6, ఫిబ్రవరి 2013, బుధవారం

పద్య రచన – 244

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. తండ్రీ కొడుకులు వచ్చిరి
    తండ్రీ కొడుకులను జూచి తామిట్లనియెన్
    తండ్రీ! కుమారు గంటివ!
    గుండ్రాయేతారకునికి గొంతున బడియెన్!

    రిప్లయితొలగించండి
  2. హనుమచ్ఛాస్త్రి గారు,
    తండ్రీకొడుకులు వచ్చి తండ్రీ కొడుకులను చూసినారా! భలే , పదాలతో చమత్కారములాడటంలో మీకుమీరే సాటి.

    రిప్లయితొలగించండి
  3. ఒక్కడు మువ్వురుగనగుచు
    చక్కగ లోకములనేలు జగదీశా! నీ
    మక్కువ పుత్రునిపైనను
    మిక్కిలిగా జూపుచున్న మిషయది యేమో?

    రిప్లయితొలగించండి
  4. నిన్నటి పద్యరచన.

    సిరులను కురిపించు జనని
    వరియించె హరిని; విడువదు పాదములను; తా
    మరలో జనించు స్రష్టయె,
    పరుగున వచ్చునె పిలువగ పరమాత్ముండే.

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీ దేవి గారూ ! ధన్యవాదములు.
    మువ్వురుగ 'నగుచు' న్న పద్యం బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, ఫిబ్రవరి 06, 2013 8:31:00 AM

    మారుడు మసియై పోయిన మనసు పడుచు
    పార్వతి కరము పట్టగ ఫలము నొందె
    తారకాంతక తనయుని తరలి వచ్చె
    బ్రహ్మ విష్ణులు పార్వతీ పతిని జూడ౤

    రిప్లయితొలగించండి
  7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, ఫిబ్రవరి 06, 2013 8:34:00 AM

    శాస్త్రీజీ.ఈరొజు ప్రథమ పురస్కారం మీదే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీకంధరాయ గౌరీవల్లభాయ వి
    ....జ్ఞాన స్వరూపాయ తేనమోస్తు
    మందాకినీ సదా మండిత మూర్ధాయ
    ....దేవ సంస్తుత్యాయ తే నమోస్తు
    హేరంబ గుహ సుకుమార సంసేవ్యాయ
    ....ధ్యాన సంలగ్నాయ తేనమోస్తు
    శాంభవీ సహితాయ జలజసంభవ విష్ణు
    ....దేవ సంపూజ్యాయ తే నమోస్తు
    యజ్ఞ ఫలదాయకాయ విశ్వాధిపాయ
    నగనివాసాయ కాంచన నగధరాయ
    మోహవిధ్వంసకాయ ప్రమోదకాయ
    స్తుత్య మహిమాయ తే నమోస్తు వరదాయ

    (ఈ పద్యములోని ప్రతిపాదములో మొదటి అక్షరములను జేర్చితే "శ్రీమహేశాయనమోస్తు" అని వచ్చును) స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. నేమాని గారి పద్యము పద గాంభీర్యముతో చక్కగానున్నది , ఒక్క "ప్రమోదకాయ" అన్న పదము దగ్గరే కొరుకుడు పడకుండ నున్నది . ప్రమోదమును కలిగించేవాడని అర్థమును ఇచ్చునా , ఇచ్చినచోనే విధముగా అన్నది విచారణీయం . మిగిలిన పద్యము బాగున్నది.

    రిప్లయితొలగించండి
  10. బ్రహ్మ విష్ణులు చెరి యొక వైపు నుండి
    తార కాసుర మర్దుని దండ్రి కచట
    పెట్టు చుండిరి దండముల్ బిట్టు గాను
    ఆది దేవుని కయ్యది యర్హ మేను .

    రిప్లయితొలగించండి
  11. అజ్ఞాత గారూ,
    చోదన కర్త చోదకుడు...
    పరిశోధన కర్త పరిశోధకుడు...
    అలాగే
    ప్రమోదన కర్త "ప్రమోదకుడు" కాదా?
    ఇంతకన్న ఎక్కువ వ్యాఖ్యానించే సంస్కృత పాండిత్యం నాకు లేదు.
    లేదా... "ప్రమోదదాయ" అనే దానికి అది టైపాటూ కానచ్చు.

