కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సీతా రాముని యెడఁదను జీల్చితివి గదా!
ఈ సమస్యను సూచించిన గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు.
నిజానికి మిత్రుడు పంపిన సమస్య ఇది...
సీతా రాముని గుండెఁ జీల్చితివి రాశీభూతపాపాగ్నివై.
శార్దూలవృత్తం కొందరిని ఇబ్బంది పెడుతుందేమో అని కందంగా మార్చడం జరిగింది.
ఉత్సాహం ఉన్న మిత్రులు దీనిని ప్రయత్నించవచ్చు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సీతా రాముని యెడఁదను జీల్చితివి గదా!
ఈ సమస్యను సూచించిన గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు.
నిజానికి మిత్రుడు పంపిన సమస్య ఇది...
సీతా రాముని గుండెఁ జీల్చితివి రాశీభూతపాపాగ్నివై.
శార్దూలవృత్తం కొందరిని ఇబ్బంది పెడుతుందేమో అని కందంగా మార్చడం జరిగింది.
ఉత్సాహం ఉన్న మిత్రులు దీనిని ప్రయత్నించవచ్చు.
వాతాత్మజా యొక సభను
రిప్లయితొలగించండినాతను వణువణువునందు నాతడె యనుచున్
ప్రీతిగ జనులకు జూపగ
సీతారాముని, యెడఁదను జీల్చితివి గదా!
నాతిని లంకకుఁ జేర్చగ
రిప్లయితొలగించండియాతలపులలో వియోగ మన్నది మనసున్
కోతలఁ గోయగ రావణ!
సీతారాముని యెడదను జీల్చితవి గదా!
నాతిని లంకకుఁ జేర్చగ
రిప్లయితొలగించండియాతలపులలో వియోగ మన్నది మనసున్
కోతలఁ గోయగ రావణ!
సీతారాముని యెడదను జీల్చితవి గదా!
నీ తరమా జననిఁ దెలియ,
రిప్లయితొలగించండిసీతమ్మపయినపనింద జేసితి వోయీ!
కూతల నిట్టుల కూయుచు
సీతా రాముని యెడఁదను జీల్చితివి గదా!
సీతామాతను ధర్మరూపిణిని యా శ్రీలక్ష్మినిప్పట్టునన్
ఘాతంబో యన నిందజేసితివిగా కాఠిన్యమౌ రీతినిన్
కూతల్ కూసితివోయి ధూర్తుడవు చేకూరున్ మహాపాపమా
సీతా రాముని గుండెఁ జీల్చితివి రాశీభూతపాపాగ్నివై.
వాతసుతుడు బల్కె నిటుల
రిప్లయితొలగించండి“సీతా ! రాముని యెడదను జీల్చితివి గదా !
ఊతగ నిల్చిన నాతని
భ్రాత పలుకులు వినకుండ రావణు పాలై "
రిప్లయితొలగించండిశీతాంశుఁడు నీ మగనికిఁ
బ్రీతిన్ శిష్యుం, డతనిని బ్రేమించితివే
భీతి యిసుమంత లేక, నొ
సీ, తారా! ముని యెడఁదను జీల్చితివి గదా!
గురువుగారూ ఒక మెరుపు మెరిపించారు!
రిప్లయితొలగించండిచిత్తము నిండుగ గొలువుము
రిప్లయితొలగించండిసీతారాముని, యెడదను జీల్చితివి గదా
రక్తపు నేత్రము తోడను
భీతిలి బ్రహ్లాదు డంత విల విల లాడెన్
ప్రీతిన్నీ యొడిలో శిరమ్ము నిడి నిద్రింపంగ నో కాకి యీ
రిప్లయితొలగించండిరీతిన్ గాయము జేయ నోర్చితివె నిర్భీతిన్ కటా! నా ప్రియా!
సీతా! రాముని గుండెఁ జీల్చితివి రాశీభూతపాపాగ్నివై
సీతన్ గాదిది వాయసాధమమ! యిస్సీ నీకిదే మూడెడిన్.
వహ్వా ! గురువు గారూ ! సమస్యను ( పద్య పాదమును ) భలేగా చీల్చి చెండాడితిరి గదా !
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఈ తీరున నన్నొంటరి
జేతువె కనికరము లేక జీవింతునె నే
నీ తోడిల లేకను హా!
సీతా! రాముని యెడంద జీల్చితివి గదా!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిరాముని చూపడానికి హనుమ ఎడదను చీల్చినాడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
రావణుని సంబోధించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
'జేర్చగ నా తలపులలో...' అనండి.
