10-10-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగు”
(లేదా...)
“తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో”
(నేను నేపాల్ వెళ్ళి ఉంటే ఈరోజు కాట్మండు పశుపతి దర్శనం)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నాటి శైవ ద్వేషులైన వైష్ణవుల ప్రచారం:తేటగీతిహృదయమందు లక్ష్మినిదాల్చి యింపుగానుసృష్టి స్థితికారుఁడౌ శౌరి సేమమొసగుకాటి వాసి నసమనేత్రు గరళగళునిపశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగు! చంపకమాలసిరులకు మాలమౌ రమయె చేరియు మానసమందు నిల్వగన్హరి స్థితికారుఁడై మెరసి యర్చనఁ జేసిన శ్రేయమందెడున్నిరతము కాటిలో దిరుగు నీలగళున్ లయకారుఁ డంచనన్దిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తే॥ వరదుఁడు శివుఁడు సులభుఁడు భక్తులకిలనొసఁగుఁ దరియించ జనులకు నొనరు గానుబశుపతినిఁ గొల్వ సకలసంపదలు, దొలఁగుధనము జూదము నాడఁగఁ దప్పకుండచం॥ వరదుఁడు శంకయేలనొకొ భక్తుల కాప్తుఁడు నంబరీషుఁడేకరములఁ జోడ్చి మ్రొక్కుచును గాంచఁగ భక్తిని నమ్రులై మహిన్దిరమగు సంపదల్ పశుపతిన్ దరసించిన, లుప్తమౌనయోమరుగుచు మద్యపానమును మక్కువ నొందుచు నాడ జూదమున్
వెడ యనగనేల నిజముగ విభవమబ్బుపశుపతినిఁ గొల్వ ; సకలసంపదలు దొలఁగుదుష్టులను జేరి వారితో దొరయుచుండికాలమును వృధా చేయుచు గడుపుచుండ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శాశ్వతానందమునుగూర్చు సాధనమ్ముమోదమలరఁగ జూపించు ముక్తి పథముపశుపతినిఁ గొల్వ, సకలసంపదలు దొలఁగునైహికములకొరకునీశు నర్చఁ జేయ
కరివరదున్ పరాత్పరుని కామితముల్ నెరవేర వేడఁగన్కరుణను జూచి భక్తుల కఖర్వముగానిడు శాంతి సౌఖ్యముల్,తిరమగు సంపదల్, పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయోవరముగ పాపసంచయము జ్వాలను తూలము దగ్ధమౌ విధిన్
కలత చెందకు మంటినో చెలియ వినుమవాస్తవమ్మ వచింతును, ప్రాప్త మగునుపశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగుకాలకంఠికాలిడినంత కలిమియెల్ల.సిరులను గోరువారికిల క్షేమమొసంగుచు భక్తకోటికిన్ భరమని యెంచబోవక నుపార్జమొసంగగ చేరునింక నాతిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌనయోకరిసము లన్న మాట యది కల్లయటంచు వచింపబోకుమా.
భక్త సులభుడు వరదుడు పరమశివుడువరము లాశింప శీఘ్రమే తొరలివచ్చుపశుపతినిఁ గొల్వ సకలసంపదలు, దొలఁగునెల్ల పాపముల్ శుభములు వెల్లువగునునిరుపమ భక్త రక్షకుడు నిర్గుణ హంసుడు నీలకంఠుడేవరముల నీయ భక్తులకు వైళమె తార్కొను వేలుపాతడేతిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌనయోదురితము లన్నియున్ దొలగు దుర్భర దుస్థితి దైన్యమంతమౌ
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'తరలివచ్చు' టైపాటు.
తరగని కామమున్ పెను మదమ్మును క్రోధము లోభమోహముల్పెరిగిన మత్సరమ్ము మురిపించి హసించి నశింపజేయవే!తురమగ లేని వైరులవి! దుష్టుని జీవితమందునవ్వియేతిరమగు సంపదల్! పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో!!
భవుని నామము స్మరియించి భక్తి గొలువ కోర్కె లన్నియు ఫలియించు కువ ల య మున ననుచు పెద్దలు వచియింప నవని నెందు పశుపతిని గొల్వ సకల సంపదలు దొలగు?
