునికి
    దార యయిన భూదేవికి , దరచి చూడ

    రిప్లయితొలగించండి
  4. గరళకంఠుని శిరమున గంగ సవతి
    పార్వతికి, రమాదేవి సపత్ని యగును
    పైడిచూలాలునకు, గనన్ బ్రహ్మపత్ని
    వాణి కెన్నడు సవతుల బాధ లేదు

    రిప్లయితొలగించండి
  5. శర్వుని శీర్షమందుగల జాహ్నవియొప్పె సపత్ని గాగనన్
    పార్వతికిన్, రమాసతి సపత్ని యటంచు వచింత్రు విజ్ఞులే
    యుర్వికి, నల్వరాణియగు నుక్తికి లేరు సపత్ను లెవ్వరున్
    సర్వ విశాల నేత్రలకు శాంతి లభించు సపత్ని లేనిచో

    రిప్లయితొలగించండి
  6. వింత లే దిందు సుంతయు సంత తాను
    కంపన మడర జనుల రమింపఁ జేయు
    దివ్య నది యగు గంగాసతి తన చెల్లి
    పార్వతికి రమాదేవి సపత్ని యగును

    [రమా దేవి = సంతోష మొసఁగు స్త్రీమూర్తి]

    పర్వదినమ్ము నందుఁ బరిపాటిగ నొక్కెడఁ గూరుచుండఁగా
    గర్వము తోడ నిట్లుడివెఁ గర్మఠుఁ డొక్కఁడు సత్వరమ్ముగా
    సర్వ మసత్యమౌ నటులఁ జారుతరమ్ము వచింపుమా యనం
    బార్వతికిన్ రమాసతి సపత్ని యటంచు వచింత్రు విజ్ఞులే

    రిప్లయితొలగించండి
  7. హరికి సోదరి యందురు హరుని భార్య
    యట్టి యెడ నౌను వదినగా నచ్యుతు సతి
    యెన్ని భంగు ల యోచింప నే విధాన
    పార్వతికి రమా దేవి సపత్ని యగును?

    రిప్లయితొలగించండి
  8. తే.గీ:తనదు దాంపత్య మందలి ఘనత దెలిపె
    పార్వతికి రమాదేవి "సపత్ని యగును
    ధరణి , సవతి పో రామెతో తగుల దెపుడు
    నాథు ప్రేమ మా యెడ సమాన మ్మటంచు.
    (భూదేవి నాకు సవతి అవుతుంది కానీ మా మధ్య పోరు లేదని లక్ష్మీ దేవి పార్వతి తో అన్నట్లు .)

    ఉ:శర్వు మహత్తు దా నెరిగి సఖ్యత తోడ వచించె నిట్టులన్
    పార్వతికిన్ రమాసతి "సపత్ని యటంచు వచింత్రు విజ్ఞులే
    యుర్విని గంగ నీ సవతి యో యను రీతిగ కొంద రట్టులన్
    శర్వుడు చేయునే జగతి శాంతికి దాల్చు శిరమ్ము పైననే"
    (చాలా మంది తెలివైన వాళ్లు కూడా గంగ నీకు సవతి యేమో!అనే అర్థం లో మాట్లాడతారు కానీ శివుడు అలా చేస్తాడా?లోక శాంతి కై కేవలం ఆమెని శిరస్సున ధరించాడు అని లక్ష్మీ దేవి  పార్వతి తో అన్నది.)

    రిప్లయితొలగించండి
  9. పర్వదినంబునైన మది భక్తి యొకింతయు లేక మూఢులై
    యుర్విని బుద్ధి హీనులటు లుద్ధతి జాటగ వక్ర భాష్యముల్
    శర్వుని పత్ని గౌరి గన శౌరికి సోదరి గాదె యెట్టులౌ
    పార్వతికిన్ రమాసతి సపత్ని యటంచు వచింత్రు విజ్ఞులే

    రిప్లయితొలగించండి