19-10-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్”
(లేదా...)
“పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా”
కందంరంజనచెడి మనుజుడు క్రిమిభంజనుఁడై యింటఁ దాగె బలవంతుండైకంజదళాక్షా! దయగనుపంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్! ఉత్పలమాలరంజనమన్నదే చెడెను ప్రాజ్ఞుడు పామరుడైన నింటిలోభంజనులై మనన్ వెతల ప్రాణ భయంబున దిక్కు తోచకే!కంజదళాక్ష! చిన్ని క్రిమి కర్కశమొల్కను జాలిలేదొకో!పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
అంజనిపుత్రుడు లంకనుసంజనితశత్రువగుటనుసంగరమయ్యెన్రంజిలెరావణుడంతనుపంజరమునఁగుంజరమ్ముబంధింపబడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదం రెండవ గణం జగణమయింది. సవరించండి.
అంజనిపుత్రుడు లంకనుసంజనితశత్రువునగుటనుసంగరమయ్యెన్రంజిలెరావణుడంతనుపంజరమునకుంజరమ్ముబంధింపబడెన్
అంజనిపుత్రుడంతటనహంకృతిఁజూపిన శత్రుజేరియున్సంజనువెల్గుసూర్యువలెనసంశయవిక్రమమందురాజిలెన్రంజనలంకలోచెడగ రామునిబంటువిచారమందెగా బందిజేసిరేపంజరమందుకుంజరము బంధితమయ్యెనుసత్యమేగదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
రంజనలంకలోచెడగరామునిబంటునుబందిజేసిరే
సవరించారు. బాగుంది.
తంజావూరున పిల్లలుగుంజుకొన నందెన గల కుంజరబొమ్మల్భంజమునొంది దరినగలపంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణభంగం. 'కుంజరబొమ్మల్' దుష్టసమాసం. సవరించండి.
🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కుంజరమా యభిమన్యుఁడుకంజవ్యూహమునఁజొచ్చి కౌరవమూకన్భంజన మొనరింపఁగనాపంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కౌరవ మూక' దుష్టసమాసం. "కౌరవ బలమున్" అనండి.
కం॥ రంజిలు నెత్తము నోడఁగ వ్యంజనఁ గౌరవులు సేయఁ బాండవులఁ గనన్బుంజముగఁ గ్రమ్మె దుఃఖముపంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్ఉ॥ రంజిలు జూదమందునట రాజును మోసముఁ జేసి గెల్వఁగన్వ్యంజనఁ గౌరవాధములు పాండవులన్ గని సేయఁ గ్రూరులైపుంజములౌ యనిర్వృతినిఁ బొందఁగ నచ్చట నిస్సహాయులైపంజరమందుఁ గుంజరము బంధితమయ్వెను సత్యమే కదారాజు ధర్మరాజండినెత్తము పాచికలాటవ్యంజన ఎగతాళి పుంజము రాశి ప్రోగుఅనిర్వృతి దుఃఖముకుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చన్ దృష్టిలో ఉంచుకొని నండి.
రంజింప జేసెనని పృథసంజాతుడు రాజరాజు సమ్మోధికడై అంజిష్ఠ సుతుడు కౌరవ పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్.రంజన మంది భానుజుడు రాజ్యమొ సంగిన రాజరాజుకున్ రంజన మంద జేయ కుటిలాత్ముల పక్షము జేరెగాదె నీ లాంజన తుల్యుడంచు విని ప్రాజ్ఞులు పల్కిరధర్ములున్న యా పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా.
జొచ్చెన్
కంజదళాయతాక్షుఁడగు కవ్వడి సూనుఁడు తమ్మి మొగ్గరంబుంజని కౌరవేయుల సమూహము తల్లడమొంద జేయగన్భంజన సేయ గౌరవులు బాలకునిం గదియించిరక్కటాపంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మంజుల మానసుండు గురుమాన్యుఁడు భీష్ముఁడు శాంతనుండు తాన్ రంజిత ధర్మవర్తనుఁడు, రాగవివర్జిత భక్తిసాంద్రతన్ వింజ సముండు, పాండవుల విద్విష పక్షమె యుద్ధమందునన్పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా!!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
మంజుల హృదయుడు గాంగాసంజాతుడు పరశురామ ఛాత్రుడు సమితిన్సంజకు వాలెనకట! శిఖిపంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "గంగాసంజాతుడు"
పరశురామచ్ఛాత్రుడు సాధు వండి. పరశురాము ఛాత్రుడు సాధువగును.
గురువు గారికి, కామేశ్వర రావు గారికి ధన్యవాదములుమంజుల హృదయుడు గంగాసంజాతుడు పరశురాము ఛాత్రుడు సమితిన్సంజకు వాలెనకట! శిఖిపంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్!!
