11-1-2023 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె”(లేదా...)“కాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్”(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో ఉపాధ్యాయుల గౌరీశంకరరావు గారి సమస్య)
ఉ.లోకము మెచ్చురీతి కొమరున్ గడు హెచ్చగువిద్యల దిట్ట చేయగాయా కొమరుండు చెడి యాస్తుల నమ్ముచు ఖిన్నుడై చనన్లోకులుకాకులై మనుచు లోపల గల్గిన కుళ్ళు నిట్లు యీ "కాకికిఁ గాకి పుట్టె"నని కాకులు గోలిడె గుంపు కట్టుచున్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి, రెండవ పాదాలలో గణభంగం. "చేయగా నా కొమరుండు" అని ఉండాలి. సవరించండి.
కొమ్మపయిన గట్టుకొనిన గూటిలోనకాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె ,రహిని పొందిన దానికి లాంఛనముగ ,కాకులయిన మనుజులైన కరణి యొకటె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంతు వృద్ధికి కృషి చేయు జాతు లన్నిపక్షి జాతియు తమవంతు పాటు పడుచుకాకి కిం కాకి పుట్టగ గాకు లఱ చెసంత సంబును బ్రకటింప సద్దు సేసి
చీకటిని మించినట్టి కసీన వర్ణపేదవానికొక సుతయె బెరయ గాంచి ఛీత్కరింపగ నొకడనె చిట్టకమున కాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె.కాకులవంటి లోకులు సుఖమ్ములఁ గోరుచు పేదవారినే ఛీ కొడుచుందురంచు కవి చెప్పె నొకానొక కావ్యమందునన్ సాకగ లేనివానికిల సంతతి కల్గిన యోర్వలేక నేకాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: కలివిడితనమ్ము గలిగిన కాకులన్ని గ్రుడ్డుపొదిగిన వెంటనే గూడునందు వెలసియుండిన పిల్లను వీక్షజేసి కాకికిం గాకి పుట్టగ గాకు లఱచె.
కాకుల సదృశమైనట్టి గణములోననెల్లరి శరీరముండును నల్లగానెనల్లనైన మగువ నల్ల పిల్లనుగనకాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచెలోకులు కాకులే ననెడు లోకపు వాక్కులు నిక్కమౌను చీకాకు పరాభవమ్ములను గాచుచు కశ్మలమున్ భరింపగాకాకుల బోలు కాంతలు నికామపు చర్చల పెండ్లికాని యేకాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
మనిషి గ్రుడ్డువెట్టిన వింత కనగ భువినిపికము గ్రుడ్డును పొదిగిన వింతయేగవింతలకు వింతయగు గ్రుడ్డువెట్టి పొదుగుకాకికింగాకి పుట్టఁగఁ, గాకులఱచెచివుకుల అచ్యుత దేవరాయలు, అమెరికా
లోకులు కాకులైరి కడు రోతగ నొంటరి యాడుదాని నేకాకిగనున్నదాని పలు కష్టములందున మున్గియుండ చీకాకుగ కన్నబిడ్డఁ గని కల్మష భావము తేలువాఱ నేకాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వృద్ధి సెందఁగ వంశము బుద్ధి యున్ననెవ్వఁ డందఁడు హర్షమ్ము నెడఁద లోన సంతసమ్మునఁ బొంగుచుఁ జెంత నంతఁ గాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచెసాఁకునొ సాక కుండునొ విచారము నూని యెడందలో నికం దాఁకునొ తాక కుండునొ సుతం గర యుగ్మము తోడ నంచునున్ లోకులు కాకులే యన విరుద్ధమె కూఁతురు వుట్ట హర్ష మేకాకికిఁ గాకి పుట్టె నని కాకులు గోలిడె గుంపు కట్టుచున్ [కాకి = అల్పము; హర్ష మల్పము]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తేటగీతి.కాకిపిల్ల కాకికి ముద్దు, మేకపిల్లమేకకి పరమ ప్రీతియౌ,లోక రీతిసంతతి గని సంతోషము సహజ మగుటకాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