*
లక్ష్మీదేవి గారూ,
సులభము కందము వ్రాయుట
సులభ మ్మేవృత్తమైన శోభను వ్రాయం
గల నేర్పు గలదు నా కని
లలితముగాఁ గూర్చితీవు లక్ష్మీదేవీ!
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ కలానికీ రెండు వైపుల పదునే.. కాకాసుర వృత్తాంతంలో వృత్తం, సీతా వియోగంతో రాముడి చిత్తవృత్తితో కందం... అందంగా పూరించారు. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
నాగరాజు రవీందర్ గారూ,
నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిగురువుగారికి ధన్యవాదములు.తమరి పూరణ మంచి విరుపుతో బ్రహ్మాండంగా వుంది. తమరి సూచిత సవరణతో నా పద్యం :-
రిప్లయితొలగించండినాతిని లంకకుఁ జేర్చగఁ
నా తలపులలో వియోగ మన్నది మనసున్
గోతలుఁ గోయఁగ రావణ!
సీతారాముని యెడఁదను జీల్చితివి గదా!
నాతీ! నా ప్రియ సఖియా !
రిప్లయితొలగించండిపోతివి భూమాత తోడ పుడమిని వీడే
రీతిగ నే మన నింకను
సీతా! రాముని యెడదను జీల్చితివి కదా!
హేతువు లెన్నెన్నొ పలికి
రిప్లయితొలగించండిప్రీతిగ వెన్నంటి నడచి ప్రియమగు సతివై !
మాత యొడి జేరి తుదకిటు
సీతా రాముని యెడఁ దను జీల్చితివి గదా !
వాతూలాత్మజుడంత కృద్ధుడగుచున్ వాతప్పు విన్నంతనే
రిప్లయితొలగించండి"కూతల్ మానుమ రావణా!" వినుము మా "కోదండ రామాస్త్రమున్"
భీతాగ్నిన్ వధియించు నో తులువ నిన్ భీభత్స రీతిన్ గదా!
సీతారాముని గుండె జీల్చితివి రాశీభూతపాపాగ్నివై.
నేమాని పండితార్యుల పూరణ లేకపోవడానికి కారణ మేమో....
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ మిస్సన్న గారూ!శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు అందరు చక్కని పూరణములు చేస్తున్నారు కదా. అది నాకు ఆనంద దాయకమే కదా!. స్వస్తి.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిసమస్యగానైనా సరే దైనదూషణ, పురాణపాత్రలను చులకన చేసే విధంగా కించిత్తున్నా నిలునెల్లా భక్తికి రూపమైన నేమాని వారు నొచ్చుకుంటారు. సమస్య పంపిన మిత్రుని బలనంతంవల్ల సందేహిస్తూనే సమస్యను ఇచ్చాను. సహజంగానే నేమాని వారు ఈ సమస్యను పూరించడానికి ఇష్టపడనట్టున్నారు. వారి మనస్సును నొప్పించి ఉంటే క్షమించవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇకనుండి 'ఒళ్ళు దగ్గర పెట్టుకొని' సమస్యలను ఇస్తాను.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
'పుడమిని విడి యే రీతిగ...' అందాం.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
వాతప్పు....?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారూ! నమస్సులు.
రిప్లయితొలగించండివాతప్పు = వాయి+తప్పు నోట వెలువడిన తప్పుమాట, వితథము (ఆంధ్ర వాచస్పత్యం)
శర్మ గారూ,
రిప్లయితొలగించండి'నా తప్పు' తెలుసుకున్నాను. ధన్యవాదాలు.
సీతను లంకకు తెచ్చుట
రిప్లయితొలగించండికెంతో వింతైన మృగమునెంపిక జేయన్
గీతను దాటకుమన్నను
సీతా! రాముని యెడదను జీల్చితివి గదా!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
రావణునికి హనుమంతుని హితబోధ :
01)
_________________________________________
సైతానైతివి రాము పాలిట , సతీ - స్తైన్యంబు గావించుటన్
సీతారాముని గుండెఁ జీల్చితివి రా - శీభూత పాపాగ్నివై !
సీతారాముడు సేనతోడ నిటకున్ - సింగాణితో జేరి , నిన్
సాతాళించెడు వేళ దిక్కెవరు ? నీ - శ్వాసంబు రక్షింపగన్
మాతానాథుడె తోడు వచ్చినను , రా - మాపాథ దగ్దంబునన్ !
సీతారాముని నాశ్రయించవనిలో - క్షేమంబు గాంక్షించితే
సీతన్, రామున కప్పగించి ,బగితిన్- చేయెత్తి ప్రార్థించుమా !
