13-1-2023 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో”(లేదా...)“కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్”(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో కన్నేపల్లి వరలక్ష్మి గారి సమస్య)
శ్రీకైవల్యపథమ్ము చేరుటకునై అని శ్రీమదాంధ్రమహాభాగవతమునకు శ్రీకారమును జుట్టిన శ్రీపోతనార్యులను స్మరిస్తూ.... కందంరాముండెంచినఁ బోతనశ్రీమద్భాగవతమునకు శ్రీకారమునన్గామించన పథమన సత్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో!శార్దూలవిక్రీడితమురాముండెంచినఁ బోతనార్యుడిలలో రంజిల్లి సద్భక్తితోశ్రీమద్భాగవతమ్మునున్ మలచఁ దా శ్రీకారమున్ జుట్టుచున్గామించెన్గద మేటి సత్పథమదే! కావ్యంపు సత్కర్త సత్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్!
శా.భామాలోలులు, జూదరుల్,జడులు, పాపారణ్య సంచారలున్క్షేమంబౌనొకొ?ముక్తి మార్గ పదముల్ జేరంగని వ్వారికిన్కామ క్రోధమదాది శత్రువులపై గర్జించు యోగీశు "నిష్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్
ధీమంతు o డగు వాడైసామాన్యుల బాగు కొఱకు సత్క్తృత్యంబు ల్ప్రేమగయొ న రిం చెడి సత్కా మా సక్తు న కె దక్కు కైవల్య మహో!
ఏమియు సందేహింపకకామక్రోధములు వీడి కలలోనైనన్నీమమ్ముల విడువని నిష్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామక్రోధాదులెపుఁడుపాములవలెకాటువేసి బాములపెట్టున్ధీమతుఁడై బరఁగెడు నిష్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
ఏమందును నీదినములప్రేమను జూపించు యాలుబిడ్డల యందున్కామముతో జియ్యపయి నిష్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
క్రొవ్విడి వెంకట రాజారావు: సామి కొలుపున తరించుచు కామ మదమహములనెల్ల కడజేయుచు తా నీమముతో మెలిగెడు స త్కామాసక్తునకె దక్కు కైవల్యమహో!
జేమనములేని పేదకుబ్రేమగ నన్నమిడి వారి విక్షోభమునే నేమముగా తీర్చెడు సత్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో.సామాన్యుండ్రకు పేదవారికి సదా సాయమ్ము నందించుచున్ బ్రేమన్ వీడక సాటివారికిలలో విక్షోభమున్ దీర్చుచున్ కామక్రోధము వీడి సంతతము సత్కార్యమ్ము లే సల్పు సత్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్.
క్రొవ్విడి వెంకట రాజారావు: కామక్రోధమదమ్ములన్ని క్షయమున్ గానిచ్చి శౌరిన్ సదా ప్రమోదమ్మున గొల్చుచున్ పరమునే వాంఛించుచున్ బంధముల్ తా మళ్ళించి తదేకమౌ నిలుకడన్ ధ్యానంబు నందుండు స త్కామాసక్తుడె యర్హుడయ్యెడుగదా కైవల్యముం బొందగన్.
