16-1-2023 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కాఁడు వేంకటేశుండు గాపాడువాఁడు”(లేదా...)“కాఁడఁట వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్”(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో బండకాడి అంజయ్య గౌడ్ గారి సమస్య)
మూడు నామాలు ధరియించి ముచ్చటగనుచిద్విలాసమునొలికించు చిన్మయు డతడేడు కొండలపైనున్న వాడు వన్నెకాఁడు వేంకటేశుండు, గాపాడువాఁడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతిసంకటమ్ముల బాపెడు స్వామి మనకునేడు కొండలఁ గొలువైననింపువాడుసతులు శ్రీదేవి భూదేవి కతన నీటుకాఁడు, వేంకటేశుండు గాపాడు వాడు!
ఉత్పలమాలతోడుగ నిర్వురున్ సతులఁ దుష్టిగ వక్షమునందు ప్రేమతోకూడిన వాడనన్ స్థితినిఁ గూర్చెడు శ్రీహరి రూపమే యనన్వేడిన వారినెల్లరను వేడ్కను బ్రోవఁగ గొంటుకాఁడు దాకాఁడఁట! వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
ఆర్తరక్షణ బిరుదమునందిట్టిసకలవాసవవందితు, సప్తగిరినివాసు, డచ్యుతుడనఘుండు వరుస "నంప కాఁడు", వేంకటేశుండు గాపాడు వాడు!అంపకాఁడు = ధనుర్ధారి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'బిరుదము నందినట్టి' టైపాటు. 'సకల సురముని వందితు' అనండి.
వాడు నిపాతకాంతకుడు పాహియటంచును జేరినంత కాపాడెడి భక్తరక్షకుడు పంకజ నాభుని నామ కీర్తనన్ వీడక పోహణించినను వేదన తీర్చెడు వాడు కోపియా?కాఁడఁట , వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ముడుపులను గట్టి భక్తులు మ్రొక్కు కొనుచుకాలి నడకన వెళ్ళియు గాంక్ష దీరదివ్య దర్శ న మున వెను దీయు వాడుకాడు వేం క టేశుండు. కాపాడు వాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వెళ్ళియు' అనడం వ్యావహారికం. "నడకను నేగియు/వెడలియు" అనండి.
ఉ.వేడగఁ దొండమానునికిఁ బేర్మిని కన్పడె శ్రీనివాసుడేపోడిమి మ్రొక్కుగా మెలగు పుణ్య నివాసము వెంకటాద్రిలోచూడగ విగ్రహంబు హరి సొంపుగ దర్శనమీయుదేవుడే*కాఁడఁట, వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్.*
వాంఛ తీర్చెననుచు దన భక్త జనులుముడుపు లీయగనె మరచి పోవు వాడుకాఁడు,వేంకటేశుండు గాపాడువాఁడువారి నెల్లరి నికపయి ముందుగూడ
సప్తగిరులపై వెలసిన స్వామి యతడు!పరగ నాపద మొక్కుల వాడతండుశ్రీనివాసుడు! చిత్తము లేని వాడుకాఁడు వేంకటేశుండు గాపాడువాఁడు!
లేడట కొండపైన తనలీలలు చూపని విగ్రహంబుగాతోడుగనిల్చి భక్తులను తోడ్కొను వాడట శ్రీనివాసుడేవేడిన వారికిన్ సతము వెన్నడి యుండిన తోడుమాత్రమేకాఁడఁట వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్
ధన్యవాదాలు గురూజీ 🙏
దీన జనులకు రక్షయౌ దేవుడతఁడుశరణుగోరిన సరగున వరములిచ్చుదయను గావఁగ వేఁడ కాదనెడువాడుకాఁడు, వేంకటేశుండు గాపాడువాఁడు
ఉ.మా.వీడకచేయి,నిల్చుచును వేడిన వానికి తోడునీడయై,మోడుల సైతమెప్పుడును మ్రొక్కిన తక్షణమాదరించి కాపాడగ, గుడ్డివారలుగ భావ్యముకాదిది పల్కుటివ్విధిన్*గాఁడఁట వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్!*
ధన్యవాదాలు గురుదేవా 🙏🙏
వేడఁగ భక్తినిల్పి మది వేగమె వీడక తోడునిల్చి కాపాడెడు దైవమెవ్వరనఁ పావన నాముఁడు వేంకటేశుఁడేకాడట దుర్లభుండతఁడు, కాడట లోభియు, నిర్దయుండు తాకాఁడఁట, వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యోస్మి గురువుగారూ 🙏🏻
క్రూర కర్మ నిరత నర కోటి కంపకాఁడు భక్తుల కక్కఱకాఁడు శిష్ట మేదినీ జనుల యఘము మృగపు వేఁటకాఁడు వేంకటేశుండు గాపాడువాఁడు పాడిగ భక్తి నూని మదిఁ బన్నుగఁ గొల్చిన డెందమందునున్గోడు వినంగ సత్వరము గూర్మినిఁ జూపెడు వాఁడె నేఁ డహో వేఁడిన మోసగాఁడు నల వేడుక కాఁడు మఱెట్టి కాఁడునుం గాఁడఁట వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'చిద్విలాస మోము' దుష్టసమాసం. "చిద్విలాస ముఖముతోడ" అనండి.
