26, జనవరి 2023, గురువారం

సమస్య - 4219

27-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాకొమరుఁడు బిచ్చమిమ్మురా యని వేడెన్"
(లేదా...)
"రాకొమరుండు బిచ్చమిడరా యని వేడెను పేద వాకిటన్"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో పి. జమున గారి సమస్య)

16 కామెంట్‌లు:

  1. నీకడకు జేరి, నిత్యము
    నాకలి బాధపడు వారి యంగద దీర్చున్,
    నేకారణముననో మరి
    రాకొమరుఁడు బిచ్చమిమ్మురా యని వేడెన్

    రిప్లయితొలగించండి
  2. ఆకలి తాళగ లేనని
    చాకిరి కేగుటకు శక్తి చాలదటంచున్
    నాకుని పిత పంప ఫకీ
    రా కొమరుఁడు బిచ్చమిమ్మురా యని వేడెన్.


    ఆకలి తాళలేననుచు నన్నము పెట్టుమటంచు కోరగా
    శోకితయై వచించెనట సూషణ యింటను ధాన్యసారమే
    లేకనుపాసముంటిమని రిత్తయమత్రము జూపగా ఫకీ
    రా కొమరుండు బిచ్చమిడరా యని వేడెను పేద వాకిటన్.

    ఫకీరు పేదవాడు
    కొమరుఁడు బాలుడు
    ఫకీరు ఆ కొమరుఁడు= ఫకీరా కొమరుఁడు.

    రిప్లయితొలగించండి
  3. ఆకలి దీర్చెడు భిక్షను
    చేకొనెనజ్ఞాతవాస చేతనతోడన్
    ప్రాకటమొప్పగ పార్థుడు
    రాకొమరుఁడు బిచ్చమిమ్మురా యని వేడెన్

    రిప్లయితొలగించండి
  4. కందం
    శ్రీకరుఁడన షిర్డీపురి
    చేకూరిన దైవ సుతుడె శ్రీసాయి యనన్
    వీకను నైదిండ్ల ఫకీ
    రా కొమరుఁడు బిచ్చమిమ్ము రా యని వేడెన్!

    ఉత్పలమాల
    శ్రీకరులౌ మహేశ్వరుడు శ్రీహరి బ్రహ్మయు సర్వదేవతా
    ప్రాకట దైవమా సుతుడు పండెను షిర్డి పురాధినాధుడై
    వీకను నిత్యమైదుగురి భిక్షను జేకొను పోకడన్ ఫకీ
    రా కొమరుండు బిచ్చమిడరా యని వేడెను పేద వాకిటన్!

    రిప్లయితొలగించండి
  5. చేకొని పారుని వేషము
    నాకలి తీరుటకు పార్థు డ హమును వీడె న్
    బ్రాకట ముగ వీరు o డా
    రా కొమ రుడు బిచ్చ మిమ్ము రా యని వే డెన్

    రిప్లయితొలగించండి
  6. ఆఁకొని తనదేశ ప్రజలు
    దూఁకొన నంబలియులేక దురవస్థ పడన్
    వీఁకన్ తనదైవమ్మును
    రాకొమరుఁడు బిచ్చమిమ్మురా యని వేడెన్

    రిప్లయితొలగించండి
  7. మేఁకి యలంకరింపబడిన మిన్నగయుండిన వస్త్రముల్ నగల్
    వీఁక ముఖంబుతో నగుఁచు వీధిని పాంథులకిచ్చి వేయగా
    సాఁకనహింస ముఖ్యముగ సాధనఁజేయ విరాగమున్ ౘవిన్
    రాకొమరుండు బిౘ్చీమిడరాయని వేడెను పేదవాకిటన్

    చివుకుల అచ్యుత దేవరాయలు

    రిప్లయితొలగించండి
  8. రాకొమరుండు సద్గుణుఁడు రాజ్యమునందున క్షామమేర్పడన్
    దూఁకొన గంజిలేని కడు దుస్థితి నెక్కొనియున్న వేళలో
    వీఁకగ దైవముందలచి పేదల యాకలి బాప నన్నమున్
    రాకొమరుండు బిచ్చమిడరా యని వేడెను పేద వాకిటన్