    రిప్లయితొలగించండి
  12. పరమేశా! మది నీ పదాబ్జముల సంభావించు నీ వేళలో
    పరమార్థంబును వీడి కొండొకడహో వ్యంగ్యోక్తులన్ బూనె శం
    కర! యీ దుస్థితి నీవె దిద్దవలె నజ్ఞానిన్ ప్రసన్నుండవై
    పరమానంద రస స్వరూప విభవా! ప్రజ్ఞానతేజోనిధీ!

    రిప్లయితొలగించండి
  13. శ్రీ తోపెల్ల వారి పద్యము 3, 4 పాదములను ఇలాగ మార్చితే అన్వయము మెరుగు పడుతుంది:

    తారకాంతకు గుహు శివతనయు జూడ
    తరలి వచ్చిరి నలువయు హరియు వేడ్క

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. కలసిన త్రిమూర్తు లచ్చట
    తలపోసిరి తారకుడిని దండించగనే!
    యిలలో నైనను పెద్దలు
    తలచిన దుష్టులముగింపు తథ్యంబవదే?

    రిప్లయితొలగించండి





  15. శంకరుని యొడిలో నున్న షణ్ముఖుండు
    తారకాసురు నంత మొందంగ జేయు
    నంచు సంతసమ్మున హరి ,యబ్ఝభవుడు,
    వారి కభివాదమును జేయు వారు చూవె.

    రిప్లయితొలగించండి
  16. తారకు జంప నీ సుతుడు తద్దయు లోకములెల్ల భద్రమై
    హారతులెత్త మించెడిని హాయిగ నీ యొడిలోన శంకరా!
    వారిజ నాభుడున్ మరియు వారిజ సంభవు డిట్లు పల్కగా
    జేరి కుమారతాత గని చిన్నగ నవ్వెను జూచి పుత్రునిన్.

    రిప్లయితొలగించండి
  17. అకటకటా !సరస్వతి!మదంబ!యిదేమిటి ?పండితుండు వే
    రొక పదమేది లేనటుల నుత్సుకతన్ జరియించుచున్ "ప్రమో
    దకుడను" మాట వాడి యది తప్పనుచో సహనమ్మునేది యీ
    వికలపు మాటలాడె వినవే కనవే యిది యేమి చిత్రమో?

    రిప్లయితొలగించండి
  18. అయ్యా శంకరయ్యగారూ మీ వివరణ మీద మరల స్పందించెదను. ప్రస్తుతానికి నేమాని గారిని వివరణ అడిగితే సహనము కోల్పోయి కొండొకడు ,అజ్ఞాని యని యనుచున్నారు కాని వివరణ మాత్రము నివ్వలేదు . వారి స్పందన యేమిటో యివ్వాళ చూచెదము గాక.ఆతరువాత మీ స్పందన మీద వ్యాఖ్యానింతుము .

    రిప్లయితొలగించండి
  19. డా ప్రభల రామలక్ష్మిబుధవారం, ఫిబ్రవరి 06, 2013 11:06:00 PM

    తలచని ఇడుములు పెక్కులు
    తలకొనుచుండంగ ద్రుపదతనయ తలంచెన్|
    తలపడవలయును తధ్యము
    తలమే కురువంశ కుటిలతనమును తలపన్||

    రిప్లయితొలగించండి
  20. మూడు లోకము లకును
    మూడు మూర్తు లనగ ముచ్చట గొలుపన్ !
    మూడు కన్నుల వాడట
    మూడు కాలమ్ముల కైన మోక్షమ్మిడునే ? !

    రిప్లయితొలగించండి
  21. ఈనాటి పద్యరచన శీర్షికకు చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    కమనీయం గారికి,
    మిస్సన్న గారికి,
    డా ప్రభల రామలక్ష్మి గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యంలో నాలుగు పాదాల్లోనూ గణదోషం ... సవరించండి..

    రిప్లయితొలగించండి
  22. హనుమచ్ఛాస్త్రి గారూ ! మీరేం తక్కువ?
    తండ్రీ కొడుకులకూ తండ్రీ కొడుకులకూ ఉభయకుశలోపరి జరిపించేశారు చక్కగా!

    రిప్లయితొలగించండి