19, ఫిబ్రవరి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 971 (పాపములనుఁ జేయువాని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పాపములనుఁ జేయువానిఁ బార్వతి  మెచ్చున్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

  1. పాపముఁ జేయుచు మ్రొక్కిన
    పాపములను జేయు వాని పార్వతి మెచ్చున్!
    యీపగిది తలంచియు ని
    క్షేపముగ దురితముఁ జేయ శ్రీకరి యడచున్!

    రిప్లయితొలగించండి
  2. శంకరయ్య గారూ,
    వరంగల్ శతావధాన వివరాలను బ్లాగులో ప్రకటిస్తామన్నారు. ఎప్పుడు ప్రకటిస్తారు?

    రిప్లయితొలగించండి
  3. తలప రాదెన్నడును పాపములను జేయు
    వాని, పార్వతి మెచ్చున్ శుభమ్ములిచ్చు
    సకల సద్గుణ రాశియై సాదరమున
    యోగ సాధన జేయుచు నుండు వాని

    రిప్లయితొలగించండి
  4. ఆ పువ్వులు గురిపెట్టుచు
    పాపములను జేయువాని పార్వతి మెచ్చున్
    పాపము పంచాస్త్రుండును
    తాపము బడ బేసికంటి దగ్ధుడు నయ్యెన్

    రిప్లయితొలగించండి
  5. రూప రహిత సర్వాంతర్
    వ్యాపక తత్త్వమునకన్నియాకారములన్
    రూపించుట పాపమైన
    పాపములను జేయు వాని పార్వతి మెచ్చున్!

    రిప్లయితొలగించండి
  6. ఆపరమేశ్వరి దిక్కని
    రేపులు మాపులును పూజ, రిత్తగనవగా
    అపదలును మసిజేయగ
    పాపములను, జేయువాని పార్వతి మెచ్చున్

    రిప్లయితొలగించండి
  7. సహదేవుడు గారూ ! ఈ రోజు రెండు పూరణలలో మీరే ముందున్నారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మూర్తిగారు,
    పువ్వులను గురిపెట్టే వానికి బాగానే గురిపెట్టారు. మంచి ఆలోచన , అమ్మవారు క్షమించినదాతడినే కదా!
    పద్యము రెండవభాగములో అన్వయం సరిగ్గా కుదరలేదేమో అని అనిపిస్తున్నది.

    రిప్లయితొలగించండి

  9. దీపము తానై వెలుగుచు
    నా పరమేశ్వరి యొకింత యౌదార్యముతో,
    పాపులను జంపుట యనెడు
    పాపములనుఁ జేయువానిఁ బార్వతి మెచ్చున్.

    రిప్లయితొలగించండి
  10. పాపాల రావు గారనె
    పాపాలను జేయువాని ,బార్వతి మెచ్చున్
    నేపాపము సేయ కుండ
    మా పాలిట దేవ తంచు మాతను గొలువన్

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీదేవి గారూ ! ధన్యవాదములు. సవరించాను

    ఆ పువ్వులు గురిపెట్టుచు
    పాపములను జేయువాని పార్వతి మెచ్చున్
    కోపముఁ గన ఫాలాక్షుడు
    పాపము తా శిక్ష నొందె పంచశరుండున్ !

    రిప్లయితొలగించండి




  12. కాపురుషుండయి యెన్నియొ
    పాపములను జేయువాని బార్వతి మెచ్చున్
    శాపగ్రస్తుడు పశ్చా
    త్తాపమ్మున మారి నడువ ధర్మనిరతితోన్.

    రిప్లయితొలగించండి
  13. ధన్యవాదములు,గురుదేవులకు పాదాబివందనములతో

    శ్రీ నేమాని పండితవర్యుల బాటలో నా చిన్ని ప్రయత్నము
    ఆటవెలది / సీసము లలో
    =======*=========
    పాపములను జేయు వాని బార్వతి మెచ్చు
    --- నని కలియుగ స్వామి యన్న,బల్కు
    లు విని పరుగు బెట్టె లోకనాయకులెల్ల
    ----పాపములను జేయ వారి బంధు
    వర్గములను బిల్చి ,పారిదోషకమును
    ---- బొందగలరు మీరు పురజనులను
    పగలు రాత్రియనక ,వారు వీరనకను
    ---- చిత్ర హింసల గురి జేసి రమ్ము.
    పాప భీతినొదలి ప్రభుతల తోడను
    ---- చెలిమి వలన గల్గు బలిమి మీకు
    రక్త మందు రుచిని భక్తి తోడను గని
    --- రెచ్చి పొండి దమరు హెచ్చు గాను |


    రిప్లయితొలగించండి
  14. పాపపు కర్మల నరసియు
    శ్రీపతి భువి నెవరికైన శిక్షల నిచ్చున్
    ఆపదలయందు మ్రొక్కుచు
    పాపములను జేయువాని పార్వతి మెచ్చున్.

