24, ఫిబ్రవరి 2013, ఆదివారం

పద్య రచన – 262 (కవి సమ్మేళనములు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"కవి సమ్మేళనములు"

32 కామెంట్‌లు:

  1. కవి సమ్మేళనముల్ శుభోదయమునన్ గ్రాలున్ మహోత్సాహవై
    భవ సంపన్నములౌచు జాలజగతిన్ భాగ్యంబదే శంకరా!
    కవి లోక స్తుత! శంకరాభరణ దీక్షాదక్ష! యీ పర్వముల్
    సవనప్రఖ్యములౌచు సాగుత సదా సౌజన్య రత్నాకరా!

    రిప్లయితొలగించండి
  2. నిన్నటి సమస్యకు మరొక పూరణము.

    తా తలచెను నన్నయ నా
    పోతన,"భారతము వ్రాసె బుధులు పొగడఁగన్
    నే తరియించెద నిపుడు పు
    నీతము భాగవత గ్రంథ నిర్మాణమునన్.

    కవి సమ్మేళనమందున
    నవ కవితలనాదరింప నాణ్యత గలదే?
    కవనవనములో సొబగుల
    నవ పల్లవము చిగురించు నాడది యెపుడో?

    రిప్లయితొలగించండి
  3. కవిసమ్మేళనముల సరి
    రవళించును గాదె పద్య రాగములెన్నో
    స్తవనీయ కోకి ల శుకము
    లవలీలగ జేయు శ్రావ్య రవముల వలెనే !

    రిప్లయితొలగించండి
  4. ఈరోజు హైదరాబాద్, త్యాగరాయ గాన సభలో ఉదయం. 10. గంటలకు సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులైన శ్రీ చిక్కా రామ దాసు అధ్యక్షతన ‘తెలుగు సాహిత్య కళా పీఠం’ ఆధ్వర్యంలో కవిసమ్మేళనం జరుగబోతున్నదని చింతా రామకృష్ణారావు గారు తమ "అంధ్రామృతం" బ్లాగులో తెలియజేసారు.

    రిప్లయితొలగించండి
  5. కవి సమ్మేళనములు నా
    గవు లందరు నొక్క చోట కలుసుకు నుండిన్
    కవితలు బ్రశ్నలు మొదలగు
    వివిధములుగ జర్చ జేసి వివరణ యిత్తుర్

    రిప్లయితొలగించండి
  6. కవి సమ్మేళనము లనగ
    కవిగాయకు లొక్కచోట కలిసెడు వేళల్
    కవులు గళమెత్తి పాడుదు
    రవియే ! కోకిలలు గూయు నారామంబుల్

    రిప్లయితొలగించండి
  7. శంకరాభరణంబను సాహిత్యపర
    బ్లాగు, దిన దిన మొక కవి పండిత గణ
    శోభిత కవిసమ్మేళన సుధలఁ జిల్క
    భారతికిడెడు మంగళ హారతులవె!

    రిప్లయితొలగించండి
  8. రవి గాంచని చోటైనను
    కవు లందరు కవిత లల్లి గానము చేయన్ !
    నవరస మగు కవనమ్ముల
    నవిరళముగ వినిపింతు రానందముగన్ !

    రిప్లయితొలగించండి
  9. వసుధను తెల్గు ప్రపంచ కవీశ్వర పాదసుపీఠిగ పాదుకొనంగ నిటన్
    మసగుచు కావ్య సమంచిత వస్తుసమాశ్రిత మైన సమస్యలు వర్ణనముల్
    పసగల "శంకర" బ్లాగున భాషకు ప్రాభవమొప్పగ పద్యకవిత్వ మసల్
    రస"కవిరాజవిరాజిత"మై నవరాగ సుధారస రంజితమై వరలన్.
    ( పసగల = వస్తుసమూహము గల,దమ్మున్న)
    (మసల్ = విలాసములు)
    ( మసగుచు=విజృంభించుచు)

    రిప్లయితొలగించండి
  10. శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
    మీ కవిరాజవిరాజిత వృత్త ప్రయత్నము ప్రోత్సహించ దగినదే. మా అభినందనలు. ప్రతి పాదములో చివరలో గణములు సమముగా లేవు. ఎక్కువగా నున్న అక్షరములను తొలగించి సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ నేమాని గురువర్యులకు నమస్సులు. పొరపాటుగ 1 నగణము + 7 జగణములుగా గ్రహించితిని. యతిస్థానములు 8+14+20 గా సులక్షణసారమునందు చెప్పబడినది. ఇది సరియేనా? తెలుప ప్రార్థన. మీసూచనానంతరం సరిదిద్దుబాటు. దోషములు తెలియవు.

