సుబ్బారావు గారూ, మాయె నిపుడు తఱచు బాంబు దాడి.. అన్నచోట యతి తప్పింది. మాయె బాంబు దాడులాయె తరచు... అని నా సవరణ. * వరప్రసాద్ గారూ, ఒచ్చి... ప్రయోగం గ్రామ్యం. నేమాని వారి సవరణను గమనించారు కదా. * సహదేవుడు గారూ, కథ, శ్రమ, చితి... ఈ శబ్దాల తరువాత ఒకచోటకు సంధి లేదు. అక్కడ యడాగమం వస్తుంది. * రవీందర్ గారూ, "ఆకాశమును + అంటు" అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ .. ఆకాశమునె యంటు... అందాం.
తగని విధమ్ము ఘోరములు ధైర్యము జంపగ నెల్లవారికిన్
రిప్లయితొలగించండినగరమునందు జీవనము నాటికి నేటికి నెంత మారెనో!
పగలును రాత్రులందునిక పట్టణమందలి వీథులందునన్
జగడములెన్నొ హెచ్చె నెటు చావది ముంచుకు వచ్చునో కదా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినగరపు జీవన మిది తెలి
రిప్లయితొలగించండియగ మరి నాజూకు గాజు టద్దపు మేడై
పగలైన పగల మధ్యన
పగతుర మతి భ్రమణమందు పగులునొ యేమో !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినగర జీవనంబు నానాడు దుష్కర
రిప్లయితొలగించండిమాయె నిపుడు తఱచు బాంబు దాడి
వలన బ్రదుకు దె ఱు వు బహు భార మగుటన
తప్ప దింక దయ్య ! తనువు వీ డ .
ఉస్సురుస్సు రనుచు నున్న యూరు వదలి
రిప్లయితొలగించండినగరి జేరి నంత తగు లశాంతి
పరుగు బ్రతుకు నుంచి బయటకు దారిల్లె
నగర జీవనమ్ము పొగల మూటె !
శ్రీ శంకరయ్యగురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు ,పెద్దలకు వినమ్రవందనములు
రిప్లయితొలగించండి=======*=====
జగతిలోని వింతలెల్ల జాలమందు జూచి నే
రుగ గన నగరములకొచ్చి రోగ,భోగములకు తా
సగము జచ్చి దిరుగు సాధు జనులు,క్రూర జనులతో
పగటి పూట భయము తోడ పరుగు బెట్టు చుండగన్
నగర జీవనమ్ము నేడు నరక ప్రాయమయ్యె రా
రిప్లయితొలగించండినగర జీవితము నెలవు నాగరకత,
విద్యలకు ,వినోదములకు వీడు గాదె ,
విరియు దేశసంపదలకు వెన్నుదన్ను,
అట్టి నగరమ్మె నాకిష్టమైన తావు.
నయన పర్వమ్ముగా నభము నంటెడు భవ
రిప్లయితొలగించండి....నమ్ము లొప్పుచునుండు నగరమందు
గతిమించి వాహనతతులు సదా ప్రయా
....ణము చేయుచుండును నగరమందు
రకరకమ్ములు సుకరమ్ములౌ నుపకర
....ణమ్ము లొప్పుచునుండు నగరమందు
జీవితమ్మున నూత్న చేతనత్వము గూర్చు
....సుగతు లొప్పుచునుండు నగరమందు
వసతులు లభించు చుండును బహువిధములు
నగర జీవితమున మహానందముండు
ముచ్చట లనేకములు నిత్యమును లభించు
నగర జీవనమే నాకు మిగుల ప్రీతి
పూజ్యశ్రీ నేమాని పండితుల గురువుల ఆశీస్సులతో మరొక్క సారి అక్కరతో మధ్యాక్కర
రిప్లయితొలగించండిపడమటి సంధ్యను జేరి పరవశించుచు పవళించి
వేడుకన్ ప్రాక్సంధ్య జేరి వేవెల్గు చింద ప్రభాక
రుడువచ్చె హిందోళ రాగరూమ్మునన్ వినువీధి
కడు కమనీయ దృశ్యంపు కావ్యమై కనువిందు జేయ.
రణగొణ ధ్వనులు ప్రభాత రాయని రాకతో మొదలు
గణగణ మని గంట మ్రోగ గడబిడ తో పిల్లలంత
రణము చేయుచు కదలవలె రహదారి పైనున్న జనులు
ఫణముగ ప్రాణముల్ బెట్టి బ్రతుకవలె నగర మందు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిటైపాటును సవరించిన తరువాత
రిప్లయితొలగించండిపడమటి సంధ్యను జేరి పరవశించుచు పవళించి
వేడుకన్ ప్రాక్సంధ్య జేరి వేవెల్గు చింద ప్రభాక
రుడువచ్చె హిందోళ రాగరూపమ్మునన్ వినువీధి
కడు కమనీయ దృశ్యంపు కావ్యమై కనువిందు జేయ.
రణగొణ ధ్వనులు ప్రభాత రాయని రాకతో మొదలు
గణగణ మని గంట మ్రోగ గడబిడ తో పిల్లలంత
రణము చేయుచు కదలవలె రహదారి పైనున్న జనులు
ఫణముగ ప్రాణముల్ బెట్టి బ్రతుకవలె నగర మందు.
నగర జీవనం...