ధన్యవాదాలు గురువుగారు.తేటగీతి.శ్రీ నివాసుడు కమనీయ చిద్విలాసముఖముతోడ దాసుల కాచు మోహనుండు,వాడు నమ్మిన వారికి పరమ చెలిమికాఁడు ,వేంకటేశుండు గాపాడువాఁడుప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
పాడి వసించుచున్ కరము భక్తిని నిల్పి మనస్సు నందునన్ పోడిగ పూజసల్పినను ప్రోచును వారల నిశ్చయమ్ముగా వేడిన బాధలన్ మడచి ప్రీతిని గూర్చును, కోపమగ్నుడే గాఁడఁట, వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్.అసనారె
పసిడి రంగున వెలిగొందు ప్రముఖ వన్నె గాడు వేంకటేశుండు, గాపాడు వాడు నార్తి భజియించు భక్తుల నందఱి నిలను వేంకటేశ్వరా యనుచును వేడుకొనిన
వేడిన నేడు కొండలకు వెళ్ళక పోయినపేదవారలన్నీడగ నిల్చియెల్లపుడు నిర్మల భక్తులమర్వకుండ తాతోడుగ నుండి వారలకు తోషము నిచ్చునుమర్చిపోవువా డ్కాడట వేంకటేశుడును గాచెడు దైవము మానవాళికిన్
ఏడు కొండలపైన తానిమ్ముగానుకొలువుదీరెనుభక్తుల కోర్కె దీర్చభక్తవత్సలుడీతడు వన్నెల చెలికాడు వేంకటేశుండు గాపాడువాడుమరొక పూరణ కరములెత్తి మ్రొక్కిన యంత కరుణ చూపుస్వామి యెవ్వరనంగనీ జగతి యందుపద్మనేత్రి పద్మావతి వలచిన చెలికాడు వేంకటేశుండు కాపాడువాడు
రిప్లయితొలగించండిమూడు నామాలు ధరియించి ముచ్చటగను
చిద్విలాసమునొలికించు చిన్మయు డత
డేడు కొండలపైనున్న వాడు వన్నె
కాఁడు వేంకటేశుండు, గాపాడువాఁడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిసంకటమ్ముల బాపెడు స్వామి మనకు
నేడు కొండలఁ గొలువైననింపువాడు
సతులు శ్రీదేవి భూదేవి కతన నీటు
కాఁడు, వేంకటేశుండు గాపాడు వాడు!
ఉత్పలమాల
తొలగించండితోడుగ నిర్వురున్ సతులఁ దుష్టిగ వక్షమునందు ప్రేమతో
కూడిన వాడనన్ స్థితినిఁ గూర్చెడు శ్రీహరి రూపమే యనన్
వేడిన వారినెల్లరను వేడ్కను బ్రోవఁగ గొంటుకాఁడు దా
కాఁడఁట! వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఆర్తరక్షణ బిరుదమునందిట్టి
రిప్లయితొలగించండిసకలవాసవవందితు, సప్తగిరిని
వాసు, డచ్యుతుడనఘుండు వరుస "నంప
కాఁడు", వేంకటేశుండు గాపాడు వాడు!
అంపకాఁడు = ధనుర్ధారి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బిరుదము నందినట్టి' టైపాటు. 'సకల సురముని వందితు' అనండి.
రిప్లయితొలగించండివాడు నిపాతకాంతకుడు పాహియటంచును జేరినంత కా
పాడెడి భక్తరక్షకుడు పంకజ నాభుని నామ కీర్తనన్
వీడక పోహణించినను వేదన తీర్చెడు వాడు కోపియా?
కాఁడఁట , వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిముడుపులను గట్టి భక్తులు మ్రొక్కు కొనుచు
రిప్లయితొలగించండికాలి నడకన వెళ్ళియు గాంక్ష దీర
దివ్య దర్శ న మున వెను దీయు వాడు
కాడు వేం క టేశుండు. కాపాడు వాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెళ్ళియు' అనడం వ్యావహారికం. "నడకను నేగియు/వెడలియు" అనండి.
ఉ.
రిప్లయితొలగించండివేడగఁ దొండమానునికిఁ బేర్మిని కన్పడె శ్రీనివాసుడే
పోడిమి మ్రొక్కుగా మెలగు పుణ్య నివాసము వెంకటాద్రిలో
చూడగ విగ్రహంబు హరి సొంపుగ దర్శనమీయుదేవుడే
*కాఁడఁట, వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్.*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాంఛ తీర్చెననుచు దన భక్త జనులు
రిప్లయితొలగించండిముడుపు లీయగనె మరచి పోవు వాడు
కాఁడు,వేంకటేశుండు గాపాడువాఁడు
వారి నెల్లరి నికపయి ముందుగూడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసప్తగిరులపై వెలసిన స్వామి యతడు!
