11, ఫిబ్రవరి 2013, సోమవారం

పద్య రచన – 249

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    భర్త వెంటే భార్య , అన్న వెనుకే తమ్ముడు :

    01)
    _______________________________

    తండ్రి మాటను నిలుపగ - ధరణి నాడు
    తమ్ముడగు లక్ష్మణుండును - తరుణి వీడి
    తనకు రాముని సేవయే - ధర్మ మనిన
    తరలె రాముడు కానకు - తరుణి తోడ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  2. సచ్చిదానంద భాస్వంతంబు పరమాత్మ
    పరగ రాముండగ్ర భాగమందు
    మధ్యలో జానకి మాయా మహాదేవి
    భీత మృగేక్షణ రీతి నుండ
    వెనుక భాగమ్మున దనర జీవాత్మ రూ
    పమ్మున సౌమిత్రి నెమ్మనమున
    శరముల సంధించి చాపమ్ముల ధరించి
    జాగరూకత తోడ సహజు లటుల
    నడచుచును బోవుచుండి రయ్యెడను క్రూర
    మృగము లేనియు రాక్షసులేని యెదురు
    పడినచో శస్త్రముల వేసి పటుతరముగ
    నంతకుని చెంతకుం బంపు నట్టి పగిది

    రిప్లయితొలగించండి
  3. అన్నగరి వీడి వనులకు
    నాన్నయె జెప్పెననుచు జనె నారాముండే
    దన్నుగ నా జానకి జనె
    అన్నకు తా లక్ష్మణుండె యండగ వెడలెన్.

    రిప్లయితొలగించండి


  4. ఒక ఇంతి ఇద్దరు పురుషులు మువ్వురి ఈ కథ
    నాలుగు కాలాల బాటు మనోరంజక మైన కథ
    పంచ భూతముల సాక్షి గా రమాపతి జరిపిన కథ
    దశ కంఠుని సంహారం అహో రామాయణ కథ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. తండ్రి యాజ్ఞను రాముడు దాట లేక
    బయలు దేరెను నడవికి భామ తోడ
    వెంట సాగెను లక్ష్మణు డొంటి గాను
    చూడు డార్యులు చిత్రము సొబగు దనము

    రిప్లయితొలగించండి
  6. తండ్రి మాటను తలదాల్చ ధర్మప్రభువు
    పతిని యనుసరించ పత్ని సీత
    యన్న వదిన వెంట నడుగిడ తమ్ముఁడు
    బ్రతుకు రీతిఁ దెల్పు రామ చరిత

    రిప్లయితొలగించండి
  7. పతినెడబాయకుండజనె పావని సీత, సుమిత్ర సూనుడున్
    సతతము రామచందురుని ఛాయగ నిల్చె తదేక దీక్షతో,
    వెతలను సైతమెన్నడును వీడని భక్తిని గొల్చు వారికై
    జతనము జేయ జంకు విడి, చల్లగ కాచును రాముడెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  8. పతినెడబాయకుండజనె పావని సీత, సుమిత్ర సూనుడున్
    సతతము రామచందురుని ఛాయగ నిల్చె తదేక దీక్షతో,
    --------------------
    లక్ష్మీదేవి గారూ ..... వావ్.

    రిప్లయితొలగించండి
  9. ద్రుత విలంబితము :

    జనకు నాజ్ఞను సమ్మతి దాల్చుచున్
    వనము కేగెను ప్రాజ్ఞుడు రాముడే
    చనెను రాముని సంగడి సీతయున్
    అనుసరించెను అన్నను తమ్ముడే

    రిప్లయితొలగించండి
  10. నరసింహమూర్తిగారు,
    దోశల గురించి మీరు చెప్పిన సంగతి సంతసం కలిగించింది. దోశల ఖ్యాతి గురించిన ఇట్లాంటి సంగతులు అప్పుడప్పుడూ చెవిన బడుతూనే ఉంటాయి. అందుకే జగతిని ఖ్యాతి గడించినదన్నాను.
    లక్కరాజు గారు,
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    ఆధ్యాత్మికత నేపధ్యంతో మీ పద్యం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    సీతారామలక్ష్మణుల వనగమనంపై చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు...
    వసంత కిశోర్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    లక్కరాజు వారూ,
    జిలేబీ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. డా. ప్రభల రామలక్ష్మిసోమవారం, ఫిబ్రవరి 11, 2013 11:42:00 PM

    తండ్రియానతి మీద తరలిపోయెను రాము
    డానాడు తన సతి, భ్రాత తోడ
    కైకమ్మ కెంతటి కార్పణ్యమో యని
    లోకులు కాకులై లోపమెంచ
    జూతురు గానియా శోకమ్ముచే, గాదె
    తాపసులెందరో ధన్యులైరి !
    కన్నతల్లి యొడిని కాయమ్ము వాల్చిన
    జనకజపై నంత జాలి యేల?
    కష్టనుఖముల కలబోత కాపురమ్ము
    కాదదెన్నడు కోరగ కల్పతరువు
    అన్నియును గూడ మన మంచికంచు చెప్పి
    యెంచి చూడుడు జనులార! హంసలాగ.

    రిప్లయితొలగించండి
  13. సేకరణ: సాహిత్యాభిలాషి.మంగళవారం, ఫిబ్రవరి 12, 2013 12:28:00 AM

    నడువనేరనికొమ్మయడుగులు పొక్కులై
    శర్కరస్థలముల శ్రమముజెందె
    వీచిన చేతులవ్రేళ్ళు నెత్తురు గ్రమ్మి
    పొటమర్లు కెంపులపోల్కి నమరె
    వడిగాలి సుడివడి వాడిన లేదీగ
    భావంబునను మేనిచేవ తఱిగె
    బూర్ణచంద్రుని కాంతి పున్నమవేకువ
    గనుపట్టుగతి మోము కళల విడిచె
    ధవుని నడుగడుగునకు గైదండ గొనుచు
    నెగడుదప్పిని నిట్టూర్పు లెగసి చిగురు
    బెదవులెండగ నీడకు నుదిల గొనుచు
    మనసులో జేవ యూతగ జనెడువేళ.

    రిప్లయితొలగించండి
  14. మర్మము తెలియని రాముడు
    ధర్మము వీడకను వెడలె దైవత్వము నన్ !
    నిర్మల చిత్తమున సతిని
    కర్మపు ఫలమంచు ననుజు కారడ వులకున్ !

    రిప్లయితొలగించండి