    వసుధను తెల్గు ప్రపంచ కవీశ్వర పాద సు పీఠిగ పాదుకొనన్
    మసగుచు కావ్యసమంచిత వస్తుసమాశ్రితమైన సమస్య లిటన్
    పసగల "శంకర" బ్లాగున భాషకు ప్రాభవమొప్పగ పద్యము సా
    రస "కవిరాజ విరాజిత" మై నవరాగ సుధారస రంజితముల్

    రిప్లయితొలగించండి
  12. మరియొక చిన్న ప్రయత్నము:

    మిసమిసలాడెడు మేలిమి బంగరు మించు కవిత్వ సమేతములై
    రసమయ సత్కవిరాజవిరాజిత రమ్యసభా ప్రకరమ్ములు సం
    తసమును మానస తామరసమ్మున దద్దయు గూర్పగ తన్మయతన్
    బిసరుహ సంభవు ప్రేయసికిన్ పదపీఠి నొనర్తును వేల నతుల్

    రిప్లయితొలగించండి
  13. పండితార్యా! నమస్సులు. యతిస్థానానుమాన నివృత్తికి మీరు చెప్పిన "సత్కవిరాజవిరాజితము"
    అద్భుతము.ధన్యుడను.

    రిప్లయితొలగించండి
  14. రవిరాకతోడ మొదలవు
    కవులందరు కలముతీసి కవితలు వ్రాయన్
    కవిసమ్మేళనమిచటను
    చవులూరగ జరుగుచుండు శంకరబ్లాగున్

    చిక్కులు తీసియు పూరణ
    చక్కగ వర్ణింతురంత చాతుర్యముతో
    వెక్కసమవ్వదు కవులకు
    మిక్కుటముగ మక్కువౌను మేళనమందున్

    రిప్లయితొలగించండి
  15. శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారికి
    అభినందనలతో,

    అందమైన మీ పద్యాన్ని ఈ విధంగా అన్వయించుకొందాము.

    వసుధను తెల్గు ప్ర - పంచ కవీశ్వర – వందిత వాణిగ రాణఁగొనన్
    మసఁగుతఁ; గావ్యస - మంచిత వస్తుస – మాశ్రితభవ్యసమస్యలచేఁ
    బసఁగల "శంకర" - బ్లాగున భాషకుఁ - బ్రాభవ మొప్పఁగఁ బద్యసుధా
    రస "కవిరాజ వి - రాజిత" మై నవ - రాగసుధారసరంజితమై.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  16. తోపెళ్ళ వారూ,
    మీరు సవరించి వ్రాసిన పద్యం సలక్షణంగా ఉంది.
    కవిరాజవిరాజితం 23వ వికృతిచ్ఛందంలో 3595120వ వృత్తం.
    గణాలు - న జ జ జ జ జ జ వ. (1న-6జ-లగం)
    యతిస్థానాలు - 8, 14, 20
    (నన్నయ్య మాత్రం కేవలం 14వ అక్షరానికే యతి పాటించాడు)
    ప్రాసనియమం ఉంది.

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని గురువర్యులకు మరియు శంకరార్యులకు వందనములు,
    ఉత్సాహమున్నప్పటికి, వృత్తి యందలి శ్రమాధిక్యతవలన అప్పుడప్పుడు ప్రాస, యతి, గణ దోషాలు దొర్లి నిరాశక్తి కలుగుతున్నా, పెద్దలైన తమ సూచనలు మాకు శక్తినిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    ఈరోజు మా బావగారి ప్రథమ సాంవత్సరికానికి ఊరికి వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. ప్రయాణపుటలసట వల్ల ఎట్టి వ్యాఖ్యలు చేయలేను. మన్నించండి. ఉదయం ప్రస్తావిస్తాను.

    రిప్లయితొలగించండి
  19. ఏల్చూరి మురళీధర మహోదయా! ఏమి నాభాగ్యము! మీచేత సంస్కరింపబడిన నాపద్యము హృద్యము. ఏదో వ్రాయాలన్న తపనతో వేసే తప్పటడుగులను మీబోటి పెద్దలు సరిదిద్దుచూ చేయూతనిచ్చి నడిపించుట మా అదృష్టము. సాదర పాదభివందనములతో
    ... ఆజన్మాంత మురళీధరాభిమానిగా
    ... మీతోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.

