14-1-2023 (శనివారం)కవిమిత్రులారా,భోగిమంటను గురించి ఉత్పలమాల వ్రాయండి1వ పాదం 1వ అక్షరం 'భో'2వ పాదం 2వ అక్షరం 'గి'3వ పాదం 10వ అక్షరం 'మం'4వ పాదం 17వ అక్షరం 'ట'
"భో"గముయన్న తల్చినను మోక్షమె, బాగుగ పూర్వజన్మలోదా"గి"న కర్మశేషముల దగ్ధము చేసేడి జ్ఞానజ్యోతియైమాగిన పాత వస్తువుల "మం"చిగ దగ్ధము చేతుమిందులోభోగియె జ్ఞాన సంపదను పొందుట కౌనగు నా"ట"పట్టుగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'భోగము + అన్న' అన్నపుడు యడాగమం రాదు. "భోగమటంచు దల్చినను" అనవచ్చు. 'జ్ఞానజ్యోతి' అన్నపుడు 'న' గురువై గణభంగం. "జ్ఞానతేజమై" అనవచ్చు.
"భో"గమటంచు తల్చినను మోక్షమె, బాగుగ పూర్వజన్మలోదా"గి"న కర్మశేషముల దగ్ధము చేసేడి జ్ఞానతేజమైమాగిన పాత వస్తువుల "మం"చిగ దగ్ధము చేతుమిందులోభోగియె జ్ఞాన సంపదను పొందుట కౌనగు నా"ట"పట్టుగాసరిచేశాను గురువుగారు 🙏 తెలియజేసి నందుకు ధన్యవాదములు గురువుగారు
గురుదేవులకు కవిమిత్రలందరికీ భోగిపర్వదిన శుభాకాంక్షలతో.... ఉత్పలమాలభోగికి పంటలున్ గృహపు ముచ్చట దీరగ నింప ధాన్యమున్దాగిన చింతలన్ రగులు దారువు జ్వాలల గాల్చు పర్వమింపౌగద! భావి జీవితము మంటల వెల్గులనూహలద్దుచున్స్వాగత మంచు సంక్రమణ భానుని మ్రొక్కరె మింటగాంచుచున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
భోగి యనంగ సంక్రమణ ముందటి రోజది వేడ్కతో జనుల్ బేగిన నిద్రలేచి తమ వేశ్మము నందున మూలనుండెడిన్ మాగుపదార్థరాసులను మంటల కర్పణ జేసి కాల్చుచున్ రాగుని స్వాగతింత్రు మకరమ్మును జేరగ నాటపాటతో.
భోగ విలాస పర్వమని పొంగులు వారెడు సంబరమ్ము తోభోగి దినమ్ము వచ్చె నని మోదముతో దమ యింటి ముంగిటన్మాగియు కుళ్ళి పోయినవి మంటలలో మసి చేయ బూని యున్పోగులు జేసి కాల్చియును బూడిద సేయఁగ నుత్స హించ రే!
నాలుగవ పాదం చివర బూడిద సేయఁగ మంట వేయరే అని సవరణ చేయడమైనది
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భోగము భాగ్యమున్ గలుగు ముచ్చట తీరుట సాధ్యమౌగదాభోగికి చూడనౌను సరి పోడిమి నిచ్చెడు రంగవల్లులన్మా గృహవీధిలో రగులు మంటల వెచ్చని సౌఖ్యమందుచున్రాగము లాలపింతురు విరామము నొందుచు తేటతెల్గులో
ధన్యవాదాలు గురూజీ 🙏
‘భో’ గము నిచ్చి పాతవగు పూర్వులు వాడిన బల్లల న్నిటిన్వీ’గి’నకాళ్ళతోడగల పీటనుముక్కలు చేసి వా టినిన్మాగుడు వారిన ట్టిదగు ‘మం’చముబాగుగ నున్నదై ననున్వేగమె వాటి నన్నిటిని వేసెద పండుగ మం’ట’లందునన్
భోగి మహోన్నతమ్ముగను భోగ కరమ్మని యెంచి నెమ్మదిన్ దాఁగిన కట్టె లన్నిటినిఁ దద్ద రగిల్చి జయింత్రు శీతలం బాగక విష్ణుచిత్తజ సమంచిత చిత్త వరించి విష్ణునిం దూఁగుచు భర్తృ వక్షమునఁ దుష్టిఁ జెలంగుచు నుంట వింటిమే
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
భోగి సుపర్వమందు పెనుపొందును గావుత భోగభాగ్యముల్లోగిలులందు ముగ్గుల విలోకము గూర్చు మనోవికాసమున్మైగలులట్లు కూడలుల మంటలు వేయుచు కోడెకాండ్రు సంవేగమునొందుచున్సలుపు వేడుక కన్నులపంటయే యగున్(మైగలి=శూరుడు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్పలమాల.భోగికి పూర్వపాపములు పోవగ భావన జేత దల్చుచున్మాగిలి గడ్డి కుప్పవడ మంచిగ కాల్చుచు,కాగు నీళ్ళ తోమాగుడు తానముల్ సలిపి మంగళ దాయక దేవతాస్తుతుల్బాగుగ పాడి మొక్కెదరు భాస్కర దేవుని మింట చూచుచున్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
భోగవిరాజిత ప్రభలముంగిళులందున రంగవల్లికల్భోగి శుభప్రదంబనుచుపొంగలి జేయుదు రీ దినమ్మునన్మాగని క్రొత్తబియ్యమునుమంచిగ నర్సెలు సక్కినాలతోరాగిలు ధాన్యరాసులునురైతుల పాలిటి వాటమౌ నహో!వాటము=భాగము, వెలుగు
భోగి దినమ్ములో నెదను పుణ్యము గోరుచు భక్తి తోడుతన్ భోగి ని పేరుగా నిడుచు, పొంచిన కామము క్రోధ లోభముల్మా గమనమ్మెదుర్కొనక మంటల వేసి దహింపఁజేయగా వేగ మనమ్మునన్ దలచి ప్రీతి భజించెడి బాట సాగెదన్!