రిప్లయితొలగించండిడబ్బుల పెరుగంగ ఢంబంబు నొకచోట జబ్బుల పాలౌ ప్రజలొక చోట
నశ్లీల వస్త్రాల నతిశయమొకచోట కట్టు బట్టలులేని కథొక చోట
మాదక ద్రవ్యాల మోదంబు నొకచోట సారాయి పీల్చిన శ్రమొక చోట
హైటెక్ వ్యభిచార హంగులే నొకచోట చితికిన బ్రతుకుల చితొక చోట
మానవత్వమ్ము నొకచోట ప్రాణ మిచ్చు
దానవత్వమ్ము నొకచోట దాడిఁ జేయ
రెండు పార్శ్వాలు సమరీతి నుండ గాను
యెట్టి భావాన జూచిన నట్టులుండు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఒకడి నెత్తిమీద నొకడు మసలుచుండు
రిప్లయితొలగించండిగంప కింద కోళ్ళ గుంపు పగిది
అద్దె ధరలు జూడ నాకాశమును యంటు
పట్టణముల లోని బ్రతుకు వెఱపు
పుట్టినూరు విడచి పట్టణాని కరుగ
చెప్పరాని పాట్లు తప్ప కుండు
కలుగు వీడి యెలుక కష్టాల పాలౌను
పట్టణాల మోజు వలదు వలదు
బాంబుల భయ మొకటి ప్రబలెను నగరాన
ప్రజలు భీతి తోడ పరుగు దీయ
భాగ్య నగర మి‘ట్ల భాగ్య' నగర మయె!
ఉగ్ర వాద మొంద నుగ్ర రూపు
శ్రీ వరప్రసాద్ గారి పద్యము 2వ పాదమునులో చిన్న మార్పు అవసరము:
రిప్లయితొలగించండిఇలా చేద్దాము:
"....
రుగ గన నగరముల జేరి........"
స్వస్తి.
నాపద్యమునందు హిందోళ బదులుగా "భూపాల" అని చదువ మనవి.
రిప్లయితొలగించండినలుగురు మెచ్చెడి నగరము
రిప్లయితొలగించండిపలు రకముల వింత లుండు బాధలు వెట్టన్ !
మలినపు మనసుల మనుషులు
కల కలమును రేపు చుంద్రు కక్షలు మెండౌ ! !
ప్రొద్దుయు గ్రుంకు చుండనిక పోయెదమింటి కటంచు సాగ ,మే
రిప్లయితొలగించండిన్ముద్దలుముద్దలయ్యెగద,ముష్కరమూకలు బాంబుప్రేల్చగా
బుద్దుడు బుట్టినట్టి ఘనభూమినమారణహోమమాపగా
వద్దుర పాలకా నిదుర!పట్టణజీవికి దిక్కెవండురా !!!
నానాటికి దుర్భరమౌతున్న నగరజీవనాన్ని చిత్రించే మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
గన్నవరపు నరసింహమూర్తి గారికి,
వరప్రసాద్ గారికి,
కమనీయం గారికి,
పండిత నేమాని వారికి,
తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
సహదేవుడు గారూ,
నాగరాజు రవీందర్ గారూ,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
మంద పీతాంబర్ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమాయె నిపుడు తఱచు బాంబు దాడి.. అన్నచోట యతి తప్పింది.
మాయె బాంబు దాడులాయె తరచు... అని నా సవరణ.
*
వరప్రసాద్ గారూ,
ఒచ్చి... ప్రయోగం గ్రామ్యం.
నేమాని వారి సవరణను గమనించారు కదా.
*
సహదేవుడు గారూ,
కథ, శ్రమ, చితి... ఈ శబ్దాల తరువాత ఒకచోటకు సంధి లేదు. అక్కడ యడాగమం వస్తుంది.
*
రవీందర్ గారూ,
"ఆకాశమును + అంటు" అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ .. ఆకాశమునె యంటు... అందాం.
కూడుగుడుచు వేళ కుదురు లేకుండును
రిప్లయితొలగించండిచదువునపుడు కలుగు సద్దు లెన్నొ
నిదురబోవు సరికి నీరసమైపోవు
నగర జీవనమ్ము నయము కాదు.
నాలుగు మెతుకులు నాల్కనంటగజేసి
రిప్లయితొలగించండిబడినెక్కి వెడలు బాటవెంట
మార్గమందున పలుమార్లు ఆగవలయు
అట్లు పోవగ బాసు ఆగ్రహించు
అద్దంపు మేడలందావాసమే గాని
హద్దులన్నొ పెడుదురందులోన
బొట్టుబొట్టుగ నీరు బెట్టు చేయుచు పడ్డ
కట్టమందురు నీటి కట్నమంత
కూడుగుడుచు వేళ కుదురు లేకుండును
చదువునపుడు కలుగు సద్దు లెన్నొ
నిదురబోవు సరికి నీరసమైపోవు
నగర జీవనమ్ము నరకమేగ.
సవరణతో:
రిప్లయితొలగించండిఒకడి నెత్తిమీద నొకడు మసలుచుండు
గంప కింద కోళ్ళ గుంపు పగిది
అద్దె ధరలు జూడ నాకాశమునె యంటు
పట్టణముల లోని బ్రతుకు వెఱపు
nagaraju raveender గారు మీ పద్యం సింపుల్ గ బాగుంది.
రిప్లయితొలగించండిఒకడి నెత్తిమీద నొకడు మసలుచుండు
గంప కింద కోళ్ళ గుంపు పగిది
అద్దె ధరలు జూడ నాకాశమునె యంటు
పట్టణముల లోని బ్రతుకు వెఱపు"
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
వరుస ప్రేలుళ్ల నేపథ్యంలో :
01)
_______________________________
నగరి నాశకుల్ శ్రుతిమించి - నాట్య మాడ
నరులు నలుగుడు పడుచును - నగరి నడుమ
నడువ నెప్పుడు నేమూల - నాశ మొదవు
ననుచు నడుకుగ నడయాడు - నగరమునను
నగర జీవన మది నేడు - నరక మాయె !
_______________________________
నడుకు = భయము
నగరము = హైదరాబాదు నగరము