రంజిలు యుద్ధము నందు ధనంజయుని శరములఁ జిక్కె నాభీష్ముండేకుంజర సన్నిభుడతడేపంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్వింజమనంగనొప్పు కురు వృద్ధుడు వీరులనడ్డగింపగాకుంజర సన్నిభుండు కనఁ గ్రుద్ధుడు భీష్ముడు యుద్ధమందునన్భంజనుడై కిరీటి శరపాతము పాల్పడి నేలకూలగాపంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా[వింజము = వింధ్యపర్వతము]
ధన్యవాదాలు గురూజీ 🙏
సంజ వెలుంగు న బాలుడు మంజుల మగు బొమ్మలు గొని మవు న ము తోడ న్ రంజి ల గ నాడు చొ క పరి పంజరమున గుంజ రమ్ము బంధింప బడె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "మౌనముతోడన్"
రంజన మణఁగ నరేభం బంజలి ధర్మజుఁడు నిల్చి యనుజవరుల తోడం జని శకుని భృశము వేఁ పం జరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్ [వేఁపన్ + చరమున = వేపం జరమున; చరము = జూదము] కంజదళాక్ష రక్షితము కాదిల మానవ రక్షితమ్ము దా నంజలి మోడ్చి మ్రొక్కినను హస్తినిఁ బట్టెడు వేడ్కఁ ద్రవ్వఁగా మంజుల ఖాత మొక్కటి సమంచిత రీతినిఁ గాన లోన భూపంజర మందుఁ గుంజరము బంధిత మయ్యెను సత్యమే కదా
కంజదళాయతాక్షనకు కమ్మను వ్రాసెను భైష్మి ప్రేమతో రంజన చేయగా వడిగ రంగడు వచ్చు నటంచునెంచుచున్ మంజుల గాత్రిదానిలిపె మానుగ నాతని రూపమున్ మనో*“పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా”*రంజనమదిహెచ్చంగనుకుంజర యూధమునువీడి కూడగ తోడున్బంజారులుసదనమ్మను*"పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్”*
కం:రంజన సెడి పాండవు లరిభంజను లై విరటు గొల్వ బాల్పడి రకటా!సంజయ!విధి నేమందునుపంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్(ఏమాత్రం కష్ట పడని పూరణం)
కందం
రిప్లయితొలగించండిరంజనచెడి మనుజుడు క్రిమి
భంజనుఁడై యింటఁ దాగె బలవంతుండై
కంజదళాక్షా! దయగను
పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్!
ఉత్పలమాల
రంజనమన్నదే చెడెను ప్రాజ్ఞుడు పామరుడైన నింటిలో
భంజనులై మనన్ వెతల ప్రాణ భయంబున దిక్కు తోచకే!
కంజదళాక్ష! చిన్ని క్రిమి కర్కశమొల్కను జాలిలేదొకో!
పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఅంజనిపుత్రుడు లంకను
రిప్లయితొలగించండిసంజనితశత్రువగుటనుసంగరమయ్యెన్
రంజిలెరావణుడంతను
పంజరమునఁగుంజరమ్ముబంధింపబడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదం రెండవ గణం జగణమయింది. సవరించండి.
అంజనిపుత్రుడు లంకను
తొలగించండిసంజనితశత్రువునగుటనుసంగరమయ్యెన్
రంజిలెరావణుడంతను
పంజరమునకుంజరమ్ముబంధింపబడెన్
అంజనిపుత్రుడంతటనహంకృతిఁజూపిన శత్రుజేరియున్
రిప్లయితొలగించండిసంజనువెల్గుసూర్యువలెనసంశయవిక్రమమందురాజిలెన్
రంజనలంకలోచెడగ రామునిబంటువిచారమందెగా బందిజేసిరే
పంజరమందుకుంజరము బంధితమయ్యెనుసత్యమేగదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. సవరించండి.
రంజనలంకలోచెడగరామునిబంటునుబందిజేసిరే
రిప్లయితొలగించండిసవరించారు. బాగుంది.
తొలగించండితంజావూరున పిల్లలు
రిప్లయితొలగించండిగుంజుకొన నందెన గల కుంజరబొమ్మల్
భంజమునొంది దరినగల
పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. 'కుంజరబొమ్మల్' దుష్టసమాసం. సవరించండి.
🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికుంజరమా యభిమన్యుఁడు
రిప్లయితొలగించండికంజవ్యూహమునఁజొచ్చి కౌరవమూకన్
భంజన మొనరింపఁగనా
పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కౌరవ మూక' దుష్టసమాసం. "కౌరవ బలమున్" అనండి.
