5, ఫిబ్రవరి 2013, మంగళవారం

పద్య రచన – 243

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. వందనమ్ము శేషతల్ప! భక్తబృంద కల్పకా!
    వందనమ్ము వారిజాక్ష! వారిజాసన స్తుతా!
    వందనమ్ము పద్మనాభ! పద్మినీ మనోహరా!
    వందనమ్ము దేవ దేవ! వాసుదేవ! కేశవా!

    రిప్లయితొలగించండి
  2. పాల కడలి లోన పవ్వళించిన నీకు
    పాము చుట్ట పరుపు పట్టు పడక
    భామ సిరిని జేరి పద్మ సంభవు గూడి
    మరతు వేమొ మాకు పట్టు బడక.

    రిప్లయితొలగించండి
  3. పాల కడలి లోన పవ్వళించిననీకు
    పాము చుట్టలె పరుపు పట్టు పడక
    భామ సిరిని జేరి పద్మ సంభవు గూడి
    మరతు వేమొ మమ్ము పట్టు బడక.

    రిప్లయితొలగించండి
  4. అత్తా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీరు 2 పద్యములు వ్రాసేరు. 2వ పాదములో పాము చుట్ట అంటేనె గణములు సరిపోవును. 4వ పాదములో యతి మైత్రి లేదు. సరిజేయండి.

    రిప్లయితొలగించండి
  5. ఆర్యా ! ధన్య వాదములు. దోషములను సవరించుచున్నాను.

    పాల కడలి లోన పవ్వళించిన నీకు
    పాము చుట్ట పరుపు పట్టు పడక
    భామ సిరిని జేరి పద్మ సంభవు గూడి
    మాకు పట్టు బడక మరతు వేమొ

    రిప్లయితొలగించండి
  6. పాల కడలి వాస ! !పరమాత్మ !మురహర !
    కావ రమ్ము మమ్ము , కనిక రింఛి
    పాండు రంగ ! శేష పానుపు శయ నుండ !
    వేచి యుంటి మ య్య ! వేగ రమ్ము .


    రిప్లయితొలగించండి
  7. పద్మ పాదము లొత్తగ పరవ శించు
    పద్మ జాతుడు సృష్టింప పాల కుండు
    పద్మనాభుడట పతిత పావ నుండు
    పన్నగ శయనుడగుచు నాపన్నుగాచు..

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, ఫిబ్రవరి 05, 2013 3:52:00 PM

    పద్మ పాదము లొత్తగ పరవ శించు
    పద్మ జాతుడు సృష్టింప పాల కుండు
    పద్మనాభుడట పతిత పావ నుండు
    పన్నగ శయనుడగుచు నాపన్నుగాచు..

    రిప్లయితొలగించండి
  9. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్యగారికి,
    పెద్దలకు ప్రణామములు!

    పాన్పుగా నమరిన ఫణిరాజు “బుస్సు బు”
    స్సను నూర్పుగాడ్పుల సవదరింపఁ
    గస్తూరి తిలకంబు కరఁగి “జలజల”న
    జాఱు చాఱలఁ జెంప జలదరింప
    నడిరేయిఁ గనుమూఁత వడనీక “బుడబుడఁ”
    గలశాబ్ధి తరఁగలు గలకలింప
    నడుగుఁదమ్ములఁ బిసికెడి లచ్చిమి పడఁతి
    గాజుల “గలగల” కళవళింప

    హోరు జోఱు మీఱ - నొకరాత్రి మేల్కాంచి,
    కనులు నులుముకొంచుఁ గలఁతఁ జెందు
    కమలభవునిఁ గాంచి కమలాయతాక్షుని
    కనులఁ జిలిపి తలఁపు కాంతి విరిసె.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  10. ఏల్చూరిగారి పద్యము మరల మరల చదువుకొనేలా చాల బాగుంది.

    రిప్లయితొలగించండి
  11. ఒక సాహిత్యాభిమానిమంగళవారం, ఫిబ్రవరి 05, 2013 7:38:00 PM

    నీపుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా నీపుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా నీపాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా నీపెం పేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా||
    బమ్మెర పోతనామాత్య ప్రణీతం "నారాయణ శతకం" నుండి

    రిప్లయితొలగించండి
  12. ఒక సాహిత్యాభిమానిమంగళవారం, ఫిబ్రవరి 05, 2013 7:42:00 PM

    నీపుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా
    నీపుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా
    నీపాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా
    నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా


    రిప్లయితొలగించండి
  13. పాప రేని పైన పండిన పరమాత్మ
    శరణ మన్న వారి గరుణ జూచు
    కలిమి బలిమి నిచ్చు కలకాల మిలలోన
    కడకు తనను జేర్చు కమల భర్త.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ లక్ష్మి సేవ లందుచు
    హేలగ శయనించి నీవు శేషుని పైనన్ !
    పాలను నీటను ముంచుచు
    పాలన జేయంగ ధరను పాప హరంబౌ !

    రిప్లయితొలగించండి
  15. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, ఫిబ్రవరి 05, 2013 10:25:00 PM

    రాజేశ్వరి అక్కయ్యగార్కి నమస్సులు. 2పా యతిని పరిశీలించండి.హ-శ లకు రతి సరిపోవునా?నా అనుమానము మాత్రమే.

    రిప్లయితొలగించండి
  16. సోదరులు శ్రీ తోపెల్లవారికి ధన్య వాదములు. నాకూ అనుమానమె ఐనా ధైర్యం చేసి అలానే
    ఉంచాను . ' హె- శె 'ఎ కారమునకు సరిపడుతుందని ఆశ. ఐనా మీరు చెప్పాక ఇక ఆలస్య మెందుకు ? సరి చేద్దాం .

    శ్రీ లక్ష్మి సేవ లందుచు
    హేలగ శయనించి తీవు హేలా రతుడై !
    పాలను నీటను ముంచుచు
    పాలన జేయంగ ధరను పాప హరంబౌ !

    రిప్లయితొలగించండి
  17. సకల లోక భద్రంకరుని యొక్క పరమానంద వైభవమునే వర్ణించుచూ నాదొక చిన్న ప్రయత్నము:

    పాల సంద్రపు కెరటాల తుంపరలతో
    నంగంబు ధాళధళ్యము వహింప
    ప్రేమామృతేక్షణ శ్రీమన్మహాలక్ష్మి
    మెత్తగా పాదము లొత్తుచుండ
    నాభి పద్మజుడైన నలువ చతుర్వేద
    సూక్తులతో జేయ స్తోత్రములను
    నారద సనక సనందన ముఖ్యులు
    సంకీర్తనంబులు సలుపుచుండ
    కనులు మూసియు సకల లోకముల పాల
    నము సమర్థముగా సంతతము నొనర్చు
    శ్రీమహావిష్ణు పద సరసిజ యుగంబు
    శరణు శరణంచు నే నతిశత మొనర్తు

    రిప్లయితొలగించండి
  18. మనోహరంగా విష్ణుస్తుతి పద్యాలను రచించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    ఏల్చూరి మురళీధరరావు గారికి,
    మిస్సన్న గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి




  19. పాలకడలిలో శేషతల్పమ్ము పైన
    పరమ శాంతమూర్తి మురారి పవ్వళించె
    వేదముల బఠింప విధాత వేదవేద్యు
    డాదిలక్ష్మి ,పద్మాక్షి, పాదముల నొత్త.

    రిప్లయితొలగించండి