కామంబుల్ సతతంబు శాంతినిడువంగన్ ౙాలవంౘ్చున్ మతిన్ మీమాంసంబు వడన్ నెఱుంగువడగన్ మెౘ్చంగ వైరాగ్యమున్రామాయంౘు శరీరమున్ విడుౘు బైరాగుండు మోక్షంబునన్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముంబొందఁగన్చివుకుల అచ్యుత దేవరాయలు, అమెరికా
కామక్రోధమదాది షట్కముల చక్రంబందునన్ దారుచున్నీమంబుల్విడనాడి యైహికములే నిత్యంబులం చెంచగన్క్షేమంబౌనొకొ? సర్వసంగముల విచ్ఛేదంబు గావించు నిష్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్
రామాగ్ర హానల శిఖాభీ మాతప సదృశ విశిఖ వేగ విఘాతుం డై మోక్ష మందె నసురుఁడు కామాసక్తునకె దక్కుఁ గైవల్య మహోధామస్థుం డయి తాను బొంది వరుసన్ ధర్మార్థ కామమ్ములన్ శ్రీమంతుండు దరిద్రుఁడుం బుడమి నిర్వేదంబు వర్ధిల్లినన్ వే మోక్షార్థమ నిత్య మచ్యుతుని సేవింపంగ సన్యాస సత్కామాసక్తుఁడె యర్హుఁ డయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్
కందం.కామోపభోగము లవియునీముము తో ననుభవించి నిండుగ మనుచున్క్షేమము దర్మార్థము గలకామాసక్తునకె దక్కుఁ గైవల్యమహోప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు
కం. ఏమా గుణనిధి వైభవ మేమో యా నిగమశర్మ దేమో యయ్యా జామీళుని గన నాహా! కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహోకడయింటి కృష్ణమూర్తి..గోవా. 13-1-23
కామాసక్తుఁడు రాముని నామమునే నెల్లపుఁడు నమలుట వలనేయేవిధ ముగనై న నరయకామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్భామా! యేమనిఁబల్కు చుంటివి?యిటన్ భావ్యమ్ము గాఁదోచెనే?నీమాటల్వినసొంపుగాఁదు,పలుకుల్ నీచంబు,ఁబల్కంగనౌనేమా యల్దరిచేరె నిన్ను చెపుమా యేణాంకబింబాననా!
కామాసక్తుని కెవ్విధిన్ గలుగునా కైవల్య మూహింపగాకామంబే గద మూలకారణము దుష్కర్మాపదేశంబునౌనీమంబూని నిరంతరం బజితునా నీలాంగు నర్చించు నిష్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్
శ్రీకైవల్యపథమ్ము చేరుటకునై అని శ్రీమదాంధ్రమహాభాగవతమునకు శ్రీకారమును జుట్టిన శ్రీపోతనార్యులను స్మరిస్తూ....
రిప్లయితొలగించండికందం
రాముండెంచినఁ బోతన
శ్రీమద్భాగవతమునకు శ్రీకారమునన్
గామించన పథమన స
త్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో!
శార్దూలవిక్రీడితము
రాముండెంచినఁ బోతనార్యుడిలలో రంజిల్లి సద్భక్తితో
శ్రీమద్భాగవతమ్మునున్ మలచఁ దా శ్రీకారమున్ జుట్టుచున్
గామించెన్గద మేటి సత్పథమదే! కావ్యంపు సత్కర్త స
త్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్!
శా.
రిప్లయితొలగించండిభామాలోలులు, జూదరుల్,జడులు, పాపారణ్య సంచారలున్
క్షేమంబౌనొకొ?ముక్తి మార్గ పదముల్ జేరంగని వ్వారికిన్
కామ క్రోధమదాది శత్రువులపై గర్జించు యోగీశు "ని
ష్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్
ధీమంతు o డగు వాడై
రిప్లయితొలగించండిసామాన్యుల బాగు కొఱకు సత్క్తృత్యంబు ల్
ప్రేమగయొ న రిం చెడి స
త్కా మా సక్తు న కె దక్కు కైవల్య మహో!
ఏమియు సందేహింపక
రిప్లయితొలగించండికామక్రోధములు వీడి కలలోనైనన్
నీమమ్ముల విడువని ని
ష్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికామక్రోధాదులెపుఁడు
రిప్లయితొలగించండిపాములవలెకాటువేసి బాములపెట్టున్
ధీమతుఁడై బరఁగెడు ని
ష్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
ఏమందును నీదినముల
రిప్లయితొలగించండిప్రేమను జూపించు యాలుబిడ్డల యందున్
కామముతో జియ్యపయి ని
ష్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసామి కొలుపున తరించుచు
కామ మదమహములనెల్ల కడజేయుచు తా
నీమముతో మెలిగెడు స
త్కామాసక్తునకె దక్కు కైవల్యమహో!
