31, అక్టోబర్ 2024, గురువారం

సమస్య - 4929

1-11-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్”

(లేదా...)

“సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

  1. కందం
    లజ్జ యొకింతయు లేకయె
    బొజ్జలు పెంచంగఁ దోచి బొక్కసమయొయో!
    యజ్జగని యెన్నిక గెలువ
    సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్

    ఉత్పలమాల
    లజ్జయొకింతలేక తమ రాజ్యమటంచును స్వార్థచిత్తులై
    బొజ్జలు పెంచగన్ బ్రభుత బొక్కసమున్ దిగ మ్రింగి నేతలై
    యజ్జ యటంచు నెన్నికల నందలమెక్కఁగ పంచి కాన్కలన్
    సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్

    రిప్లయితొలగించండి
  2. పజ్జనుజేరగవిష్ణుని
    కజ్జాలాడిశత్రువులుగ ఖలులైరిగదా
    లజ్జనులేకనుదౌష్ట్యము
    సజ్జనుల ప్రజకుహితమొసంగెదరసురుల్

    రిప్లయితొలగించండి
  3. అజ్జరె! మాధవుండె వటుడాకృతి దాల్చి సురారి వద్దకున్
    గుజ్జుగ వచ్చి కోరెనడుగుల్ మరి మూడు బలిన్ యశోధనున్
    లజ్జకు పాత్రుడయ్యె బలి రాక్షస నాయక పాలనంబునన్
    సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్!!

    రిప్లయితొలగించండి

  4. ఒజ్జయె యోర్మి వహించుచు
    వెజ్జుకు తెలిపె విషయము, విభీషణు డతడా
    సజ్జన సచి పాలనలో
    సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్.


    ఒజ్జ యతండు చెప్పు సమయోచిత గాధల వాడటన్
    బుజ్జియవార్తవన్ నిదుర బుచ్చుచు పేర్మి వచించె నిట్టులన్
    సజ్జన మైత్రితో నసుర జాతి విభీషణు బాలనమ్ములో
    సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్.

    రిప్లయితొలగించండి
  5. సజ్జన సాంగత్యమ్మున
    నిజ్జగమున దుర్జనుండు హితకారియగున్
    రజ్జుగ మారును భుజగము
    సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్

    రిప్లయితొలగించండి
  6. మజ్జారె ! వాడుక బదలె
    పిజ్జా హట్టు నికటమున వేడిగ మిర్చీ
    బజ్జీ తినిపించి నపుడు
    సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్

    రిప్లయితొలగించండి
  7. జజ్జర కారులు దనుజులు
    సజ్జను లైరను దలంపు సన్మానితమా?
    రజ్జన విడి తెల్పుమెపుడు
    సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్?

    జజ్జరకార్లు దానవులు సంబ్రముఁ వీడుదురా స్వభావమున్
    సజ్జనులైతిరా యనుచు సంశయ మెవ్విధి కల్గియుండెనో
    రజ్జులు పల్కగా దగునె రక్కొని గ్రమ్మఱి తెల్పు మెచ్చటన్
    సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్?

    రిప్లయితొలగించండి
  8. సజ్జనకోటి సంగతము సర్వ శుభంబులకాలవాలమై
    యిజ్జగమందు శాంతి సుఖమేర్పడ గూర్చును నిశ్చయమ్ముగా
    వెజ్జులవంటి సజ్జనుల విజ్ఞతతో వ్యవహారశైలితో
    సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్

    రిప్లయితొలగించండి
  9. కం:ముజ్జగముల నిను బోలెడు
    స జ్జగపతి లేడు రామ !చావగ నన్నల్
    లజ్జించె లంక సేనయు
    సజ్జనులై ప్రజకు హితమొసంగెదరసురుల్”
    (యుద్ధానంతరం విభీషణుడు రాముని తో "నా అన్నల మృతి తో లంక సైన్యం లజ్జించింది.ఇక పై రాక్షసులు మంచి వాళ్లు గా మారతారు అన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  10. లజ్జను వీడిన నేతలు
    ముజ్జగ ముల మోస గించు పోకిరు లగుచున్
    బొజ్జలు పెంచుట కొఱ కై
    సజ్జనులై ప్రజకు హిత మొ సం గెద రసు రుల్

    రిప్లయితొలగించండి
  11. ఉ:ముజ్జగముల్ రమాధవుని మ్రోల బలీంద్రుడు వెట్టె, రాముడే
    సజ్జనుడంచు యుద్ధమున సాయ మొనర్చె విభీషణుండు, భా
    స్వజ్జయ మీయ పాండవుల పక్షము జేరె ఘటోత్కచుం డిటుల్
    సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్”
    (రాక్షసులు ధర్మ పక్షాన నిలచిన ఉదాహరణలు.)