    రిప్లయితొలగించండి
  15. చేపల యెంగిలి మధుపపు
    త్రాపెంగిలి లేగదూడ త్రాగెంగిలియున్
    పాపమిడ కాని పాపము
    పాపములను జేయువాని పార్వతి మెచ్చున్.

    రిప్లయితొలగించండి
  16. పాపము జేయుచు తెలియక
    శాపములను పొందు చుంద్రు చాపల్యము నన్
    కోపము వలదని తల్లిగ
    పాపములను జేయు వాని పార్వతి మెచ్చెన్ !

    రిప్లయితొలగించండి

  17. ఆ పరమేశుడు మెచ్చడు
    పాపములను జేయువాని ; పార్వతి మెచ్చున్
    శ్రీపతినే వేడి శరణు
    పాపము జేయని నరుడిని భక్తుని వానిన్

    రిప్లయితొలగించండి
  18. పాపము ! దయ జూప రెవరు
    పాపములను జేయు వాని ; పార్వతి మెచ్చున్
    పాపిని సైతము పశ్చా
    త్తాపము నొందుచును వాడె “తల్లీ !" యనగన్

    రిప్లయితొలగించండి
  19. “కోపము బూనెడు వానిని
    పాపములను జేయు వాని పార్వతి మెచ్చున్"
    ఈ పలుకులు గావు నిజము
    పాపములను జేయు వాని పార్వతి దునుమున్

    రిప్లయితొలగించండి
  20. పుట్టి నింటికి వేడుక పూని జరుప
    పండుగ దినము నందరు వచ్చిరంత
    భోజనంబున ఘృతపాపములను జేయు
    వాని పార్వతి మెచ్చున్ సెబాసనుచును.
    (ఘృతపు+ఆపములను (అపూపములను)

    రిప్లయితొలగించండి
  21. ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చేసిన కవిమిత్రులు...
    సహదేవుడు గారికి,
    పండిత నేమాని వారికి,
    గన్నవరుపు నరసింహమూర్తి గారికి,
    చంద్రమౌళి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    కమనీయం గారికి,
    వరప్రసాద్ గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    మిస్సన్న గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    నాగరాజు రవీందర్ గారికి
    అభినందనలు. ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    మూడవ పాదం ప్రారంభంలో యడాగమం వేసారు. వాక్య ప్రారంభం కనుక దానిని 'ఈ పగది' అని అచ్చుతో మొదలు పెట్టడంలో దోషం లేదు.
    *
    చంద్రమౌళి గారూ,
    మూడవపాదం చినర 'పమైన' అని జగణం పడింది. అక్కడ "పాప మయిన" అంటే సరి.
    *
    సుబ్బారావు గారూ,
    మూడవ పాదం చివర 'య కుండ' అని జగణం వేసారు. 'దేనత + అంచు = దేవత యంచు' అని యడాగమం వస్తుంది. అక్కడ సంధి లేదు. నా సవరణ...
    ఏ పాపములను జేయక
    మా పాలిట దేవత యని మాతను గొలువన్

    రిప్లయితొలగించండి
  22. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    వైవిధ్యంగా, చమత్కారంగా చెప్పాలన్న మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
    'ఘృతపు + ఆపము" అన్నప్పుడు 'కర్మధారయమున ఉత్తున కచ్చు పరమైనపుడు టుగాగమ మగు' అన్న సూత్రం వలన ఘృతపుటాపము అవుతుంది. పేర్వాది శబ్దాలకు మాత్రం సంధి జరిగే అవకాశం ఉంది.
    మార్చే అవకాశం లేనందున అలాగే ఉండనిద్దాము.

    రిప్లయితొలగించండి
  23. లోపములెంచకు నాయెడ
    పాపములను చేయనింక పార్వతిమాతా
    కోపమువలదని కోరిన
    పాపములను జేయు వాని పార్వతి మెచ్చున్"

    రిప్లయితొలగించండి
  24. శాపము నా విరహమ్మౌ
    తాపము భరియింప లేక తప్పులనయ్యో!
    పాపమని! దేవదాసును
    పాపములనుఁ జేయువానిఁ బార్వతి మెచ్చున్

    రిప్లయితొలగించండి
  25. దాపుఁ గని దేవదాసుని
    శాపమ్మీ త్రాగుడనుచు సైచుచు నయ్యో
    పాపమ్మని దయజూపుచు
    పాపములనుఁ జేయువానిఁ బార్వతి మెచ్చున్

    రిప్లయితొలగించండి