29-1-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."పాడ నేర్పుమనుచు పాము లడిగె"(లేదా...)"పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్"(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ఆర్. కళ్యాణి గారి సమస్య)
కుటము పయిన పికము కూయుచు నుండగజెట్టు దిగువ నున్న చిట్ట లోని సర్ప ములు వి ని కడు సంతస మొందిపాడ నేర్పుమనుచు పాము లడిగె
పెద్ద పాము కడకు వెడలియు దమ యొక్కసందియములు దెల్పి సాయ మడిగెశత్రు తతుల నుండి సంతాన ములను గాపాడ నేర్పు మనుచు పాము లడి గె
మమ్ము గాంచినంత మనుజులు భీతిల్లిచంప బూను చుండ్రి చంద్రధరుడనరులు ప్రేమతోడ ధరలోన మమ్ము కాపాడ నేర్పుమనుచు పాము లడిగె. ఓటుల బొంది గెల్చుచు మహోన్నత స్థానము పొందు మంత్రులే చాటున నుండి విజ్ఞులిల సాయము జేయుచు నుండగా భువిన్ మేటిగ పాలనమ్మునకు మేలగు సూచనలడ్గుటన్ గనన్ పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్.
వసుధపై వసించు ప్రాణులనెల్ల కాపాడ నేర్పు మనుచు పాము లడిగెకాటు వైచి నపుడు కాలము చెల్లకసేద దీరు నటుల చేయ మనుచు
పాటవమొప్పు గానమును పాపలు పాములు జంతుజాలముల్గాటపు నర్మిలిన్ వినుటకై వివశత్వము నొందురీ భువిన్దీటుగ నామనిన్ పికము తీయగ సల్పగ కూజితమ్ములన్పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్
శిశువు పశువు పాము శిరసులనూపవెపాటవినగనెపుడు పరవశించికోకిలమ్మ సేయు కూజితమ్మునువినిపాడ నేర్పుమనుచు పాము లడిగె
నేర్పకుండ నెట్లు నేర్తుము మేమాడఁ జూడ నెంచి తేని యాడ మేము బూర నూదుచుండి మూరుచు రేపు మాపాడ నేర్పు మనుచుఁ బాము లడిగె [రేపుమాపు + ఆడ= రేపు మాపాడ] వీటను చూచి నట్టి వగు వింతల నక్కట యేమి చెప్పుదుం దూటులు లేని యత్తెలివి దోరము సెల్గఁగఁ జుట్టలై చనం మేటివి కొన్ని బాము లవి మీఱఁగఁ బాములు గోయిలమ్మలుంబాటలు పాడ నేర్పుమని పాములు వేడెను గోయిలమ్మలన్
మునుల యాశ్రమమున ముదముతో మృగరాశి కలసి గడుపు తరిని కాల మచట. వేడ్క తోడనన్ని వేళల యందున పాడ నేర్పమనుచు పాము లడిగె
మరొక పూరణ పాలు పుట్టలోన భక్తితో పోసినా. పసుపుకుంకుమాది వస్తువులవి పరిసరముల నెల్ల పాడుకానీక కా పాడ నేర్పు మనుచు పాము లడిగె
ఆ.వె:కాళియునకు జేయ కన్నయ్య గర్వభంగమ్ము వాని సతు లహమ్ము విడిరినీదు లీల లెల్ల నినదింపగా గృష్ణపాడ నేర్పు మనుచు పాము లడిగె
ఉ:ధాటిని జూపి కృష్ణు డతి దర్పము జూపెడు కాళియాహికిన్జేటు నొనర్ప భార్యలును జేసిరి కృష్ణునకున్ బ్రణామముల్ "పాటలు పాడ నేర్పు మని పాములు వేడెను కోయిలమ్మలన్దీటుగ జేసి నీ మహిమ దెల్పెడు రీతి" నటంచు నమ్రతన్.