_________________________________________
స్తైన్యము = దొంగతనము
సింగాణి = విల్లు
శ్వాసము = ప్రాణము
మాత = పార్వతి
పాథము = అగ్ని
బగితి = భక్తి
అమ్మా! రామలక్ష్మి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములో 2వ పాదములో ప్రాస నియమమును పాటించ లేదు. ఆ పాదమును మార్చండి. ప్రాస అక్షరమునకు ముందు అక్షరము దీర్ఘమైన అచ్చుతో కూడి యుండవలెను. అనుస్వారముతో మీరు వేసేరు - అది పొరపాటు.
ప్రభల రామలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
నేమాని వారి సూచన గమనించారు కదా..
సీతను లంకకు తెచ్చుట
కే తా వింతైన మృగమునెంపిక జేయన్.... అందాం.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఆశ్రయించ భువిలో.... అనండి. ఆశ్రయంచ + అవనిలో = ఆశ్రయించ నవనిలో.. అవుతుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిరావణునికి హనుమంతుని హితబోధ :
01అ)
_________________________________________
సైతానైతివి రాము పాలిట , సతీ - స్తైన్యంబు గావించుటన్
సీతారాముని గుండెఁ జీల్చితివి రా - శీభూత పాపాగ్నివై !
సీతారాముడు సేనతోడ నిటకున్ - సింగాణితో జేరి , నిన్
సాతాళించెడు వేళ దిక్కెవరు ? నీ - శ్వాసంబు రక్షింపగన్
మాతానాథుడె తోడు వచ్చినను , రా - మాపాథ దగ్దంబునన్ !
సీతారాముని నాశ్రయించు, భువిలో - క్షేమంబు గాంక్షించితే
సీతన్, రామున కప్పగించి ,బగితిన్- చేయెత్తి ప్రార్థించుమా !
_________________________________________
స్తైన్యము = దొంగతనము
సింగాణి = విల్లు
శ్వాసము = ప్రాణము
మాత = పార్వతి
పాథము = అగ్ని
బగితి = భక్తి
సీతారాముని నాశ్రయించవనిలో - క్షేమంబు గాంక్షించితే
రిప్లయితొలగించండిసీతారామునిన్+ ఆశ్రయించు+అవనిలో =సీతారాముని నాశ్రయించవనిలో
శంకరార్యా ! సరియే గదా !
రిప్లయితొలగించండిమాతా, బాధ్యత తీరెన్
నీ తరుణమున ,నిటనుండ నియ్యకొనన్ ,
నీతో గొనిపొమ్మంచును
సీతా, రాముని యెడదను జీల్చితివి గదా!
అయ్యా! శ్రీ వసంత కిశోర్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఆశ్రయించు + అవనిలో = నుగాగమము వచ్చి ఆశ్రయించు నవనిలో అని యగును. స్వస్తి.
పండిత మరియు శంకరార్యులకు వందనములు,
రిప్లయితొలగించండిఉత్సాహమున్నప్పటికి, వృత్తి యందలి శ్రమాధిక్యతవలన అప్పుడప్పుడు ప్రాస, యతి, గణ దోషాలు దొర్లి నిరాశక్తి కలుగుతున్నా, పెద్దలైన తమ సూచనలు మాకు శక్తినిస్తున్నాయి. శంకరార్యులు సూచించిన విధంగా సవరణ చేసి........
సీతను లంకకు తెచ్చుట
కే తా వింతైన మృగమునెంపిక జేయన్
గీతను దాటకుమన్నను
సీతా! రాముని యెడదను జీల్చితివి గదా!
సదా మీ శిష్య వాత్సల్యం ఆశిస్తూ, ధన్యవాదములు తెలుపుకొంటున్నాను.
నేమాని వారికి ధన్యవాదములు !
రిప్లయితొలగించండికోతలు కోసెడి భీముని
రిప్లయితొలగించండినేతై బెంగాలు నందు నేరుపు తోడన్
మాతా! మమతా! యేచూర్
సీతారాముని యెడఁదను జీల్చితివి గదా!
నీతుల్ జెప్పుచు పీఠ క్రిందకరెవో నీరమ్ములన్ జేర్చుచున్
రిప్లయితొలగించండికోతల్ కోయుచు కమ్యునిస్టుననుచున్ కొట్లాడు యేచూరుడౌ
సీతా రాముని గుండెఁ జీల్చితివి రాశీభూతపాపాగ్నివై...
వాతల్ బెట్టెద రోయి మోడి వడిగన్ బ్రాహ్మణ్య సంఘమ్ములే