దశ కంఠుని కెదురు పడిన దిశ మార్చక తప్పదనుచు దేవుడు యముడౌ ! వశ మాయె యముని కొక పరి దశ మార్చి వరము నొందె తా కాకాసురు డై !
ఒకసారి రావణా సురునికి యెదురు పడిన యమధర్మ రాజు తప్పించు కోలేక కాకిలో తాను ప్రవేసించి ఎగిరి పోయి ,కాకాసురునికి పిండములు తిని [ బలిహరణములు ] బ్రతక మని వరమి చ్చాడు కదా ! అదన్న మాట .
కాకాసురుఁ డపరాధము
రిప్లయితొలగించండినీ కాంతకుఁ జేయఁ గినిసి నీవొక బాణం
బా కాకి నేయ శరణననె
నేకాక్షిగఁ జేసి విడువవే హరి! వరదా!
(కళాశాల విద్యార్థిగా 1970లో వ్రాసిన 'వరద శతకము' నుండి)
శ్రీమదధ్యాత్మ రామాయణము నుండి:
రిప్లయితొలగించండిహనుమంతునితో సీతాదేవి చెప్పిన కథ:
హనుమా! మరియొక గుర్తుగ
వినిపించెద వాయసంపు వృత్తాంతంబున్
మును మేమడవుల నేకత
మున నుండగ జరిగె వినుము పుణ్య చరిత్రా!
చిత్రకూటమ్మున శ్రీరాముడును నేను
నేకతమ్మున నుండ కాకి యొకటి
పాటల రుచితోడ బరగు నా పాదంపు
నంగుష్ఠమును మాంసమని భ్రమించి
మాటిమాటికి జీల్చి మరలు చుండుట జూచి
నా యొడిలో నున్న నాథుడంత
నా వాయసమ్ముపై నస్త్రమున్ వేయగా
శరణు గోరుచు నది సకలలోక
ములను దిరుగుచు రక్షణ పొందలేక
బ్రహ్మయును నింద్రుడును దమ వలనుగాద
నంగ శరణంచు శ్రీరఘునాథు వేడ
గరుణ గని స్వామి యిట్లనె గాకితోడ
తిరుగు లేనిదీ యస్త్రంబు శరణ మీవు
కోరితివి గాన నిపుడిచ్చు కొమ్ము ప్రతిగ
దాని కీవొక నేత్రంబునేని ననుడు
తన యెడమ కంటినిచ్చె నస్త్రమున కతడు
ఏకాంతము నందుండగ
రిప్లయితొలగించండికాకాసురుడేగి సీత కాంతను పొడిచెన్
తా కుశమును మంత్రించెను
చీకాకుగ వేసె పైకి చిద్రూపుండే.
ముల్లోకంబులు దిరిగెను
కల్లోలము చెంది, సురలు కాకాసురుతో
చెల్లవు మామహిమలె యనె
కాళ్ళకు మ్రొక్కిడగ నతడు కరుణించు ననెన్.
తిరుగే లేనిది రాముని
తిరు నామము బాణమైన తీక్షణముగ శ్రీ
కరమగు మహిమను జూపును
మరి వ్యర్థము గాదు గాన మదియోచించెన్.
రామా నీవే దిక్కని
బామాలుచు శరణు వేడ వాయస మునకున్
వామాక్షము దీసెనపుడు
కామారి నుతుడు కరుణను కాకిని బ్రోచెన్.
సీతమ్మ కాలిఁ గొరకగ
రిప్లయితొలగించండిఘాతక కాకాసురునికి కన్నేబోయెన్
మాతను కోరిన రావణు
పాతకమది తూపు తోనె ప్రాణముఁదీసెన్
రిప్లయితొలగించండిచిత్ర కూ టమ్ము నందున సీ త యుండ
కాక యను బేరు గల యట్టి నొక్క యసురు
డంత జానకి వ్రేలును గొంత పొడువ
కన్ను బోగొట్టి కొనియెను కాకి ప్రతిగ
అర్భకుడగు కాక మొకడు
రిప్లయితొలగించండినార్భాటము జేయుచుండ నవనీ సుతపై
దర్భను విసరగ రాముడె
దౌర్భాగ్యుడు వాని కన్ను ధ్వంసం బయ్యెన్
సీత దేహమ్ము రక్తమున్ చింద జూచి
రిప్లయితొలగించండిదర్భ మంత్రించి వదులగా తరుమజొచ్చె
కాకి నేలోకమందున గాచువారు
లేక శరణనె నిన్నె తా కాకి తుదకు.
కాకి మూర్ఖయై చేయంగ ఘాతుకమ్ము
కోల నేయగ సమకట్టి జాలిచూపె
కాకినైనను గాకుంటి కరుణ పొంద
ననుచు వాపోయె భక్తుడో యినకులేశ!
కోకనొకప్రక్క దోసియు
రిప్లయితొలగించండిమాకళి చేయంగ దలచె మాంసము భుక్తిన్
కాకుత్స తిలకుడదిగని
ఏకాక్షుని చేసె గాదె ఏకకుశముతో.
సతియట చీకాకు పడగ
రిప్లయితొలగించండిపతియొక దర్భను వదలగ వదలక తరుమన్
గతిలేక కాకి రాముని
గతి నేకాక్షిగ వరదుడు కావగనయ్యెన్.
దశ కంఠుని కెదురు పడిన
రిప్లయితొలగించండిదిశ మార్చక తప్పదనుచు దేవుడు యముడౌ !
వశ మాయె యముని కొక పరి
దశ మార్చి వరము నొందె తా కాకాసురు డై !
ఒకసారి రావణా సురునికి యెదురు పడిన యమధర్మ రాజు తప్పించు కోలేక కాకిలో తాను ప్రవేసించి ఎగిరి పోయి ,కాకాసురునికి పిండములు తిని [ బలిహరణములు ] బ్రతక మని వరమి చ్చాడు కదా ! అదన్న మాట .
కాకాసుర వృత్తాంతాన్ని పద్యబద్ధం చేసిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సహదేవుడు గారికి,
సుబ్బారావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
మిస్సన్న గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.