26, అక్టోబర్ 2024, శనివారం

సమస్య - 4924

27-10-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“హైందవమందిరముఁ గూల్చు టఘదూరంబౌ”

(లేదా...)

“హైందవమందిరమ్మునకు హాని యొనర్చుట పుణ్యకార్యమౌ”

(వి.వి. సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలతో...)

11 కామెంట్‌లు:

  1. పందలకార్యంబిదియగు
    హైందవ మందిరముఁగూల్చుట, ఘదూరంబౌ
    కొందలమందక నరుడును
    డెందముమానవతయందు ఠీవిగ నుండన్

    రిప్లయితొలగించండి
  2. హిందూమతమన నచ్చని
    కొందరు పరమతపువారు కూడుకొనిరటన్
    విందు తినుచు తలచిరిటుల
    హైందవమందిరముఁ గూల్చు టఘదూరంబౌ

    రిప్లయితొలగించండి

  3. మందుల ప్రవచనముల విని
    తొందర పడబోకు మంటి దోషంబదియే
    కుందక తప్పదు పిమ్మట
    హైందవమందిరముఁ గూల్చు టఘదూరంబౌ?


    ఎందులకిట్లు జేసెదవు హీనుల మిటల నాలకించినన్
    దొందరపాటు చర్యయగు తుంటరి కార్యపు దోషమబ్బగా
    కుందక తప్పదంటినిల కోవెల లన్న పవిత్ర క్షేత్రముల్
    హైందవమందిరమ్మునకు హాని యొనర్చుట పుణ్యకార్యమౌ?

    రిప్లయితొలగించండి
  4. కందం
    హిందూమత ధర్మమ్ముల్
    సంధించియు వృద్ధిగనఁగ శంకర! చనితే
    మందుల చేష్టల ఫలమై
    హైందవమందిరముఁ గూల్చు టఘదూరంబౌ

    ఉత్పలమాల
    హిందువు లెల్ల జాగృతము నింపుగ నొందగఁ జేయ శంకరా!
    కుందియు నుద్ధరించితివి, కోల్పడి మిమ్ము నధోగతిన్ బడన్
    మందుల కృత్యమై ప్రభుత మాన్పగ లేదను నిస్సహాయతన్
    హైందవమందిరమ్మునకు హాని యొనర్చుట పుణ్యకార్యమౌ

    రిప్లయితొలగించండి
  5. మందిరము శిథిలమవగా
    కొందరు పెద్దలు పొదిగొని కోరిన విధమున్
    సుందరముగఁ గట్టుటకై
    హైందవమందిరముఁ గూల్చు టఘదూరంబౌ

    సుందర మైన రీతి పురుషోత్తములే యిట నిర్ణయింప రూ
    పొందిన నాకృతిన్ దలచి ముందటి పన్నునగాక నవ్యమౌ
    కందువ నూత్నకట్టడముకై శిథిలమ్ములఁ గూల్చు టెట్లగున్
    హైందవమందిరమ్మునకు హాని యొనర్చుట? పుణ్యకార్యమౌ!

    [కందువ - సంఘము]

    రిప్లయితొలగించండి
  6. కొందరు నాస్తికుల్ మిగుల కుత్సిత లౌకిక వాద భావకుల్!
    కొందరు తీవ్రవాదులును! కొందరు విగ్రహ వైరి సంఘముల్!
    కొందరికన్యదేశమన కూరిమి బంధము! వారి దృష్టిలో
    హైందవమందిరమ్మునకు హాని యొనర్చుట పుణ్యకార్యమౌ!!

    రిప్లయితొలగించండి
  7. హిందూ వ్యతిరేకులు గా
    నిందించుచు హైందవ మును నీ చ మన స్కుల్
    దుందు డు కొప్పగ వారికి
    హైందవ మందిరము గూల్చు ట ఘ దూ రంబౌ

    రిప్లయితొలగించండి
  8. కొందరు హైందవేతరులు కొందలమొందఁగజేయ భక్తులన్
    పందలవోలె మూర్తులను పంచము సేయగ సాహసింతురే
    యెందులకీవిధిన్ పరమ హేయఁపు చేష్టల కుద్యమింతురో!
    హైందవమందిరమ్మునకు హాని యొనర్చుట పుణ్యకార్యమౌ?

    రిప్లయితొలగించండి
  9. కొందలమొందఁగ భక్తులు
    పందలవలె విగ్రహముల పంచము సేయన్
    కొందరు యోచింతు రకట!
    హైందవమందిరముఁ గూల్చు టఘదూరంబౌ?

    రిప్లయితొలగించండి
  10. బృందారకు నుంచఁ దిరిగి
    కొందల మందంగ నేల కుడ్యశ్రేణీ
    బృందము శిథిలం బైనన్
    హైందవ మందిరముఁ గూల్చు టఘ దూరంబౌ


    మందులు దేవుఁ డొక్కడని మానవ జాతికి నేర రక్కటా
    యెందును బేళ్లు భిన్నములె యిద్ధర నెంతటి వారి కైననుం
    దొందర గల్గ భక్తులకు దుష్ట మనమ్ముల హాని సేసినన్
    హైందవ మందిరమ్మునకు హాని యొనర్చుట పుణ్య కార్యమౌ

    రిప్లయితొలగించండి
  11. నిందలు వేయుచున్ సతము నెమ్మిని వీడుచు దూరు చేయుచున్
    అందర నొక్కటేయనుచు నందరి ముందునచెప్పి మాటునన్
    పందల వోలె తిట్టుమిము వారెవయంచనుటెట్టులే విధిన్
    *“హైందవమందిరమ్మునకు హాని యొనర్చుట పుణ్యకార్యమౌ”*


    రిప్లయితొలగించండి