భక్త జనావళి పై నను రక్తి వహించి కడు దుస్తర మయిన కామా సక్తిని, వహించి హరిపై భక్తిని విడు మయ్య నరుఁడ స్వర్గము దక్కున్
శక్తి కొలంది పూజలను జక్కఁగఁ జేయుచు సంతతమ్మునున్ రక్తి వహించి ధర్మ పరిరక్షణ మందు సమంచితమ్ముగన్ భుక్తికినై నిరంతరము భూత గణాంతక చేష్ట లందు నీ భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికందం
తొలగించండిసక్తతఁ జూపి వరూధిని
రక్తిని గూర్ఛంగ నిలువ ప్రవరాఖ్య! నిరా
సక్తతె? భువి విలువలపై
భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్!
ఉత్పలమాల
సక్తతఁ జూపి యప్సరస సందిటఁ జిక్కుదునంచు కేళిలో
రక్తినిఁ గూర్తునంచు ప్రవరాఖ్య! వరూధిని చేరఁగన్ నిరా
సక్తత ధర్మసూత్రముల సాగుదె తాకక? కట్టుబాట్లపై
భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్!
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిసక్తజూపకవిషయము
రిప్లయితొలగించండిముక్తినిగోరుచుపదపడిమోక్షేచ్ఛమదిన్
రక్తముపాతమునందున
భక్తినివిడుమయ్య నరుడస్వర్గముదక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సక్తత జూపక" టైపాటు
సక్తతజూపకన్విషయసంపదయందునవీతరాగివై
రిప్లయితొలగించండిముక్తమునైనయట్టిమనమోడకసాధనయందునిల్పుచున్
భుక్తిని నాసజేయుమదిభూరియశస్సునలక్ష్మిగోరునా
భక్తినివీడుమానరుడ! స్వర్గముమోక్షమునందగోరినన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములుగురువుగారు
తొలగించండి
రిప్లయితొలగించండిముక్తి యదేల ప్రవర యను
రక్తిని చూపించ మంచు రమణి పిలువ నా
సక్తిని చూపు మనవసర
భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్.
రక్తిని వీడకుండ నను రాగము జూపుచు లోటు చేయకన్
భుక్తి నొసంగు ధర్మమది, బుద్భుద మైన సుఖమ్ము గోరుచున్
శక్తికి మించి కష్టపడి సంపద గూర్చుటయేల బైసిపై
భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్.
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండియుక్తిగ మీ వెతనుండి వి
రిప్లయితొలగించండిముక్తి కలుగజేసెదమని పొచ్చెము సలుపన్
శక్తిగల నాయకులపై
భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం॥ త్యక్తముఁ జేసి యహమునిల
రిప్లయితొలగించండిశక్తిగ భగవంతుని యటు సర్వము నీవే
ముక్తిఁ గనుమని యిహముపై
భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్
ఉ॥ త్యక్తముఁ జేసి కర్తనను హావము భావముఁ దత్పరుండవై
శక్తినిఁ గాంచి దైవమును సర్వము నీకృప యంచు శ్రద్ధతో
ముక్తినిఁ గోరి కొల్చుచును బుద్ధిగ నైహిక సౌఖ్యసిద్ధిపై
భక్తిని వీడుమా నరుఁడ స్వర్గము మోక్షము లందఁ గోరినన్
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరక్తిని వీడనిచో నీ
రిప్లయితొలగించండిశక్తి నిరర్థక మగునను సత్యమెరుగవా
ముక్తికొరకు, జోడింపగ
భక్తిని, విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్
రక్తిని వీడకున్న ననురాగపు బంధము లడ్డగింపగా
శక్తి నిరర్థకం బగును సంసృతి బంధము లంతమొందగా
ముక్తికి మార్గమేర్పడక పోదు హుటాహుటిఁ, బెంపుజేయగా
భక్తిని, వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ🙏
తొలగించండిరిక్తపు విషయమ్ముల నా
రిప్లయితొలగించండిసక్తినిజూపక నడువుము సన్మార్గమునన్
భుక్తికొరకు చూపెడు నీ
భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్
శక్తికొలంది పేదలకు సౌఖ్యము గూర్చ పరిశ్రమించు మా
రిప్లయితొలగించండిసక్తిని జూపకెన్నఁడును స్వార్థపు చింతనలందు దైవమున్
రిక్తఁపు వాంఛితమ్ములకు రేఁబవలున్ భజియించు మూర్ఖపుం
భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్
శక్తి కొలంది జను ల కా
రిప్లయితొలగించండిసక్తి గ సేవలను జేయు సంకల్ప ము తో
యుక్తి గ మెలగుచు కపట పు
భక్తిని విడు మయ్య నరుడ స్వర్గము దక్కున్
కం:వ్యక్తమగు దైవ మందరు
రిప్లయితొలగించండివ్యక్తులలో వారి వదలి యాలయములలో
వ్యక్త మగు ననెడు మూఢపు
భక్తిని విడుమయ్య నరుఁడ స్వర్గము దక్కున్”
ఉ:ముక్తసుఖుండవై ప్రవర! ముక్కుల మూసుక గాలి త్రిప్పగా
రిప్లయితొలగించండిముక్తి లభించునే? దివిన ముద్దుల నిచ్చెడు భామ యిచ్చటన్
వ్యక్తము జేయగా వలపు వ్యర్థము జేతువె!విప్రవృత్తి పై
భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్
శక్తికి మించి కోరికలు సంపదపై నతి కాంక్ష నుంచుచున్
రిప్లయితొలగించండివ్యక్తిగ క్రింద జారుచును నన్యుల సొమ్ముల యందు మోహమున్
త్యక్తము చేయుచున్మదిని దైవమునుంచుచు కొల్చుమింక పై
*భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్”*
ముక్తియ కలుగునటంచును
వ్యక్తులు కొందరు తెలుపగ వడిగా మదిలో
సక్తుడవుగాకమూఢపు
*భక్తినివిడుమయ్యనరుడ స్వర్గము దక్కున్
భక్త జనావళి పై నను
రిప్లయితొలగించండిరక్తి వహించి కడు దుస్తర మయిన కామా
సక్తిని, వహించి హరిపై
భక్తిని విడు మయ్య నరుఁడ స్వర్గము దక్కున్
శక్తి కొలంది పూజలను జక్కఁగఁ జేయుచు సంతతమ్మునున్
రక్తి వహించి ధర్మ పరిరక్షణ మందు సమంచితమ్ముగన్
భుక్తికినై నిరంతరము భూత గణాంతక చేష్ట లందు నీ
భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్