ఉ. భోగి కి మంటలెత్తినవి భోగి ని నాల్కల జూపి యాడగా రాగిల జేయదే యికను రాగల కాలము మానసమ్ములన్ మాగిన వృద్ధులందరును మంటల ముందర వెచ్చగాగుచో నాగడె భీష్ముడింతకును నారవి మారెడు పూటకోసమై. కడయింటి కృష్ణమూర్తి..గోవా. 14-1-23
భోగియు, కర్మయోగియును, భూమిజనాళికి దోచుదైవమౌ రాగిలు సూర్యు దేవుడొగి ప్రాగ్దిశ నం దుదయించువేళలోమైగొని యడ్డగించునని మంచుతెఱల్; గొని కట్టె,కొమ్మలన్ వేగమె కర్షకోత్తములు వేసిరి శోభగ మంటలత్తరిన్
భోగము భాగ్యముల్ బడసి భూమి జనాళి ప్రమోదమందగాభోగి శుభంబుగా నమరె ముంగిట రంగుల రంగవల్లులన్మాగిలి పైరులన్ సిరుల మంజుల మంగళ తోరణంబులన్స్వాగత హేలగా మకర సంక్రమణంబున నాట పాటలన్
"భో"గముయన్న తల్చినను మోక్షమె, బాగుగ పూర్వజన్మలో
రిప్లయితొలగించండిదా"గి"న కర్మశేషముల దగ్ధము చేసేడి జ్ఞానజ్యోతియై
మాగిన పాత వస్తువుల "మం"చిగ దగ్ధము చేతుమిందులో
భోగియె జ్ఞాన సంపదను పొందుట కౌనగు నా"ట"పట్టుగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భోగము + అన్న' అన్నపుడు యడాగమం రాదు. "భోగమటంచు దల్చినను" అనవచ్చు. 'జ్ఞానజ్యోతి' అన్నపుడు 'న' గురువై గణభంగం. "జ్ఞానతేజమై" అనవచ్చు.
"భో"గమటంచు తల్చినను మోక్షమె, బాగుగ పూర్వజన్మలో
తొలగించండిదా"గి"న కర్మశేషముల దగ్ధము చేసేడి జ్ఞానతేజమై
మాగిన పాత వస్తువుల "మం"చిగ దగ్ధము చేతుమిందులో
భోగియె జ్ఞాన సంపదను పొందుట కౌనగు నా"ట"పట్టుగా
సరిచేశాను గురువుగారు 🙏 తెలియజేసి నందుకు ధన్యవాదములు గురువుగారు
గురుదేవులకు కవిమిత్రలందరికీ భోగిపర్వదిన శుభాకాంక్షలతో....
రిప్లయితొలగించండిఉత్పలమాల
భోగికి పంటలున్ గృహపు ముచ్చట దీరగ నింప ధాన్యమున్
దాగిన చింతలన్ రగులు దారువు జ్వాలల గాల్చు పర్వమిం
పౌగద! భావి జీవితము మంటల వెల్గులనూహలద్దుచున్
స్వాగత మంచు సంక్రమణ భానుని మ్రొక్కరె మింటగాంచుచున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండి
రిప్లయితొలగించండిభోగి యనంగ సంక్రమణ ముందటి రోజది వేడ్కతో జనుల్
బేగిన నిద్రలేచి తమ వేశ్మము నందున మూలనుండెడిన్
మాగుపదార్థరాసులను మంటల కర్పణ జేసి కాల్చుచున్
రాగుని స్వాగతింత్రు మకరమ్మును జేరగ నాటపాటతో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభోగ విలాస పర్వమని పొంగులు వారెడు సంబరమ్ము తో
రిప్లయితొలగించండిభోగి దినమ్ము వచ్చె నని మోదముతో దమ యింటి ముంగిటన్
మాగియు కుళ్ళి పోయినవి మంటలలో మసి చేయ బూని యున్
పోగులు జేసి కాల్చియును బూడిద సేయఁగ నుత్స హించ రే!