జేమనములేని పేదకు
రిప్లయితొలగించండిబ్రేమగ నన్నమిడి వారి విక్షోభమునే
నేమముగా తీర్చెడు స
త్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో.
సామాన్యుండ్రకు పేదవారికి సదా సాయమ్ము నందించుచున్
బ్రేమన్ వీడక సాటివారికిలలో విక్షోభమున్ దీర్చుచున్
కామక్రోధము వీడి సంతతము సత్కార్యమ్ము లే సల్పు స
త్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికామక్రోధమదమ్ములన్ని క్షయమున్ గానిచ్చి శౌరిన్ సదా
ప్రమోదమ్మున గొల్చుచున్ పరమునే వాంఛించుచున్ బంధముల్
తా మళ్ళించి తదేకమౌ నిలుకడన్ ధ్యానంబు నందుండు స
త్కామాసక్తుడె యర్హుడయ్యెడుగదా కైవల్యముం బొందగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికామంబుల్ సతతంబు శాంతినిడువంగన్ ౙాలవంౘ్చున్ మతిన్
రిప్లయితొలగించండిమీమాంసంబు వడన్ నెఱుంగువడగన్ మెౘ్చంగ వైరాగ్యమున్
రామాయంౘు శరీరమున్ విడుౘు బైరాగుండు మోక్షంబునన్
కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముంబొందఁగన్
చివుకుల అచ్యుత దేవరాయలు, అమెరికా
కామక్రోధమదాది షట్కముల చక్రంబందునన్ దారుచున్
రిప్లయితొలగించండినీమంబుల్విడనాడి యైహికములే నిత్యంబులం చెంచగన్
క్షేమంబౌనొకొ? సర్వసంగముల విచ్ఛేదంబు గావించు ని
ష్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్
రామాగ్ర హానల శిఖా
రిప్లయితొలగించండిభీ మాతప సదృశ విశిఖ వేగ విఘాతుం
డై మోక్ష మందె నసురుఁడు
కామాసక్తునకె దక్కుఁ గైవల్య మహో
ధామస్థుం డయి తాను బొంది వరుసన్ ధర్మార్థ కామమ్ములన్
శ్రీమంతుండు దరిద్రుఁడుం బుడమి నిర్వేదంబు వర్ధిల్లినన్
వే మోక్షార్థమ నిత్య మచ్యుతుని సేవింపంగ సన్యాస స
త్కామాసక్తుఁడె యర్హుఁ డయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్
కందం.
రిప్లయితొలగించండికామోపభోగము లవియు
నీముము తో ననుభవించి నిండుగ మనుచున్
క్షేమము దర్మార్థము గల
కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు
కం. ఏమా గుణనిధి వైభవ
రిప్లయితొలగించండిమేమో యా నిగమశర్మ దేమో యయ్యా
జామీళుని గన నాహా!
కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
కడయింటి కృష్ణమూర్తి..గోవా. 13-1-23
కామాసక్తుఁడు రాముని
రిప్లయితొలగించండినామమునే నెల్లపుఁడు నమలుట వలనే
యేవిధ ముగనై న నరయ
కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్
రిప్లయితొలగించండిభామా! యేమనిఁబల్కు చుంటివి?యిటన్ భావ్యమ్ము గాఁదోచెనే?
నీమాటల్వినసొంపుగాఁదు,పలుకుల్ నీచంబు,ఁబల్కంగనౌ
నేమా యల్దరిచేరె నిన్ను చెపుమా యేణాంకబింబాననా!
కామాసక్తుని కెవ్విధిన్ గలుగునా కైవల్య మూహింపగా
రిప్లయితొలగించండికామంబే గద మూలకారణము దుష్కర్మాపదేశంబునౌ
నీమంబూని నిరంతరం బజితునా నీలాంగు నర్చించు ని
ష్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్