పాములు విష్ణుమూర్తితో..."ఇట్టి నరులు మమ్ము వేణుగానము చేతవశము చేసు కొండ్రు పద్మనాభ!వారి వశము చేయు దారిచూపుమనుచు "పాడ నేర్పుమనుచు పాము లడిగె
ఆటవెలదిమా యులూచి వలచి మహితాత్ము నర్జునున్స్వాగతించమనెను సవ్యసాచిఁగోయిలమ్మలార కులుకులమరె మాకుపాడ నేర్పుమనుచు పాము లడిగెఉత్పలమాలనీటగు వాని నర్జునుని నీరజనేత్ర యులూచి ప్రేమతోఁబాటలగంధి తా వలచి స్వాగతమీయమటంచుఁ గోరెనేసాటియె రారు మాకెవరు చక్కని నాట్యములాడ పాడగన్పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్!
ఆటవెలదిమా యులూచి వలచి మహితాత్ము నర్జునున్స్వాగతించమనెను సవ్యసాచిఁగోయిలమ్మలార కులుకులమరె మాకుపాడ నేర్పుమనుచు పాము లడిగెఉత్పలమాలనీటగు వాని నర్జునుని నీరజనేత్ర యులూచి ప్రేమతోఁబాటలగంధి తా వలచి స్వాగతమీయమటంచుఁ గోరెనేసాటియె రారు మాకెవరు చక్కని నాట్యములాడ వేడ్కగన్పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్!
పిన్నక నాగేశ్వరరావు.పాటలన్న ప్రీతి పాములనెడు వాన్కియుత్సుకతను జూపి యొక్క గురువుచెంతకేగి తాను చేతులు జోడించిపాడ నేర్పుమనుచు పాము లడిగె.
జనులు మమ్ము గాంచి చంపగా జూతురుమాకు రక్ష ణేది? మహినియందుమందరమణి నీవు మమ్ములమేము కా పాడ నేర్పుమనుచు పాములడిగె
కుటము పయిన పికము కూయుచు నుండగ
రిప్లయితొలగించండిజెట్టు దిగువ నున్న చిట్ట లోని
సర్ప ములు వి ని కడు సంతస మొంది
పాడ నేర్పుమనుచు పాము లడిగె
పెద్ద పాము కడకు వెడలియు దమ యొక్క
రిప్లయితొలగించండిసందియములు దెల్పి సాయ మడిగె
శత్రు తతుల నుండి సంతాన ములను గా
పాడ నేర్పు మనుచు పాము లడి గె
రిప్లయితొలగించండిమమ్ము గాంచినంత మనుజులు భీతిల్లి
చంప బూను చుండ్రి చంద్రధరుడ
నరులు ప్రేమతోడ ధరలోన మమ్ము కా
పాడ నేర్పుమనుచు పాము లడిగె.
ఓటుల బొంది గెల్చుచు మహోన్నత స్థానము పొందు మంత్రులే
చాటున నుండి విజ్ఞులిల సాయము జేయుచు నుండగా భువిన్
మేటిగ పాలనమ్మునకు మేలగు సూచనలడ్గుటన్ గనన్
పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్.
వసుధపై వసించు ప్రాణులనెల్ల కా
రిప్లయితొలగించండిపాడ నేర్పు మనుచు పాము లడిగె
కాటు వైచి నపుడు కాలము చెల్లక
సేద దీరు నటుల చేయ మనుచు
పాటవమొప్పు గానమును పాపలు పాములు జంతుజాలముల్
రిప్లయితొలగించండిగాటపు నర్మిలిన్ వినుటకై వివశత్వము నొందురీ భువిన్
దీటుగ నామనిన్ పికము తీయగ సల్పగ కూజితమ్ములన్
పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్
శిశువు పశువు పాము శిరసులనూపవె
రిప్లయితొలగించండిపాటవినగనెపుడు పరవశించి
కోకిలమ్మ సేయు కూజితమ్మునువిని
పాడ నేర్పుమనుచు పాము లడిగె
నేర్పకుండ నెట్లు నేర్తుము మేమాడఁ
రిప్లయితొలగించండిజూడ నెంచి తేని యాడ మేము
బూర నూదుచుండి మూరుచు రేపు మా
పాడ నేర్పు మనుచుఁ బాము లడిగె
[రేపుమాపు + ఆడ= రేపు మాపాడ]
వీటను చూచి నట్టి వగు వింతల నక్కట యేమి చెప్పుదుం
దూటులు లేని యత్తెలివి దోరము సెల్గఁగఁ జుట్టలై చనం
మేటివి కొన్ని బాము లవి మీఱఁగఁ బాములు గోయిలమ్మలుం
బాటలు పాడ నేర్పుమని పాములు వేడెను గోయిలమ్మలన్
మునుల యాశ్రమమున ముదముతో మృగరాశి
రిప్లయితొలగించండికలసి గడుపు తరిని కాల మచట.