నిండుచూలాలు పతి వీడ గుండె చెదరెనొంటరిగ జీవనముఁ జేయ నొక్కరోజునల్లవనితకుఁ బుట్టెను నల్లపిల్లకాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె
తేటగీతిమౌని మంత్రము పఠియించి మర్కునడిగికొడుకునున్ గుమారిగ నంది కుంతి తలఁచనొప్పని ప్రజల నూహింప నొంటరి యగుకాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచెఉత్పలమాలచేకుర మౌనిమంత్రమది సీరుని వేడ కుమారి కుంతియేవీక దివాకరుండు వెనువెంటనె పుత్రునొసంగి వీడఁగన్లోకుల నైజమున్ దెలిసి రోదనమెంచిన నామె యూహ నేకాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్
ఐకమత్య మునకు చిహ్నమవనియందు కాకులేయను మాటలు కల్లకాదువినుమొకతరువునందున వేకువందుకాకికింకాకిపుట్టగ గాకులరచెకాకులవంటిదీజగతికాల్చుచునుండుసతమ్మువాక్కుచేశోకముకూర్చుచుండునుగసూటిగమాటలనాడకండనేకాకికి,కాకిపుట్టెననికాకులుగోలిడెగుంపుకట్టుచున్నేకత శూన్యమయ్యెకదయిమ్మనుజాళికటంచునేడ్చెతాన్
కాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె గ్రుడ్డుఁ జీల్చుచు వెలువడ గోముగాను సహజ మయ్యది జగమున జంతువులకు కాకికి ముద్దుగా నరయగఁ గాకి పిల్ల
కాకుల గోల యేమిటని కాతర మొందుచు బైటచూడగాఁగాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్కాకుల పిల్లలుల్ దలప కాకుల కున్ బెను ముద్దులౌనుగా లోకము తీరునట్లెగద రూపవ తీచెలి! నీవు చెప్పుమా
క్రొవ్విడి వెంకట రాజారావు: రాకయు పోకయున్ మఱియు రాగల మేలును కీడులన్ సదా కేకల కూతలన్ మనకు కృష్ణము లెల్లెడ తెల్పునట్లుగన్ కాకికి గ్రుడ్డు విచ్చుకొని కాకియె సంభవమొంద నెమ్మితో గాకికి గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపుకట్టుచున్.
లోకపు రీతి మారె గన లుప్తమయెన్ సరసద్వివేకముల్తాకి మనంబు గాయపడ దౌష్ట్య విమర్శనమే విధానమౌపోకిరి మూకలెల్లెడల బ్రోపడె వీరల తీరు గాంచగాకాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్
ఉ.
రిప్లయితొలగించండిలోకము మెచ్చురీతి కొమరున్ గడు హెచ్చగువిద్యల దిట్ట చేయగా
యా కొమరుండు చెడి యాస్తుల నమ్ముచు ఖిన్నుడై చనన్
లోకులుకాకులై మనుచు లోపల గల్గిన కుళ్ళు నిట్లు యీ
"కాకికిఁ గాకి పుట్టె"నని కాకులు గోలిడె గుంపు కట్టుచున్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి, రెండవ పాదాలలో గణభంగం. "చేయగా నా కొమరుండు" అని ఉండాలి. సవరించండి.
కొమ్మపయిన గట్టుకొనిన గూటిలోన
రిప్లయితొలగించండికాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె ,
రహిని పొందిన దానికి లాంఛనముగ ,
కాకులయిన మనుజులైన కరణి యొకటె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంతు వృద్ధికి కృషి చేయు జాతు లన్ని
రిప్లయితొలగించండిపక్షి జాతియు తమవంతు పాటు పడుచు
కాకి కిం కాకి పుట్టగ గాకు లఱ చె
సంత సంబును బ్రకటింప సద్దు సేసి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచీకటిని మించినట్టి కసీన వర్ణ
పేదవానికొక సుతయె బెరయ గాంచి
ఛీత్కరింపగ నొకడనె చిట్టకమున
కాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె.
