10-1-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సద్దు సేయదు పికము వసంతమందు”(లేదా...)“సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్”(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మాచవోలు శ్రీధరరావు గారి సమస్య)
ఎచట నుండునో మరి యన్య ఋతువు లందుసద్దు సేయదు పికము ; వసంతమందుగళము విప్పి వీనుల విందు గలుగ జేయుమావి చిగురు భుజించిన మత్తుతోడ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
హద్దు మీరిన కారు చిచ్చది యంత కంతకు పెర్గియున్జిద్దుతోడను గాల్చివేసెను జేను మొత్తమునిర్దయన్సుద్ది సెప్పుట మానవేసెను శోకమందున మున్గి తాసద్దు సేయదు కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "...యంతకంతకు హెచ్చినన్... మానివేసెను" అనండి. 'జిద్దు' అన్యదేశ్యం.
ప్రహ్లాదుడు -- హిరణ్య కశ్యపుడుతే. గీ.భక్తి రసమున మున్గిన బాలకునికి తండ్రి తననామధేయంబు తలప మనగతలప నేర్చునె? యెట్లన్న ఇలను"కాకి సద్దు, సేయదు పికము వసంతమందు"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమయమిదియె కాదన్న విషయమెఱుంగవేల? సంగీత సాధన పేరు తోడరాగములవేల వలదంటి రాత్రి వేళసద్దు సేయదు పికము వసంతమందు. హద్దులన్నవి దాటబోకుడి ఆలకింపుడు నానుడుల్ పెద్దలెల్లరు నిద్రబోయిరి, వేళగాదిది పాటకున్ వద్దువద్దని చెప్పుచుంటిని బాలకావిను శార్వరిన్ సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
అన్ని ఋతువుల యందున నణగి యుండిసద్దు సేయదు పికము : వసంత మందుమావి చిగురులు మెక్కియు మత్తు తోడకూయ మొదలిడు కోకిల కోర్కె మీర
సుద్దు లేవియు లెక్క చేయక శుంఠులైన ప్రజాళియున్హద్దు మీరిన కశ్మలమ్ముల హాని గూర్చగ గాలికిన్ముద్దులొల్కు స్వరమ్ము బొంగురు పోవనాగ్రహ మందుచున్సద్దు సేయదు కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్
మొద్దు నిద్దుర పోవుచున్నది పొద్దు మీరుచు నుండియున్సద్దు సేయదు కోకిలమ్మ ; వసంతకాలము వచ్చినన్హద్దు మీరుచు కూయునె ప్పుడునన్ని వేళల ముద్దుగన్కొద్ది కొద్దిగ మావి చెట్టులకున్న పల్లవ మెక్కుచున్
సరస సంగీత నిర్జర జలధి లోనదేశ జనులనెపుడు ముంచి తేల్చిన 'లత'భరత గానకోకిల చేరె పరమపదముసద్దు సేయదు పికము వసంతమందు
సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్మొద్దు నిద్దురపోయెనామరి మూగనోమును పట్టెనా?హద్దుఁ గానక పాదపమ్ముల నంతమొందగ జేసినన్క్రుద్ధమొందిన కోకిలమ్మకు గొంతు విస్వరమొందెనా?
వనములన్నియు క్రమముగా హననమొందమచ్చుకైనను గానక పచ్చదనమునంతుతెలియని నైరాశ్య మావరించిసద్దు సేయదు పికము వసంతమందు
తేటగీతిసృష్టి పులకింప మావిళ్ల చిగురులలమిహరితవర్ణంపు వస్త్రాల మురిసినటులమేలమూదగ నొగరుల మెసవకుండసద్దు సేయదు పికము వసంతమందుమత్తకోకిలసిద్ధమైనవి లేచిగుర్లన సృష్టి ముచ్టట గొల్పగన్ముద్దులొల్కెడు మావిపిందెలుఁ బుల్కరింతలు రేపఁగన్హద్దులేదన నా యొగర్లను నార్తిమీరగ మెక్కకేసద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్
హద్దులేని యపేక్ష తోడుత నార్జనమ్మును పెంచగాముద్దుసేయు వనమ్ములన్నియు మూర్ఖులైప్రజ కూల్చగాశుద్ధిలేని రసాయనమ్ములు చొప్పడంగ దళమ్ములన్సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
క్రొవ్విడి వెంకట రాజారావు: మలిన వాతావరణమున వెలసినట్టి కలుషమంటిన దళములు కతికియుండి గళముచెడి మాటరాకుండు కాలమందు సద్దుచేయదు పికము వసంతమందు. సుద్దివిడ్చిన కశ్మలంబగు చూషకమ్మును బీల్చియున్ నిద్దమౌనగు పాటపాడెడి నేర్పుగూడిన కంఠమే గద్దరింపుగ మారిపోవగ కక్కసమ్మును జెందుచున్ సద్దుచేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్.
