ఖగపు ధాటికి కూలిన ఖగము గాచి కోట చేరిన గౌతమ, కొమరు జూచి | "పట్టుకొనిరండు వేగమె పయము, పాలు హంస పాలను, వీడు తోయముల ద్రావు" || అనిన మహారాజు మాటలు విని సేవకులు పరుగెత్తారు. ( ఖగము = బాణము, పక్షి ).
గురువు గారూ ! వందనములు. య-ర-ల-వ అనెడు అంతస్థములకు తమలో తాము పరస్పర యతిమైత్రి చెల్లునని సులక్షణ సారములో ఇవ్వబడినది. కాని మరోసారి చూస్తే మీరన్నట్లు ఇది అప్రశస్తము మరియు నగ్రాహ్యము. అప్పకవి కూడ దీనిని ఒప్పుకోక నగ్రాహ్య యతులలో చేర్చినాడు. సందేహ నివృత్తి చేసినందులకు ధన్యవాదాలు.
కార్తిక్ గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీరు ముందుగా కొంత ఛందోనియమాలను తెలిసికొని పద్యాలను వ్రాయడం మొదలుపెడితే నేను, మిత్రులు మీకు పద్యరచనలో తోడ్పడగలము. స్వస్తి!
తత్త్వ విభవమ్ము మరచుచు, తనువులొంది,
రిప్లయితొలగించండిచెంది తాదాత్మ్య మంగాదులందు నాత్మ;
తుఛ్ఛ సుఖముల గాంచు సంతుష్టి; నకట
హంస పాలను వీడు, దోయముల ద్రావు
ఎన్నిమారులు చెప్పిన నేమి వినడు
రిప్లయితొలగించండిమంచి నెంచుచు చెడునేమొ త్రుంచ మనిన
వదల డేమందు నిక నేను మదిని దలతు
' హంస పాలను, వీడుఁ దోయములఁ ద్రావు'
కలియు గమ్మున వింతలు కలవు మెండు
రిప్లయితొలగించండిదారు ణమ్ముగ చెలరేగె దనుజ సంతు
పంచ భూతము లన్నియు మంచె కెక్కె
హంస పాలను వీడు దో యముల ద్రావు
కంటిరెప్పగ పాలించు కన్న తల్లి
రిప్లయితొలగించండిసంతు శ్రేయస్సు గోరుట వింత యగునె
కూన లాకొన వాత్సల్య మూని, జనని
హంస పాలను వీడు దోయముల ద్రావు !
కలియుగంబున నన్నియు కల్తి కాగ
రిప్లయితొలగించండిఖాద్య మైనను ద్రవమైన కాంచు మిచట
శాస్త్ర విజ్ఞాన మనుచును సంచ రింప
హంస పాలను వీడుఁ దోయములఁ ద్రావు.
చిత్ర మైన రీతుల తోడ జీవ సృష్టి
శాస్త్ర విజ్ఞాన క్లోనింగు చర్య లనుచు
చేయ మారెస్వ ధర్మము జీవులందు
హంస పాలను వీడుఁ దోయములఁ ద్రావు
మురిపెమున నొక యంచను ముద్దుజేసి
రిప్లయితొలగించండిపెంచు చుండగ మావాడు పోయుచుండె
చూడ నేబోయి యచ్చట చూచి నాను
హంస పాలను, “వీడుఁ” దోయములఁ ద్రావు
మురిపెమున నొక యంచను ముద్దుజేసి
రిప్లయితొలగించండిపెంచు చుండగ మావాడు పోయుచుండె
చూడ నేబోయి యచ్చట చూచి నాను
హంస పాలను, “వీడుఁ” దోయములఁ ద్రావు
యూరియా కాస్టికుల సోడ, ఉప్పు, నూనె
రిప్లయితొలగించండిసర్పు, సల్పేటు, వివిథ రసాయనములఁ
జేసి సింథటిక్ పాలను పోసినంత
హంస పాలను వీడుఁ దోయములఁ ద్రావు!!
మంచిని గ్రహించి చెడును త్య
రిప్లయితొలగించండిజించుము విషము వలె నెంచి యెప్పటి కైనన్
కించిత్తు పొరబడక రా
యంచలు క్షీరమును గ్రోలి వారిన్ విడచున్
*********
మనసు ముక్తి మార్గమ్మును మరచిపోయి
ఐహిక సుఖముల నెపుడు నభిలషించు
మరలుచుండును చిత్తము మంచి నుండి
హంస పాలను వీడు, దోయముల ద్రావు
క్షీరమును నీరమును హంస వేరుచేయు
మంచి చెడులను మనము గుర్తించవలెను
మనసు మర్కటము పగిది మాట వినదు
హంస పాలను వీడు, దోయముల ద్రావు
ఖగపు ధాటికి కూలిన ఖగము గాచి
రిప్లయితొలగించండికోట చేరిన గౌతమ, కొమరు జూచి |
"పట్టుకొనిరండు వేగమె పయము, పాలు
హంస పాలను, వీడు తోయముల ద్రావు" ||
అనిన మహారాజు మాటలు విని సేవకులు పరుగెత్తారు.
( ఖగము = బాణము, పక్షి ).
సమస్యకు చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
జిగురు సత్యనారాయణ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
'యంచలు క్షీరమును గ్రోలి వారిన్ విడచున్.... అన్నప్పుడు యతి తప్పింది. 'యంచలు క్షీరమును గ్రోలి యంబువుల విడున్' అందామా?
గురువు గారూ ! వందనములు. య-ర-ల-వ అనెడు అంతస్థములకు తమలో తాము పరస్పర యతిమైత్రి చెల్లునని సులక్షణ సారములో ఇవ్వబడినది. కాని మరోసారి చూస్తే మీరన్నట్లు ఇది అప్రశస్తము మరియు నగ్రాహ్యము. అప్పకవి కూడ దీనిని ఒప్పుకోక నగ్రాహ్య యతులలో చేర్చినాడు. సందేహ నివృత్తి చేసినందులకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపాలు మాత్రమె దొరికెడు కాల మందు
రిప్లయితొలగించండిహంస తిరిగెడు చోటుకు నరిగి యొకడు
పాత్ర ముందెట్ట కడుపార పట్టి త్రాగె
హంస పాలను, వీడుఁ దోయములఁ ద్రావు
మంచి చేడుల మధ్య మహ సంగ్రమం
రిప్లయితొలగించండిరామరావణ యుధ్థం ధర్మం గెలవగా
ద్రోపతి వస్త్రం లగీనావాడు అధోగతిపాలు
హంస పాలను విడు దోయముల ద్రోవు
నాకు ఎమి రాదు తప్పలు వుంటే తెలియఙేయండి
రిప్లయితొలగించండికార్తిక్ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీరు ముందుగా కొంత ఛందోనియమాలను తెలిసికొని పద్యాలను వ్రాయడం మొదలుపెడితే నేను, మిత్రులు మీకు పద్యరచనలో తోడ్పడగలము. స్వస్తి!
కృతఙ్ఙతలు గురువు గారు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి