5, జనవరి 2023, గురువారం

సమస్య - 4300

6-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చురచుర చూడ్కుల దినమణి సుధలం గురిసెన్”
(లేదా...)
“చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి గారి సమస్య)

34 కామెంట్‌లు:

  1. కందం
    మురిపెమ్మున ముని మంత్రము
    పరీక్షకెంచి పృథ మ్రొక్కి భానుని దలఁచన్
    ధరణికి బిరబిర దిగుచున్
    జురచుర చూడ్కుల దినమణి సుధలన్ గురిసెన్

    చంపకమాల
    మఱువక మౌని మంత్రమును మానిని కుంతి పరీక్షకెంచుచున్
    గుఱుకొని తూర్పు దేవరను గోరి పటింపగ సూనునందగన్
    సరసిజ నేత్ర ముందుదిగి, సర్వజగాన దివాకరుండనన్
    చురచుర చూపులం గనలి, చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా🙏 రెండవపాదము చివర 'పఠింపగ' అని టైపాటు సవరణ.

      తొలగించండి

  2. హరియే , మయూఖములతో
    ధరణిని దరికొల్పి యలసి దశమీస్తుండై
    చరమదిశనస్తమింపగ
    చురచుర చూడ్కుల దినమణి, సుధలం గురిసెన్.

    రిప్లయితొలగించండి
  3. కందం.
    చరచర తూర్పున పొడిచెను
    చురచుర చూడ్కుల దినమణి,సుధలం గురిసెన్
    హరి,పున్నమి వెన్నెలలో
    విరివిగ ఓషధి తరువులు వికసించంగన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి

  4. తరుణి హిడింబ గాంచి తన దారగ గైకొననెంచి యామె సో
    దరుడగు క్రూర రక్కసుని దందడి యందువధించి ప్రేమతో
    సరసిజ లోచనన్ లలిని స్వంగమునన్ గొని భీమసేనుడా
    చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే.

    రిప్లయితొలగించండి
  5. వరుసగపండితులడిగెడు
    పరిపరి ప్రశ్నలకును వెరవకబదులిడగన్
    భరతునివధానమునుగని
    చురచుర చూడ్కులదినమణి సుధలన్ గురిసెన్

    రిప్లయితొలగించండి
  6. ఒరిగెను పడమటి దిక్కున
    చురచుర చూడ్కుల దినమణి; సుధలం గురిసెన్
    హరిణాంకుడు పున్నమి రా
    తిరి శీతమయూఖరేఖ తేజోమయమై

    రిప్లయితొలగించండి
  7. నరులను దహించు చుండెను
    చురచుర చూడ్కుల దినమణి ;సుధలం గురిసెన్
    త్వరత్వర చల్లబరచగ
    సురవర్త్మమున ఛవితోడ సోముడు రాగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'త్వరత్వర' అన్నపుడు మొదటి 'ర' గురువై గణభంగం అవుతుంది కదా?

      తొలగించండి
  8. విరియుచు తూర్పున గనబడె
    చుర చుర చూడ్కు ల దిన మణి :సుధలన్ గురి సెన్
    గరముగ సోముడు నభ మున
    మురియగ లోకములు జాల మోదము బొందన్

    రిప్లయితొలగించండి
  9. కం.
    వరమును బొందిన కుంతియె
    కరముల జోడించి పిలువ,గదలుచు వడిగన్
    దరుణికినొసంగ దనయుని
    *జురచుర చూడ్కుల దినమణి సుధలం గురిసెన్*
    చం.మా.
    వరమునుబొంది కుంతి కన ప్రార్థన సేయుచు వేడినంత, తా
    గరిగిన మానసంబునను గన్యకు బుత్రునొసంగుకార్యమై
    తరలుచు వేగపాటునను దక్షణమే నిలువంగ జెంతనన్
    *జురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే*

    రిప్లయితొలగించండి
  10. పరిపరి విధముల నూష్మము
    పరిసరములనింపి మొయిలు పరిగొనినంతన్
    కురియగ వర్షము భువిపై
    చురచుర చూడ్కుల దినమణి సుధలం గురిసెన్

    రిప్లయితొలగించండి
  11. మరిమరి కోల్మసంగి రవి మండుచు నూష్మము గుమ్మరించుచున్
    పరిపరి రీతులన్ జనుల పల్లటపెట్టుచునుండ నింతలో
    పరిగొని మేఘమాలికలు వర్షపుజల్లుల జిల్కరించగా
    చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే

    రిప్లయితొలగించండి
  12. పఱచుచు వెన్నెల మనమున
    నఱమఱ లేక యొక యింత యలరింపఁగ నం
    దఱఁ జంద్రుఁ, డస్తమింపఁగఁ
    జుఱచుఱ చూడ్కుల దినమణి, సుధలం గురిసెన్

    వెఱ పొక యింత లే కెదల విస్తృత దర్పము మూరు చుండఁగా
    నెఱఁగక యున్నఁ దన్ను గని హీన మనస్కులు వారి నొంపఁగా
    నఱిముఱి సెంద ముజ్జగము లార్తి నభోమణి కంద గాత్రముల్
    చుఱచుఱ చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే

    [సుధ = సున్నము; నభోమణి = నింగి నున్న (సున్నపు) ఱాయి]

    రిప్లయితొలగించండి
  13. కం:హర హర ఇదేమి చలి యని
    కర వొందగ నెండ పొడకు కమ్మగ నిపుడే
    కరముల దట్టుచు,సన్నని
    చురచుర చూడ్కుల దినమణి సుధలన్ గురిసెన్

    రిప్లయితొలగించండి
  14. చం:"హరి హరి !మంచు బిందువులె యర్కుని గెల్చెడు కాల" మంచు నే
    పరిపరి కుందుచుండ దన ప్రాభవ మొక్క క్షణాన జూపుచున్
    కరముల స్పర్శ నిచ్చి ,యొక కమ్మని వెచ్చదనమ్ము నిచ్చు నా
    చురచుర చూపులన్ గనలి చూడ్కుల తో సుధ జిల్కె భానుడే

    రిప్లయితొలగించండి
  15. కురియగ మంచు వర్షమట కుందుచు నిండ్లను కొందరాగినన్
    పరగుచు ముఖ్య కార్య పరిపాలనకై మరికొందరేగగా
    తరిగెను వర్ష తీవ్రతయు దాటెను మబ్బులు నింగి నీలమై
    చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే

    రిప్లయితొలగించండి