    రిప్లయితొలగించండి
  20. వసుధను తెల్గు ప్రపంచ కవీశ్వర పాద సు పీఠిగ పాదుకొనన్
    మసగుచు కావ్యసమంచిత వస్తుసమాశ్రితమైన సమస్య లిటన్

    మిసమిసలాడెడు మేలిమి బంగరు మించు కవిత్వ సమేతములై
    రసమయ సత్కవిరాజవిరాజిత రమ్యసభా ప్రకరమ్ములు

    బసఁగల "శంకర" - బ్లాగున భాషకుఁ - బ్రాభవ మొప్పఁగఁ బద్యసుధా
    రస "కవిరాజ వి - రాజిత" మై నవ - రాగసుధారసరంజితమై.

    ముగ్గురు ఉద్దండుల ఈనాటి శంకర ఆభరణాలు.

    రిప్లయితొలగించండి




  21. కవుల సమ్మేళనమ్ముల గాంతి తరిగె,
    తొంటి ప్రాభవమిప్పుడు తోచరాదు
    పాండితీగరిమ,సుకవితాప్రౌఢిమయును
    దరుచగుటయు,వచనకవితాప్రభావ
    మతిశయించుట కారణమ్మౌనొ యేమొ

    రిప్లయితొలగించండి




  22. కవుల సమ్మేళనమ్ముల గాంతి తరిగె,
    తొంటి ప్రాభవమిప్పుడు తోచరాదు
    పాండితీగరిమ,సుకవితాప్రౌఢిమయును
    దరుచగుటయు,వచనకవితాప్రభావ
    మతిశయించుట కారణమ్మౌనొ యేమొ

    రిప్లయితొలగించండి
  23. సోదరులు శ్రీ తో పెల్ల వారి అదృష్టం శ్లాఘ నీయం .శుభాభి నందనలు

    రిప్లయితొలగించండి


  24. నాడు సభాప్రాంగణమ్ముల జరిగె,నేడు
    తెలుగు కవితా వైభవమ్ము చూడుడు
    బిట్సు బైటుల సమ్మిళనముగా
    జరుగుతున్నవి కవుల సమ్మేళనములు !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  25. ఈరోజు శంకరాభరణం బ్లాగు మనోహరమైన పద్యాలతో కవిరాజ విరాజితమై శోభిల్లింది.
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సహదేవుడు గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    కమనీయం గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. చిక్కులు తీసియు పూరణ
    చక్కగ వర్ణింతురంత చాతుర్యముతో
    వెక్కసమవ్వదు కవులకు
    మిక్కుటముగ మక్కువౌను మేళనమంటే

    రిప్లయితొలగించండి
  27. శ్రీ తోపెల్ల శర్మ గారు నిన్న వ్రాసిన కవిరాజవిరాజితమునకు డా. ఏల్చూరి మురళీధర్ గారు సవరణ చేసేరు బాగున్నది. అందులో మొదటి పాదమునకు మరొక సవరణ:
    1వ పాదము చివరలో: రాణగొనన్ కి బదులుగా: భాసిలుచున్ అంటే యతిమైత్రి బాగుంటుంది. స్వస్తి

    రిప్లయితొలగించండి
  28. కవనమ్ముల వనములలో దవనమ్మిది కాగలదని
    గమనమ్మును సేతురిచట సమభావముతో
    నియమమ్ముల నెరుగనెడల వివరమ్ముగ తెలిపెదరట
    తధ్యమ్మిది మారుమ్రోగు పద్యము సుమ్మా

    పలుమారులు పరికించగ వనమాలియె శంకరయ్య
    కవిరాజుల గాడిపట్టు కానగనైతిన్
    కవితామృత ధారలొసగు బ్లాగున నీరీతిచేరి
    కవి సమ్మేళనమున ధన్యుడ నైతిన్

    పద్యమ్మును రచియింపగ సత్యమ్మది సొత్తులేదు
    తొడ్కొని మది సత్తువంత రాసితి రాతల్
    అక్కరతో చేసితినే యత్నముతో సంభవమని
    ఆర్జింతును విద్య దొడ్డ దీవెనలంది

    చిఱ్ఱావూరి అనంత్

    రిప్లయితొలగించండి