16, ఫిబ్రవరి 2013, శనివారం

పద్య రచన – 254

చరకుఁడు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:


  1. అదిగో చూడండి, ఆర్యులవారి చమక్కు
    భళీ కవితల్ని కామెంటు రూపేణా
    బలాగు పాత్రలో వేసి చూర్ణము చేయంగ
    ఇదే కదా మహిమాన్విత శంకరాభరణము !


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. ప్రకృతిని మూలికలను గొని
    వికృతపు రోగముల మాన్ప వేదము జేసెన్
    సుకృతము పొందెను చరకుడు
    ప్రకృతిని వాడుట తెలిసిన ఫలితము మెండౌ.

    రిప్లయితొలగించండి
  3. పరిపూర్ణారోగ్యమునకు
    పరిరక్షణ గూర్చునట్టి వర శాస్త్రంబున్
    చరకుడు రచించె నతనికి
    పరమాదృతి నేనొనర్తు ప్రణతి శతంబున్

    రిప్లయితొలగించండి
  4. ధర యాయుర్వే దంబును
    చరకుడు నే వ్రాసె నొక్క శాస్త్రంబునుగా
    జ్వరములు ముదిరిన వైనచొ
    చరకుని ముని మందు వలన చప్పున దగ్గున్ .

    రిప్లయితొలగించండి
  5. చరక సంహితయను శాస్త్రము జగతిని
    ఖ్యాతి పొందె, వైద్య జ్ఞానమునకు
    దారి జూపె నంద్రు , తక్కిన వివరము
    తెలియనైతి నేమి తెలుపవచ్చు?

    రిప్లయితొలగించండి
  6. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    2వ పాదములో గణభంగము సరిచేస్తూ ఈ విధముగా మార్చితే బాగుంటుంది:

    "వైద్య విద్య యందు బడసి ఖ్యాతి"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా,
    నమస్కారములు. ద్య జ్ఞా అనుచోట గణభంగమును సూచించినారనుకుంటున్నాను.
    మీ సవరణ బాగున్నది. కృతజ్ఞురాలను.
    నా సవరణ.
    చరక సంహితయను శాస్త్రము జగతిని
    పేరు మోసె, రోగ భీతి తొలగ
    దారి జూపెనంద్రు, తక్కిన వివరము
    తెలియనైతి నేమి తెలుపవచ్చు?

    రిప్లయితొలగించండి
  8. వ్యాధి సోకిన వారల బాధ నణచి
    ఆయువును వృధ్ధి జే దలపోయునట్టి
    వైద్యవరులను దిద్దెగ విద్య నేర్పి!
    గురుల గురుడైన చరకుని గొలుతు నిపుడు !!

    రిప్లయితొలగించండి



  9. ప్రాచీనభారతావని
    ప్రాచుర్యముబొందె వైద్య ప్రావీణ్యమ్ముల్
    ఆచరణమున బేరొందిరి
    యా చరకుడుమొదలు పలువు రాయుర్వైద్యుల్.

    రిప్లయితొలగించండి
  10. చరకునిపై చక్కని పద్యములను రచించిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    కమనీయం గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    రెండవ పాదాన్ని "చరకుండు రచించె నొక్క శాస్త్రంబనగా" అంటే బాగుంటుంది.
    *
    కమనీయం గారూ,
    మూడవ పాదంలో గణదోషం. "ఆచరణమ్మున ఘనులయి" అందాం.

    రిప్లయితొలగించండి
  11. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, ఫిబ్రవరి 17, 2013 12:47:00 PM

    కరకు రోగములన్నియు కరగిపోవ
    అరకు, మాత్రలు మొదలుగ అమరునట్లు
    పూర్వకాలమునాడె యపూర్వరీతి
    చరకుడిచ్చినాడు మనకు చరిత చూడ!

    రిప్లయితొలగించండి
  12. డా.ప్రభల రామలక్ష్మిసోమవారం, ఫిబ్రవరి 18, 2013 12:08:00 AM

    రక్షణ చేయును కాయము
    శిక్షణతో కూడినట్టి చరకుని వైద్యం
    భక్షణ చేసిన గుళికలు
    తక్షణమే బాధలన్ని తనువును వదలన్

    రిప్లయితొలగించండి




  13. శంకరార్యా,మీ సూచనమేరకు మూడవ చరణం ని ' ఆచరణమ్మున ఘనులయి ' అని సవరిస్తున్నాను.ధన్యవాదములు.--కమనీయం.

    రిప్లయితొలగించండి
  14. చరకుని వైద్యము తోడనె
    చురుక్కుమన రోగమదియె సోలుచు వీడున్
    భరతావని గర్వించగ
    చరితార్తుడె లోక వినుత శాస్త్రముఁ గూర్చన్!

    రిప్లయితొలగించండి