కాకులవంటి లోకులు సుఖమ్ములఁ గోరుచు పేదవారినే
ఛీ కొడుచుందురంచు కవి చెప్పె నొకానొక కావ్యమందునన్
సాకగ లేనివానికిల సంతతి కల్గిన యోర్వలేక నే
కాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికలివిడితనమ్ము గలిగిన కాకులన్ని
గ్రుడ్డుపొదిగిన వెంటనే గూడునందు
వెలసియుండిన పిల్లను వీక్షజేసి
కాకికిం గాకి పుట్టగ గాకు లఱచె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాకుల సదృశమైనట్టి గణములోన
రిప్లయితొలగించండినెల్లరి శరీరముండును నల్లగానె
నల్లనైన మగువ నల్ల పిల్లనుగన
కాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె
లోకులు కాకులే ననెడు లోకపు వాక్కులు నిక్కమౌను చీ
కాకు పరాభవమ్ములను గాచుచు కశ్మలమున్ భరింపగా
కాకుల బోలు కాంతలు నికామపు చర్చల పెండ్లికాని యే
కాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిమనిషి గ్రుడ్డువెట్టిన వింత కనగ భువిని
రిప్లయితొలగించండిపికము గ్రుడ్డును పొదిగిన వింతయేగ
వింతలకు వింతయగు గ్రుడ్డువెట్టి పొదుగు
కాకికింగాకి పుట్టఁగఁ, గాకులఱచె
చివుకుల అచ్యుత దేవరాయలు, అమెరికా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలోకులు కాకులైరి కడు రోతగ నొంటరి యాడుదాని నే
రిప్లయితొలగించండికాకిగనున్నదాని పలు కష్టములందున మున్గియుండ చీ
కాకుగ కన్నబిడ్డఁ గని కల్మష భావము తేలువాఱ నే
కాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివృద్ధి సెందఁగ వంశము బుద్ధి యున్న
రిప్లయితొలగించండినెవ్వఁ డందఁడు హర్షమ్ము నెడఁద లోన
సంతసమ్మునఁ బొంగుచుఁ జెంత నంతఁ
గాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె
సాఁకునొ సాక కుండునొ విచారము నూని యెడందలో నికం
దాఁకునొ తాక కుండునొ సుతం గర యుగ్మము తోడ నంచునున్
లోకులు కాకులే యన విరుద్ధమె కూఁతురు వుట్ట హర్ష మే
కాకికిఁ గాకి పుట్టె నని కాకులు గోలిడె గుంపు కట్టుచున్
[కాకి = అల్పము; హర్ష మల్పము]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండితేటగీతి.
రిప్లయితొలగించండికాకిపిల్ల కాకికి ముద్దు, మేకపిల్ల
మేకకి పరమ ప్రీతియౌ,లోక రీతి
సంతతి గని సంతోషము సహజ మగుట
కాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిండుచూలాలు పతి వీడ గుండె చెదరె
రిప్లయితొలగించండినొంటరిగ జీవనముఁ జేయ నొక్కరోజు
నల్లవనితకుఁ బుట్టెను నల్లపిల్ల
కాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిమౌని మంత్రము పఠియించి మర్కునడిగి
కొడుకునున్ గుమారిగ నంది కుంతి తలఁచ
నొప్పని ప్రజల నూహింప నొంటరి యగు
కాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె
ఉత్పలమాల
చేకుర మౌనిమంత్రమది సీరుని వేడ కుమారి కుంతియే
వీక దివాకరుండు వెనువెంటనె పుత్రునొసంగి వీడఁగన్
లోకుల నైజమున్ దెలిసి రోదనమెంచిన నామె యూహ నే
కాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఐకమత్య మునకు చిహ్నమవనియందు
రిప్లయితొలగించండికాకులేయను మాటలు కల్లకాదు
వినుమొకతరువునందున వేకువందు
కాకికింకాకిపుట్టగ గాకులరచె
కాకులవంటిదీజగతికాల్చుచునుండుసతమ్మువాక్కుచే
శోకముకూర్చుచుండునుగసూటిగమాటలనాడకండనే
కాకికి,కాకిపుట్టెననికాకులుగోలిడెగుంపుకట్టుచు
న్నేకత శూన్యమయ్యెకదయిమ్మనుజాళికటంచునేడ్చెతాన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె
రిప్లయితొలగించండిగ్రుడ్డుఁ జీల్చుచు వెలువడ గోముగాను
సహజ మయ్యది జగమున జంతువులకు
కాకికి ముద్దుగా నరయగఁ గాకి పిల్ల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాకుల గోల యేమిటని కాతర మొందుచు బైటచూడగాఁ
రిప్లయితొలగించండిగాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్
కాకుల పిల్లలుల్ దలప కాకుల కున్ బెను ముద్దులౌనుగా
లోకము తీరునట్లెగద రూపవ తీచెలి! నీవు చెప్పుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరాకయు పోకయున్ మఱియు రాగల మేలును కీడులన్ సదా
కేకల కూతలన్ మనకు కృష్ణము లెల్లెడ తెల్పునట్లుగన్
కాకికి గ్రుడ్డు విచ్చుకొని కాకియె సంభవమొంద నెమ్మితో
గాకికి గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపుకట్టుచున్.
లోకపు రీతి మారె గన లుప్తమయెన్ సరసద్వివేకముల్
రిప్లయితొలగించండితాకి మనంబు గాయపడ దౌష్ట్య విమర్శనమే విధానమౌ
పోకిరి మూకలెల్లెడల బ్రోపడె వీరల తీరు గాంచగా
కాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్