23, అక్టోబర్ 2024, బుధవారం

సమస్య - 4921

24-10-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వానరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో”

(లేదా...)

“వానరులెల్ల రొక్కటిగ వర్ధిలు కాలము వచ్చు టెన్నఁడో”

(ఈ సమస్యను పంపినదెవరో గుర్తు లేదు. వారికి ధన్యవాదాలు)

19 కామెంట్‌లు:

  1. కందం
    మానవతిని సుగ్రీవుని
    చానను గొన వాలి వారు శత్రువులైరే?
    హీనుని వాలిని గూల్చక
    వానరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో?

    ఉత్పలమాల
    మానవతిన్ రుమన్ జెలఁగి మన్ననలెంచక వాలి చేకొనన్
    దీనత సూర్య పుత్రుడు విధేయత వీడఁగ వైరివర్గమై
    పూనిరి కక్షలన్ మిగుల, మోహి ని వాలిని జంపకుండఁగన్
    వానరులెల్ల రొక్కటిగ వర్ధిలు కాలము వచ్చు టెన్నఁడో?

    రిప్లయితొలగించండి
  2. కోనలకొండలదిరిగెడి
    వానరులొక్కటిగ నెపుడువర్థిలగలరో
    పూనికవిజ్ఞానంబున
    కానరుతెలివినినరులును ఖండములందున్

    రిప్లయితొలగించండి
  3. మేనికిరంగునేగనుచు మెచ్చరుజాతిని బుద్ధిహీనులై
    కానరు మానసాంబుథినికల్గెడిభావములొక్కటేయనన్
    మానుగశాస్త్రసంగతినిమానవుడేగదకోతియన్నచో
    వానరులెల్లరొక్కటిగవర్థిలుకాలమువచ్చుటెన్నడో

    రిప్లయితొలగించండి

  4. కానగరారేచేయుచు
    దానములనుపాత్రులకునుదగురీతినిలన్
    హీనమతివీడుచోదే
    *"వా!నరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో”*

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. మానునె సమరము! వినునే
      హీనులు యుద్ధముల కాలమిది కాదనినన్!
      ప్రాణమన లెక్కయే! దే
      వా!నరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో!!

      తొలగించండి
  6. డా బల్లూరి ఉమాదేవి

    చానలు నేగుచుండగనుసందులయందునమాటువేయుచున్
    హీనపు బుద్ధితోసతముయేలగకోరుచుకాంతలన్సదా
    మానముదోచువాంఛవిడిమానవులెప్పుడుమారుచుంద్రొ దే
    *“వానరులెల్ల రొక్కటిగ వర్ధిలు కాలము వచ్చు టెన్నఁడో”*



    రిప్లయితొలగించండి
  7. దానవులై చెలరేగక
    వానర సముదాయమన్న వైఖరి తొలగన్
    మానవ జాతులు మనలే
    వా! నరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మానవ జాతులందు పెను మచ్చర మేకద చిచ్చుపెట్టగా
      దానవులై జనాళి పరి తాపము నొందెడు పోరు సల్పరే
      మానవ జాతులే సుకరమౌ దెస ఘర్షణ లేక నుండ లే
      వా! నరులెల్ల రొక్కటిగ వర్ధిలు కాలము వచ్చు టెన్నఁడో

      తొలగించండి

  8. క్షోణిని కులభేదమ్ముల
    తో నను నిత్యము మనుజుడు దొమ్మియె సేయున్
    జ్ఞానివి గద చెప్పన్ గల
    వా, నరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో?


    నేనధికుండనంచు మరినీకుల మల్పమటంచు నెంచెడిన్
    మానవజాతి వల్లనె ప్రమాదమటంచు దలంచితిన్ గనన్
    జానెడు పొట్టకోసమని స్వార్థ పథమ్మును జేరె, చెప్పలే
    వా, నరులెల్ల రొక్కటిగ వర్ధిలు కాలము వచ్చు టెన్నఁడో?

    రిప్లయితొలగించండి
  9. దీనుల యెడ దయ జూపుచు
    దానము ధర్మములు జేయు ధార్మిక పరులై
    జ్ఞాను లు గా మారుచు దే
    వా! నరు లొక్కటి గ నెపుడు వర్ధిల్ల గలరో?

    రిప్లయితొలగించండి
  10. శీనులవలె వానరములు
    కాననముల దిరుగుచుండి కయ్మము నేర్వన్
    మానవులవలె తిరముగన్
    వానరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ ఆనవుగలరో”

    రిప్లయితొలగించండి
  11. కానము పక్షులయందున
    కానలలో పశువులందు కావేషములన్
    కాని నరులఁ గాంతుము వ
    హ్వా! నరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో

    రిప్లయితొలగించండి
  12. కానము మర్త్యులందు కనికారము, దీనుల కక్కసమ్ములన్
    గానము యొండొరుల్ కలిసికట్టుగ నుండుట, జీవజాలముల్
    కానలలోచరించుటను గాంతుము కూరిమితోడ గాని వ
    హ్వా! నరులెల్ల రొక్కటిగ వర్ధిలు కాలము వచ్చు టెన్నఁడో

    రిప్లయితొలగించండి
  13. కం:ఏనాడును కనుపించని
    నీ నామ ,ప్రతిమలకును నిత్యము కలహ
    మ్మే నేడు పెరిగినది దే
    వా!నరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో”

    రిప్లయితొలగించండి
  14. ఉ:వానరు డొక్క డిట్లనియె వాలియు,నాతని సోదరుండు ద్వే
    షానలదగ్ధులై కపుల యైక్యత ద్రుంచుచు నెంత కాల మీ
    వానర సేనకున్ తగని బాధను దెచ్చుచు బోరుచుందురో
    వానరులెల్ల రొక్కటిగ వర్ధిలు కాలము వచ్చు టెన్నఁడో”

    రిప్లయితొలగించండి
  15. ఆదినుండి మానవులకున్న యుద్ధోన్మాదముపై

    కం॥ జ్ఞానము నొందక ధరణిని
    మానక యుద్ధములఁ జేసి మనుజ పతనమున్
    మానవులె చేయుదురె దే
    వా! నరులొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో

    అర్జునుడు కృష్ణుడితో కురుక్షేత్ర యుద్ధమునకు మునుపు

    ఉ॥ జ్ఞానముఁ గౌరవాగ్రజుఁడు కాంచక నీవిధిఁ దెచ్చె యుద్ధమున్
    మానక ద్వేషభావమును మాన్యుల నెంచక బుద్ధిహీనుఁడై
    దీనులఁ జేయునందరినిఁ దెల్లము భర్తలు చావునొప్ప బా
    వా! నరులెల్ల రొక్కటిగ వర్ధిలు కాలము వచ్చుటెన్నడో

    రిప్లయితొలగించండి
  16. కానము క్షమా గుణము లవ
    మీ నరకాయమ్ము నందు నిలలో రామా!
    మానవ రూప విరాజిత
    వానరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో


    కానము నేఁడు శాంతి ధరఁ గంజదలాక్ష! దయాపయోనిధీ!
    దానవ తత్త్వ మెల్లెడల దారుణ రీతిని సంతరించెనే
    మానవతా గుణమ్ము మటు మాయము రక్ష నొసంగ దేవ! రా
    వా నరు లెల్ల రొక్కటిగ వర్ధిలు కాలము వచ్చు టెన్నఁడో

    రిప్లయితొలగించండి