కం॥ రంజిలు నెత్తము నోడఁగ
రిప్లయితొలగించండివ్యంజనఁ గౌరవులు సేయఁ బాండవులఁ గనన్
బుంజముగఁ గ్రమ్మె దుఃఖము
పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్
ఉ॥ రంజిలు జూదమందునట రాజును మోసముఁ జేసి గెల్వఁగన్
వ్యంజనఁ గౌరవాధములు పాండవులన్ గని సేయఁ గ్రూరులై
పుంజములౌ యనిర్వృతినిఁ బొందఁగ నచ్చట నిస్సహాయులై
పంజరమందుఁ గుంజరము బంధితమయ్వెను సత్యమే కదా
రాజు ధర్మరాజండి
నెత్తము పాచికలాట
వ్యంజన ఎగతాళి
పుంజము రాశి ప్రోగు
అనిర్వృతి దుఃఖము
కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చన్ దృష్టిలో ఉంచుకొని నండి.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిరంజింప జేసెనని పృథ
రిప్లయితొలగించండిసంజాతుడు రాజరాజు సమ్మోధికడై
అంజిష్ఠ సుతుడు కౌరవ
పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్.
రంజన మంది భానుజుడు రాజ్యమొ సంగిన రాజరాజుకున్
రంజన మంద జేయ కుటిలాత్ముల పక్షము జేరెగాదె నీ
లాంజన తుల్యుడంచు విని ప్రాజ్ఞులు పల్కిరధర్ములున్న యా
పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిజొచ్చెన్
రిప్లయితొలగించండికంజదళాయతాక్షుఁడగు కవ్వడి సూనుఁడు తమ్మి మొగ్గరం
రిప్లయితొలగించండిబుంజని కౌరవేయుల సమూహము తల్లడమొంద జేయగన్
భంజన సేయ గౌరవులు బాలకునిం గదియించిరక్కటా
పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమంజుల మానసుండు గురుమాన్యుఁడు భీష్ముఁడు శాంతనుండు తాన్
రిప్లయితొలగించండిరంజిత ధర్మవర్తనుఁడు, రాగవివర్జిత భక్తిసాంద్రతన్
వింజ సముండు, పాండవుల విద్విష పక్షమె యుద్ధమందునన్
పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా!!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమంజుల హృదయుడు గాంగా
రిప్లయితొలగించండిసంజాతుడు పరశురామ ఛాత్రుడు సమితిన్
సంజకు వాలెనకట! శిఖి
పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"గంగాసంజాతుడు"
పరశురామచ్ఛాత్రుడు సాధు వండి. పరశురాము ఛాత్రుడు సాధువగును.
తొలగించండిగురువు గారికి, కామేశ్వర రావు గారికి ధన్యవాదములు
తొలగించండిమంజుల హృదయుడు గంగా
సంజాతుడు పరశురాము ఛాత్రుడు సమితిన్
సంజకు వాలెనకట! శిఖి
పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్!!
రంజిలు యుద్ధము నందు ధ
రిప్లయితొలగించండినంజయుని శరములఁ జిక్కె నాభీష్ముండే
కుంజర సన్నిభుడతడే
పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్
వింజమనంగనొప్పు కురు వృద్ధుడు వీరులనడ్డగింపగా
కుంజర సన్నిభుండు కనఁ గ్రుద్ధుడు భీష్ముడు యుద్ధమందునన్
భంజనుడై కిరీటి శరపాతము పాల్పడి నేలకూలగా
పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా
[వింజము = వింధ్యపర్వతము]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిసంజ వెలుంగు న బాలుడు
రిప్లయితొలగించండిమంజుల మగు బొమ్మలు గొని మవు న ము తోడ న్
రంజి ల గ నాడు చొ క పరి
పంజరమున గుంజ రమ్ము బంధింప బడె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మౌనముతోడన్"
రంజన మణఁగ నరేభం
రిప్లయితొలగించండిబంజలి ధర్మజుఁడు నిల్చి యనుజవరుల తో
డం జని శకుని భృశము వేఁ
పం జరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్
[వేఁపన్ + చరమున = వేపం జరమున; చరము = జూదము]
కంజదళాక్ష రక్షితము కాదిల మానవ రక్షితమ్ము దా
నంజలి మోడ్చి మ్రొక్కినను హస్తినిఁ బట్టెడు వేడ్కఁ ద్రవ్వఁగా
మంజుల ఖాత మొక్కటి సమంచిత రీతినిఁ గాన లోన భూ
పంజర మందుఁ గుంజరము బంధిత మయ్యెను సత్యమే కదా
కంజదళాయతాక్షనకు కమ్మను వ్రాసెను భైష్మి ప్రేమతో
రిప్లయితొలగించండిరంజన చేయగా వడిగ రంగడు వచ్చు నటంచునెంచుచున్
మంజుల గాత్రిదానిలిపె మానుగ నాతని రూపమున్ మనో
*“పంజరమందుఁ గుంజరము బంధితమయ్యెను సత్యమే కదా”*
రంజనమదిహెచ్చంగను
కుంజర యూధమునువీడి కూడగ తోడున్
బంజారులుసదనమ్మను
*"పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్”*
కం:రంజన సెడి పాండవు లరి
రిప్లయితొలగించండిభంజను లై విరటు గొల్వ బాల్పడి రకటా!
సంజయ!విధి నేమందును
పంజరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్
(ఏమాత్రం కష్ట పడని పూరణం)