వేడ్క తోడనన్ని వేళల యందున
పాడ నేర్పమనుచు పాము లడిగె
మరొక పూరణ
రిప్లయితొలగించండిపాలు పుట్టలోన భక్తితో పోసినా.
పసుపుకుంకుమాది వస్తువులవి
పరిసరముల నెల్ల పాడుకానీక కా
పాడ నేర్పు మనుచు పాము లడిగె
ఆ.వె:కాళియునకు జేయ కన్నయ్య గర్వభం
రిప్లయితొలగించండిగమ్ము వాని సతు లహమ్ము విడిరి
నీదు లీల లెల్ల నినదింపగా గృష్ణ
పాడ నేర్పు మనుచు పాము లడిగె
ఉ:ధాటిని జూపి కృష్ణు డతి దర్పము జూపెడు కాళియాహికిన్
రిప్లయితొలగించండిజేటు నొనర్ప భార్యలును జేసిరి కృష్ణునకున్ బ్రణామముల్
"పాటలు పాడ నేర్పు మని పాములు వేడెను కోయిలమ్మలన్
దీటుగ జేసి నీ మహిమ దెల్పెడు రీతి" నటంచు నమ్రతన్.
పాములు విష్ణుమూర్తితో...
రిప్లయితొలగించండి"ఇట్టి నరులు మమ్ము వేణుగానము చేత
వశము చేసు కొండ్రు పద్మనాభ!
వారి వశము చేయు దారిచూపుమనుచు "
పాడ నేర్పుమనుచు పాము లడిగె
ఆటవెలది
రిప్లయితొలగించండిమా యులూచి వలచి మహితాత్ము నర్జునున్
స్వాగతించమనెను సవ్యసాచిఁ
గోయిలమ్మలార కులుకులమరె మాకు
పాడ నేర్పుమనుచు పాము లడిగె
ఉత్పలమాల
నీటగు వాని నర్జునుని నీరజనేత్ర యులూచి ప్రేమతోఁ
బాటలగంధి తా వలచి స్వాగతమీయమటంచుఁ గోరెనే
సాటియె రారు మాకెవరు చక్కని నాట్యములాడ పాడగన్
పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్!
ఆటవెలది
రిప్లయితొలగించండిమా యులూచి వలచి మహితాత్ము నర్జునున్
స్వాగతించమనెను సవ్యసాచిఁ
గోయిలమ్మలార కులుకులమరె మాకు
పాడ నేర్పుమనుచు పాము లడిగె
ఉత్పలమాల
నీటగు వాని నర్జునుని నీరజనేత్ర యులూచి ప్రేమతోఁ
బాటలగంధి తా వలచి స్వాగతమీయమటంచుఁ గోరెనే
సాటియె రారు మాకెవరు చక్కని నాట్యములాడ వేడ్కగన్
పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
పాటలన్న ప్రీతి పాములనెడు వాన్కి
యుత్సుకతను జూపి యొక్క గురువు
చెంతకేగి తాను చేతులు జోడించి
పాడ నేర్పుమనుచు పాము లడిగె.
రిప్లయితొలగించండిజనులు మమ్ము గాంచి చంపగా జూతురు
మాకు రక్ష ణేది? మహినియందు
మందరమణి నీవు మమ్ములమేము కా
పాడ నేర్పుమనుచు పాములడిగె