    రిప్లయితొలగించండి
  12. కం॥ ఒజ్జగఁ బ్రహ్లాదుఁడు బలి
    సజ్జన తత్వముఁ గరపఁగ సమరస మరయన్
    లజ్జనుఁ బొందిరి మనమమన
    సజ్జనులై ప్రజకు హితమొసంగెదరసురుల్

    ఉ॥ ఒజ్జగ మారి నేర్ప బలి యోరిమి తోడను మంచిబుద్ధులన్
    లజ్జను బొంది రాక్షసులు రంజిలి వీడుచు బ్రాఁత పద్ధతుల్
    నుజ్జును జేసి బుద్ధిఁగని నూతన జీవన వాంఛ మోదమై
    సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రహ్లాదుడే రాఘవేంద్రస్వామి గా అవతరించి గురువై మధ్వతత్వము (ద్వైతము) బోధించారని నమ్మకము. అందుకే ద్వైతము నమ్మిన వారిలో ప్రహ్లాద రాఘవేంద్ర గురురాజ వాదిరాజ అత్యంత ప్రాచుర్యము పొందిన నామధేయాలండి.

      తొలగించండి
  13. ముజ్జగములకు వెలుంగుల
    మజ్జన మొనరించు చుండి మానక నిత్యం
    బజ్జరె పండ్రెండుగురును
    సజ్జనులై ప్రజకు హిత మొసంగెద రసురుల్

    [అసురుఁడు = సూర్యుఁడు]


    ఉజ్జగిలంగ నాసురుల యుగ్రత హ్లాదుని పాలనమ్ము నం
    దజ్జనక ద్విషుం డిడిన యాజ్ఞల దాఁట నశక్తులై ధరన్
    ముజ్జగముల్ ముదం బరయ భూరి విభీషణు పాలనమ్మునన్
    సజ్జను లైరి రక్కసులు సర్వ జనాళికి మేలు గూర్పఁగన్

    రిప్లయితొలగించండి
  14. డా బల్లూరి ఉమాదేవి
    ఇజ్జగమున హరి ఘనుడని
    యొజ్జకు ప్రహ్లాదుడరుహ నొప్పుగ వినుచున్
    లజ్జను వీడుచు బాలలు
    *“సజ్జనులై ప్రజకు హితమొసంగెద రసురుల్”*


    ఒజ్జల బోధలెప్పుడును నొప్పగు రీతిన మార్చి వేయగా
    నిజ్జగమందుమారిరిలనిమ్ముగదైత్యులెమంచిబోధచే
    ముజ్జగముల్ విచిత్రముగపోల్చగ భక్తుల తోడ వారలన్
    *సజ్జనులైరి రక్కసులు సర్వ జనాళికి మేలు గూర్చగన్

    రిప్లయితొలగించండి
  15. మజ్జనకు లైదు మందియు
    సజ్జనులై ప్రజకు హితమొసంగెద ,రసురుల్
    బొజ్జలు బెంచుచు లావుగ
    సజ్జనుఁ బీడించుచుండ్రు సతతముధరలోన్

    రిప్లయితొలగించండి
  16. ఒజ్జల కారణంబునన నోర్పును మంచితనంబుఁగల్గగా
    సజ్జనులైరి రక్కసులు సర్వజనాళికి మేలు గూర్చఁగన్
    ముజ్జగ మేలునాభవుఁడు మోదము నొందుచు మేలుసేయుతన్
    సజ్జన భావముంగలిగి సాయముఁజేయగఁబూనుకొందిరే

    రిప్లయితొలగించండి