గురువు గారు ధన్యవాదాలు మీ సూచనకు. సవరించి పంపినాను
తీయ తీయని చందపుఁ దీరు నుండ మానసం బలరు పగిది మ్రాను లందుఁ బాడు రాగము సుద్దులు గూడి నట్టి సద్దు సేయదు పికము వసంత మందునిద్దురం బెను తిండిఁ గోరెడు నిత్య కాములఁ గాంచి యెప్పొద్దు వోలుచు వారిఁ దాఁ దలపోయకే నిజ ధర్మముం దద్ద మామిడి పల్లవమ్ము సతమ్ము మెక్కి పరుండి యే సద్దు సేయదు కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్
వద్దు వేరు వరంబు మేలని భర్త యెంతగ వేడినన్ గద్దెపై సుతు గాంచ గానల కంపె రాముని కైకయే హద్దెరుంగని దుఃఖమందె జనాళి లోకము చీకటైసద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్
నిద్రపోవగ నెంచుచు నెమ్మదిగనుసద్దుచేయదు పికము వసంతమందుమావిచిగురునుతినుచుతా మత్తుతోడకమ్మనైన పాటలుపాడు గళమునెత్తిమరొక పూరణస్వార్థ చింతన మూనుచు జవము గానుమామిడి తరువులనుగొట్ట మానవాళిచెట్టుకొమ్మపై నించుక చివురులేకసద్దు చేయదు పికము వసంతమందు
హద్దుమీరుతరంగముల్మరియండజంబులఁ జంపగాముద్దుముద్దుగముచ్చటించుచుమూడుఁబొద్దులుసాగుచున్మొద్దునిద్దురవీడకన్సహజాతముల్దెగగోయగాసద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్కొరుప్రోలు రాధాకృష్ణరావు
ఎచట నుండునో మరి యన్య ఋతువు లందు
రిప్లయితొలగించండిసద్దు సేయదు పికము ; వసంతమందు
గళము విప్పి వీనుల విందు గలుగ జేయు
మావి చిగురు భుజించిన మత్తుతోడ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిహద్దు మీరిన కారు చిచ్చది యంత కంతకు పెర్గియున్
రిప్లయితొలగించండిజిద్దుతోడను గాల్చివేసెను జేను మొత్తము
నిర్దయన్
సుద్ది సెప్పుట మానవేసెను శోకమందున మున్గి తా
సద్దు సేయదు కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...యంతకంతకు హెచ్చినన్... మానివేసెను" అనండి. 'జిద్దు' అన్యదేశ్యం.
ప్రహ్లాదుడు -- హిరణ్య కశ్యపుడు
రిప్లయితొలగించండితే. గీ.
భక్తి రసమున మున్గిన బాలకునికి
తండ్రి తననామధేయంబు తలప మనగ
తలప నేర్చునె? యెట్లన్న ఇలను"కాకి
సద్దు, సేయదు పికము వసంతమందు"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసమయమిదియె కాదన్న విషయమెఱుంగ
వేల? సంగీత సాధన పేరు తోడ
రాగములవేల వలదంటి రాత్రి వేళ
సద్దు సేయదు పికము వసంతమందు.
హద్దులన్నవి దాటబోకుడి ఆలకింపుడు నానుడుల్
పెద్దలెల్లరు నిద్రబోయిరి, వేళగాదిది పాటకున్
వద్దువద్దని చెప్పుచుంటిని బాలకావిను శార్వరిన్
సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅన్ని ఋతువుల యందున నణగి యుండి
రిప్లయితొలగించండిసద్దు సేయదు పికము : వసంత మందు
మావి చిగురులు మెక్కియు మత్తు తోడ
కూయ మొదలిడు కోకిల కోర్కె మీర
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసుద్దు లేవియు లెక్క చేయక శుంఠులైన ప్రజాళియున్
రిప్లయితొలగించండిహద్దు మీరిన కశ్మలమ్ముల హాని గూర్చగ గాలికిన్
ముద్దులొల్కు స్వరమ్ము బొంగురు పోవనాగ్రహ మందుచున్
సద్దు సేయదు కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమొద్దు నిద్దుర పోవుచున్నది పొద్దు మీరుచు నుండియున్
రిప్లయితొలగించండిసద్దు సేయదు కోకిలమ్మ ; వసంతకాలము వచ్చినన్
హద్దు మీరుచు కూయునె ప్పుడు
నన్ని వేళల ముద్దుగన్
కొద్ది కొద్దిగ మావి చెట్టులకున్న పల్లవ మెక్కుచున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసరస సంగీత నిర్జర జలధి లోన
రిప్లయితొలగించండిదేశ జనులనెపుడు ముంచి తేల్చిన 'లత'
భరత గానకోకిల చేరె పరమపదము
సద్దు సేయదు పికము వసంతమందు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్
రిప్లయితొలగించండిమొద్దు నిద్దురపోయెనామరి మూగనోమును పట్టెనా?