రిప్లయితొలగించండిపరగ నాపద మొక్కుల వాడతండు
శ్రీనివాసుడు! చిత్తము లేని వాడు
కాఁడు వేంకటేశుండు గాపాడువాఁడు!
లేడట కొండపైన తనలీలలు చూపని విగ్రహంబుగా
తొలగించండితోడుగనిల్చి భక్తులను తోడ్కొను వాడట శ్రీనివాసుడే
వేడిన వారికిన్ సతము వెన్నడి యుండిన తోడుమాత్రమే
కాఁడఁట వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిదీన జనులకు రక్షయౌ దేవుడతఁడు
రిప్లయితొలగించండిశరణుగోరిన సరగున వరములిచ్చు
దయను గావఁగ వేఁడ కాదనెడువాడు
కాఁడు, వేంకటేశుండు గాపాడువాఁడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ.మా.
రిప్లయితొలగించండివీడకచేయి,నిల్చుచును వేడిన వానికి తోడునీడయై,
మోడుల సైతమెప్పుడును మ్రొక్కిన తక్షణమాదరించి కా
పాడగ, గుడ్డివారలుగ భావ్యముకాదిది పల్కుటివ్విధిన్
*గాఁడఁట వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్!*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురుదేవా 🙏🙏
తొలగించండివేడఁగ భక్తినిల్పి మది వేగమె వీడక తోడునిల్చి కా
రిప్లయితొలగించండిపాడెడు దైవమెవ్వరనఁ పావన నాముఁడు వేంకటేశుఁడే
కాడట దుర్లభుండతఁడు, కాడట లోభియు, నిర్దయుండు తా
కాఁడఁట, వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి గురువుగారూ 🙏🏻
తొలగించండిక్రూర కర్మ నిరత నర కోటి కంప
రిప్లయితొలగించండికాఁడు భక్తుల కక్కఱకాఁడు శిష్ట
మేదినీ జనుల యఘము మృగపు వేఁట
కాఁడు వేంకటేశుండు గాపాడువాఁడు
పాడిగ భక్తి నూని మదిఁ బన్నుగఁ గొల్చిన డెందమందునున్
గోడు వినంగ సత్వరము గూర్మినిఁ జూపెడు వాఁడె నేఁ డహో
వేఁడిన మోసగాఁడు నల వేడుక కాఁడు మఱెట్టి కాఁడునుం
గాఁడఁట వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చిద్విలాస మోము' దుష్టసమాసం. "చిద్విలాస ముఖముతోడ" అనండి.
ధన్యవాదాలు గురువుగారు.
తొలగించండితేటగీతి.
శ్రీ నివాసుడు కమనీయ చిద్విలాస
ముఖముతోడ దాసుల కాచు మోహనుండు,
వాడు నమ్మిన వారికి పరమ చెలిమి
కాఁడు ,వేంకటేశుండు గాపాడువాఁడు
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాడి వసించుచున్ కరము భక్తిని నిల్పి మనస్సు నందునన్
రిప్లయితొలగించండిపోడిగ పూజసల్పినను ప్రోచును వారల నిశ్చయమ్ముగా
వేడిన బాధలన్ మడచి ప్రీతిని గూర్చును, కోపమగ్నుడే
గాఁడఁట, వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్.
అసనారె
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపసిడి రంగున వెలిగొందు ప్రముఖ వన్నె
రిప్లయితొలగించండిగాడు వేంకటేశుండు, గాపాడు వాడు
నార్తి భజియించు భక్తుల నందఱి నిలను
వేంకటేశ్వరా యనుచును వేడుకొనిన
వేడిన నేడు కొండలకు వెళ్ళక పోయిన
రిప్లయితొలగించండిపేదవారలన్
నీడగ నిల్చియెల్లపుడు నిర్మల భక్తుల
మర్వకుండ తా
తోడుగ నుండి వారలకు తోషము నిచ్చును
మర్చిపోవువా
డ్కాడట వేంకటేశుడును గాచెడు దైవము మానవాళికిన్
ఏడు కొండలపైన తానిమ్ముగాను
రిప్లయితొలగించండికొలువుదీరెనుభక్తుల కోర్కె దీర్చ
భక్తవత్సలుడీతడు వన్నెల చెలి
కాడు వేంకటేశుండు గాపాడువాడు
మరొక పూరణ
కరములెత్తి మ్రొక్కిన యంత కరుణ చూపు
స్వామి యెవ్వరనంగనీ జగతి యందు
పద్మనేత్రి పద్మావతి వలచిన చెలి
కాడు వేంకటేశుండు కాపాడువాడు