8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

పద్య రచన – 246

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:


  1. బొట్టు కాటుక ముకుపుడక
    కనుదోయి లో కరుణ
    పెదవుల పై చిరు నగవు
    కరుణామయీ అంధ్ర వనిత !


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. జిలేబీ గారూ,
    అభినందనలు. మీ భావానికి నా ఛందోరూపం.....

    బొట్టు, కాటుక, ముకుపుడక, కందోయిలో
    నవరసములు గురియు, నటులలోన
    మేటియైన పసుపులేటి కన్నాంబకు
    సాటి లేరు చిత్రజగతిలోన.

    రిప్లయితొలగించండి
  3. కన్నారా యియ్యంబను
    విన్నారా నాటి తరపు వెండితెరను తా
    నెన్నో పాత్రలు వేసిన
    కన్నాంబే యీమె కళల కన్నంబయ్యెన్.

    రిప్లయితొలగించండి
  4. కన్నాంబ ను జూ డంగ నె
    మిన్నందె ను సంత సంబు , మీ కును గాదా ?
    యెన్నంగ నటన యామెది
    మున్నెవ్వరు సాటి రారు మురిపెము లందున్ .

    రిప్లయితొలగించండి
  5. కన్నాంబను జూడగ నా
    కన్నార్పగబోదు నటన కౌశలమున మీ
    కన్నా చిత్రజగతినన్
    దెన్నగ సాటెవ్వరమ్మ! యిప్పటికైనన్.

    రిప్లయితొలగించండి
  6. నటిగఁ గాక పాత్రె నడయాడె తెరపైన
    కొన్ని హంగు లైన కూర్పు మెరయ
    కట్టు బొట్టు లందు కన్నాంబ తీరైన
    తెలుగు దనముఁగలిపి వెలిగె నాడు

    రిప్లయితొలగించండి
  7. సంపత్ గారు,
    మీ పూరణలో చిత్రజగతినన్ అను చోట చిత్రజగతినం అని ఒకటి, సాటెవ్వరమ్మ అను చోట యడాగమం రావాలి గావున "ధీటెవ్వరమ్మ" అంటే బాగుంటుందేమో పరిశీలించగలరు.

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, ఫిబ్రవరి 08, 2013 9:03:00 PM

    మాటవిరుపుల,యొరుపుల మంత్రమేసి
    హావభావ ప్రకటనల హాయిగొలుపు,
    తనకుతానె సాటియగుచు తరలిపోయె
    ఘనచరిత చిత్ర కన్నాంబ కాంతుమిచట.

    రిప్లయితొలగించండి
  9. కన్నాంబ వంటి తల్లిని
    యెన్నగ నేడెవరి తరము నెవ్విధి నైనన్ !
    సన్నుతి పొందగ చిత్రము
    మన్నన లందించ మనకు మరియాద కదా ?

    రిప్లయితొలగించండి
  10. డా. ప్రభల రామలక్ష్మిశుక్రవారం, ఫిబ్రవరి 08, 2013 10:43:00 PM

    చిత్ర జగతిలోని చిత్రమును జూడగ
    చిత్ర గతిగనేలె చిత్రజగతి
    కన్నె కాదనుచును కన్నాంబయేనన
    అనుపమానమాయె నామె నటన.

    రిప్లయితొలగించండి
  11. గతకాలపు నటీమణి కన్నాంబపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
    జిలేబీ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    సహదేవుడు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి



  12. పూర్ణ శారద చంద్రుని బోలు ముఖము,
    నవరసమ్ముల నవలీల నటన జూపు
    నట్టి కన్నాంబ చలచిత్ర నటి కనంగ
    నేటికిన్నెవరైనను సాటికలరె.

    రిప్లయితొలగించండి