హద్దుఁ గానక పాదపమ్ముల నంతమొందగ జేసినన్
క్రుద్ధమొందిన కోకిలమ్మకు గొంతు విస్వరమొందెనా?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివనములన్నియు క్రమముగా హననమొంద
రిప్లయితొలగించండిమచ్చుకైనను గానక పచ్చదనము
నంతుతెలియని నైరాశ్య మావరించి
సద్దు సేయదు పికము వసంతమందు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిసృష్టి పులకింప మావిళ్ల చిగురులలమి
హరితవర్ణంపు వస్త్రాల మురిసినటుల
మేలమూదగ నొగరుల మెసవకుండ
సద్దు సేయదు పికము వసంతమందు
మత్తకోకిల
సిద్ధమైనవి లేచిగుర్లన సృష్టి ముచ్టట గొల్పగన్
ముద్దులొల్కెడు మావిపిందెలుఁ బుల్కరింతలు రేపఁగన్
హద్దులేదన నా యొగర్లను నార్తిమీరగ మెక్కకే
సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిహద్దులేని యపేక్ష తోడుత నార్జనమ్మును పెంచగా
రిప్లయితొలగించండిముద్దుసేయు వనమ్ములన్నియు మూర్ఖులైప్రజ కూల్చగా
శుద్ధిలేని రసాయనమ్ములు చొప్పడంగ దళమ్ములన్
సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమలిన వాతావరణమున వెలసినట్టి
కలుషమంటిన దళములు కతికియుండి
గళముచెడి మాటరాకుండు కాలమందు
సద్దుచేయదు పికము వసంతమందు.
సుద్దివిడ్చిన కశ్మలంబగు చూషకమ్మును బీల్చియున్
నిద్దమౌనగు పాటపాడెడి నేర్పుగూడిన కంఠమే
గద్దరింపుగ మారిపోవగ కక్కసమ్మును జెందుచున్
సద్దుచేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్.
గురువు గారు ధన్యవాదాలు మీ సూచనకు. సవరించి పంపినాను
రిప్లయితొలగించండితీయ తీయని చందపుఁ దీరు నుండ
రిప్లయితొలగించండిమానసం బలరు పగిది మ్రాను లందుఁ
బాడు రాగము సుద్దులు గూడి నట్టి
సద్దు సేయదు పికము వసంత మందు
నిద్దురం బెను తిండిఁ గోరెడు నిత్య కాములఁ గాంచి యె
ప్పొద్దు వోలుచు వారిఁ దాఁ దలపోయకే నిజ ధర్మముం
దద్ద మామిడి పల్లవమ్ము సతమ్ము మెక్కి పరుండి యే
సద్దు సేయదు కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్
వద్దు వేరు వరంబు మేలని భర్త యెంతగ వేడినన్
రిప్లయితొలగించండిగద్దెపై సుతు గాంచ గానల కంపె రాముని కైకయే
హద్దెరుంగని దుఃఖమందె జనాళి లోకము చీకటై
సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్
నిద్రపోవగ నెంచుచు నెమ్మదిగను
రిప్లయితొలగించండిసద్దుచేయదు పికము వసంతమందు
మావిచిగురునుతినుచుతా మత్తుతోడ
కమ్మనైన పాటలుపాడు గళమునెత్తి
మరొక పూరణ
స్వార్థ చింతన మూనుచు జవము గాను
మామిడి తరువులనుగొట్ట మానవాళి
చెట్టుకొమ్మపై నించుక చివురులేక
సద్దు చేయదు పికము వసంతమందు
హద్దుమీరుతరంగముల్మరియండజంబులఁ జంపగా
రిప్లయితొలగించండిముద్దుముద్దుగముచ్చటించుచుమూడుఁబొద్దులుసాగుచున్
మొద్దునిద్దురవీడకన్సహజాతముల్దెగగోయగా
సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్
కొరుప్రోలు రాధాకృష్ణరావు