తే.గీ:గొర్రెలను గాచు వానిని గొలిచినంతగోవులను గాచు వానిని గొలిచినంతసంపదలు కల్గ నే రీతి శైవభక్తిబశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగు”?(ఏసు క్రీస్తు గొర్రెల కాపరి.కృష్ణుడు గోపాలుడు.శివుడు పశుపతి.వాళ్లని కొలిస్తే సంపదలు వచ్చి పశుపతిని కొలిస్తే పోతాయా?)
మరువకమూడు ప్రొద్దులునుమానసమందు న దీక్ష బూనుచున్స్థిరమగుబుద్ధితోగొలువతీరుగనబ్బునుభక్తితోసదా*“తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌనయో”*నెరుగకచేయుదోషములునిమ్ముగనీశుదయార్ధ్రదృష్టితో
కోరు వారల కందును కూర్మితోడ*“పశుపతినిఁ గొల్వ సకలసంపదలు ,దొలఁగు”*చెంతనున్న సంపద లెల్ల శీఘ్రగతిని నీల గళుని సతతమిల నిందచేయ
చం:స్థిరమగు భాగ్య మజ్ఞతను జీల్చెడు జ్ఞానమె కాదె దానినిన్హరుడె యొసంగు భౌతికము లై కనుపించెడి వేవి కావు నీ తిరమగు సంపదల్, పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయోస్థిరమును వీడి యస్థిరము జేకొను మాయ నిమేష మందునన్.
చదువు లబ్బవు పొలములు క్షయము లౌను సంతు సిక్కదు శకటము లంతము లగుఁదఱుగుఁ బశువులు మదిలోనఁ దలఁప వేని పశుపతినిఁ గొల్వ సకల సంపదలు దొలఁగు అరుగక చెంత సంతతము నంజలి నచ్చట నుంట యొక్కటే, పెరుగును భక్తి తత్పరత పెల్లుగ సంతస మందు డెందమే దురితము లెల్ల ముక్క లగు దుఃఖము లాఱును వెల్గుఁ గొల్లలై తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌ నయో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాటి శైవ ద్వేషులైన వైష్ణవుల ప్రచారం:
తొలగించండితేటగీతి
హృదయమందు లక్ష్మినిదాల్చి యింపుగాను
సృష్టి స్థితికారుఁడౌ శౌరి సేమమొసగు
కాటి వాసి నసమనేత్రు గరళగళుని
పశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగు!
చంపకమాల
సిరులకు మాలమౌ రమయె చేరియు మానసమందు నిల్వగన్
హరి స్థితికారుఁడై మెరసి యర్చనఁ జేసిన శ్రేయమందెడున్
నిరతము కాటిలో దిరుగు నీలగళున్ లయకారుఁ డంచనన్
దిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండితే॥ వరదుఁడు శివుఁడు సులభుఁడు భక్తులకిల
రిప్లయితొలగించండినొసఁగుఁ దరియించ జనులకు నొనరు గాను
బశుపతినిఁ గొల్వ సకలసంపదలు, దొలఁగు
ధనము జూదము నాడఁగఁ దప్పకుండ
చం॥ వరదుఁడు శంకయేలనొకొ భక్తుల కాప్తుఁడు నంబరీషుఁడే
కరములఁ జోడ్చి మ్రొక్కుచును గాంచఁగ భక్తిని నమ్రులై మహిన్
దిరమగు సంపదల్ పశుపతిన్ దరసించిన, లుప్తమౌనయో
మరుగుచు మద్యపానమును మక్కువ నొందుచు నాడ జూదమున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివెడ యనగనేల నిజముగ విభవమబ్బు
రిప్లయితొలగించండిపశుపతినిఁ గొల్వ ; సకలసంపదలు దొలఁగు
దుష్టులను జేరి వారితో దొరయుచుండి
కాలమును వృధా చేయుచు గడుపుచుండ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశాశ్వతానందమునుగూర్చు సాధనమ్ము
రిప్లయితొలగించండిమోదమలరఁగ జూపించు ముక్తి పథము
పశుపతినిఁ గొల్వ, సకలసంపదలు దొలఁగు
నైహికములకొరకునీశు నర్చఁ జేయ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికరివరదున్ పరాత్పరుని కామితముల్ నెరవేర వేడఁగన్
రిప్లయితొలగించండికరుణను జూచి భక్తుల కఖర్వముగానిడు శాంతి సౌఖ్యముల్,
తిరమగు సంపదల్, పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో
వరముగ పాపసంచయము జ్వాలను తూలము దగ్ధమౌ విధిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలత చెందకు మంటినో చెలియ వినుమ
రిప్లయితొలగించండివాస్తవమ్మ వచింతును, ప్రాప్త మగును
పశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగు
కాలకంఠికాలిడినంత కలిమియెల్ల.