నాలుగవ పాదం చివర బూడిద సేయఁగ మంట వేయరే అని సవరణ చేయడమైనది
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభోగము భాగ్యమున్ గలుగు ముచ్చట తీరుట సాధ్యమౌగదా
రిప్లయితొలగించండిభోగికి చూడనౌను సరి పోడిమి నిచ్చెడు రంగవల్లులన్
మా గృహవీధిలో రగులు మంటల వెచ్చని సౌఖ్యమందుచున్
రాగము లాలపింతురు విరామము నొందుచు తేటతెల్గులో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి‘భో’ గము నిచ్చి పాతవగు పూర్వులు వాడిన బల్లల న్నిటిన్
రిప్లయితొలగించండివీ’గి’నకాళ్ళతోడగల పీటను
ముక్కలు చేసి వా టినిన్
మాగుడు వారిన ట్టిదగు ‘మం’చము
బాగుగ నున్నదై ననున్
వేగమె వాటి నన్నిటిని వేసెద
పండుగ మం’ట’లందునన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభోగి మహోన్నతమ్ముగను భోగ కరమ్మని యెంచి నెమ్మదిన్
రిప్లయితొలగించండిదాఁగిన కట్టె లన్నిటినిఁ దద్ద రగిల్చి జయింత్రు శీతలం
బాగక విష్ణుచిత్తజ సమంచిత చిత్త వరించి విష్ణునిం
దూఁగుచు భర్తృ వక్షమునఁ దుష్టిఁ జెలంగుచు నుంట వింటిమే
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిభోగి సుపర్వమందు పెనుపొందును గావుత భోగభాగ్యముల్
రిప్లయితొలగించండిలోగిలులందు ముగ్గుల విలోకము గూర్చు మనోవికాసమున్
మైగలులట్లు కూడలుల మంటలు వేయుచు కోడెకాండ్రు సం
వేగమునొందుచున్సలుపు వేడుక కన్నులపంటయే యగున్
(మైగలి=శూరుడు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల.
రిప్లయితొలగించండిభోగికి పూర్వపాపములు పోవగ భావన జేత దల్చుచున్
మాగిలి గడ్డి కుప్పవడ మంచిగ కాల్చుచు,కాగు నీళ్ళ తో
మాగుడు తానముల్ సలిపి మంగళ దాయక దేవతాస్తుతుల్
బాగుగ పాడి మొక్కెదరు భాస్కర దేవుని మింట చూచుచున్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభోగవిరాజిత ప్రభల
రిప్లయితొలగించండిముంగిళులందున రంగవల్లికల్
భోగి శుభప్రదంబనుచు
పొంగలి జేయుదు రీ దినమ్మునన్
మాగని క్రొత్తబియ్యమును
మంచిగ నర్సెలు సక్కినాలతో
రాగిలు ధాన్యరాసులును
రైతుల పాలిటి వాటమౌ నహో!
వాటము=భాగము, వెలుగు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభోగి దినమ్ములో నెదను పుణ్యము గోరుచు భక్తి తోడుతన్
రిప్లయితొలగించండిభోగి ని పేరుగా నిడుచు, పొంచిన కామము క్రోధ లోభముల్
మా గమనమ్మెదుర్కొనక మంటల వేసి దహింపఁజేయగా
వేగ మనమ్మునన్ దలచి ప్రీతి భజించెడి బాట సాగెదన్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉ. భోగి కి మంటలెత్తినవి భోగి ని నాల్కల జూపి యాడగా
రిప్లయితొలగించండిరాగిల జేయదే యికను రాగల కాలము మానసమ్ములన్
మాగిన వృద్ధులందరును మంటల ముందర వెచ్చగాగుచో
నాగడె భీష్ముడింతకును నారవి మారెడు పూటకోసమై.
కడయింటి కృష్ణమూర్తి..గోవా. 14-1-23
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభోగియు, కర్మయోగియును, భూమిజనాళికి దోచుదైవమౌ
రిప్లయితొలగించండిరాగిలు సూర్యు దేవుడొగి ప్రాగ్దిశ నం దుదయించువేళలో
మైగొని యడ్డగించునని మంచుతెఱల్; గొని కట్టె,కొమ్మలన్
వేగమె కర్షకోత్తములు వేసిరి శోభగ మంటలత్తరిన్
భోగము భాగ్యముల్ బడసి భూమి జనాళి ప్రమోదమందగా
రిప్లయితొలగించండిభోగి శుభంబుగా నమరె ముంగిట రంగుల రంగవల్లులన్
మాగిలి పైరులన్ సిరుల మంజుల మంగళ తోరణంబులన్
స్వాగత హేలగా మకర సంక్రమణంబున నాట పాటలన్