    రిప్లయితొలగించండి
  9. చేకొన జయమ్ము సంగ్రా
    మాకాంక్షుఁడు ద్వంద్వ యుద్ధ మప్పు డొనర్పన్
    వీఁక రణము సేయుదు నని
    రాకొమరుఁడు బిచ్చ మిమ్మురా యని వేడెన్

    ఆఁకలి కుండు నెందు నుచి తానుచితమ్ములు భూ తలమ్మునం
    బ్రాకట మయ్యె నిప్పు డిది పన్నుగ నెల్లర కక్కజమ్ముగన్
    సాఁకఁగ బిడ్డ నింటఁ గడు చక్కఁగ నైన నిదేమి చిత్ర మౌ
    రా కొమరుండు బిచ్చ మిడరా యని వేడెను పేద వాకిటన్

    రిప్లయితొలగించండి


  10. ఆకలికేకలనువినుచు.
    శోకంబునుబాపనెంచిశోధనచేయ
    న్నే కాగ్రత బూనుచునా
    రాకొమరుడుబిచ్చమిమ్మురాయనివేడెన్



    రిప్లయితొలగించండి
  11. ఏకచక్రపురాన అర్జునుడు తిరిపమెత్తిన సందర్భం.
    కందం
    చేకొని జోలెను పార్థుడు
    ఆకొన తిరిపమడిగె తన యనుజన్ములకు
    న్నాకలి దీర్పగ నెంచుచు
    రాకొమరుడు బిచ్చమిమ్మురా యని వేడెన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు

    రిప్లయితొలగించండి
  12. చీకటి జీవయానమున చింతలు
    చిక్కులలోన జిక్కి తా
    మాకటి కోర్వలేక పడు యాతన
    జూచియు భీమసేనుడున్
    జేకొని జోలె చక్రపురి చేరియు మిక్కిలి
    యార్తితో నయో!
    రాకొమరుండు బిచ్చమిడరాయని వేడెను పేదవాకిటన్.

    రిప్లయితొలగించండి
  13. వేఁకువ నేగెనె యటవికి
    రాకొమరుఁడు,బిచ్చమిమ్ము, రా యనివేడెం
    జాకిరిఁజేయగ లేనిక
    నాకడుపుంనిండగొట్టు నలినదళాక్షీ!

    రిప్లయితొలగించండి
  14. రాజు గురువుతో మాట్లాడుతూ..

    చేకొన విద్యాభ్యాసము
    నా కొమరుని గురుకులముకు నంపగవలెనౌ!
    సోకుగ గురువును, విద్యను
    రాకొమరుఁడు బిచ్చమిమ్మురా యని వేడెన్

    రిప్లయితొలగించండి
  15. కం:చీకాకు వెట్ట శత్రువు
    "లీ కొలదియె సేన చాలదే "యని హితుడౌ
    రా కొమరుని నెయ్యము తో
    రా కొమరుడు "బిచ్చ మిమ్మురా !"యని వేడెన్
    (తన సేన చాలక రాజకుమారుడు మరొక స్నేహితుడైన రాజకుమారుణ్జి సహాయం వేడుకొన్నాడు.)

    రిప్లయితొలగించండి
  16. ఉ:లోకము మారి రాజ్యములె లుప్తము లయ్యెను,రాజపుత్రులే
    లోకసభన్ జొరంబడగ లోకుల యోట్లను పొంద గోరి చీ
    కాకును జూప కుండి, రిక గర్వము వీడుచు లౌక్య మొప్పగన్
    రాకొమరుండు "బిచ్చ మిడరా!" యని వేడెను పేద వాకిటన్
    (మనకి ప్రజాస్వామ్యం వచ్చాక రాజాలు,సంస్థానాధీశులు మళ్లీ పార్లమెంట్ కి పోటీ చేశారు.వోట్లు అడుక్కున్నారు.ఎంతైనా ఒకప్పటి రాజులు కదా!కాస్త లౌక్యం గా బిచ్చ మడిగాడు రాజకుమారుడు.లోకసభ=పార్లమెంట్ లోని లోక్ సభ.)

    రిప్లయితొలగించండి