సిరులను గోరువారికిల క్షేమమొసంగుచు భక్తకోటికిన్
భరమని యెంచబోవక నుపార్జమొసంగగ చేరునింక నా
తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌనయో
కరిసము లన్న మాట యది కల్లయటంచు వచింపబోకుమా.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిభక్త సులభుడు వరదుడు పరమశివుడు
రిప్లయితొలగించండివరము లాశింప శీఘ్రమే తొరలివచ్చు
పశుపతినిఁ గొల్వ సకలసంపదలు, దొలఁగు
నెల్ల పాపముల్ శుభములు వెల్లువగును
నిరుపమ భక్త రక్షకుడు నిర్గుణ హంసుడు నీలకంఠుడే
వరముల నీయ భక్తులకు వైళమె తార్కొను వేలుపాతడే
తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌనయో
దురితము లన్నియున్ దొలగు దుర్భర దుస్థితి దైన్యమంతమౌ
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'తరలివచ్చు' టైపాటు.
తరగని కామమున్ పెను మదమ్మును క్రోధము లోభమోహముల్
రిప్లయితొలగించండిపెరిగిన మత్సరమ్ము మురిపించి హసించి నశింపజేయవే!
తురమగ లేని వైరులవి! దుష్టుని జీవితమందునవ్వియే
తిరమగు సంపదల్! పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభవుని నామము స్మరియించి భక్తి గొలువ కోర్కె లన్నియు ఫలియించు కువ ల య మున
రిప్లయితొలగించండిననుచు పెద్దలు వచియింప నవని నెందు
పశుపతిని గొల్వ సకల సంపదలు దొలగు?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:గొర్రెలను గాచు వానిని గొలిచినంత
రిప్లయితొలగించండిగోవులను గాచు వానిని గొలిచినంత
సంపదలు కల్గ నే రీతి శైవభక్తి
బశుపతినిఁ గొల్వ సకలసంపదలు దొలఁగు”?
(ఏసు క్రీస్తు గొర్రెల కాపరి.కృష్ణుడు గోపాలుడు.శివుడు పశుపతి.వాళ్లని కొలిస్తే సంపదలు వచ్చి పశుపతిని కొలిస్తే పోతాయా?)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమరువకమూడు ప్రొద్దులునుమానసమందు న దీక్ష బూనుచున్
రిప్లయితొలగించండిస్థిరమగుబుద్ధితోగొలువతీరుగనబ్బునుభక్తితోసదా
*“తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌనయో”*
నెరుగకచేయుదోషములునిమ్ముగనీశుదయార్ధ్రదృష్టితో
కోరు వారల కందును కూర్మితోడ
రిప్లయితొలగించండి*“పశుపతినిఁ గొల్వ సకలసంపదలు ,దొలఁగు”*
చెంతనున్న సంపద లెల్ల శీఘ్రగతిని
నీల గళుని సతతమిల నిందచేయ
చం:స్థిరమగు భాగ్య మజ్ఞతను జీల్చెడు జ్ఞానమె కాదె దానినిన్
రిప్లయితొలగించండిహరుడె యొసంగు భౌతికము లై కనుపించెడి వేవి కావు నీ
తిరమగు సంపదల్, పశుపతిన్ దరిసించిన లుప్తమౌనయో
స్థిరమును వీడి యస్థిరము జేకొను మాయ నిమేష మందునన్.
చదువు లబ్బవు పొలములు క్షయము లౌను
రిప్లయితొలగించండిసంతు సిక్కదు శకటము లంతము లగుఁ
దఱుగుఁ బశువులు మదిలోనఁ దలఁప వేని
పశుపతినిఁ గొల్వ సకల సంపదలు దొలఁగు
అరుగక చెంత సంతతము నంజలి నచ్చట నుంట యొక్కటే,
పెరుగును భక్తి తత్పరత పెల్లుగ సంతస మందు డెందమే
దురితము లెల్ల ముక్క లగు దుఃఖము లాఱును వెల్గుఁ గొల్లలై
తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌ నయో